ఆంధ్రప్రదేశ్ సామాజిక, ఆర్థిక సర్వే 2018-19
Sakshi Education
రాష్ట్ర స్థూల ఆర్థిక పరిస్థితిని వివరించే వార్షిక సామాజిక, ఆర్థిక సర్వే 2018-19ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి శ్రీ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి 2019 జూలై 12న రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టారు.
ఈ సర్వేలో మొత్తం 10 అంశాలు ఉన్నాయి.
1. సాధారణ సమీక్ష
2. స్థూల ఆర్థిక అంశాలు
3. ప్రజారుణం
4. ధరలు, వేతనాలు, పౌరసరఫరాలు
5. వ్యవసాయం, అనుబంధ రంగాలు
6. పరిశ్రమలు
7. ఆర్థిక మౌలిక సదుపాయాలు
8. సాంఘిక మౌలిక సదుపాయాలు
9. పేదరికం, ఉద్యోగిత- నిరుద్యోగిత
10. పరిపాలనలో ప్రాధాన్యతా అంశం
సాధారణ సమీక్ష :
1981 -91 మధ్య 21.13%
2001 -11 మధ్య 9.21 %
అదే సమయంలో భారతదేశ జనాభా వృద్ధిరేటు 17.7 శాతం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అక్షరాస్యత 2011 జనాభా లెక్కల ప్రకారం 67.35%, అదే సమయంలో భారతదేశ అక్షరాస్యత 72.98% ఉంది.
ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న మొత్తం భూమి వివరాలు...
స్థూల ఆర్థిక అంశాలు...
వ్యవసాయం,దాని అనుబంధ రంగాలు...
పరిశ్రమలు :
సేవలు :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తలసరి ఆదాయం :
గత ఐదేళ్లలో రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయం గణనీయంగా పెరిగింది. ప్రస్తుత ధరల ప్రకారం చూస్తే జాతీయ స్థాయిలో తలసరి ఆదాయం సగటు కంటే, రాష్ట్రంలో తలసరి ఆదాయం చాలా మెరుగ్గా ఉంది
2017-18, 2018-19ల మధ్య రాష్ట్ర తలసరి ఆదాయ వృద్ధిరేటు: 13.96%
ప్రజారుణం రాష్ట్ర రెవెన్యూ రాబడి :
రాష్ట్ర రుణం :
రాష్ట్రంలో ప్రస్తుతం కార్యకలాపాలు నిర్వహిస్తున్న విమానాశ్రయాలు 6 కాగా ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ప్రధాన ఓడరేవులు 14. విశాఖపట్నం సహజ ఓడరేవు మాత్రం కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంది.
పేదరికం :
2011-12 సంవత్సరానికి గాను ఆంధ్రప్రదేశ్‌లో పేదరికం 9.20 శాతంగా నమోదైంది. ఇది గ్రామీణ ప్రాంతాల్లో 10.96 శాతం, పట్టణ ప్రాంతాల్లో 5.81 శాతంగా ఉంది. అదే సమయంలో భారత దేశ పేదరికం 21.92 శాతం కాగా అందులో గ్రామీణ భారతదేశ పేదరికం 25.70 శాతం పట్టణ పేదరిక శాతం 13.70శాతంగా ఉంది.
నిరుద్యోగం :
2011-12 మధ్య నేషనల్ శాంపిల్ సర్వే కార్యాలయం వారు నిర్వహించిన 68వ రౌండ్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ గ్రామీణ ప్రాంతాల్లో 12, పట్టణ ప్రాంతాల్లో 43గా నిరుద్యోగం నమోదైంది.అదే సమయంలో భారతదేశంలో గ్రామీణ స్థాయిలో 17, పట్టణ స్థాయిలో 34గా నిరుద్యోగం నమోదైంది.
