Skip to main content

భారత రూపాయి సింబల్‌ను డిజైన్ చేసిందిఎవరు?

భారత్ - ఆర్థిక వాతావరణం :
నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ అంచనా ప్రకారం 2018-19 మొదటి త్రైమాసికంలో భారత జీడీపీ స్థిర ధరల వద్ద రూ.34.14 లక్షల కోట్లు కాగా, 2019-20 మొదటి త్రైమాసికంలో రూ.35.85 లక్షల కోట్లుగా నమోదైంది. ఇదే కాలానికి సంబంధించి భారత జీడీపీ వృద్ధి 5 శాతంగా నమోదైంది. 8 కీలక పరిశ్రమల ఉత్పత్తి వృద్ధి ఆగస్టు 2018లో 4.5 శాతం కాగా, ఆగస్టు 2019లో రుణాత్మక వృద్ధి (-0.5 శాతం) నమోదైంది. ముడి చమురు, బొగ్గు, సహజ వాయువు, సిమెంటు, విద్యుచ్ఛక్తి రంగాల ఉత్పత్తిలో రుణాత్మక వృద్ధి నమోదైనందుకు 2019 ఆగస్టులో కీలక పరిశ్రమల ఉత్పత్తి వృద్ధి మందగించింది. ఈ స్థితి ఆర్థిక వ్యవస్థలో వృద్ధి క్షీణతను స్పష్టం చేస్తుంది.
 • ఆసియా అభివృద్ధి బ్యాంకు భారత వృద్ధిని 2019-20లో 6.5 శాతంగా అంచనా వేసింది. స్వదేశీ డిమాండ్, పెట్టుబడుల్లో రికవరీతో పాటు ప్రభుత్వ విధానాల కారణంగా 2020-21లో 7.2 శాతం వృద్ధిని భారత్ సాధిస్తుందని ‘ఆిసియాన్ డెవలప్‌మెంట్ అవుట్‌లుక్ 2019’లో ఆసియా అభివృద్ధి బ్యాంకు పేర్కొంది. కార్పొరేషన్ పన్ను రేటు తగ్గింపు కారణంగా ప్రైవేటు పెట్టుబడులు పెరిగి పోటీతత్వం మెరుగవుతుంది. బ్యాంక్ రీకాపిటలైజేషన్, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలకు అవసరమైన మద్దతు, రిజర్‌‌వబ్యాంకు ద్రవ్య విధాన రేట్ల తగ్గింపులాంటి చర్యల కారణంగా పారిశ్రామిక రంగం, అవస్థాపనా రంగంలో పరపతి ప్రవాహం పెరుగుతుందని ఆసియా అభివృద్ధి బ్యాంకు పేర్కొంది.
 • ప్రపంచ గోల్డ్ కౌన్సిల్ అభిప్రాయంలో 2019వ సంవత్సరం రెండో త్రైమాసికంలో ప్రపంచ వ్యాప్తంగా బంగారానికి డిమాండ్ పెరగడానికి కేంద్ర బ్యాంకులు బంగారం కొనుగోలు కారణమైంది. ఈ కాలంలో కేంద్ర బ్యాంకులు 224.4 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేశాయి. డాలర్ విలువలో ఒడిదుడుకుల కారణంగా ముందు జాగ్రత్త కోసం కేంద్ర బ్యాంకులు బంగారాన్ని కొనుగోలు చేశాయి. ఇదే కాలంలో భారత రిజర్వు బ్యాంకు 42 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేసింది. ప్రస్తుతం రిజర్వుబ్యాంకు వద్ద బంగారం నిల్వ 618 టన్నులకు చేరుకుంది. బంగారం ధరలకు, వడ్డీరేట్లకు మధ్య విలోమ సంబంధం ఉంటుంది. వడ్డీ రేట్లలో పెరుగుదల ఏర్పడినపుడు పెట్టుబడిదారులు బంగారంపై కాకుండా స్థిర ప్రతిఫలాన్నిచ్చే ఇతర స్థిర ఆదాయ పెట్టుబడులకు ఆకర్షితులవుతారు. తద్వారా బంగారానికి డిమాండ్ తగ్గి ధరలు తగ్గుతాయి.
