Skip to main content

Banks Samme: సమ్మెకు సై... ఆ రెండు రోజులు బ్యాంకులు బంద్‌...!

దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులు మరోసారి సమ్మె బాట పట్టనున్నారు.
Banks Strike

వివిధ డిమాండ్ల సాధన కోసం జనవరి 30 నుంచి రెండు రోజుల పాటు సమ్మె చేయాలని పలు బ్యాంకు యూనియన్ల గొడుగు సంస్థ యునైటెడ్‌ ఫోరమ్‌ ఆఫ్‌ బ్యాంక్‌ యూనియన్స్‌ (యూఎఫ్‌బీయూ) గురువారం నిర్ణయించినట్లు ఆల్‌ ఇండియా బ్యాంక్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ (ఏఐబీఈఏ)  వెల్లడించింది,

గురువారం ముంబైలో జరిగిన యూఎఫ్‌బీయూ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. తమ డిమాండ్‌లపై ఇండియన్‌ బ్యాంక్స్‌ అసోసియేషన్‌ (ఐబిఎ) లేఖలు రాసినా స్పందన రాకపోవడంతో, ఆందోళనను పునరుద్ధరిస్తున్నట్లు యూనియన్‌ నాయకులు తెలిపారు. జనవరి 30, 31 తేదీల్లో (సోమ, మంగళవారం) సమ్మెకు పిలుపు నివ్వాలని నిర్ణయించామని ఏఐబీఈఏ ప్రధాన కార్యదర్శి సీహెచ్‌ వెంకటాచలం తెలిపారు. ముఖ్యంగా ఐదు రోజుల వర్కింగ్‌ డేస్, పెన్షన్‌ అప్‌డేట్, నేషనల్‌ పెన్షన్‌ సిస్టమ్ (ఎన్‌పీఎస్‌) రద్దు, వేతన సవరణ డిమాండ్‌ల చార్టర్‌పై తక్షణ చర్యలు, అన్ని విభాగాల్లో తగిన నియామకాలు తదితర డిమాండ్స్‌తో ఈ సమ్మెకు దిగుతున్నట్లు వెల్లడించారు.

Published date : 12 Jan 2023 07:19PM

Photo Stories