ప్రస్తుత ధరల వద్ద జి.డి.పి. పరంగా అమెరికా తర్వాతి స్థానం పొందిన దేశంఏది?
అంతర్జాతీయ ద్రవ్యనిధి ‘వరల్డ్ ఎకనమిక్ అవుట్‌లుక్’లో ప్రపంచ ఉత్పత్తి వృద్ధిని 2019లో 2.9 శాతంగా అంచనావేసింది. ప్రపంచ ఆర్థిక సంక్షోభం తర్వాతి కాలంలో ఉత్పత్తి వృద్ధి అల్పంగా 2019లో నమోదైనట్లు నివేదిక పేర్కొంది. చైనా-అమెరికా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు, తయారీ కార్యకలాపాల క్షీణత ప్రధానంగా ప్రపంచ వాణిజ్యం, ఉత్పత్తి వృద్ధి తగ్గుదలకు కారణాలుగా నిలిచాయి. ప్రపంచ ఉత్పత్తి వృద్ధ్ది 2020లో 3.3 శాతంగా ఉండగలదని నివేదిక పేర్కొంది. భారత ఆర్థిక వ్యవస్థ 2020లో 5.8 శాతం వృద్ధిని సాధించగలదని అంచనా.
ప్రపంచ వ్యాప్తంగా వినియోగ డిమాండ్‌లో తగ్గుదల కారణంగా పారిశ్రామిక కార్యకలాపాలు క్షీణించాయి. సాంకేతికత, ఉద్గారాల ప్రామాణికాలకు సంబంధించి అనేక దేశాలలో మార్పుల కారణంగా డిమాండ్ క్షీణించినందు వల్ల ఆటోమొబైల్ పరిశ్రమ ఉత్పత్తి క్షీణించింది. భారత్‌లోనూ ఇదే పరిస్థితి ఏర్పడినట్లు ‘వరల్డ్ ఎకనమిక్ అవుట్‌లుక్’ పేర్కొంది. ప్రపంచ వ్యాప్తంగా పారిశ్రామిక కార్యకలాపాల తగ్గుదల కారణంగా ముఖ్య దేశాల తయారీ ఎగుమతుల వృద్ధి మందగించింది. వాణిజ్య ఉద్రిక్తతల కారణంగా వాణిజ్య అనిశ్చితి పెరిగి వ్యాపారం పట్ల విశ్వాసం సన్నగిల్లింది. భారత్ తయారీ ఎగుమతుల వృద్ధిలోనూ క్షీణత ఏర్పడింది.
ప్రస్తుత ధరల వద్ద జి.డి.పి. పరంగా 2019లో ప్రపంచంలో అమెరికా ప్రథమ స్థానం (21.4ట్రి.డా.) పొందగా చైనా (14.1 ట్రి.డా.) రెండో స్థానం జపాన్ (5.2 ట్రి.డా.) మూడో స్థానం పొందాయి. తర్వాతి స్థానాలలో వరుస క్రమంలో జర్మనీ (3.9 ట్రి.డా.), భారత్ (2.9 ట్రి.డా.), యు.కె., ఫ్రాన్‌స, ఇటలీ, బ్రె జిల్, కొరియాలు నిలిచాయి.
1. భారత ఆర్థిక వ్యవస్థ - ముఖ్యాంశాలు:
మొదటి ముందస్తు అంచనాల ప్రకారం 2018-19లో వాస్తవిక జి.డి.పి. వృద్ధి 6.8 శాతం కాగా 2019-20లో 5 శాతంగా నమోదైంది. నామినల్ జి.డి.పి. 2019-20లో రూ.204.4 లక్షల కోట్లు కాగా 2018-19తో పోల్చినప్పుడు నామినల్ జి.డి.పి. వృద్ధి 7.5 శాతం.
భారత ఆర్థిక వ్యవస్థలో ప్రైవేటీకరణ కారణంగా ఆయా సంస్థల సామర్థ్యం పెరుగుదల వల్ల కలిగే ప్రయోజనాలను సర్వే ప్రస్తావించింది. ఏ్కఇఔలో 53.29 శాతంగా ఉన్న ప్రభుత్వ వాటాను ‘వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణ’లో భాగంగా విక్రయించిన కారణంగా జాతీయ సంపదలో రూ.33,000 కోట్ల పెరుగుదల ఏర్పడిందని సర్వే పేర్కొంది. 1999-2000 నుంచి 2003-04 మధ్య కాలంలో పెట్టుబడుల ఉపసంహరణ జరిగిన 11 కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ప్రగతిని సర్వే ప్రస్తావించింది. పెట్టుబడుల ఉపసంహరణ జరిగిన తర్వాతి కాలంలో ముందు కాలంతో పోల్చినపుడు ఆయా సంస్థల నికర లాభాలు, నికర విలువ, ఆస్తుల నుంచి ప్రతిఫలం, ఈక్విటీల నుంచి ప్రతిఫలంలో గణనీయమైన పెరుగుదల ఏర్పడింది. లభ్యమయ్యే అదే పరిమాణంలో వనరుల నుంచి అధిక సంపదను ప్రైవేటీకరించిన ప్రభుత్వ రంగ సంస్థలు సృష్టించగలిగాయని సర్వే పేర్కొంది. అధిక లాభదాయకత, సమర్దత పెంపు, పోటీతత్వం పెంపు, ్కటౌజ్ఛటటజీౌ్చజీటఝను ప్రోత్సహించడానికి పెట్టుబడుల ఉపసంహరణ ఆవశ్యకతను సర్వే ప్రస్తావించింది.