1. సాధారణ సమీక్ష
2. స్థూల ఆర్థిక అంశాలు
3. ప్రజారుణం
4. ధరలు, వేతనాలు, పౌరసరఫరాలు
5. వ్యవసాయం, అనుబంధ రంగాలు
6. పరిశ్రమలు
7. ఆర్థిక మౌలిక సదుపాయాలు
8. సాంఘిక మౌలిక సదుపాయాలు
9. పేదరికం, ఉద్యోగిత- నిరుద్యోగిత
10. పరిపాలనలో ప్రాధాన్యతా అంశం
సాధారణ సమీక్ష :
- ఆంధ్రప్రదేశ్ 1,62,970 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో దేశంలో 8వ స్థానంలో ఉంది
- ఆంధ్రప్రదేశ్ 974 కిలోమీటర్ల సముద్రతీరం తో దేశంలో రెండో స్థానంలో ఉంది
- ఆంధ్రప్రదేశ్ 37,707 చదరపు కిలోమీటర్ల అటవీ విస్తీర్ణంతో దేశంలో తొమ్మిదో స్థానంలో ఉంది
- ఆంధ్రప్రదేశ్ జనాభా మొత్తం దేశ జనాభాలో 4.10 శాతంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ జనాభా వృద్ధిరేటు గత నాలుగు దశాబ్దాల్లో
1981 -91 మధ్య 21.13%
2001 -11 మధ్య 9.21 %
అదే సమయంలో భారతదేశ జనాభా వృద్ధిరేటు 17.7 శాతం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అక్షరాస్యత 2011 జనాభా లెక్కల ప్రకారం 67.35%, అదే సమయంలో భారతదేశ అక్షరాస్యత 72.98% ఉంది.
ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న మొత్తం భూమి వివరాలు...
భూమి రకం | శాతం | విస్తీర్ణం |
నికర సాగు భూమి | 37.08% | 60. 43లక్షల హెక్టార్లు |
అటవీ భూమి | 22.63% | 36.88 లక్షల హెక్టారు |
చిత్తడి భూములు | 8.91% | 14.51 లక్షల హెక్టార్లు |
వ్యవసాయేతర భూమి | 12.63% | 20.58 లక్షల హెక్టార్లు |
బంజరు, బీడు భూమి | 8.25 % | 13.45 లక్షల హెక్టార్లు |
తడి, వ్యవసాయ వ్యర్థాల భూమి | 7.03% | 11.46 లక్షల హెక్టార్లు |
ఇతర భూమి | 3.47% | 5.66 లక్షల హెక్టార్లు |
- 2018 -19 సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థూల ఉత్పత్తి (ప్రస్తుత ధరల్లో): 9,33,402 కోట్లు (అంచనా)
- 2017-18 సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థూల ఉత్పత్తి: (ప్రస్తుత ధరల్లో): 8,095,48 కోట్లు
- స్థిర ధరల వద్ద 2018-19 సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థూల ఉత్పత్తి: 6,80,332 కోట్లు (అంచనా)
- స్థిర ధరల వద్ద 2017-18 సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థూలఉత్పత్తి 6,12,793 కోట్లు
- 2017-18, 2018-19 మధ్య ఆంధ్రప్రదేశ్ GSDP వృద్ధిరేటు 11.02 శాతం. అదే సమయంలో భారతదేశ వృద్ధిరేటు 7.0 శాతం
- రంగాల వారి వృద్ధి రేటు( 2011 - 12 స్థిర ధరల వద్ద, 2018 - 19 సంవత్సరానికి)
1.వ్యవసాయం 10.78 %
2. పరిశ్రమలు 10.24%
3. సేవారంగం 11.09%
వ్యవసాయం,దాని అనుబంధ రంగాలు...
