అధ్యక్ష తరహా పద్ధతిలో అధ్యక్షుడు?
1. పార్లమెంట్ ఉభయసభల సంయుక్త సమావేశాలకు సంబంధించి కింది వాటిలో భిన్నమైంది?
1) బ్యాంకింగ్ సర్వీస్ కమిషన్ బిల్లు-1978
2) పౌరహక్కుల పరిరక్షణ చట్టం-1955
3) వరకట్న నిషేధ బిల్లు -1961
4) ప్రివెన్షన్ ఆఫ్ టైజం బిల్లు- 2002
- View Answer
- సమాధానం: 2
2. కింది వాటిలో ప్లేటో రచించిన గ్రంథమేది?
1) పాలిటిక్స్
2) పాలిటీ
3) ద లాస్
4) పొలిటికల్ ఎకాన మీ
- View Answer
- సమాధానం: 3
3. ప్రతిపాదన(ఎ): ఆరిస్టాటిల్ను రాజనీతి శాస్త్ర పితగా పిలవడం సమర్థనీయమే.
హేతువు (ఆర్): ప్లేటో ఆదర్శవాదంపై ఆరిస్టాటిల్ విమర్శ ఈ విషయాన్ని రుజువు పరుస్తుంది.
1) (ఎ), (ఆర్) లు రెండూ సరైనవే.
(ఆర్), (ఎ)కు సరైన వివరణ
2) (ఎ), (ఆర్)లు రెండూ సరైనవే.
(ఆర్), (ఎ)కు సరైన వివరణ కాదు
3) (ఎ) సరైంది కానీ (ఆర్) సరైంది కాదు
4) (ఎ) సరైంది కాదు కానీ (ఆర్) సరైంది
- View Answer
- సమాధానం: 1
4. కింది వాటి కాలక్రమాన్ని సూచించండి.
ఎ) స్వదేశీ ఉద్యమం
బి) సహాయ నిరాకరణోద్యమం
సి) క్విట్ ఇండియా ఉద్యమం
డి) శాసన ఉల్లంఘన ఉద్యమం
1) ఎ, బి, సి,డి
2) బి, ఎ, డి, సి
3) డి, బి, ఎ, సి
4) ఎ, బి, డి, సి
- View Answer
- సమాధానం: 4
5. అధ్యక్ష తరహా పద్ధతిలో అధ్యక్షుడు?
1) రాజ్యాధినేత
2) ప్రభుత్వాధినేత
3) 1, 2
4) పైవేవీ కావు
- View Answer
- సమాధానం: 3
6.బ్రిటిష్ రాజ్యాంగమే లేదని చెప్పిందెవరు?
1) డి టాకివెల్లి
2) హామిల్టన్
3) హార్మన్ ఫైరన్
4) సి.ఎఫ్. స్ట్రాంగ్
- View Answer
- సమాధానం: 1
7. కింది జతల్లో సరికానిది ఏది?
1) భారతదేశం- బహుళపక్ష దేశం
2) యు.కె.- రాజ్యాంగబద్ధ రాచ రికం
3) యూఎస్ఏ - కేబినెట్ సమష్టి బాధ్యత
4) స్విట్జర్లాండ్- ప్రజాభిప్రాయ సేకరణ
- View Answer
- సమాధానం: 3
8. కింది ప్రాంతీయ పార్టీల ఏర్పాటు కాలక్రమాన్ని గుర్తించండి.
ఎ) తెలుగుదేశం పార్టీ
బి) బిజూ జనతాదళ్
సి) డీఎంకే
డి) తెలంగాణ రాష్ట్ర సమితి
1) ఎ, బి, సి, డి
2) డి, ఎ, బి, సి
3) సి, బి, ఎ, డి
4) సి, ఎ, బి, డి
- View Answer
- సమాధానం: 4
9. సమాఖ్య వ్యవస్థను తొలిసారిగా ప్రవేశపెట్టిన దేశం?
