భారత సమాఖ్య విధానానికి ఆధారమైన రాజ్యాంగాన్ని ఏ దేశం నుంచి తీసుకున్నారు?
1. కింది వాటిలో భారత రాజ్యాంగ మౌలిక స్వరూపంలో భాగం కాని అంశం ఏది?
1) సమన్యాయ పాలన
2) పార్లమెంటరీ ప్రభుత్వం
3) లౌకికతత్వం
4) ఆర్థిక అత్యవసర పరిస్థితి
- View Answer
- సమాధానం: 4
2. భారత సమాఖ్య విధానానికి ఆధారమైన రాజ్యాంగాన్ని ఏ దేశం నుంచి తీసుకున్నారు?
1) స్విట్జర్లాండ్
2) అమెరికా
3) కెనడా
4) బ్రిటన్
- View Answer
- సమాధానం: 3
3. అధికరణ 141 దేని గురించి తెలుపుతుంది?
1) సుప్రీంకోర్టులో జడ్జీల నియామకం
2) సుప్రీంకోర్టు నిర్మాణం
3) సుప్రీంకోర్టు ప్రకటించిన తీర్పులను దేశంలో అన్ని న్యాయస్థానాలు పాటిం చాలి
4) సుప్రీంకోర్టు జడ్జీల జీతభత్యాలు
- View Answer
- సమాధానం: 3
4. పార్లమెంటు రాష్ట్ర జాబితాపై కింద పేర్కొన్న ఏయే పరిస్థితుల్లో చట్టాలు చేయవచ్చు?
a) రాజ్యసభ ఒక ప్రత్యేక తీర్మానం చేసినప్పుడు
b) రాష్ట్రాలు కోరినప్పుడు
c) జాతీయ అత్యవసర పరిస్థితి విధించినప్పుడు
d) సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు
1) a, c
2) a, b, c, d
3) a, b, c
4) a, b
- View Answer
- సమాధానం: 3
5. ఒక రాష్ర్టంలోని విధాన పరిషత్‌ను రద్దు చేసే అధికారం ఎవరికి ఉంది?
1) ఆ రాష్ర్ట గవర్నర్
2) భారత రాష్ర్టపతి
3) భారత పార్లమెంట్
4) ఆ రాష్ర్ట కేబినెట్
- View Answer
- సమాధానం: 3
6.కింది వాటిలో రాష్ర్ట గవర్నర్ కార్యనిర్వహణాధికారం కానిది ఏది?
1) రాష్ట్ర ఆర్థిక సంఘం ఏర్పాటు
2) రాష్ర్ట అడ్వకేట్ జనరల్ నియామకం
3) ఆంగ్లో ఇండియన్స నియామకం
4) రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ నియామకం
- View Answer
- సమాధానం: 3
7. రాష్ట్ర మానవ హక్కుల చైర్మన్‌ను తొలగించే అధికారం ఎవరికి ఉంది?
1) ఆ రాష్ట్ర శాసనసభకు
2) ఆ రాష్ట్ర గవర్నర్‌కు
3) భారత రాష్ట్రపతికి
4) భారత పార్లమెంట్‌కు
- View Answer
- సమాధానం: 3
8. సమాజాభివృద్ధి పథకానికి సంబంధించి కింది వాటిలో సరికాని అంశం ఏది?
a) వి.టి. కృష్ణమాచారి సిఫారసుల ప్రకారం దీన్ని ప్రవేశపెట్టారు
b) 1952 అక్టోబర్ 2న ఈ పథకాన్ని ప్రారంభించారు
c) అమెరికాకు చెందిన ‘ఫోర్డ్ ఫౌండేషన్’ సహకారం అందించింది
d) స్వాతంత్య్రానంతరం పట్టణాల అభివృద్ధి కోసం ప్రారంభమైన పథకం
1) a, b, c
2) a, b, c, d
3) a, b
4) d మాత్రమే
- View Answer
- సమాధానం: 4
9. జిల్లా యూనిట్‌గా ప్రణాళికా అభివృద్ధి జరగాలని సూచించిన కమిటీ ఏది?
