‘బాధ్యతాయుతమైన ప్రభుత్వం’, ‘సమష్టి బాధ్యత’ అనేవి ఏ ప్రభుత్వ ప్రధాన లక్షణాలు?
1. కింది వారిలో భారత రాజ్యాంగ పరిషత్‌ను ప్రతిపాదించిన ‘కేబినెట్ మిషన్’లో సభ్యులు కాని వారెవరు?
1) లారెన్స్
2) క్రిప్స్
3) వేవెల్
4) అలెగ్జాండర్
- View Answer
- సమాధానం: 3
2. మౌలిక భారత రాజ్యాంగంలోని ఆ- భాగంలో పొందుపర్చిన స్వదేశీ సంస్థానాల్లో ప్రధాన కార్యనిర్వహణాధికారి ఎవరు?
1) గవర్నర్
2) చీఫ్ కమిషనర్
3) లెఫ్టినెంట్ గవర్నర్
4) రాజ్ ప్రముఖ్
- View Answer
- సమాధానం: 4
3. రాజ్యాంగ పరిషత్‌కు సంబంధించి కింది వాటిలో సరైనవి ఏవి?
ఎ) ప్రెస్ గ్యాలరీ కమిటీ చైర్మన్ - ఉపానాథ్ సేన్
బి) చీఫ్ కమిషనర్ ప్రాంతాల కమిటీ చైర్మన్ - పట్టాభి సీతారామయ్య
సి) ఆర్డర్ ఆఫ్ బిజినెస్ కమిటీ చైర్మన్ - జి.వి. మౌలాంకర్
1) ఎ, బి
2) బి, సి
3) ఎ, సి
4) ఎ, బి, సి
- View Answer
- సమాధానం: 1
4. కింది వాటిని ఏర్పాటు చేసిన సంవత్సరాల ఆధారంగా సరైన వరుసలో పేర్కొనండి.
ఎ) బోర్డ్ ఆఫ్ కంట్రోల్
బి) కలెక్టర్
సి) బ్రిటిష్ హైకమిషనర్
డి) కార్యదర్శి
1) సి, బి, ఎ, డి
2) బి, ఎ, డి, సి
3) బి, ఎ, సి, డి
4) బి, సి, ఎ, డి
- View Answer
- సమాధానం: 2
5. ‘బాధ్యతాయుతమైన ప్రభుత్వం’, ‘సమష్టి బాధ్యత’ అనేవి ఏ ప్రభుత్వ ప్రధాన లక్షణాలు?
1) అధ్యక్షతరహా ప్రభుత్వం
2) పార్లమెంటరీ ప్రభుత్వం
3) ఏకకేంద్ర ప్రభుత్వం
4) సమాఖ్య ప్రభుత్వం
- View Answer
- సమాధానం: 2
6. కింది వాటిలో రాజ్యాంగబద్ధమైంది ఏది?
1) మండల సంఘాలు
2) నీతి ఆయోగ్
3) జిల్లా ప్రణాళిక సంఘం
4) జాతీయ మహిళా కమిషన్
- View Answer
- సమాధానం: 3
7. రాజ్యాంగ సవరణకు సంబంధించి కింది వాటిలో సరైనవి?
ఎ) రాజ్యాంగ సవరణ బిల్లును రాష్ట్రపతి అనుమతితో మాత్రమే ప్రవేశపెట్టాలి
బి) రాజ్యాంగ సవరణ బిల్లు విషయంలో రాష్ట్రపతికి ఎలాంటి వీటో అధికారం లేదు
సి) రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం విషయంలో సంయుక్త సమావేశానికి అవకాశం లేదు
1) ఎ, బి
2) బి, సి
3) ఎ, సి
4) ఎ, బి, సి
- View Answer
- సమాధానం: 2
8. 99వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ‘కొలీజియం’ స్థానంలో ఏర్పాటు చేసిన ‘జాతీయ న్యాయ నియామకాల కమిషన్’ (ఎన్‌జేఏసీ) ను సుప్రీంకోర్టు ఎప్పుడు కొట్టివేసింది?
