ఏపీపీఎస్సీ గ్రూప్–1 మినహా అన్ని కేటగిరీలకు ప్రిలిమ్స్ రద్దు.. ఇంటర్వ్యూలు కూడా..
Sakshi Education
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్–1 కేటగిరీ పోస్టులకు మినహా మిగిలిన అన్ని కేటగిరీల పోస్టులకు ప్రిలిమ్స్ పరీక్షలను రద్దు చేస్తూ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) కీలక నిర్ణయం తీసుకుంది.
అలాగే, గ్రూప్–1 సహా అన్ని పోస్టులకూ ఇంటర్వ్యూలను పూర్తిగా తొలగించింది. ఇకపై అన్ని కేటగిరీల పోస్టులకూ ఇంటర్వ్యూలతో సంబంధం లేకుండా లిఖితపూర్వక పరీక్షల్లో మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేసేలా ఏపీపీఎస్సీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.
చదవండి: ఏపీ పీజీసెట్: ఇక అన్ని వర్సిటీలకు ఒకే ప్రవేశ పరీక్ష
చదవండి: ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ ప్రారంభం: రంగంలోకి దళారులు.. మోసపోవద్దు.!
చదవండి: నాడు–నేడుతో సర్కారీ బడి.. సరికొత్త సవ్వడి..
రాష్ట్రంలోని నిరుద్యోగులకు మేలు కలిగించే ఈ నిర్ణయాలను ఏపీపీఎస్సీ కార్యాలయంలో కమిషన్ సభ్యుడు ఎస్.సలాంబాబు శుక్రవారం మీడియాకు వెల్లడించారు. ఆయన ఏమన్నారంటే.. ప్రిలిమ్స్ రద్దుచేయాలని అభ్యర్థులు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. ప్రిలిమ్స్‌ను రద్దు చేయడంవల్ల పోస్టుల భర్తీ త్వరగా పూర్తిచేయడానికి వీలుంటుంది. ప్రిలిమ్స్ రద్దుపై ఎమ్మెల్సీలు, పలువురు ప్రముఖులతో చర్చించిన అనంతరం గ్రూప్–1 మినహా తక్కిన అన్ని కేటగిరీల పోస్టులకూ రద్దుచేయాలని కమిషన్ నిర్ణయించింది. ఈ మేరకు ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపించాం. ప్రిలిమ్స్ పరీక్షకు గతంలో జారీచేసిన జీఓలను రద్దుచేయాలని, ప్రిలిమ్స్ విధానాన్ని తొలగిస్తూ సవరణ జీఓలు విడుదల చేయాలని అందులో పొందుపరిచాం. ప్రభుత్వ ఉత్తర్వులు రాగానే కొత్త నియామకాలకు నోటిఫికేషన్లు జారీచేస్తాం.
ఏపీపీఎస్సీ గ్రూప్ 1,2,3,4 సిలబస్, వీడియో కోచింగ్ క్లాసులు, స్టడీ మెటీరియల్, బిట్ బ్యాంక్స్, ప్రీవియస్ పేపర్లు, ఆన్లైన్ ప్రాక్టీస్ టెస్ట్స్, ప్రిపరేషన్ గైడెన్స్.. ఇతర అప్డేట్స్ కోసం క్లిక్ చేయండి.
ఇంటర్వ్యూలు కూడా లేవు
రాష్ట్రంలో ఏపీపీఎస్సీ ద్వారా అన్ని కేటగిరీలకు నిర్వహించే పోస్టుల భర్తీలో ఇంటర్వ్యూలను కూడా తొలగిస్తూ కమిషన్ నిర్ణయం తీసుకుంది. ఇకపై ఏ పోస్టుకూ ఇంటర్వ్యూలు ఉండవు. ఏడాదిన్నర కాలంలో 32 నోటిఫికేషన్లకు సంబంధిం చి పరీక్షలు, ఇంటర్వ్యూలు ఎక్కడా ఎలాంటి పొరపాట్లు, లోపాలు, అక్రమాలకు తావులేకుం డా సమర్థవంతంగా పారదర్శకంగా పూర్తిచేశాం. పోస్టుల భర్తీలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (ఎకనమికల్లీ వీకర్ సెక్షన్స్–ఈడబ్ల్యూఎస్) వారి కి 10 శాతం రిజర్వేషన్లు అమలుచేయనున్నాం. రానున్న నోటిఫికేషన్లని్నంటికీ ఈ రిజర్వేషన్లను వర్తింపజేస్తాం. ఇప్పుడు ప్రభుత్వం ఉత్తర్వులి వ్వడంతో కమిషన్ అమలుచేయనుంది. ఇందు కు వీలుగా ఏపీ సబార్డినేట్ సర్వీసు రూల్సును సవరిస్తూ రోస్టర్ పాయింట్లను ఖరారు చేసేందు కు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. ఉత్తర్వులు రాగానే నోటిఫికేషన్లను విడుదల చేస్తాం.

Published date : 17 Jul 2021 03:32PM