APPSC Chairman Gowtham Sawang : ఈలోపే గ్రూప్-1 & 2 ఉద్యోగాలకు నోటిఫికేషన్.. పెరిగిన పోస్టులు ఇవే.. ప్రిలిమ్స్ పరీక్ష ఎప్పుడంటే..?
గ్రూప్-1లో 100 ఉద్యోగాలకు, గ్రూప్-2లో 900 పోస్టులకు నోటిఫికేషన్ ఇస్తామన్నారు. అలాగే ఈ గ్రూప్-1 & 2 ఉద్యోగాల నోటిఫికేషన్‌లను ఈ నెల (నవంబర్) చివరిలోపు ఎప్పుడైన విడుదల చేస్తామన్నారు. 2024 ఫిబ్రవరిలో గ్రూప్-1&2 ప్రిలిమ్స్ నిర్వహింస్తామన్నారు. ఈ పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తి పారదర్శకంగా ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. 2022 గ్రూప్-1 ప్రక్రియను రికార్డుస్ధాయిలో తొమ్మిది నెలల్లో పూర్తి చేసిన విషయం తెల్సిందే. ఈ సారి గ్రూప్-1 & 2 ఉద్యోగాల భర్తీ ప్రక్రియను కూడా వేగవంతంగా పూర్తి చేస్తామన్నారు. గ్రూప్-2 సిలబస్ లో మార్పులు చేశామన్నారు.
గ్రూప్-1 & 2 పరీక్షావిధానంలో మార్పులు ఇవే :
ఏపీపీఎస్సీ గ్రూప్-1 పరీక్షావిధానంలో కొన్ని కీలక మార్పులు చేయబోతున్నాం. గ్రూప్-1 ప్రిలిమ్స్ లో రెండు పేపర్ల స్ధానంలో ఈ సారి ఒక పేపర్ మాత్రమే ఉంటుంది. అలాగే గ్రూప్-1 మెయిన్స్ అయిదు ప్రధాన పేపర్లకి బదులు నాలుగే ఉంటాయి. ఇందులో రెండు పేపర్లు ఆబ్జెక్టివ్ తరహాలో...రెండు పేపర్లు డిస్క్రిప్షన్ తరహాలో ఉంటాయి. లాంగ్వేజ్‌లో రెండు పేపర్లకి బదులు ఒక పేపర్ మాత్రమే ఉంటుంది. అలాగే ఈ సిలబస్‌లో ఎటువంటి మార్పులు ఉండవు. నిరుద్యోగ అభ్యర్ధులకి మేలు చేయడానికే ఈ నిర్ణయం తీసుకున్నామని గౌతమ్ సవాంగ్ తెలిపారు.
ఆ తర్వాతే ఈ మార్పులు..
యూపీఎస్సీ, మహారాష్ట్ర లాంటి వివిధ రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమీషన్లని పరిశీలించిన తర్వాతే ఈ మార్పులు చేస్తున్నామన్నారు. డిసెంబర్ నెలలో 2200 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకి ఏపీపీఎస్సీ ఆద్వర్యంలో పరీక్షలు జరనున్నాయి. అలాగే జనవరిలో ఫలితాలు వెల్లడిస్తామన్నారు. ఏపీపీఎస్సీకి సంబంధం లేని పరీక్షలు నిర్వహించాల్సి వచ్చినపుడు బడ్జెట్ మాత్రం ఆయా శాఖలు భరిస్తాయి. అలాగే కొన్ని పత్రికలు ఈ ఉద్యోగాలపై పూర్తిగా తప్పుడు కథనాలు ప్రచురించాయి. వీటిని తీవ్రంగా ఖండిస్తున్నాను. అలాగే ఏపీలో నిరుద్యోగ అభ్యర్దులు గ్రూప్-1, గ్రూప్ 2 ఉద్యోగ పరీక్షలకు కష్టపడి ప్రిపేర్ అవ్వాలని సూచిస్తున్నాను.
Tags
- APPSC Group 1 Jobs
- 900 APPSC Group 1 Jobs 2023
- 100 APPSC Group 1 Jobs 2023
- APPSC Group 1 Jobs Notification 2023
- Appsc group 2 jobs 2023
- appsc chairman gowtham sawang
- appsc chairman gowtham sawang today news
- appsc group 1 new exam pattern 2023
- appsc group 1 jobs recruitment 2023
- appsc group 2 jobs recruitment 2023