Group II: అభ్యసనతోనే విజయం సొంతం.. ఇలా చేస్తే మంచి మార్కులు సాధించవచ్చు..
గ్రూప్-1, గ్రూప్-2 సాధనకు ప్రణాళికాబద్ధమైన అభ్యసనమే ప్రధానమన్నారు. కరెంట్ అఫైర్స్, జనరల్ నాలెడ్జ్ పాటు సబ్జెక్టుపై ఎక్కువ ఫోకస్ ఉన్నప్పుడు మెరుగైన మార్కులు సాధించవచ్చునన్నారు. తాను ఆ స్థాయి నుంచే వచ్చానని గుర్తు చేశారు. ఉద్యోగ సాధనకు మార్పు కోరుకోవాలి డబ్బు కీలకం కాదని, ఉన్నత విద్యతో పాటు తెలివితేటలు ఉంటే చాలన్నారు. ఒకే దఫా 1.40 లక్షల గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలు కల్పించిన ఘనత సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికే దక్కుతుందన్నారు. ఇవే కాకుండా తాజాగా 900 గ్రూప్-2, 100 గ్రూప్-1 పోస్టులకు నోటిఫి కేషన్ జారీకి ఆమోదం తెలిపారన్నారు. అత్యంత ఎక్కువ ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించిన సీఎంగా దేశ చరిత్రలో వై.ఎస్. జగన్మోహన్ రెడ్డికి ప్రత్యేక చోటు దక్కిందన్నారు.
చదవండి: ఏపీపీఎస్సీ - స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | గైడెన్స్ | ప్రీవియస్ పేపర్స్ | సక్సెస్ స్టోరీస్ | సిలబస్ | ఆన్‌లైన్ టెస్ట్స్ | ఆన్‌లైన్ క్లాస్ | ఎఫ్‌ఏక్యూస్ | టీఎస్‌పీఎస్సీ
ఆర్సీ ఎగ్జామ్స్ చైర్మన్ మెండెం కిరణ్ కుమార్ మాట్లా డుతూ జూలై మొదటి వారంలో హైదరాబాద్ అశోక్ నగ రులో ఏపీ గ్రూప్-2 తెలుగు, ఇంగ్లిష్ మీడియం బ్యాచు లను ప్రారంభిస్తున్నామని తెలిపారు. ఆసక్తిగల అభ్య ర్థులు 8985094499 ఫోన్ నంబరులో సంప్రదించి అడ్మి షన్ తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో 'సాక్షి' అనంతపురం బ్రాంచ్ మేనేజర్ శ్రీకాంత్, ఈవెంట్ మేనే జర్ చంద్ర, యాడ్స్ టీం లీడర్ శ్రీనివాసులు, ఆర్సీ ఎగ్జామ్స్ సంస్థ లెజండరీ ఫ్యాకల్టీ బి. కృష్ణారెడ్డి (పాలిటీ), అబ్ధుల్ కరీం (హిస్టరీ), సి. హరికృష్ణ (సైన్స్ అండ్ టెక్నా లజీ), ఎండీ పాషా (ఎకానమీ), వందలాది మంది అభ్య ర్థులు పాల్గొన్నారు. సదస్సులో టాలెంట్ టెస్ట్ నిర్వహించి ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నగదు బహుమతులు, ప్రామాణిక స్టడీ మెటీరియల్ అందజేశారు.
ఇదే అంబేడ్కర్ భవన్ ఎదురుగా ఉండే చిన్న గదిలో ఉంటూ డిగ్రీ వరకూ చదువుకుని, ఎస్కేయూలో పీజీ పూర్తి చేసి, పీహెచీ అందుకున్నా. జీవితంలో మార్పు కోరుకోకపోతే విఫలం అవుతాం. గ్రూప్-2 నోటిఫికేషన్ రావడం తథ్యం. ఫలితం అనుకూలమా? ప్రతికూలమా? అని పక్కనబెట్టి అం కితభావంతో కృషి చేస్తే విజయం సొంతమవుతుంది.
- బి.కృష్ణారెడ్డి, పాలిటీ ఫ్యాకల్టీ
బేసిక్ అంశాలపై పట్టుండాలి
గ్రూప్-2 ఎకానమీకి గతంలో 150 మార్కులు ఉండేవి. తాజాగా 75 మార్కులకు కుదించారు. సిలబస్లో ఉన్న అం శాలపై నేరుగా ప్రశ్నలు ఉండవు. అప్లైడ్ విధానంలోనే ప్రశ్నలు అడుగుతారు. వాటిని బట్టే సమాధానం గుర్తించగ లిగే సామర్థ్యముండాలి. బేసిక్ అంశాలపై పట్టు సాధించి నప్పుడే ఇది సాధ్యమవుతుంది. వచ్చే 5, 6 నెలలు అభ్యసనంపైనే దృష్టి కేంద్రీక రిస్తే కచ్చితంగా విజయం సాధించవచ్చు.