1) 2015 అక్టోబర్ 16
2) 2016 అక్టోబర్ 16
3) 2015 నవంబర్ 29
4) 2016 నవంబర్ 29
- View Answer
- సమాధానం: 1
9. ‘రాజ్యాంగ ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగమే’ అనే భావనకు మూలం?
1) రాజ్యాంగంలో లిఖితబద్ధంగా ఉంది
2) భారత సమాజంలో ఉన్న సంప్రదాయం
3) భారత పార్లమెంట్ చట్టం ద్వారా అవతరణ
4) సుప్రీంకోర్టు తీర్పు ద్వారా అవతరణ
- View Answer
- సమాధానం: 4
10. రాజ్యాంగ ప్రవేశిక ప్రకారం ఏయే విషయాల్లో స్వేచ్ఛను పొందవచ్చు?
ఎ) ఆలోచన, భావ ప్రకటన
బి) అంతస్థు, అవకాశాలు
సి) విశ్వాసం, నమ్మకం, ఆరాధన
డి) సాంఘిక, ఆర్థిక, రాజకీయ
1) ఎ, బి
2) ఎ, సి
3) ఎ, సి, డి
4) ఎ, బి, సి, డి
- View Answer
- సమాధానం: 2
11.కింది వాటిలో సరికానిది ఏది?
1) స్త్రీలకు, పిల్లలకు ప్రత్యేక అవకాశాలు - ప్రాథమిక హక్కు
2) స్త్రీలకు ప్రసూతి సౌకర్యాలు - ఆదేశిక సూత్రం
3) స్త్రీలను గౌరవించడం - ప్రాథమిక విధి
4) స్త్రీలకు పౌష్టికాహారం అందించడం - ప్రవేశిక
- View Answer
- సమాధానం: 4
12. జతపరచండి.
జాబితా - I
i) అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవం
ii) భారత రాజ్యాంగ దినోత్సవం
iii) అంతర్జాతీయ ఆదివాసుల దినోత్సవం
iv) ప్రాథమిక విధుల అమలు దినోత్సవం
జాబితా - II
a) నవంబర్ 26
b) ఆగస్టు 9
c) సెప్టెంబర్ 15
d) జనవరి 3
1) i-b, ii-a, iii-b, iv-d
2) i-b, ii-a, iii-d, iv-c
3) i-c, ii-a, iii-b, iv-d
4) i-d, ii-a, iii-b, iv-c
- View Answer
- సమాధానం: 3
13. భారత రాజ్యాంగ పరిషత్ తొలి సమావేశ కాల పరిమితి?
1) 1946 డిసెంబర్ 9 నుంచి 26 వరకు
2) 1946 డిసెంబర్ 9 నుంచి 24 వరకు
3) 1946 డిసెంబర్ 9 నుంచి 25 వరకు
4) 1946 డిసెంబర్ 9 నుంచి 23 వరకు
- View Answer
- సమాధానం: 4
14. గౌరవ ప్రధానంగా మరణించడం కూడా జీవించే స్వేచ్ఛ (ఆర్టికల్-21)లో అంతర్భాగమని ‘కారుణ్య మరణం’పై సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన అయిదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనానికి నేతృత్వం వహించిన వారెవరు?
1) దీపక్ మిశ్రా
2) జాస్తి చలమేశ్వర్
3) రాజన్ గొగోయ్
4) కురియన్ జోసెఫ్
- View Answer
- సమాధానం: 1
15. కింది వాటిలో సరైంది ఏది?
