భారత రాజ్యాంగం ప్రకారం సుప్రీంకోర్టు న్యాయ మూర్తుల కనీస వయస్సు ఎంత?
1. భారతదేశంలో సుప్రీంకోర్టును తొలిసారిగా ఎప్పుడు ఏర్పాటు చేశారు?
1) 1772
2) 1773
3) 1774
4) 1775
- View Answer
- సమాధానం: 3
వివరణ: వారన్ హేస్టీంగ్స్ బెంగాల్ గవర్నర్ జనరల్‌గా ఉన్నప్పుడు రెగ్యులేటింగ్ చట్టం–1773 ప్రకారం సుప్రీంకోర్టును 1774లో కలకత్తాలో ఏర్పాటు చేశారు. ఇందులో ఒక ప్రధాన న్యాయమూర్తి, ముగ్గురు న్యాయమూర్తులు ఉన్నారు. దీని ప్రధాన న్యాయమూర్తి సర్ ఎలిజా ఇంఫే. దీనిని 1937లో ఫెడరల్ కోర్ట్‌గా మార్చారు. భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన తర్వాత ప్రస్తుత సుప్రీంకోర్టు 1950 జనవరి 28న అవతరించింది. దీని తొలి ప్రధాన న్యాయమూర్తి హెచ్.జె.కానియా
- సమాధానం: 3
2. భారత రాజ్యాంగం ప్రకారం సుప్రీంకోర్టు న్యాయ మూర్తుల కనీస వయస్సు ఎంత?
1) 50 ఏళ్లు
2) 55 ఏళ్లు
3) 60 ఏళ్లు
4) కనీస వయస్సు లేదు
- View Answer
- సమాధానం: 4
వివరణ: రాజ్యాంగం ప్రకారం సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులకు కనీస వయస్సు లేదు. కానీ ప్రధాన న్యాయమూర్తుల సమావేశంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల కనీస వయస్సు 55 ఏళ్లుగా ఉండాలని, హైకోర్టు న్యాయమూర్తుల కనీస వయస్సు 45 ఏళ్లుగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. ఇది ఒక సాంప్రదాయంగా కొన సాగుతుంది.
-
3. కేంద్ర, రాష్ట్రాల మధ్య జరిగే వివాదాల పరిష్కారం అనేది సుప్రీంకోర్టు ఏ అధికార పరిధిలోకి వస్తుంది?
1) ప్రారంభ విచారణాధికారం
2) అప్పీళ్ల విచారణాధికారం
3) కోర్ట్ ఆఫ్ రికార్డ్
4) రిట్స్ జారీ అధికారం
- View Answer
- సమాధానం: 1
వివరణ: కొన్ని రకాల కేసులను సుప్రీంకోర్టు నేరుగా స్వీకరించి విచారిస్తుంది. దీనినే ప్రారంభ విచారణాధికారం అంటారు. సుప్రీంకోర్టు ప్రారంభ విచారణాధికారం లోకి కింది వివాదాలు వస్తాయి.
1. కేంద్ర, రాష్ట్రాల మధ్య వివాదాలు
2. రాష్ట్రాల మధ్య వివాదాలు
3. ప్రాధమిక హక్కుల పరిరక్షణ
4. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల వివాదాలు.
- సమాధానం: 1
4. భారత రాష్ట్రపతి ఏ ఆర్టికల్ ప్రకారం సుప్రీంకోర్టును న్యాయ సలహా కోరవచ్చు?
1) 124
2)131
3) 143
4) 147
- View Answer
- సమాధానం: 3
వివరణ: ఆర్టికల్ 143 ప్రకారం రాష్ట్రపతి ఏదైనా సమస్య పరిష్కారం కోసం సుప్రీంకోర్టును న్యాయసలహా కోరవచ్చు. అప్పుడు సుప్రీంకోర్టు ఐదుగురు జడ్జీల బెంచ్‌తో కలిపి న్యాయ సలహానిస్తుంది. ఇది కేవలం సలహా పరమైంది మాత్రమే. దీనికి రాష్ట్రపతి కట్టుబడి ఉండనవసరం లేదు.