భారత ఆర్థిక వ్యవస్థ పరిమాణానికి అనుపాతంగా 1969 తర్వాతి కాలంలో బ్యాంకింగ్ రంగం అభివృద్ధి చెందలేదు. ప్రపంచ వ్యాప్తంగా మొదటి వంద బ్యాంక్‌లలో భారత్‌కు సంబంధించి ఒక బ్యాంక్ మాత్రమే స్థానం పొందింది. భారత ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి మద్దతుగా నిలిచే ప్రభుత్వ రంగ బ్యాంక్‌లు మొత్తం భారత బ్యాంకింగ్ రంగ మార్కెట్‌లో 70 శాతం వాటాను కల్గి ఉన్నాయి. 2019లో భారత ప్రభుత్వ రంగ బ్యాంక్‌లలో ప్రతి రూపాయి పెట్టుబడికి సంబంధించి సగటున 23 పైసల నష్టం సంభవించింది. మరోవైపు నూతన ప్రైవేటు బ్యాంకులలో ప్రతి రూపాయి పెట్టుబడికి సంబంధించి సగటున 9.6 పైసల లాభం పొందినట్లు ఆర్థిక సర్వే పేర్కొంది.
బ్యాంకింగ్, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కార్పొరేషన్‌ల పరపతి వృద్ధిలో క్షీణత వల్ల ఆర్థిక వ్యవస్థలో వనరుల ప్రవాహం తగ్గింది. షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకుల స్థూల రికవరీ కాని రుణాలు మొత్తం అడ్వాన్సులలో మార్చి-సెప్టెంబర్ 2019 మధ్య కాలంలో స్థిరంగా 9.3 శాతంగా నమోదైంది. ఇదే కాలంలో ఎన్.బి. ఎఫ్.సి.ల స్థూల రికవరీ కాని రుణాలు 6.1 శాతం నుంచి 6.3 శాతానికి పెరిగాయి. వృద్ధి క్షీణత, అల్ప ద్రవ్యోల్బణం కారణంగా గత ఆర్థిక సంవత్సరంలో వరుసగా జరిగిన నాలుగు ద్రవ్య విధాన కమిటీ సమావేశాలలో రెపోరేటును 110 బేసిస్ పాయింట్లు తగ్గించారు.
2. కేంద్ర ప్రభుత్వ వ్యయ ధోరణులు:
కీలక రంగాల అభివృద్ధి, స్థూల ఆర్థిక లక్ష్యాల సాధనకు ఏవిధమైన అవరోధం లేకుండా ప్రభుత్వం లభ్యమయ్యే వనరులను అభిలషణీయంగా వివిధ రంగాల మధ ్య పంపిణీ చేస్తుంది. భారత్ పన్ను-జి.డి.పి. నిష్పత్తి తక్కువగా ఉన్నందు వల్ల పెట్టుబడి, అవస్థాపనా సౌకర్యాల విస్తరణకు అవసరమైన నిధుల విషయంలో ప్రభుత్వం అనేక సవాళ్ళను ఎదుర్కొంటుంది. ఈ క్రమంలో వ్యయ నాణ్యత ప్రాధాన్యత సంతరించుకుంది. గత ఐదు సంవత్సరాల కాలంలో కేంద్ర ప్రభుత్వ మొత్తం వ్యయంలో రక్షణ సర్వీసులు, వేతనాలు, పెన్షన్లు, వడ్డీ చెల్లింపులు, ముఖ్య సబ్సిడీల వాటా సగటున 60 శాతానికిపైగా నమోదైంది. 2019-20 బడ్జెట్ అంచనాల ప్రకారం మొత్తం రెవెన్యూ వ్యయం రూ.24.48లక్షల కోట్లు కాగా, ఈ మొత్తంలో వడ్డీ చెల్లింపులపై రూ.6.60లక్షల కోట్లు, ముఖ్య సబ్సిడీలపై రూ.3.02 లక్షల కోట్లు వేతనాలపై రూ.2.35 లక్షల కోట్లు, పెన్షన్‌లపై రూ.1.74 లక్షల కోట్ల వ్యయంగా అంచనా.