ఎ) PDA చట్టాన్ని నెహ్రూ ప్రధానిగా ఉన్నప్పుడు రూపొందించారు
బి) TADA చట్టాన్ని రాజీవ్‌గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు చేశారు
సి) MISA చట్టాన్ని ఇందిరా గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు చేశారు
డి) POTA చట్టాన్ని దేవెగౌడ ప్రధానిగా ఉన్నప్పుడు రూపొందించారు
1) ఎ, బి
2) ఎ, బి, సి
3) బి, సి, డి
4) ఎ, బి, సి, డి
- View Answer
- సమాధానం: 2
16. కామేశ్వరీ సింగ్ వర్సెస్ బిహార్ (1950) కేసు దేనికి సంబంధించింది?
1) రిజర్వేషన్లు
2) బాల్య వివాహాలు
3) లైంగిక వేధింపులు
4) భూ సంస్కరణలు
- View Answer
- సమాధానం: 4
17. ‘చిన్నారులకు పౌష్టికాహారం అందించడం రాజ్యం బాధ్యత’ అని తెలిపే అధికరణ?
1) 39(ఎ)
2) 39(సి)
3) 39(ఇ)
4) 39(ఎఫ్)
- View Answer
- సమాధానం: 4
18. కింది వాటిలో సరికానిది ఏది?
1) ఉమ్మడి సంస్కృతి పరిరక్షణ -4ఎ భాగం
2) ఉమ్మడి పౌరస్మృతి - 4వ భాగం
3) ఉమ్మడి వ్యాపారం - 8వ భాగం
4) ఉమ్మడి సమావేశం - 5వ భాగం
- View Answer
- సమాధానం: 3
19. భారత రాజ్యాంగంలో ఉన్న సమాఖ్య లక్షణం?
1) రాజ్యాంగ ఔన్నత్యం
2) ఏకీకృత న్యాయ వ్యవస్థ
3) అవశిష్ట అధికారాలు
4) అత్యవసర అధికారాలు
- View Answer
- సమాధానం: 1
20. కింది వాటిలో ఉమ్మడి జాబితాలో లేని అంశం ఏది?
1) సంచార జాతులు
2) భూమి శిస్తు
3) ప్రజారోగ్యం
4) సామాజిక భద్రత
- View Answer
- సమాధానం: 3
21. అంతరాష్ట్ర మండలి సమావేశానికి రాష్ట్ర గవర్నర్ ఏ సందర్భంలో హాజరవుతారు?
1) రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నప్పుడు
2) రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన అమల్లో ఉన్నప్పుడు
3) ఆర్థిక అత్యవసర పరిస్థితి అమల్లో ఉన్నప్పుడు
4) పై అన్ని సందర్భాల్లో
- View Answer
- సమాధానం: 2
22. కింది వాటిలో రాజ్యాంగబద్ధ సంస్థలు ఏవి?
ఎ) యూపీఎస్సీ
బి) ఎపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ
సి) ఎస్ఎస్సీ
డి) జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్
1) ఎ, బి, సి
2) ఎ, బి, డి
3) ఎ, బి
4) ఎ, బి, సి, డి
- View Answer
- సమాధానం: 3
23. 8వ జాతీయ ఓటర్ల దినోత్సవం (2018 జనవరి 25) నినాదం?
1) ఓటర్ చైతన్యం
2) ఎన్నికల్లో పాల్గొనడం
3) ఓటర్ సాధికారికత
4) ఎన్నికల్లో క్రమశిక్షణ
- View Answer
- సమాధానం: 2
24. భారత రాష్ట్రపతికి సంబంధించి కింది వాటిలో సరికానిది ఏది?
1) ఎన్నిక విధానం స్వీకరణ - ఐర్లాండ్
2) తొలగించే విధానం - అమెరికా
3) సుప్రీంకోర్టును సలహా కోరే అధికారం - కెనడా
4) దేశ పరిపాలన రాష్ట్రపతి పేరు మీద జరుగుతుంది - జర్మనీ
- View Answer
- సమాధానం: 4
25. జాతీయ అత్యవసర పరిస్థితిని (ఆర్టికల్ - 352) ఏ విధంగా ఉపసంహరించవచ్చు?