1) దంత్వాలా కమిటీ
2) హనుమంతరావు కమిటీ
3) జి.వి.కె. రావు కమిటీ
4) ఎల్.ఎం. సింఘ్వీ కమిటీ
- View Answer
- సమాధానం: 3
10. కింది వాటిలో భారత రాజ్యాంగం లక్షణాల్లో లేనిది ఏది?
1) లిఖిత రాజ్యాంగం
2) రాజ్యాంగాధిక్యత
3) నిబద్ధ న్యాయశాఖ
4) అధికారాల పంపిణీ
- View Answer
- సమాధానం: 3
11. భారతదేశ పరిస్థితులకు సరిపోయే సమాఖ్య విధానం ఏది?
1) బేరమాడే సమాఖ్య విధానం
2) కేంద్రీయ సమాఖ్య విధానం
3) సహకార సమాఖ్య విధానం
4) సంఘర్షణ సమాఖ్య విధానం
- View Answer
- సమాధానం: 3
12. కార్యనిర్వాహకశాఖకు స్వతంత్ర ప్రతిపత్తి కల్పించిన రాజ్యాంగం ఏది?
1) అమెరికా రాజ్యాంగం
2) బ్రిటిష్ రాజ్యాంగం
3) భారత రాజ్యాంగం
4) స్విట్జర్లాండ్ రాజ్యాంగం
- View Answer
- సమాధానం: 1
13. కింది వాటిలో భారత రాజ్యాంగానికి సంబంధించి ఏకకేంద్ర లక్షణాలు కానివి?
a) అధికరణ -275 ప్రకారం గ్రాంట్ల విడుదల
b) ఆర్థిక సంఘం ఏర్పాటు
c) అధికరణలు-200, 201
d) రాజ్యాంగ ఆధిక్యత
e) రెండు సభల విధానం
1) c, d, e
2) d, e
3) b, d, e
4) b, e
- View Answer
- సమాధానం: 2
14.ఒక రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ పదవీ విరమణానంతరం చేపట్టే పదవులకు సంబంధించి కింది వాటిలో సరైంది ఏది?
1) యూపీఎస్సీ చైర్మన్‌గా పనిచేయవచ్చు
2) యూపీఎస్సీ సభ్యుడిగా పనిచేయవచ్చు
3) ప్రభుత్వ ఉద్యోగం చేయరాదు
4) పైవన్నీ సరైనవే
- View Answer
- సమాధానం: 4
15. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్)కు సంబంధించి కింది వాటిలో సరైన అంశాలు ఏవి?
a) కాగ్ జీతభత్యాలను పార్లమెంట్ నిర్ణయిస్తుంది
b) ఈయన జీతభత్యాలను రాష్ట్రపతి నిర్ణ యిస్తాడు
c) కాగ్‌గా పనిచేసిన వ్యక్తి పదవీ విరమణా నంతరం ఏ ఉద్యోగం చేయరాదు
d) రాష్ట్రపతి నియమిస్తాడు
e) ఈ పదవిని బ్రిటిష్ రాజ్యాంగం నుంచి స్వీకరించారు
1) a, b, c
2) a, b, c, d, e
3) a, c, d, e
4) b, c, d, e
- View Answer
- సమాధానం: 3
16. శాసనసభలు రూపొందించే సాధారణ చట్టాల కంటే సర్వోన్నతమైనవి అని వేటిని అంటారు?
1) ప్రాథమిక విధులు
2) ఆదేశిక సూత్రాలు
3) ప్రాథమిక హక్కులు
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 3
17. ఆరెస్టయిన వ్యక్తిని 24 గంటల్లో కోర్టులో హాజరు పరచాలి. ఈ నిబంధన వర్తించని సందర్భాలు ఏవి?
1) అరెస్టయిన వ్యక్తి శత్రుదేశాలకు చెందిన వారైతే
2) ప్రివెంటివ్ డిటెన్షన్ కింద అరెస్టయితే
3) కోర్టు ఉత్తర్వుల మేరకు అరెస్టయితే
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
18. అంతరంగిక భద్రత చట్టం (MISA) ఎప్పుడు రూపొందించారు?
1) 1974
2) 1971
3) 1980
4) 1985
- View Answer
- సమాధానం: 2
19. కింది వాటిని జతపరచండి.