రంగం | జీవీఏ | వృద్ధిరేట్లు |
వ్యవసాయం | 28,792 కోట్లు | 9.83% |
మత్స్య పరిశ్రమ | 49,366 కోట్లు | 19.09% |
హార్టికల్చర్ | 47,111 కోట్లు | 16.07% |
పశుసంవర్ధకం | 53,156 కోట్లు | 13.30% |
పరిశ్రమలు :
రంగం | జీవీఏ | వృద్ధిరేట్లు |
తయారీ రంగం | 72,523 కోట్లు | 10.56% |
గనులు, క్వారీలు | 24,802 కోట్లు | 10.34% |
నిర్మాణ రంగం | 49,149 కోట్లు | 9.55% |
విద్యుత్,గ్యాస్, నీటి సరఫరా | 18,942 కోట్లు | 10.72% |
సేవలు :
రంగం | జీవీఏ | వృద్ధిరేట్లు |
రియల్ ఎస్టేట్-అనుబంధం | 51,083కోట్లు | 10.24% |
వర్తకం, వాణిజ్యం, హోటల్స్ | 57,507కోట్లు | 12.38% |
రవాణా | 42,369 కోట్లు | 10.36% |
బ్యాంకింగ్,బీమా,ఇతరాలు | 23,866 కోట్లు | 12.90% |
సమాచారం | 12,911కోట్లు | 12.53% |
రైల్వే | 5,124 కోట్లు | 8.40% |
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తలసరి ఆదాయం :
గత ఐదేళ్లలో రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయం గణనీయంగా పెరిగింది. ప్రస్తుత ధరల ప్రకారం చూస్తే జాతీయ స్థాయిలో తలసరి ఆదాయం సగటు కంటే, రాష్ట్రంలో తలసరి ఆదాయం చాలా మెరుగ్గా ఉంది
సంవత్సరం | జాతీయ తలసరి ఆదాయం(రూ.) | రాష్ట్ర తలసరి ఆదాయం(రూ.) |
2014-15 | 86,647 | 93,903 |
2015-16 | 94,797 | 1,08,002 |
2016-17 | 1,04,659 | 1,24,401 |
2017-18 | 1,14,958 | 1,43,935 |
2018-19 | 1,26,699 | 1,64,025 |
2017-18, 2018-19ల మధ్య రాష్ట్ర తలసరి ఆదాయ వృద్ధిరేటు: 13.96%
ప్రజారుణం రాష్ట్ర రెవెన్యూ రాబడి :
రాబడి రకం | 2017-18 | 2018-19 అంచనాలు |
సొంత పన్ను ఆదాయం | 49,813కోట్లు | 58,125కోట్లు |
పన్నేతర ఆదాయం | 3,814 కోట్లు | 4,391కోట్లు |
కేంద్రం నుంచి వచ్చిన నిధులు | 51,250 కోట్లు | 52,963కోట్లు |
రాష్ట్ర రుణం :
- 2017-18 ముగింపు నాటికి: 1,94,862 కోట్లు
- 2018-19 ముగింపు నాటికి: 2,58,928 కోట్లు
- రెవెన్యూ లోటు: 16,152కోట్లు
- ద్రవ్యలోటు: 32,373కోట్లు
- రాష్ట్ర వర్షపాతం 2018 - 19 సంవత్సరానికినైరుతి రుతుపవనాల ద్వారా కురిసింది: 456.6 మి. మీ.(రాష్ట్ర వార్షిక సగటు: 556మి. మీ., లోటు: -18%
- ఈశాన్య రుతుపవనాల ద్వారా కురిసింది: 124.1మి. మీ.(రాష్ట్ర వార్షిక సగటు: 296 మి. మీ.), లోటు: -58%
- 2018-19 సంవత్సరానికి ఆహార ధాన్యాల ఉత్పత్తి కింద ఉన్న మొత్తం సాగు భూమి: 40.26 లక్షల హెక్టార్లు (2017-18లో 42.06ల.హె.) తగ్గుదల: 4.27%
- 2018-19 సంవత్సరానికి మొత్తం ఆహార ధాన్యాల ఉత్పత్తి: 151.12 టన్నులు (2017-18లో 167.22 లక్షల టన్నులు), తగ్గుదల: 9.63%
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పంటల సాంద్రత: 1.26
- ఆంధ్రప్రదేశ్‌లోని మొత్తం భూకమతాల సంఖ్య: 85.24 లక్షలు
- ఆంధ్రప్రదేశ్‌లో సగటు భూకమతం: 0.94 హెక్టార్లు
- 2019 అక్టోబర్ 15 నుంచి ప్రతి రైతుకి పెట్టుబడి సాయం కింద 12,500 రూపాయల సహాయం
- రైతులకు ఉచితంగా పంటల బీమా సదుపాయం
- 2019 - 20 నుంచి రైతులకు వడ్డీ లేని రుణాలు
- 2018 -19 లో స్వీకరించిన మొత్తం సాయిల్ శాంపిల్స్: 6.80 లక్షలు
- 2018-19లో పంపిణీ చేసిన మొత్తం సాయిల్ హెల్త్ కార్డులు: 34.62 లక్షలు
- ఆంధ్రప్రదేశ్ రైతులకు సబ్సిడీ కింద పంపిణీ చేసిన మొత్తం విత్తనాలు: 7,748 క్వింటాళ్లు
- రైతులు లబ్ధి పొందిన మొత్తం సబ్సిడీ విలువ: రూ. 444.64 లక్షలు
- రైతులకు సబ్సిడీ కింద పంపిణీ చేసిన ట్రాక్టర్లు: 11,030
- వ్యవసాయ అభివృద్ధి, రైతుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్ మిషన్ ఏర్పాటు
- ఆంధ్రప్రదేశ్‌లో హార్టికల్చర్ కింద ఉన్న మొత్తం సాగు భూమి: 17.62 లక్షల హెక్టార్లు
- హార్టికల్చర్ ద్వారా ఆంధ్రప్రదేశ్ 2018- 19 సంవత్సరానికి చేసిన కూరగాయలు, పండ్ల ఉత్పత్తి: 327.57 లక్షల మెట్రిక్ టన్నులు
- ఆంధ్రప్రదేశ్ మిరప, నిమ్మ, ఆయిల్ ఫామ్, బొప్పాయి, టమోటా, సపోటా, ఉత్పత్తిలో దేశంలో మొదటి స్థానం కలిగి ఉంది.