ఇప్పటివరకు భారత రాష్ట్రపతులు వివిధ సందర్భాల్లో 15 సార్లు సుప్రీంకోర్టు సలహా కోరారు. అత్యధికంగా 3సార్లు సుప్రీంకోర్టు సలహా కోరిన రాష్ట్రపతి బాబూ రాజేంద్రప్రసాద్. రాష్ట్రపతి సుప్రీంకోర్టు సలహా కోరే విధానాన్ని కెనడా రాజ్యాంగం నుంచి స్వీకరించారు.
- సమాధానం: 3
5. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన తొలి మహిళా ఎవరు?
1) రుమాపాల్
2) మీరాసాహెబ్ ఫాతీమా బీబీ
3) సుజాత వసంత్ మనోహర్
4) జ్ఞాన్ సుధా మిశ్రా
- View Answer
- సమాధానం: 2
వివరణ: భారత సుప్రీంకోర్టు న్యాయ మూర్తిగా వ్యవహరించిన తొలిమహిళ మీరాసాహెబ్ ఫాతిమా బీబీ. ఈమె 1989–92 మధ్య పని చేశారు. ఇప్పటి వరకు 8 మంది మహిళలు సుప్రీంకోర్టు న్యాయ మూర్తులుగా వ్యవహరించారు. ప్రస్తుతం సుప్రీంకోర్టులో మొత్తం 33 మంది న్యాయ మూర్తులు ఉంటే, అందులో ముగ్గురు మహిళా న్యాయమూర్తులు ఉన్నారు. వారు ఆర్. భానుమతి, ఇందు మల్హోత్రా, ఇందిరా బెనర్జీ. అయితే ఇప్పటివరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఒక మహిళ కూడా కాలేదు.
- సమాధానం: 2
6. న్యాయ సమీక్ష పితామహుడు అని ఎవరిని అంటారు?
1) ఆడమ్స్
2) జఫర్సన్
3) మార్షల్
4) బెంధామ్
- View Answer
- సమాధానం: 3
వివరణ: శాసన నిర్మాణ శాఖ చేసిన చట్టాలు లేదా కార్యనిర్వాహణ శాఖ ఉత్తర్వులు రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉంటే వాటిని నిలిపి వేసే లేదా కొట్టివేసే అధికారం సుప్రీంకోర్టుకు ఉంది. దీనినే న్యాయ సమీక్షాధికారం అంటారు. భారత రాజ్యాంగంలో ఎక్కడ న్యాయసమీక్ష అనే పదంలేదు. కానీ ఆర్టికల్ –13(2)లో న్యాయ సమీక్ష భావన ఉంది.
మాడిసన్ వర్సెస్ మార్పరీ (1803) వివాదంలో అమెరికా ఫెడరల్ కోర్టు ప్రధాన న్యాయమూర్తి మార్షల్ ఇచ్చిన తీర్పు న్యాయసమీక్షకు ఆధారంగా చెప్పవచ్చు. అందుకే న్యాయ సమీక్ష పితామహుడిగా మార్షల్‌ను చెప్పవచ్చు.
- సమాధానం: 3
7. ప్రజాప్రయోజనవ్యాజ్యం(పిల్) అనే భావన ను భారతదేశంలో ప్రవేశపెట్టింది ఎవరు?
1) పి.ఎం. భగవతి
2) వై.వి. చంద్రచూడ్
3) కృష్ణయ్యర్
4) పై ముగ్గురూ
- View Answer
- సమాధానం: 4
వివరణ: సాధారణ ప్రజలు తమ సమస్యలను కోర్ట్లకు నివేదించి పరిష్కరించుకునే జ్ఞానం లేనప్పుడు వారి పక్షాన వేరే వ్యక్తులు గానీ లేదా సంస్థలు గానీ కోర్ట్‌కు నివేదించవచ్చు. దీనినే పిల్ అంటారు. ఈ పిల్‌ను భారతదేశంలో ప్రవేశపెట్టిన పై ముగ్గురికి చెందుతుంది. పిల్ అనేది అమెరికా, ఆస్ట్రేలియా దేశాల్లో బహుళ ప్రచారంలో ఉంది. దీనిని మనం అమెరికా నుంచి స్వీకరించాం.
- సమాధానం: 4
8. హెబియస్ కార్పస్ రిట్ అంటే ఏమిటి?