జాబితా- I (చట్టం)
a) కనీస వేతనాల చట్టం
b) వెట్టిచాకిరి నిరోధ చట్టం
c) వన్యమృగ సంరక్షణ చట్టం
d) గనుల చట్టం
జాబితా- II (సంవత్సరం)
i) 1976
ii) 1948
iii) 1952
iv) 1972
1) a- ii, b-i, c- iv, d- iii
2) a- i, b-iii, c- ii, d- iv
3) a- iv , b-ii, c-iii, d- i
4) a- iii, b- iv, c -ii, d- i
- View Answer
- సమాధానం: 1
20. ‘అల్ప సంఖ్యాక వర్గాల వారి ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నప్పుడు వాటికి చట్టప్రకారం నష్టపరిహరం ఇవ్వాలి’ అని ఏ నిబంధన వివరిస్తుంది?
1) 30 (1)
2) 30 (2)
3) 30 (1) ఎ
4) 30(1) బి
- View Answer
- సమాధానం: 3
21. ఒక పబ్లిక్ పదవిని పొందడానికి ఒక వ్యక్తికి హక్కుగానీ, అర్హతగానీ లేదని కోర్టు భావించినప్పుడు జారీ చేసే రిట్ ఏది?
1) మాండమస్
2) కో వారంటో
3) ప్రొహిబిషన్
4) సెర్షియోరరీ
- View Answer
- సమాధానం: 2
22. నిర్దేశిక నియమాలను రాజ్యాంగం ఎవ రికి సమర్పించింది?
1) పౌరులకు
2) సమాజానికి
3) రాజ్యానికి
4) విదేశీయులకు
- View Answer
- సమాధానం: 3
23. ‘పేదలకు ఉచిత న్యాయం’ అందించాలని ఎక్కడ పొందుపర్చారు?
1) ప్రాథమిక విధులు
2) ఆదేశిక సూత్రాలు
3) ప్రాథమిక హక్కులు
4) ప్రవేశిక
- View Answer
- సమాధానం: 2
24. నిరుద్యోగులను, వృద్ధులను రాజ్యం ఆదుకోవాలని ఏ అధికరణలో ప్రస్తావించారు?
1) అధికరణ-43
2) అధికరణ-41
3) అధికరణ-42
4) ఏదీకాదు
- View Answer
- సమాధానం: 2
25. ‘ఆదేశిక సూత్రాలను ప్రజలకు బాధ్యత వహించే ఏ మంత్రివర్గం విస్మరించ లేదు’ అని వ్యాఖ్యానించిన వారెవరు?
1) అల్లాడి కృష్ణస్వామి అయ్యర్
2) కె. సంతానం
3) ఐవర్ జెన్నింగ్‌స
4) టి.టి. కృష్ణమాచారి
- View Answer
- సమాధానం: 1
26. ‘నష్ట పరిహరమంటే న్యాయమైన నష్ట పరిహరం’ అని సుప్రీంకోర్టు ఏ కేసులో తీర్పు చెప్పింది?
1) శంకరీప్రసాద్ వర్సెస్ కేంద్ర ప్రభుత్వం (1951)
2) బెల్లా బెనర్జీ వర్సెస్ పశ్చిమ బెంగాల్ (1954)
3) కామేశ్వర్ సింగ్ వర్సెస్ బిహార్ కేసు (1951)
4) సజ్జన్ సింగ్ వర్సెస్ రాజస్థాన్ కేసు (1964)
- View Answer
- సమాధానం: 2
27. మాతృభాషలోనే ప్రాథమిక విద్యను అందించాలని రాజ్యాంగంలోని ఏ అధికరణ తెలియజేస్తోంది?
1) 351 ఏ
2) 350 ఏ
3) 350 బి
4) 351 బి
- View Answer
- సమాధానం: 2
28. కేంద్ర రాష్ట్రాల మధ్య పరిపాలనా సంబం ధాలను వివరిస్తున్న అధికరణలు?
1) 256 నుంచి 263 వరకు
2) 256 నుంచి 264 వరకు
3) 255 నుంచి 263 వరకు
4) 255 నుంచి 264 వరకు
- View Answer
- సమాధానం: 1
29. ఒక విషయాన్ని అక్కడితో వదలి వేయడానికి పార్లమెంటులో ప్రవేశపెట్టే ప్రతిపాదన?
