Skip to main content

తొలి బడ్జెట్ విశేషాలు

1953 అక్టోబరు 1న ఆంధ్ర రాష్ట్రం ‘తొలిసారి’ ఏర్పడిన తర్వాత డిసెంబరు 28న కర్నూలులోని అసెంబ్లీలో తొలి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. బడ్జెట్ ప్రసంగం మొత్తం 31 పేజీలు కాగా.. ఆర్థిక మంత్రి తెన్నేటి విశ్వనాథం గంటసేపు ప్రసంగం చదివారు. మద్రాసు రాష్ట్రంలో 1953-54 బడ్జెట్‌లో ఆంధ్ర రాష్ట్రానికి మొదటి 6 నెలలకు అవసరమైన ఖర్చు మాత్రమే మంజూరు చేశారు. దీంతో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడ్డాక మిగతా 6 నెలల కాలానికి అదే ఏడాది డిసెంబరు 28న బడ్జెట్ పెట్టారు. ఇప్పుడున్న ఆంధ్ర ప్రదేశ్.. అప్పటి ఆంధ్ర రాష్ట్ర సరిహద్దులు ఒకటే అయినప్పటికీ అప్పట్లో 11 జిల్లాలే ఉండేవి. ప్రకాశం (1970), విజయనగరం (1979) జిల్లాలు అనంతరం ఏర్పడ్డాయి.

తొలి బడ్జెట్ లోటు

రూ.51.58 లక్షలు

రాష్ట్ర ఆదాయం

రూ.11.82 కోట్లు

ఆరు నెలల ఖర్చు

రూ.12.34 కోట్లు


  • రాష్ట్రం లోటు బడ్జెట్‌లో ఉండటంతో అభివృద్ధి ప్రణాళికల నిర్వహణకు రూ.3.75 కోట్ల రుణం కావాలని ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది.
  • ఇప్పుడు ఇల్లు కట్టాలంటే రూ. 30 లక్షలైనా కావాలి. కానీ, అప్పట్లో రాజధానిలో ప్రభుత్వ భవనాల నిర్మాణానికి బడ్జెట్‌లో చేసిన కేటాయింపు కేవలం రూ. 29.5 లక్షలు.
కీలక రంగాలకు కేటాయింపులు (రూ. కోట్లలో)

సాగునీటి రంగం

1.62

విద్యుత్ ప్రణాళిక

4.19

రోడ్ల అభివృద్ధి

1.00

ప్రాథమిక విద్య

1.68

Published date : 06 Sep 2014 05:25PM

Photo Stories