- మామిడి, పసుపు, స్వీట్ ఆరెంజ్, క్యాష్యూనట్ ఉత్పత్తిలో దేశంలో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో ఉంది.
- ఆంధ్రప్రదేశ్‌లో రెండు లక్షల ఎకరాల్లో సూక్ష్మసేద్యం జరుగుతుంది.
- ఆంధ్రప్రదేశ్ పట్టు ఉత్పత్తిలో దేశంలో రెండో స్థానంలో ఉంది.
- ఆంధ్రప్రదేశ్ కోడిగుడ్ల ఉత్పత్తిలో దేశంలో నాలుగో స్థానంలో ఉంది.
- ఆంధ్రప్రదేశ్ పాల ఉత్పత్తిలో దేశంలో నాలుగో స్థానంలో ఉంది.
- ఆంధ్రప్రదేశ్ ఆక్వా రంగంలో దేశంలో ప్రథమ స్థానంలో ఉంది.
- ఆంధ్రప్రదేశ్ ష్రింప్ చేపల ఉత్పత్తిలో దేశంలో మొదటి స్థానంలో ఉంది.
- ఆంధ్రప్రదేశ్ ూ్ఛఅక వాణిజ్యంలో దేశంలో తొలిస్థానంలో ఉంది.
- 2018 - 19 లో ప్రారంభమైన 14 పెద్ద, మెగా పారిశ్రామిక ప్రాజెక్టులు 16,925.08 కోట్లతో 14,130 మందికి ఉపాధిని అందించారు.
- 2018-19లో 344.57కోట్ల పెట్టుబడితో ప్రారంభమైన 10,068 సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల వల్ల 93,240 మందికి ఉపాధి లభించింది.
- నేషనల్ ఈ గవర్నెన్‌స eBiZ ప్రాజెక్టు కింద వ్యాపార,పారిశ్రామిక అనుమతులకు సింగిల్ విండో సిస్టం ఉన్న తొలి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్.
- ఆంధ్రప్రదేశ్‌లో రెండు పారిశ్రామిక కారిడార్లు అభివృద్ధి చెందుతున్నాయి.
1. వైజాగ్-చెన్నై పారిశ్రామిక కారిడార్. దీని కింద ముఖ్యమైన ప్రాధాన్యతా నోడ్‌లుగా గుర్తించారు: విశాఖపట్నం నోడ్ , ఏర్పేడు- శ్రీకాళహస్తి నోడ్.
2. చెన్నై -బెంగళూరు పారిశ్రామిక కారిడార్. దీని కింద అభివృద్ధి చేయబోతున్న నోడ్ ఫేజ్1 కింద కృష్ణపట్నం ఇండస్ట్రియల్ నోడ్. - ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 19 ప్రత్యేక ఆర్థిక మండళ్లు (సెజ్‌లు) ఉన్నాయి.