1) ఆస్ట్రేలియా
2) కెనడా
3) యూఎస్ఏ
4) యూఎస్ఎస్ఆర్
- View Answer
- సమాధానం: 3
10.భారత రాజ్యాంగ భావనను మొదట అందించింది ఎవరు?
1) డా. బి.ఆర్. అంబేడ్కర్
2) జవహర్లాల్ నెహ్రూ
3) సర్ధార్ వల్లభభాయ్ పటేల్
4) ఎమ్. ఎన్ . రాయ్
- View Answer
- సమాధానం: 4
11. లోక్‌సభ రద్దు అయినప్పటికీ రద్దు కాని ఒకే ఒక పదవి?
1) లోక్‌సభ స్పీకర్
2) లోక్‌సభ డిప్యూటీ స్పీకర్
3) లోక్‌సభ ప్రోటెం స్పీకర్
4) లోక్‌సభ ప్యానెల్ స్పీకర్
- View Answer
- సమాధానం: 1
12. రాజ్యసభ ఏర్పాటైన రోజు?
1) 1950 ఏప్రిల్ 1
2) 1952 ఏప్రిల్ 17
3) 1952 మే 13
4) 1952 ఏప్రిల్ 3
- View Answer
- సమాధానం: 4
13. కింది వాటిని అవి జరిగిన కాలం ఆధారంగా ఒక వరుస క్రమంలో గుర్తించండి.
ఎ) అమెరికా స్వాతంత్య్ర పోరాటం
బి) రష్యా అక్టోబర్ విప్లవం
సి) ఇంగ్లండ్‌లో గ్లోరియస్ రెవల్యూషన్
డి) ఫ్రెంచి విప్లవం
1) ఎ, బి,డి, సి
2) సి, ఎ, డి, బి
3) బి, సి, ఎ, డి
4) డి, ఎ, బి, సి
- View Answer
- సమాధానం: 2
14. ముస్లిం లీగ్ ఏ సమావేశంలో ‘విభజించు, విడనాడు’ అనే నినాదం ఇచ్చింది?
1) 1940 లాహోర్
2) 1933 కరాచీ
3) 1931 లక్నో
4) 1943 కరాచీ
- View Answer
- సమాధానం: 3
15. స్వేచ్ఛా హక్కుకు సంబంధించిన అధికరణలు ఏవి?
1) 14 నుంచి 18
2) 19 నుంచి 22
3) 23 నుంచి 24
4) 25 నుంచి 28
- View Answer
- సమాధానం: 2
16. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఎవరు నియమిస్తారు?
1) రాష్ట్ర గవర్నర్
2) రాష్ట్ర ముఖ్యమంత్రి
3) భారత ప్రధాన న్యాయమూర్తి
4) భారత రాష్ట్రపతి
- View Answer
- సమాధానం: 4
17. ప్రతిపాదన(ఎ): భారతదేశంలో ప్రభుత్వాలు ఎర్పరిచిన పార్టీలు కేంద్రంలో లోక్‌సభ, రాష్ట్రంలో శాసనసభ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు పొందాయి. కానీ మెజార్టీ ఓట్లు పొందలేదు.
హేతువు (ఆర్): మెజార్టీ ఓటు వ్యవస్థ ఆధారిత ఎన్నికల్లో ఫలితాలు పోల్చదగిన ఓట్ల సముపార్జనపై నిర్ణయించబడతాయి.
1) (ఎ), (ఆర్)లు రెండూ సరైనవే. (ఆర్), (ఎ) కు సరైన వివరణ
2) (ఎ), (ఆర్)లు రెండూ సరైనవే. (ఆర్), (ఎ) కు సరైన వివరణ కాదు
3) (ఎ) సరైంది కానీ (ఆర్) సరైంది కాదు
4) (ఎ) సరైంది కాదు కానీ (ఆర్) సరైంది
- View Answer
- సమాధానం: 3
18. భారత రాష్ట్రపతిని ఎవరు ఎన్నుకుంటారు?