బడ్జెటరీ వ్యయంతో పాటు అదనపు బడ్జెటరీ వనరులను అవస్థాపనా రంగంపై పెట్టుబడి నిమిత్తం 2016-17 నుంచి సమీకరించడం ప్రారంభమైంది. అదనపు బడ్జెటరీ వనరుల రూపంలో సమీకరించిన మొత్తాన్ని (అసలు మొత్తం, వడ్డీ) కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ నుంచి చెల్లిస్తారు. 2016-17 నుంచి 2018-19 మధ్య కాలంలో ప్రభుత్వం రూ.88,454 కోట్ల అదనపు బడ్జెటరీ వనరులను సమీకరించింది. 2019-20లో రూ.57,004 కోట్లను సమీకరించాలని ప్రతిపాదించారు. ద్రవ్యలోటును లెక్కించేటప్పుడు అదనపు బడ్జెటరీ వనరులను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోదు. కానీ ప్రభుత్వ రుణ లెక్కింపులో అదనపు బడ్జెటరీ వనరులు భాగంగా ఉంటాయి.
3. రాష్ట్రాల ఫైనాన్‌స ధోరణులు:
రాష్ర్ట ప్రభుత్వాల 2019-20 బడ్జెట్ అంచనాల ప్రకారం రాష్ర్ట ప్రభుత్వాల ఉమ్మడి పన్ను రాబడిలో 11.1 శాతం, పన్నేతర రాబడిలో 9.9 శాతం వృద్ధి ఉంటుందని అంచనా. రాష్ర్ట ప్రభుత్వాల ఉమ్మడి సొంత పన్ను రాబడి 2014-15లో రూ.7.8 లక్షల కోట్లనుంచి 2018-19లో సవరించిన అంచనాల ప్రకారం రూ.12.3లక్షల కోట్లకు పెరిగింది. ఇదే కాలంలో సొంత పన్నేతర రాబడి రూ.1.4 లక్షల కోట్ల నుంచి రూ.2.4 లక్షల కోట్లకు పెరిగింది.
రాష్ర్ట ప్రభుత్వాల ఉమ్మడి వ్యయం 2014-15లో రూ.19.4 లక్షల కోట్ల నుంచి 2018-19లో సవరించిన అంచనాల ప్రకారం రూ.34.2 లక్షల కోట్లకు పెరిగింది. ఇదే కాలంలో మొత్తం వ్యయంలో భాగంగా రెవెన్యూ వ్యయం రూ.16.4లక్షల కోట్ల నుంచి రూ.28.3 లక్షల కోట్లకు పెరిగింది. రాష్ర్ట ప్రభుత్వాల రుణ-జి.డి.పి. నిష్పత్తి 2019-20లో 25 శాతంగా ఉంటుందని అంచనావేశారు. గత నాలుగు సంవత్సరాల కాలంలో రాష్ర్ట ప్రభుత్వాల రుణ-జి.డి.పి. నిష్పత్తి పెరుగుదలకు ్ఖఈఅ్గ బాండ్ల మంజూరు, వ్యవసాయ రుణాల మాఫీ, వేతన సంఘ సిఫార్సుల అమలు కారణాలుగా నిలిచాయి. వడ్డీ చెల్లింపులు, వేతనాలు, సబ్సిడీలపై అధిక వ్యయం కారణంగా రాష్ర్ట ప్రభుత్వాల రెవెన్యూ వ్యయంలో పెరుగుదల అధికమైంది. రిజర్‌వ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధ్యయనం ప్రకారం గత నాలుగు సంవత్సరాల కాలంలో రాష్ర్ట ప్రభుత్వాలు ఫిస్కల్ కన్సాలిడేషన్ చర్యలో భాగంగా మూలధన వ్యయాన్ని తగ్గించాయి. ఈ చర్య ఆర్థికాభివృద్ధికి అవరోధంగా ఉండగలదని రిజర్వు బ్యాంక్ అభిప్రాయపడింది.
4. రాష్ట్రాలకు వనరుల బదిలీ :
కేంద్రం నుంచి రాష్ట్రాలకు నిధుల బదిలీకి కింది అంశాలు ప్రధాన ఆధారంగా నిలుస్తాయి.