1) నీ అధికారం ఏమిటి?
2) మేము ఆదేశిస్తున్నాం
3) శరీరాన్ని ప్రవేశపెట్టండి
4) నిషేదం
- View Answer
- సమాధానం: 3
వివరణ: హెబియస్ కార్పస్ రిట్ అంటే ‘శరీరాన్ని ప్రవేశపెట్టుము’ లేదా బందీ ప్రత్యక్ష’ అని అర్థం. ఒక వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేస్తే 24గంటల్లోపు దగ్గరలోని మేజిస్ట్రేట్ వద్ద హజరు పరచాలి. లేకపోతే హజరు పరచాలని తెలిపే రిట్ హెబియస్ కార్పస్.
భారత రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులకు భంగం కలిగితే వాటి రక్షణ కోసం సుప్రీంకోర్టు ఆర్టికల్ – 32 ప్రకారం, హైకోర్టు ఆర్టికల్–226 ప్రకారం ఐదు రకాల రిట్లను జారీ చేస్తాయి. అవి హెబియస్ కార్పస్, మాండమస్, కో వారెంటో, ప్రొహిబిషన్, సెర్షియోరి.
- సమాధానం: 3
9. సుప్రీంకోర్టు, హైకోర్ట్ న్యాయమూర్తుల నియామకంలో రాష్ట్రపతికి సలహానిచ్చే వ్యవస్థ?
1) నియామకాల కమిటీ
2) ఎన్‌జేఏసీ
3) కొలిజీయం
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 3
వివరణ: సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల నియామకంలో రాష్ట్రపతికి సలహానిచ్చేది కొలిజీయం. కొలిజీయం వ్యవస్ధ రెండో జడ్జీల కేసు ద్వారా 1993లో అమల్లోకి వచ్చింది. కొలిజీయంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, మరో నలుగురు సీనియర్ న్యాయమూర్తులను సంప్రదించి ఇచ్చే సలహాను రాష్ట్రపతి తప్పకుండా పాటించాలి.
2014లో కొలిజీయం వ్యవస్థను రద్దుచేసి దాని స్థానంలో ఎన్‌జేఏసీని ఏర్పాటు చేశారు. కానీ 2015లో సుప్రీంకోర్టు ఎన్‌జేఏసీను రద్దు చేసింది. తద్వారా కొలిజీయం వ్యవస్థ పునరుద్దరించబడింది.
- సమాధానం: 3
1) 1860
2) 1861
3) 1862
4) 1863
- View Answer
- సమాధానం: 3
వివరణ: మొదటి కౌన్సిల్ చట్టం–1861 ప్రకారం భారత హైకోర్ట్‌ల చట్టాన్ని 1861లో చేశారు. దీని ప్రకారం 1862లో కలకత్తా, బొంబాయి, మద్రాస్‌లలో మూడు హైకోర్టులు ఏర్పడ్డాయి. 1866లో నాలుగో హైకోర్టు అలహాబాద్‌లో ఏర్పడింది. 2019లో అమరావతిలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఏర్పాటు చేయడంతో ప్రస్తుతం వీటి సంఖ్య 25కి చేరింది.
- సమాధానం: 3
11. సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులకు సంబంధించి కింది వానిలో వేరుగా ఉన్న అంశం ఏది?
1) నియామకం
2) తొలగింపు
3) రాజీనామా పత్రం
4) పదవీకాలం
- View Answer
- సమాధానం: 4
వివరణ: సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులను కొలిజీయం సలహా ప్రకారం రాష్ట్రపతి నిమమిస్తాడు. వీరిని అసమర్థత, నిరూపించబడిన దుష్ప్రవర్తన కారణంగా పార్లమెంట్ అభిశంసన తీర్మానం ద్వారా తొలగిస్తుంది. అదే విధంగా వీరు రాజీనామా చేయాలంటే రాజీనామా పత్రాన్ని రాష్ట్రపతికి ఇవ్వాలి. అదే విధంగా వీరి పదవీ విరమణ వయసు మాత్రం భిన్నంగా ఉంటుంది. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల పదవీ విరమణ వయసు 65 సం.లు కాగా హైకోర్టు న్యాయమూర్తుల పదవీ విరమణ వయసు 62 ఏళ్లు.