- డ్రగ్స్, ఫార్మాస్యూటికల్, వ్యవసాయ అనుబంధ ఉత్పత్తులు, చేతి కళావృత్తులు, ఖనిజాలు, ఖనిజ ఉత్పత్తులు మొదలైన వాటితో కలిపి 98983.95 కోట్ల విలువైన ఉత్పత్తులను ఎగుమతి చేస్తుంది.
- ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం వ్యవసాయానికి వినియోగిస్తున్న నీటి నిల్వ: 308.703 టీఎంసీలు కాగా త్వరలో వినియోగానికి రాబోతున్న నీటినిల్వ: 468.688 టీఎంసీలు.
- మార్చి 2019 నాటికి రాష్ట్రంలో సాగునీటి సౌకర్యం ఉన్న భూమి-105.36 టిఎంసీలు
- 2018 -19 సంవత్సరానికి 26,942.75 కోట్ల అంచనా వ్యయంతో 14 ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ ప్రాజెక్టుల ద్వారా 2.88 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించడం, 14.82 లక్షల ఎకరాలను స్థిరీకరించడానికి ఆదేశాలు జారీ అయ్యాయి.ఇందులో ప్రధానమైనవి...
- బొడ్డేపల్లి రాజగోపాలరావు వంశధార ప్రాజెక్టు స్టేజ్-1,ఫేజ్ 2
- సర్దార్ గౌతు లచ్చన్న తోటపల్లి బ్యారేజ్ ప్రాజెక్ట్
- గోదావరి డెల్టా ఆధునీకరణ
- కృష్ణా డెల్టా ఆధునీకరణ
- గాలేరు-నగరి సుజల స్రవంతి
- హంద్రీనీవా సుజల స్రవంతి మొదలైనవి
- ఆంధ్రప్రదేశ్‌లో సగటు భూగర్భ జలం 16.19 మీటర్లు.
- ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం స్థాపిత విద్యుత్ సామర్థ్యం- 19,160 మెగా వాట్లు.
- రాష్ట్రంలో 2018 -19 లో విడుదల చేసిన వ్యవసాయ సర్వీస్‌లు 86,430
- 2018- 19 లో అవసరమైన మొత్తం విద్యుత్ వినియోగం 63144మెగావాట్లు
- 2018 -19లో రాష్ట్రంలో తలసరి విద్యుత్ వినియోగం 1147 యూనిట్లు.
- రాష్ట్రంలో 2.20 కోట్ల ఎల్‌ఈడీ బల్బుల పంపిణీ. పట్టణాల్లో 6.21 లక్షల వీధి దీపాల స్థానంలో, గ్రామ పంచాయతీల్లో 205.60 లక్షల వీధి దీపాల స్థానంలో ఎల్‌ఈడీ బల్బులను ప్రభుత్వం అమర్చింది.
- రాష్ట్రంలో రైతులందరికీ ఉచితంగా 9 గంటల పగటిపూట విద్యుత్ సరఫరా.
రాష్ట్రంలో ప్రస్తుతం కార్యకలాపాలు నిర్వహిస్తున్న విమానాశ్రయాలు 6 కాగా ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ప్రధాన ఓడరేవులు 14. విశాఖపట్నం సహజ ఓడరేవు మాత్రం కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంది.
పేదరికం :
2011-12 సంవత్సరానికి గాను ఆంధ్రప్రదేశ్‌లో పేదరికం 9.20 శాతంగా నమోదైంది. ఇది గ్రామీణ ప్రాంతాల్లో 10.96 శాతం, పట్టణ ప్రాంతాల్లో 5.81 శాతంగా ఉంది. అదే సమయంలో భారత దేశ పేదరికం 21.92 శాతం కాగా అందులో గ్రామీణ భారతదేశ పేదరికం 25.70 శాతం పట్టణ పేదరిక శాతం 13.70శాతంగా ఉంది.
నిరుద్యోగం :
2011-12 మధ్య నేషనల్ శాంపిల్ సర్వే కార్యాలయం వారు నిర్వహించిన 68వ రౌండ్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ గ్రామీణ ప్రాంతాల్లో 12, పట్టణ ప్రాంతాల్లో 43గా నిరుద్యోగం నమోదైంది.అదే సమయంలో భారతదేశంలో గ్రామీణ స్థాయిలో 17, పట్టణ స్థాయిలో 34గా నిరుద్యోగం నమోదైంది.
Published date : 07 Aug 2019 02:09PM