1) కేంద్ర కేబినేట్ లిఖితపూర్వక సలహా ప్రకారం రాష్ట్రపతి ఒక ప్రకటన ద్వారా
2) 1/10వ వంతు లోక్‌సభ సభ్యులు రాష్ట్రపతికి లేదా లేదా స్పీకర్‌కు ఒక నోటీసు ఇచ్చి, లోక్‌సభ సమావేశంలో సాధారణ మెజారిటీతో ఉపసంహరించవచ్చు
3) 1, 2
4) ఏదీకాదు
- View Answer
- సమాధానం: 3
26. సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల జీతభత్యాలను ఏ సందర్భంలో తగ్గించవచ్చు?
1) జాతీయ అత్యవసర పరిస్థితి విధించినప్పుడు
2) రాష్ట్రపతి పాలన విధించినప్పుడు
3) ఆర్థిక అత్యవసర పరిస్థితి విధించినప్పుడు
4) పై అన్ని సందర్భాల్లో
- View Answer
- సమాధానం: 3
27. వి.వి. గిరి అనంతరం 1969-74 మధ్య భారత ఉపరాష్ట్రపతిగా వ్యవహరించిన వ్యక్తి?
1) బసప్ప దాసప్ప జెట్టీ
2) హిదయతుల్లా
3) గోపాల్ స్వరూప్ పాఠక్
4) జాకిర్ హుస్సేన్
- View Answer
- సమాధానం: 3
28. రాష్ట్రపతి.. లోక్‌సభకు నియమించే ఆంగ్లో- ఇండియన్ సభ్యులకు సంబంధించి కింది వాటిలో సరైంది?
ఎ) రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొంటారు
బి) ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొంటారు
సి) రాష్ట్రపతిని తొలగించడంలో పాల్గొంటారు
డి) ఉప రాష్ట్రపతి తొలగింపులో పాల్గొంటారు
1) బి, సి
2) బి, సి, డి
3) ఎ, సి, డి
4) బి, డి
- View Answer
- సమాధానం: 2
29. భారతదేశంలో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎక్కువకాలం పనిచేసి రికార్డ్ సృష్టించిన వ్యక్తి?
1) జ్యోతిబసు
2) గెగాంగ్ అపాంగ్
3) పవన్ కుమార్ చామ్లింగ్
4) డి.డి. లపాంగ్
- View Answer
- సమాధానం: 3
30. కింది వారిలో ప్రధానమంత్రి, ఉప ప్రధానమంత్రి రెండు పదవులూ చేపట్టిన వారెవరు?
1) మొరార్జీ దేశాయ్, వి.పి. సింగ్
2) చరణ్ సింగ్, చంద్రశేఖర్
3) మొరార్జీ దేశాయ్, ఐ.కె. గుజ్రాల్
4) చరణ్ సింగ్, మొరార్జీ దేశాయ్s
- View Answer
- సమాధానం: 4
31. కింది వాటిలో సరైనవి ఏవి?
ఎ) లోక్‌సభను సమావేశపరచేది - రాష్ట్రపతి
బి) లోక్‌సభ కాలపరిమితిని పొడిగించేది - పార్లమెంట్
సి) లోక్‌సభ సమావేశాన్ని తాత్కాలికంగా వాయిదా వేసేది - స్పీకర్
డి) లోక్‌సభ సీట్లు పెంచేది - కేంద్ర ప్రభుత్వం
1) ఎ, బి, డి
2) బి, సి, డి
3) ఎ, సి, డి
4) ఎ, బి, సి
- View Answer
- సమాధానం: 4
32. 17 ఏళ్లపాటు రాజ్యసభకు డిప్యూటీ చైర్‌పర్సన్‌గా వ్యవహరించిన వ్యక్తి?