1) పార్లమెంట్ ఉభయ సభలు
2) రాష్ట్ర శాసన సభ సభ్యులు
3) కేవలం లోక్‌సభ సభ్యులు మాత్రమే
4) పార్లమెంటు ఉభయ సభలు, రాష్ట్ర శాసన సభలకు ఎన్నికైన సభ్యులు
- View Answer
- సమాధానం: 4
19. అంతర్జాతీయ అణుశక్తి సంస్థ ఏ నగరంలో ఉంది?
1) వియన్నా
2) జెనీవా
3) న్యూయార్క్
4) పారిస్
- View Answer
- సమాధానం: 1
20. కింది వాటిని జతపరచండి.
జాబితా I
i) అధికరణ-54
ii) అధికరణ-75
iii) అధికరణ-155
iv) అధికరణ-164
జాబితా II
a) ప్రధానమంత్రి, మంత్రిమండలి నియామకం
b) రాష్ట్ర గవర్నర్ నియామకం
c) ముఖ్యమంత్రి, మంత్రిమండలి నియామకం
d) రాష్ట్రపతి ఎన్నిక
1) i-d, ii-a , iii-b, iv-c
2) i-a, ii-c, iii-d, iv-b
3) i-b, ii-d, iii-c, iv-a
4) i-c, ii-d, iii-a, iv-b
- View Answer
- సమాధానం: 1
21. కింది వాటిని కాలక్రమంలో గుర్తించండి.
ఎ) భారత రాజ్యాంగ 42వ రాజ్యాంగ సవరణ చట్టం
బి) ఎ.కె.గోపాలన్ వర్సెస్ మద్రాస్ రాష్ట్రం
సి) అంతర్గత అత్యవసర పరిస్థితి ప్రకటన
డి) కేశవానంద భారతి వర్సెస్ కేరళ రాష్ట్రం
1) బి, సి, డి, ఎ
2) ఎ, బి, సి, డి
3) బి, డి, సి, ఎ
4) సి, డి, ఎ, బి
- View Answer
- సమాధానం: 3
22. ప్రతిపాదన(ఎ): గవర్నర్ తన విచక్షణాధికారంతో బిల్లును రాష్ట్రపతి ఆమోదానికి పంపవచ్చు.
హేతువు (ఆర్): రాష్ట్ర శాసనసభ ఆమోదించిన బిల్లును రాష్ట్రపతి పున:పరిశీలించవచ్చు.
1) (ఎ), (ఆర్)లు రెండూ సరైనవే. (ఆర్), (ఎ)కు సరైన వివరణ
2) (ఎ), (ఆర్)లు రెండూ సరైనవే. (ఆర్) , (ఎ)కు సరైన వివరణ కాదు
3) (ఎ) సరైంది కానీ (ఆర్) సరైంది కాదు
4) (ఎ) సరైంది కాదు కానీ (ఆర్) సరైంది
- View Answer
- సమాధానం: 2
23. అంబేడ్కర్ ఏ హక్కును ‘రాజ్యాంగ హృదయం, ఆత్మ’గా వర్ణించారు?
1) సమానత్వపు హక్కు
2) మత స్వాతంత్రపు హక్కు
3) సాంస్కృతిక, విద్య హక్కు
4) రాజ్యాంగ పరిహారపు హక్కు
- View Answer
- సమాధానం: 4
24. కింది వాటిలో దినేష్ గోస్వామి కమిటీ సిఫార్సు చేసింది ?
1) రాష్ట్ర స్థాయిలో ఎన్నికల సంఘం ఏర్పాటు చేయడం
2) పార్లమెంటరీ ఎన్నికలకు ప్రభుత్వ నిధులు ఇవ్వడం
3) పార్లమెంటరీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులను నిషేధించడం
4) శాసన మండళ్లను రద్దు చేయడం
- View Answer
- సమాధానం: 2
25. కింది వారిలో రాజ్యాంగ పరిషత్ సలహాదారుడిగా ఎవరు వ్యవహరించారు?