- డీఎం పాషా, ఎకానమీ ఫ్యాకల్టీ
సైన్స్ అండ్ టెక్నాలజీ కీలకం
సన్నద్ధమవుతున్న పరీక్షకు సంబంధించిన సిలబస్ మీద పూర్తి అవగాహన ఉండాలి. ఒక్కో టాపిక్కు ఎన్ని మార్కులు వస్తాయనే విషయమూ కీలకమే. సమయాన్ని వినియోగిం చుకోవాలి. మనకు నచ్చిన అంశానికే కాకుండా అన్నింటికీ సమ ప్రాధాన్యత ఇస్తేనే ఎక్కువ మార్కులు సాధించగలం. ముఖ్యంగా సైన్స్ అండ్ టెక్నాలజీ సబ్జెక్టును కరెంట్ అఫైర్స్లో భాగంగానే పరిగ ణించాలి. ఇస్రో పరిశోధనలు, కొత్త ఆవిష్కరణలు, ఉపగ్రహ ప్రయోగాలు వంటి అంశాలపై దృష్టి కేంద్రీకరించాలి.
- సి.హరికృష్ణ, సైన్స్ అండ్ టెక్నాలజీ ఫ్యాకల్టీ
చదవడమే ముఖ్యం
పోటీ పరీక్షలో రాణించాలంటే ముఖ్యంగా చదవడం మొద లుపెట్టాలి. పేపర్-1లో జనరల్ స్టడీస్, పేపర్-2లో సెక్ష న్-1 ఏపీ సామాజిక, సాంస్కృతిక చరిత్ర అంశంపై ప్రశ్నలు ఉంటాయి. ప్రిలిమ్స్ లోనూ ఈ అంశాలకు సంబంధించిన ప్రశ్నలే ఉంటాయి. ప్రిలిమ్స్క సిద్ధమైతే మెయిన్స్లు కూ ప్రిపరైనట్లే.
- డాక్టర్ ఎం, అబ్దుల్ కరీం (హిస్టరీ ఫ్యాకల్టీ)
వ్యూహ రచనకు దోహదం
గ్రూప్-2 ఉద్యోగం సాధించాలం టే ఎలాంటి వ్యూహాలను అను సరించాలో తెలిసింది. ఏయే సబ్జె క్టులపై ఎలా ఫోకస్ చేయాలనే అంశాలపై స్పష్టత వచ్చింది. ప్రిలిమినరీ, మెయిన్స్ రెండిం
టీకి ఒకే దఫా ఎలా సన్నద్దం కావాలనే అంశంపై అం చనా ఏర్పరచుకున్నాను.
- అఫ్రీన్, గ్రూప్-2 అభ్యర్థి
నమ్మకం కలిగింది
సదస్సులో పాల్గొనడం ద్వారా స్వీయ అభ్యసనతో ఉద్యోగం సాధిస్తాననే నమ్మకం కలిగింది. మన మీద మనకు నమ్మకం పెం పొందించుకుంటూ పోటీ పరీక్షలకు ఎలా సన్నద్ధమవ్వాలో వివరించడం చాలా బాగుంది.
- రాజశేఖర్రెడ్డి, గ్రూప్-2 అభ్యర్థి
లక్ష్యం నిర్దేశించుకున్నా
సదస్సు ద్వారా ఓ లక్ష్యాన్ని నిర్దే శించుకున్నా. ఎలా సన్నద్ధం కావాలనే అంశంపై అవగాహన కలిగింది. బేసిక్స్ అంశాలపై పట్టు ఎలా సాధించాలో వివరిం చిన తీరు చాలా బాగుంది.
- నీరజ, గ్రూప్-2 అభ్యర్థి
ధైర్యం వచ్చింది
పోటీ పరీక్షలంటే ఇప్పటి వరకూ ఒక విధమైన భయం ఉండేది. చాలా మంది పోటీ పడతారు. మనం సాధించగలమా అనే అప నమ్మకం ఉండేది. అవగాహన సదస్సుతో ఈ అపనమ్మకం కాస్త దూరమైంది. పరీక్షల్లో టాపర్గా నిలవడానికి ఎలాంటి వ్యూహాలను అనుసరించాలో చక్కగా వివరించారు. దీంతో నాకు ధైర్యం వచ్చింది.
- అనీలా, గ్రూప్-2 అభ్యర్థి