1) అనుషంగిక ప్రతిపాదన
2) అధిక్రమణ ప్రతిపాదన
3) సవరణ ప్రతిపాదన
4) ముగింపు ప్రతిపాదన
- View Answer
- సమాధానం: 2
30. పార్లమెంటులో విజ్ఞాపన కమిటీకి సంబం దించి సరైన అంశాలను గుర్తించండి.
1) ఈ కమిటీలో లోకసభలోని 15 మంది, రాజ్యసభలోని 10 మంది సభ్యులు ఉంటారు
2) ఈ కమిటీని అంబుడ్సమన్ లేదా నిఘా కమిటీ అంటారు
3) కమిటీ చైర్మన్లను ఆయా సభాధ్యక్షులే నియమిస్తారు
4) పైవన్నీ సరైనవే
- View Answer
- సమాధానం: 4
31. న్యాయశాఖ సామర్థ్యాన్ని బట్టి ప్రజా స్వామ్యం మనుగడ ఆధారపడి ఉంటుందని పేర్కొన్న వారెవరు?
1) లార్డ్ రిప్పన్
2) లార్డ్ బ్రైస్
3) గెటిల్
4) ఏవీ డైసీ
- View Answer
- సమాధానం: 2
32. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య ఎంత?
1) ఒక ప్రధాన న్యాయమూర్తి, ఏడుగురు ఇతర న్యాయమూర్తులు
2) ఒక ప్రధాన న్యాయమూర్తి, 8 మంది ఇతర న్యాయమూర్తులు
3) ఒక ప్రధాన న్యాయమూర్తి, 9 మంది ఇతర న్యాయమూర్తులు
4) ఒక ప్రధాన న్యాయమూర్తి, ఆరుగురు ఇతర న్యాయమూర్తులు
- View Answer
- సమాధానం: 2
33. బ్రిటిష్ ఇండియాలో సుప్రీంకోర్టును ఎప్పుడు ఏర్పాటు చేశారు?
1) 1773
2) 1774
3) 1775
4) 1772
- View Answer
- సమాధానం: 2
34. ‘పార్లమెంటరీ కవల పిల్లలు’ అని ఏ రెండు కమిటీలను పిలుస్తారు?
1) అంచనాల కమిటీ, ప్రభుత్వ ఖాతాల సంఘం
2) ప్రభుత్వ ఖాతాల సంఘం, ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ
3) అంచనాల కమిటీ, ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ
4) ప్రభుత్వ హామీల సంఘం, అంచనాల సంఘం
- View Answer
- సమాధానం: 1
35. కొత్తగా సుప్రీంకోర్టు ‘బెంచ్‌లను’ ఏర్పాటు చేసే అధికారం ఎవరికి ఉంది?
1) భారత రాష్ట్రపతి
2) భారత పార్లమెంట్
3) భారత సుప్రీంకోర్టు
4) కేంద్ర కేబినెట్
- View Answer
- సమాధానం: 2
36. కింది వాటిలో సాధారణ మెజారిటీతో పార్లమెంట్ సవరించే అంశాలు ఏవి?
1) విధానమండలి ఏర్పాటు, రద్దు (అధికరణ 169)
2) పార్లమెంటు సభ్యుల జీతాలు పెంచుకోవడం (అధికరణ 106)
3) పౌరసత్వానికి సంబంధించిన మార్పులు (అధికరణలు 5 నుంచి 11 వరకు)
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
37.కింది వాటిలో పార్లమెంట్ ప్రత్యేక మెజార్టీతో పాటు సగం రాష్ట్రాలు సాధారణ మెజార్టీతో ఆమోదించే అంశాలు ఏవి?
a) జాబితాలను మార్చడం (అధికరణ 246)
b) రాష్ట్రపతి ఎన్నిక విధానాన్ని మార్చడం (54, 55 నిబంధనలు)
c) కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కార్య నిర్వాహణాధికారాలు
d) పార్లమెంటులోని రాజ్యసభ సీట్లు మార్చడం (నాలుగో షెడ్యూల్)
e) సుప్రీంకోర్టు, హైకోర్టు అధికారాలు మార్చడం (ఐదో భాగంలోని 4, 5 అధ్యాయాలు)
1) a, b, c
2) a, b, c, d, e
3) a, b, c, d
4) b, c, d, e
- View Answer
- సమాధానం: 2
38.జాతీయ వెనకబడిన తరగతుల కమిషన్ (ఓబీసీ)కు సంబంధించి సరైంది ఏది?