1) బెనగల్ రామారావు
2) బెనగల్ నర్సింగ రావు
3) బెనగల్ నరేంద్ర
4) ఎవరూ కాదు
- View Answer
- సమాధానం: 2
26.కింది వాటిలో భారత రాజ్యాంగంలోని 352 అధికరణం తెలియజేసేది ఏది
1) జాతీయ అత్యవసర పరిస్థితి
2) ఆర్థిక అత్యవసర పరిస్థితి
3) రాష్ర్టపతి పాలన
4) పైవేవీ కావు
- View Answer
- సమాధానం: 1
27. భారతదేశంలో అంబుడ్సమెన్ సంస్థను ఏమని పిలుస్తారు?
1) సి.బి.ఐ.
2) లోక్‌పాల్, లోకాయుక్త
3) కేంద్ర పాలనా ట్రైబ్యునల్
4) వినియోగదారుల న్యాయస్థానం
- View Answer
- సమాధానం: 2
28. కింది వాటిని జతపరచండి.
జాబితా -I
i) జనేచ్ఛ
ii) నిరపేక్ష సార్వభౌమత్వం
iii) పరిమిత ప్రభుత్వం
iv) నూతన రాజకీయాలు
జాబితా II
a) మాకియ వెల్లి
b) లాక్
c) హాబ్స్
d) రూసో
1) i-b, ii-c , iii-d, iv-a
2) i-c, ii-d, iii-a, iv-b
3) i-d, ii-c, iii-b, iv-a
4) i-a, ii-d, iii-c, iv-b
- View Answer
- సమాధానం: 3
29. ఏ రకమైన ప్రభుత్వానికి ‘అధికార పృథక్కరణ సూత్రం వర్తిస్తుంది?
1) ఏక కేంద్ర
2) సమాఖ్య
3) పార్లమెంటరీ
4) అధ్యక్ష తరహా
- View Answer
- సమాధానం: 4
30. భారత రాజ్యాంగ నిర్మాతలు ‘జీవించే హక్కు’ను ఏ దేశ రాజ్యాంగం నుంచి గ్రహించారు?
1) జపాన్
2) యూఎస్ఏ
3) ఆస్ట్రేలియా
4) ఫ్రాన్స్
- View Answer
- సమాధానం: 1
31. ప్రతిపాదన (ఎ) : భారత రాష్ట్రపతి రాజ్యాంగాధినేత
హేతువు (ఆర్): ప్రధానమంత్రి నాయకత్వం వహించే మంత్రి మండలికి అన్ని అధికారాలు ఉన్నాయి.
1) (ఎ), (ఆర్)లు రెండూ సరైనవే. (ఆర్), (ఎ)కు సరైన వివరణ
2) (ఎ), (ఆర్)లు రెండూ సరైనవే. (ఆర్), (ఎ)కు సరైన వివరణ కాదు
3) (ఎ) సరైంది కానీ (ఆర్) సరైంది కాదు
4) (ఎ) సరైంది కాదు కానీ (ఆర్) సరైంది
- View Answer
- సమాధానం: 2
32. భారత రాజ్యాంగంలో పొందుపరిచిన విధంగా కింది వాటిని క్రమానుగత శ్రేణిలో గుర్తించండి?
ఎ) రాష్ర్టంలో రాష్ర్టపతి పాలన విధించడం
బి) భావ ప్రకటనా స్వేచ్ఛ
సి) రాష్ర్ట అంశంపై పార్లమెంటు చట్టం చేయడం
డి) రాజ్యాంగ సవరణ విధానం
1) డి, సి, ఎ, బి
2) సి, ఎ,డి, బి
3) సి, డి, బి, ఎ
4) బి,సి, ఎ, డి
- View Answer
- సమాధానం: 4
33. ప్రతిపాదన(ఎ): భారతదేశంలో కేంద్ర మంత్రి మండలి లోక్ సభకు సమష్టి బాధ్యత వహిస్తుంది.