1) నజ్మా హెప్తుల్లా
2) వయోలెట్ అల్వా
3) ప్రతిభా పాటిల్
4) మీరాకుమార్
- View Answer
- సమాధానం: 1
33. ‘పండిత్ గోవింద్ వల్లభ్ పంత్’ పేరు మీద ఇచ్చే ‘ఉత్తమ పార్లమెంటేరియన్’ అవార్డును 2017 సంవత్సరానికి ఎవరు అందుకున్నారు?
1) కరణ్ సింగ్
2) గులాం నబీ ఆజాద్
3) శరద్ యాదవ్
4) భర్తృహరి మహతాబ్
- View Answer
- సమాధానం: 4
34. తొలి మూడు లోక్‌సభ ఎన్నికల్లో (1952, 1957, 1962) కాంగ్రెస్ తర్వాత రెండో అతిపెద్ద పార్టీగా నిలిచింది?
1) భారతీయ జన్ సంఘ్
2) సి.పి.ఐ.
3) స్వతంత్ర పార్టీ
4) లోక్‌దళ్
- View Answer
- సమాధానం: 2
35. భారత సుప్రీంకోర్టుకు సంబంధించి కింది వాటిలో సరికానిది ఏది?
1) సుప్రీంకోర్టు బెంచ్ ఏర్పాటు-ఆర్టికల్ 130
2) ప్రత్యేక సెలవుతో కూడుకున్న వివాదం - 136
3) తీర్పుల పునఃపరిశీలన - ఆర్టికల్ 137
4) రాజ్యాంగాన్ని వ్యాఖ్యానించడం - ఆర్టికల్ 145
- View Answer
- సమాధానం: 4
36. వివిధ నియోజక వర్గాల్లో అభివృద్ధి కార్యక్రమాల నిమిత్తం ఒక్కొక్క ప్రజాప్రతినిధికి ఇచ్చే వార్షిక మొత్తానికి సంబంధించి కింది వాటిలో సరైంది?
ఎ) MPLAD కింద ఒక్కో ఎంపీకి - రూ. 5 కోట్లు
బి) ఆంధ్రప్రదేశ్‌లో MLALAD కింద ఒక్కో ఎమ్మెల్యేకి - రూ. 1.5 కోట్లు
సి) తెలంగాణలో MLALAD కింద ఒక్కో ఎమ్మెల్యేకి - 3 కోట్లు
1) ఎ, బి
2) బి, సి
3) ఎ, సి
4) ఎ, బి, సి
- View Answer
- సమాధానం: 4
37. ఉన్నత విద్యా సంస్థల్లో ఓబీసీ (ఇతర వెనుకబడిన వర్గాలు) రిజర్వేషన్లను సుప్రీంకోర్టు ఏ కేసులో సమర్థించింది?
1) సమతాశర్మ
2) ఇందిరా సహానీ
3) అశోక్‌కుమార్ ఠాగూర్
4) దేవదాసన్
- View Answer
- సమాధానం: 3
38. ఒక రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని గవర్నర్ ఏ అధికారంలో అంతర్భాగంగా రాష్ట్రపతికి సిఫార్సు చేస్తారు?
1) కార్యనిర్వాహక అధికారం
2) శాసన అధికారం
3) న్యాయాధికారం
4) విచక్షణాధికారం
- View Answer
- సమాధానం: 4
39. కింది పేర్కొన్న ఏ సభలో ప్రత్యక్షంగా ఎన్నికైన సభ్యులు, పరోక్షంగా ఎన్నికైన సభ్యులు, నియామక సభ్యులు ఉంటారు?
1) లోక్‌సభ
2) రాజ్యసభ
3) విధానసభ
4) విధాన పరిషత్
- View Answer
- సమాధానం: 4
40. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ వర్గం వారికి ప్రత్యేకంగా రిజర్వేషన్లు ఉండవు?
1) మైనారిటీలు
2) మహిళలు
3) వెనుకబడిన వర్గాలు
4) ఎస్సీ, ఎస్టీ
- View Answer
- సమాధానం: 1
41. జిల్లా పరిషత్‌లో మొత్తం స్థాయి సంఘాలు?
