ఏపీపీఎస్సీ వివిధ కేటగిరీ పోస్టులకు ఎంపికైన అభ్యర్ధులకు జూలై 27న ధ్రువపత్రాల పరిశీలన
Sakshi Education
సాక్షి, అమరావతి: వివిధ కేటగిరీ పోస్టుల నోటిఫికేషన్లకు సంబంధించి ఎంపికైన అభ్యర్థుల జాబితాలను, ధ్రువపత్రాల పరిశీలన తేదీలను ఏపీపీఎస్సీ గురువారం ప్రకటించింది.
అర్హుల ధ్రువపత్రాలను జూలై 27న ఏపీపీఎస్సీ కార్యాలయంలో పరిశీలించనున్నట్లు కమిషన్ కార్యదర్శి పీఎస్సార్ ఆంజనేయులు పేర్కొన్నారు. డిగ్రీ కాలేజీ ఇంగ్లిష్, మేథమెటిక్స్, కంప్యూటర్ సైన్సు సబ్జెక్టు లెక్చరర్ పోస్టులు, సివిల్ అసిస్టెంటు సర్జన్ పోస్టులకు ఎంపికైన వారి ప్రొవిజనల్ సెలెక్టెడ్ జాబితాను విడుదల చేశారు. టెక్నికల్ అసిస్టెంటు(జియోఫిజిక్స్), టెక్నికల్ అసిస్టెంటు(హైడ్రాలజీ) పోస్టులకు, డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ సర్వే, ఆర్కియాలజీ, మ్యూజియం విభాగం టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకు ఎంపికైన వారి జాబితానూ ప్రకటించారు.
Published date : 09 Jul 2021 03:46PM