- సమాధానం: 4
12.జాతీయ హరిత ట్రిబ్యునల్ ఎప్పుడు అవతరించింది?
1) 1990
2) 2000
3) 2010
4) 2015
- View Answer
- సమాధానం: 3
వివరణ: పర్యావరణ సంబంధిత కేసులను సత్వరంగా పరిష్కరించడానికీ జాతీయ హరిత ట్రిబ్యునల్స్‌ని 2010లో ఏర్పాటు చేశారు.ఇందులో ఒక చైర్మన్, పదిమంది ఇతర సభ్యులు ఉంటారు. వీరిని కేంద్ర ప్రభుత్వం నియమిస్తుంది. దీని ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. అదే విధంగా నాలుగు ప్రాంతీయ కార్యాలయాలు కలకత్తా, చెన్నై, బోపాల్, పూణేలలో ఉన్నాయి. ప్రస్తుతం దీని చైర్‌పర్సన్‌గా ఆదర్శకుమార్ గోయల్ వ్యవహరిస్తున్నారు.
- సమాధానం: 3
13. భారతదేశంలో ఒకటి కంటే ఎక్కువ రాష్ట్రాలకు విస్తరించిన హైకోర్టులు ప్రస్తుతం ఎన్ని ఉన్నాయి?
1) 1
2) 2
3) 3
4) 4
- View Answer
- సమాధానం: 3
వివరణ: రాజ్యాంగంలోని ఆర్టికల్ – 214 ప్రకారం ప్రతి రాష్ట్రానికి ఒక హైకోర్టు ఉండాలి. కానీ కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఆర్టికల్ –231 ప్రకారం ఒకటి కంటే ఎక్కువ రాష్ట్రాలకు ఉమ్మడిగా హైకోర్టు ఉండవచ్చు. ఆ విధంగా ప్రస్తుతం దేశంలో 28 రాష్ట్రాలు ఉంటే, హైకోర్టులు మాత్రం 25 ఉన్నాయి. ఇందులో మూడు హైకోర్టులు ఒకటి కంటే ఎక్కువ రాష్ట్రాలకు తన అధికార పరిధిని కలిగి ఉన్నాయి.
అవి..
1) గువాహటి హైకోర్టు పరిధిలోకి అస్సాం, నాగాలాండ్, మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్
2) చంఢీఘడ్ హైకోర్టు పరిధిలోకి పంజాబ్, హరియాణ, చంఢిఘడ్లు
3) ముంబై హైకోర్టు పరిధి లోకి మహరాష్ట్ర, గోవా, డామన్ డయ్యూ, దాద్రా నగర్ హవేలీలు వస్తాయి.
- సమాధానం: 3
14. హైకోర్టు న్యాయమూర్తుల పదవీ విరమణ వయస్సు ఎంత?
1) 58 ఏళ్లు
2) 60 ఏళ్లు
3) 62 ఏళ్లు
4) 65 ఏళ్లు
- View Answer
- సమాధానం: 3
వివరణ: భారత మౌలిక రాజ్యాంగంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఇతర న్యాయమూర్తుల పదవీ విరమణ వయస్సు 60 ఏళ్లు ఉండేది. కానీ 1963లో 15వ రాజ్యాంగ సవరణ, చట్టం ప్రకారం దీనిని 62 ఏళ్లకు పెంచారు. ఇటీవల 114వ రాజ్యాంగ సవరణ బిల్లు ద్వారా దీన్ని 65 ఏళ్లకు పెంచే బిల్లును పార్లమెంట్లో ప్రవేశ పెడితే అది ఇంకా ఆమోదం పొందలేదు. ప్రస్తుతం ఇది పెండింగ్‌లో ఉంది.
- సమాధానం: 3
15. పరిపాలనా ట్రిబ్యునల్స్‌ను రాజ్యాంగంలో ఏ భాగంలో పొందుపరిచారు?
