AP Government Jobs 2023 : గ్రూపు–1, 2 పోస్టుల వివరాలను వెంటనే అందించండి.. ఇంకా గ్రామ, వార్డు సచివాలయాల పోస్టుల భర్తీకి తర్వలోనే..
ఇందుకు సంబంధించి తక్షణ చర్యలు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కేఎస్ జవహర్ రెడ్డి కార్యదర్శులకు సూచించారు. ఫిబ్రవరి 16వ తేదీన (గురువారం) రాష్ట్ర సచివాలయం ఐదవ బ్లాకు కలెక్టర్ల సమావేశ మందిరంలో సీఎస్ అధ్యక్షతన కార్యదర్శుల సమావేశం జరిగింది.
ఏపీ గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ప్రజలకు అందిస్తున్న సేవలను మరింత మెరుగు పరచడం, అధికారాల బదిలీ, కలెక్టర్లతో వీడియో సమావేశాల్లో వచ్చిన అంశాలపై ఫాలోఅప్ చర్యలు, అసెంబ్లీకి సంబంధించి పెండింగ్‌లో ఉన్న వివిధ ఎల్‌ఏక్యూ, ఎల్సీక్యూలపై సత్వరం సమాచారం అందించడం, తదితర అజెండా అంశాలపై సీఎస్ కార్యదర్శులతో సమీక్షించారు.
ఇంకా ఆయన ఏమన్నారంటే..
► ఏపీ గ్రామ, వార్డు సచివాలయాల్లో పని చేస్తున్న ఉద్యోగుల ప్రొబేషన్ డిక్లరేషన్‌కు చర్యలు తీసుకోవాలి. వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న గ్రూపు 1, 2స్థాయి పోస్టుల ఖాళీల వివరాలను వెంటనే సాధారణ పరిపాలన శాఖకు అందజేయాలి. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఇ–ఆఫీస్ విధానం కింద ఇ–రశీదులు, ఇ–డిస్పాచ్ విధానాన్ని పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు చర్యలు చేపట్టాలన్నారు.
► గతంలో నిర్వహించిన ఉద్యోగ సంఘాల జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాల్లో ఉద్యోగ సంఘాల నుంచి వచ్చిన డిమాండ్లలో ఆర్థికేతర అంశాలకు సంబంధించిన డిమాండ్లను త్వరగా పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలన్నారు.
☛ Andhra Pradesh: 63 CDPO ఉద్యోగాల భర్తీకి సీఎం గ్రీన్ సిగ్నల్.. అలాగే ఈ పోస్టులను కూడా..
వీలైనంత త్వరగా భర్తీ చేయాలని ఆదేశాలు..
ఇటీవలే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి కీలక ఆదేశాలు ఇచ్చిన విషయం తెల్సిందే. ఇందులో భాగంలో ఏపీపీఎస్సీ గ్రూప్-1,2 ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగుతున్న విషయం తెల్సిందే. అలాగే సీడీపీఓ 63 ఉద్యోగాలకు భర్తీకి ఆదేశాలు ఇచ్చారు. అలాగే ఈ సీడీపీఓ ఉద్యోగాలను వీలైనంత త్వరగా భర్తీ చేయాలని ఆదేశించారు. ఇదే విధంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి రంగం సిద్ధం అయింది. ఈ పోస్టుల భర్తీకి ఫిబ్రవరిలో ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయనుంది. మొత్తం 20 కేటగిరీల్లో దాదాపు 14,523 పోస్టులను భర్తీ చేసే అవకాశం ఉంది.
☛ AP Grama Ward Sachivalayam 2023 : ఇకపై వీఆర్వోలు, గ్రామ సర్వేయర్లలు చేయాల్సిన పనులు ఇవే..