1) 5
2) 7
3) 9
4) 11
- View Answer
- సమాధానం: 2
42. కింది వాటిలో రాజ్యాంగబద్ధ సంస్థలు ఏవి?
ఎ) కంటోన్మెంట్ బోర్డు
బి) పట్టణాభివృద్ధి సంస్థలు
సి) పోర్ట ట్రస్టులు
డి) వార్డు కమిటీలు
1) ఎ, బి, సి
2) బి, సి, డి
3) బి, డి
4) డి
- View Answer
- సమాధానం: 4
43. సహకార సంఘాలకు రాజ్యాంగబద్ధత కల్పించిన రాజ్యాంగ సవరణ చట్టం?
1) 95
2) 96
3) 97
4) 98
- View Answer
- సమాధానం: 3
44. ‘ఎస్సీ, ఎస్టీ అకృత్యాల నివారణ చట్టం - 1989’.. కొన్ని సవరణలతో ‘ఎస్సీ, ఎస్టీ అకృత్యాల నివారణ (సవరణ) - 2015’ పేరుతో ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది?
1) 2015 జనవరి 26
2) 2015 ఏప్రిల్ 14
3) 2016 జనవరి 26
4) 2016 ఏప్రిల్ 14
- View Answer
- సమాధానం: 3
45. కింది వాటిలో వివిధ సంస్థల ఏర్పాటుకు సంబంధించి, రాజ్యాంగ సవరణ చట్టాల్లో సరైనవి ఏవి?
ఎ) జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ - 65వ సవరణ చట్టం
బి) జాతీయ ఎస్టీ కమిషన్ - 89వ సవరణ చట్టం
సి) రాష్ట్ర ఎన్నికల కమిషన్ - 73వ సవరణ చట్టం
డి) జిల్లా ప్రణాళిక సంఘం - 74వ సవరణ చట్టం
1) ఎ, బి, సి
2) బి, సి, డి
3) ఎ, సి, డి
4) ఎ, బి, సి, డి
- View Answer
- సమాధానం: 4
46. వాజ్‌పేయి ప్రభుత్వం 2000 సంవత్సరంలో నియమించిన రాజ్యాంగ సమీక్షా కమిషన్ చైర్మన్?
1) బి.పి. జీవన్‌రెడ్డి
2) ఎం.ఎన్. వెంకటాచలయ్య
3) ఆర్.ఎస్. సర్కారియా
4) జె.ఎస్. వర్మ
- View Answer
- సమాధానం: 2
47. "Industry, Impartiality, Integrity' అనేది ఏ సంస్థ నినాదం?
1) CBI
2) NIA
3) సమాచార కమిషన్
4) ఎన్నికల కమిషన్
- View Answer
- సమాధానం: 1
48. కింది వాటిలో కేంద్ర హోంశాఖ పరిధిలోకి రానిది?
1) అంతర్రాష్ట్ర మండలి
2) మండల సంఘాలు
3) సీబీఐ
4) నూతన రాష్ట్రాల ఏర్పాటు
- View Answer
- సమాధానం: 3
49. పశ్చిమ బెంగాల్‌కు 1982 నుంచి 2011 వరకు స్పీకర్‌గా పనిచేసి అత్యధిక కాలం స్పీకర్‌గా (29 ఏళ్లు) పని చేసిన వ్యక్తిగా రికార్డ్ సృష్టించిన వారెవరు?
1) అశీర్ మిశ్రా
2) హషీమ్ అబ్దుల్ హలీమ్
3) బుద్దదేవ్ భట్టాచార్య
4) అబ్దుల్ ఖదీర్ ఖాన్
- View Answer
- సమాధానం: 2
50. భారత రాజ్యాంగం గుర్తించిన మైనారిటీలు?
1) మతపర, కులపర
2) కులపర, లింగపర, భాషాపర
3) మతపర, భాషాపర
4) మతపర, భాషాపర, లింగపర
- View Answer
- సమాధానం: 3