1) 11
2) 11ఎ
3) 14
4) 14ఎ
- View Answer
- సమాధానం: 4
వివరణ: 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 1976లో పరిపాలనా ట్రిబ్యునల్స్‌ను భారత రాజ్యాంగం 14 ఎ భాగంలో, ఆర్టికల్ 323ఎ, 323బి లో వీటిని చేర్చారు. అనంతరం 1985లో కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్‌ను ఢిల్లీ కేంద్రంగా ఏర్పాటు చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు, ఇతర వివాదాలను తక్కువ ఖర్చుతో త్వరితగతిన పరిష్కరించడానికి వీటిని ఏర్పాటు చేశారు.
- సమాధానం: 4
16. చంపకం దోరైరాజన్ వర్సెస్ మద్రాసు (1951) కేసు దేనికి సంబంధించింది?
1) రిజర్వేషన్లు
2) భూసంస్కరణలు
3) ఆస్తి హక్కు
4) పై మూడు
- View Answer
- సమాధానం: 1
వివరణ: మద్రాస్ ప్రభుత్వం విద్యా, ఉద్యోగాల్లో కొన్ని కులాలకు రిజర్వేషన్లు కల్పించడాన్ని చంపకం దోరై రాజన్ సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేశాడు. ఇది ఆర్టికల్15లో పేర్కొన్న వివక్షత పాటించరాదు అని సూత్రానికి విరుద్ధమని వాదించాడు. మద్రాస్ ప్రభుత్వం –46 ప్రకారం రిజర్వేషన్ కల్పించినట్టు పేర్కొంది. కానీ సుప్రీంకోర్టు ఆర్టికల్– 46 కంటే ఆర్టికల్ 15 ముఖ్యమైందిగా పేర్కొంటూ రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమని కొట్టివేసింది. ఈ తీర్పును అధిగమించడానికి నెహ్రు ప్రభు త్వం 1వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆర్టికల్–15(4) ద్వారా విద్యారంగంలో, ఆర్టికల్ –16(4) ద్వారా ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పిస్తూ రాజ్యాంగాన్ని సవరించింది.
- సమాధానం: 1
17. ‘రాజ్యాంగ మౌలిక స్వరూపం’ అనే భావనను ముందుగా సుప్రీంకోర్టు ఏ కేసులో వెలువరించింది?
1) గోలక్‌నాథ్ కేసు
2) కేశవానంద భారతి కేసు
3) మేనకాగాంధీ కేసు
4) ఇందిరా సహాని కేసు
- View Answer
- సమాధానం: 2
వివరణ: 1973న ఏప్రిల్ 24 న సుప్రీంకోర్టు ఈ కేసులో తీర్పునిస్తూ రాజ్యాంగాన్ని సవరించే అధికారం పార్లమెంటుకు ఉంది. కానీ రాజ్యాంగం మౌలిక స్వరూపాన్ని మార్చే అధికారం పార్లమెంటుకు లేదని తీర్పు చెప్పింది. న్యాయసమీక్ష అనేది రాజ్యాంగ మౌలిక లక్షణాలలో ఒకటి అని గుర్తించింది.
- సమాధానం: 2
18. కారుణ్య మరణం (మెర్సీ కిల్లింగ్) పై 2018 మార్చి 9న సుప్రీంకోర్టు తీర్పు చెప్పడానికి పిల్ పిటిషన్ వేసిన సంస్థ ఏది?
1) ఏడీఆర్
2) కామన్ కాజ్
3) లోక్‌సత్తా
4) పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్
- View Answer
- సమాధానం: 2
వివరణ: దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్న వ్యక్తిని లేదా బతకడానికి అవకాశం లేని వ్యక్తిని అతని అనుమతితో ఇంజెక్షన్ ద్వారా కానీ మరో విధంగా గానీ చంపడాన్ని కారుణ్య మరణం అంటారు. ఇది నెదర్లాండ్స్, బెల్జియం, లక్సెంబర్గ్ దేశాల్లో అమలులో ఉంది. భారత్‌లో ఇది అమల్లో లేదు.దీనిపై పూర్తి విచారణకై కామన్ కాజ్ అనే స్వచ్చంద సంస్థ సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్) వేయడం తో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ గౌరవప్రదంగా మరణం కూడా జీవించే హక్కులో అంతర్భాగమే అని చెబుతూ దీనికి సంబందించిన చట్టం చేయవలసిందిగా పార్లమెంట్‌ను ఆదేశించింది.
- సమాధానం: 2