1) రాజ్యాంగంలోని 340 నిబంధన ప్రకారం ఏర్పడింది
2) భారత రాష్ట్రపతి ఏర్పాటు చేస్తారు
3) 1978లో మండల కమిషన్ ఏర్పాటు
4) పైవన్నీ సరైనవే
- View Answer
- సమాధానం: 4
39. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల అర్హతలకు సంబంధించి సరికాని అంశం ఏది?
1) ఏదైనా హైకోర్టులో న్యాయమూర్తిగా 5 ఏళ్ల అనుభవం ఉండాలి
2) ఏదైనా హైకోర్టులో పదేళ్లు న్యాయవాదిగా పనిచేసిన అనుభవం ఉండాలి
3) రాష్ర్టపతి దృష్టిలో ప్రముఖ న్యాయవాద శాస్త్ర కోవిదుడై ఉండాలి
4) ఐదేళ్లు జిల్లా జడ్జిగా పనిచేసిన అనుభవం ఉండాలి
- View Answer
- సమాధానం: 4
40. గవర్నర్ పదవీ కాలం ఎన్ని సంవత్సరాలు ఉంటుంది?
1) ఐదేళ్లు
2) ఆరేళ్లు
3) రాష్ట్రపతి సంతృప్తి మేరకు
4) 65 ఏళ్ల వయస్సు నిండే వరకు
- View Answer
- సమాధానం: 3
41. గవర్నర్ జీత భత్యాలను ఎవరు నిర్ణయిస్తారు?
1) రాష్ట్ర శాసనసభ చట్టం ద్వారా
2) పార్లమెంటు చట్టం ద్వారా
3) రాష్ట్రపతి నిర్ణయం మేరకు
4) రాజ్యాంగ సవరణ ద్వారా
- View Answer
- సమాధానం: 2
42. న్యాయస్థానాలకు న్యాయ సమీక్ష ఉండటానికి కారణం?
1) రాజ్యాంగ ఔన్నత్యాన్ని కాపాడటం
2) సమాఖ్య వ్యవస్థ సమతౌల్యాన్ని కాపాడటం కోసం
3) పౌరుల ప్రాథమిక హక్కులను రక్షించడం కోసం
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
43. విధాన పరిషత్తు సభ్యుడిగా పోటీ చేయాలంటే కావలసిన అర్హతలలో లేనిది?
1) 30 ఏళ్లు వయస్సు నిండి ఉండాలి
2) పార్లమెంటు చట్టం ద్వారా నిర్ణయించిన అర్హతలు కలిగి ఉండాలి
3) శాసనసభ నిర్ణయించిన అర్హతలు ఉండాలి
4) భారతీయ పౌరుడై ఉండాలి
- View Answer
- సమాధానం: 3
44.ప్రాథమిక హక్కులకు సంబంధించి కింది వాటిలో సరికానిది ఏది?
1) వ్యక్తుల ప్రయోజనాలను పెంపొందిస్తాయి
2) న్యాయ ప్రాధాన్యత పొందినవి
3) రాజకీయ ప్రజాస్వామ్యాన్ని అందిస్తాయి
4) ఇవి రాజ్య కార్యకలాపాల పరిధిని విసృ్తతం చేస్తాయి
- View Answer
- సమాధానం: 4
45. ఆదేశిక సూత్రాలకు సంబంధించి కింది వాటిలో సరికాని అంశం ఏది ?
1) సమసమాజ స్థాపనే వీటి లక్ష్యం
2) ఆర్థిక వనరుల లభ్యత మేరకు అమలు చేస్తారు
3) న్యాయ రక్షణ లేనివి
4) ఇవి రాజ్య కార్యకలాపాల పరిధిని పరిమితం చేస్తాయి
- View Answer
- సమాధానం: 4
46. విదేశాల్లో పర్యటించే హక్కు ఏ అధికరణలో భాగంగా ఉంది?
1) అధికరణ 19
2) అధికరణ 21
3) అధికరణ 20
4) ఏదీకాదు
- View Answer
- సమాధానం: 2