 • 2019 జూన్ చివరి నాటికి భారత విదేశీ రుణం 557.4 బిలియన్ డాలర్లకు చేరుకుంది. 2019 మార్చి తర్వాత భారత విదేశీ రుణంలో పెరుగుదల 14.1 బిలియన్ డాలర్లు. భారత విదేశీ రుణంలో వాణిజ్య రుణాల వాటా ఎక్కువ. భారత కేంద్ర బ్యాంకు గణాంకాల ప్రకారం మొత్తం విదేశీ రుణాంలో వాణిజ్య రుణాల వాటా 38.4 శాతం కాగా, నాన్ రెసిడెంట్ డిపాజిట్ల వాటా 24 శాతం, స్వల్పకాల వాణిజ్య పరపతి వాటా 18.7 శాతం. 2019 జూన్ నాటికి మొత్తం విదేశీ రుణంలో దీర్ఘకాల రుణం 447.7 బిలియన్ డాలర్లు. భారత విదేశీ రుణంలో అమెరికా డాలర్ రూపేణ రుణం అధికం. 2019 జూన్ చివరి నాటికి భారత విదేశీ రుణంలో డాలర్ రూపేణా రుణం వాటా 51.5 శాతం కాగా, రూపాయి వాటా 34.7 శాతం, యెన్ 5.1 శాతం, స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ 4.7 శాతం, యూరో 3.2 శాతం వాటాను కలిగి ఉన్నాయి. ప్రభుత్వ, ప్రభుత్వేతర రంగాల విదేశీ రుణంలో పెరుగుదల ఏర్పడింది.
ఇటీవలి కాలంలో భారత్ వివిధ దేశాలతో చేసుకున్న ఒప్పందాల వివరాలు కింది విధంగా ఉన్నాయి..
 1. నైపుణ్యతాభివృద్ధి, వృత్తిపరమైన శిక్షణ, renewable energy, ఐ.టి. సర్వీసులు, అంతరిక్ష పరిశోధన లాంటి అంశాలకు సంబంధించి 2019 ఆగస్టులో భారత్, ఫ్రాన్స్ మధ్య ఒప్పందంపై సంతకం జరిగింది.
 2. రక్షణ, వాణిజ్యం, పెట్టుబడి, ఆరోగ్యం లాంటి ముఖ్యాంశాలకు సంబంధించి 2019 జూన్‌లో భారత్, కజకిస్తాన్ మధ్య 15 ఒప్పందాలపై ఇరు దేశాలు సంతకం చేశాయి.
 3. దక్షిణాఫ్రికాలోని మలావీలో భారత్- ఆఫ్రికా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ ఏర్పాటుకు సంబంధించి నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ కన్సల్టెన్సీ సర్వీసు, భారత్‌ల మధ్య 2019 ఏప్రిల్‌లో ఒప్పందంపై సంతకం జరిగింది.
 4. 2018 డిసెంబర్‌లో ఇరు దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడి పెంపునకు సంబంధించి భారత్, యూఏఈ మధ్య ‘కరెన్సీ స్వాప్’ ఒప్పందం జరిగింది.
 5. భారతీయ కరెన్సీలో యునెటైడ్ కమర్షియల్ బ్యాంకు ద్వారా చ మురు వాణిజ్యానికి సంబంధించి ఇండియా, ఇరాన్‌ల మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కుదిరింది.
 6. భారత్, చైనాల మధ్య 2017లో ద్వైపాక్షిక వాణిజ్యం 84.44 బిలియన్ డాలర్లకు చేరుకుంది.
 7. భారత ఎగుమతి-దిగుమతి బ్యాంకు, కొరియా ఎగుమతి-దిగుమతి బ్యాంకుల మధ్య ప్రతిపాదిత ఒప్పందానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.
 8. భారత్, ఘనాల మధ్య రాబోయే మూడు సంవత్సరాల కాలంలో వాణిజ్యం 3 బిలియన్ డాలర్ల నుంచి 5 బిలియన్ డాలర్లకు పెరుగుతుందని అంచనా.
మాదిరి ప్రశ్నలు :
Published date : 04 Oct 2019 03:47PM

Photo Stories