హేతువు (ఆర్): కేంద్ర ప్రభుత్వంలో మంత్రులుగా నియమించబడటానికి లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు అర్హులు
1) (ఎ), (ఆర్)లు రెండూ సరైనవే. (ఆర్), (ఎ)కు సరైన వివరణ
2) (ఎ), (ఆర్)లు రెండూ సరైనవే. (ఆర్), (ఎ)కు సరైన వివరణ కాదు
3) (ఎ) సరైంది కానీ (ఆర్) సరైంది కాదు
4) (ఎ) సరైంది కాదు కానీ (ఆర్) సరైంది
- View Answer
- సమాధానం: 3
34. కింది వాటిలో రాజకీయ పార్టీల ఏర్పాటును కాలక్రమాన్ని గుర్తించండి?
ఎ) భారత కమ్యూనిస్ట్ పార్టీ
బి) భారతీయ జన సంఘ్
సి) భారత స్వతంత్ర పార్టీ
డి) భారత జాతీయ కాంగ్రెస్
1) ఎ,బి, సి, డి,
2) బి, సి, ఎ, డి
3) డి, బి, సి, ఎ
4) డి, ఎ, బి, సి
- View Answer
- సమాధానం: 4
35. ప్రతిపాదన(ఎ): భారతదేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారాలను సూచించే మూడు జాబితాలు ఉన్నాయి.
హేతువు (ఆర్): భారత దేశంలో సమాఖ్య వ్యవస్థ ప్రభుత్వం ఉంది.
1) (ఎ), (ఆర్)లు రెండూ సరైనవే. (ఆర్), (ఎ)కు సరైన వివరణ
2) (ఎ), (ఆర్)లు రెండూ సరైనవే. (ఆర్), (ఎ)కు సరైన వివరణ కాదు
3) (ఎ) సరైంది కానీ (ఆర్) సరైంది కాదు
4) (ఎ) సరైంది కాదు కానీ (ఆర్) సరైంది
- View Answer
- సమాధానం: 1
36. రాజ్యసభ చైర్మన్ పదవీకాలం ?
1) ఆరేళ్లు
2) ఐదేళ్లు
3) శాశ్వతం
4) ఏదీ కాదు
- View Answer
- సమాధానం: 2
37. కింది వాటిలో సరైంది ఏది?
ఎ) ఇంగ్లండు దేశ ఆపద సమయమే భారతదేశ అవకాశ సమయమని వ్యాఖ్యానించినవారు అనిబిసెంట్
బి) క్రిప్స్ ప్రతిపాదనలు దివాలా తీస్తున్న బ్యాంకు భవిష్యత్తు తేదీతో ఇచ్చే చెక్కులా ఉన్నాయని గాంధీజీ అపహాస్యం చేశారు.
1) ఎ మాత్రమే సరైంది
2) బి మాత్రమే సరైంది
3) ఎ సరైంది, బి సరైంది కాదు
4) రెండూ సరైనవే
- View Answer
- సమాధానం: 4
38. కింది వాటిని జతపరచండి.
జాబితా -I
i) 1931
ii) 1932
iii) 1940
iv) 1942
జాబితా -II
a) ఇర్విన్ ఒప్పందం
b) ఆగస్టు ప్రతిపాదన
c) క్రిప్స్ ప్రతిపాదన
d) కమ్యూనల్ అవార్డు
1) i-b, ii-a , iii-d, iv-c
2) i-c, ii-d, iii-b, iv-a
3) i-a, ii-d, iii-b, iv-c
4) i-d, ii-c, iii-b, iv-a
- View Answer
- సమాధానం: 3
39. రాజ్యసభ పదవీకాలం ?
1) ఐదేళ్లు
2) ఆరేళ్లు
3) రాష్ర్టపతి నిర్ణయించిన మేరకు
4) శాశ్వతం
- View Answer
- సమాధానం: 4