1. కేంద్ర ప్రభుత్వ పన్ను రాబడిలో రాష్ట్రాల వాటా
2. ఆర్థిక సంఘం గ్రాంట్లు
3. కేంద్ర ప్రభుత్వ స్పాన్స్‌ర్డ్ పథకాలు
2013-14 వరకు కేంద్ర ప్రభుత్వ స్పాన్స్‌ర్డ్ పథకాల నిధులను ‘రాష్ర్ట ప్రభుత్వాల కన్షాలిడేటెడ్ ఫండ్, రాష్ర్ట ప్రభుత్వాల పథకం అమలు ఏజెన్సీ’కి కేంద్ర ప్రభుత్వం అందించేది. 2014-15 నుంచి స్పాన్సర్‌డ పథకాలకు సంబంధించి బదిలీతో పాటు అన్ని బదిలీలను ‘రాష్ర్ట ప్రభుత్వాల కన్సాలిడేటెడ్ ఫండ్’లో కేంద్ర ప్రభుత్వం జమచేస్తుంది.
కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ర్ట ప్రభుత్వాలకు బదిలీ మొత్తం 2014-15లో రూ.6.66లక్షల కోట్ల నుంచి 2018-19లో సవరించిన అంచనా ప్రకారం రూ.12.38లక్షల కోట్లకు పెరిగింది. ఇదే కాలానికి సంబంధించి బదిలీ మొత్తంలో కేంద్ర ప్రభుత్వం పన్ను రాబడిలో రాష్ట్రాల వాటా అధికం కాగా, తర్వాతి స్థానాలలో కేంద్ర ప్రభుత్వ స్పాన్స్‌ర్డ్ పథకాలకు సంబంధించి బదిలీ, ఆర్థిక సంఘం గ్రాంట్లు నిలిచాయి.
మాదిరి ప్రశ్నలు :
1. ప్రపంచ ఉత్పత్తి వృద్ధి 2019లో ఎంత శాతం నమోదైంది?
1) 2.6 శాతం
2) 2.9 శాతం
3) 3.6 శాతం
4) 3.8 శాతం
- View Answer
- సమాధానం: 2
2. ప్రస్తుత ధరల వద్ద జి.డి.పి. పరంగా భారత్‌ను ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా కింది ఏ నివేదిక పేర్కొంది?
1) వరల్డ్ ఎకనమిక్ అవుట్‌లుక్
2) మానవాభివృద్ధి నివేదిక
3) OECD
4) పైవేవీ కావు
- View Answer
- సమాధానం: 1
3. రైతుల ఆదాయాలను రెట్టింపు చేయడానికి కింది వాటిలో ఏ చర్య ఉపకరిస్తుంది?
1) రైతులకు పరపతి లభ్యత
2) బీమా అందుబాటు
3) వ్యవసాయ రంగంపై పెట్టుబడులు
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
4. 2019-20లో సేవారంగంలో వృద్ధి ఎంత శాతం ఉంటుందని అంచనా వేశారు?
1) 6.2 శాతం
2) 6.7 శాతం
3) 6.9 శాతం
4) 7.5 శాతం
- View Answer
- సమాధానం: 3
5. 2011-12తో పోల్చినపుడు 2017-18లో మహిళల శాశ్వత ఉపాధిలో పెరుగుదల శాతం?
1) 7 శాతం
2) 8 శాతం
3) 9 శాతం
4) 10 శాతం
- View Answer
- సమాధానం: 2
6. నూతన సంస్థల ఏర్పాటులో భారత్ మూడో స్థానంలో నిలిచినట్లు కింది ఏ సంస్థ పేర్కొంది?
1) ప్రపంచ బ్యాంక్
2) అంతర్జాతీయ ద్రవ్యనిధి
3) ఆసియా అభివృద్ధి బ్యాంక్
4) రిక్స్ బ్యాంక్
- View Answer
- సమాధానం: 1
7. ప్రపంచ ఉత్పత్తి వృద్ధి 2019లో అల్పంగా నమోదవడానికి కారణం ఏమిటి?
1) ప్రపంచ తయారీ ఉత్పత్తి వృద్ధి క్షీణత
2) ప్రపంచ వాణిజ్య వృద్ధి క్షీణత
3) ప్రపంచ వ్యాప్తంగా వినియోగ డిమాండ్ తగ్గుదల
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
8. ప్రస్తుత ధరల వద్ద జి.డి.పి. పరంగా అమెరికా తర్వాతి స్థానం పొందిన దేశం?
1) జర్మనీ
2) భారత్
3) చైనా
4) జపాన్
- View Answer
- సమాధానం: 3
9.వాస్తవిక జి.డి.పి. వృద్ధి 2018-19లో కింది వాటిలో దేనిలో అధికంగా నమోదైంది?
1) ప్రభుత్వ వినియోగం
2) వస్తు, సేవల దిగుమతులు
3) వస్తు, సేవల ఎగుమతులు
4) స్థిర పెట్టుబడి
- View Answer
- సమాధానం: 2
10.టోకు ధరల సూచీ సగటు కింది ఏ సంవత్సరంలో అధికంగా నమోదైంది?
1) 2016-17
2) 2017-18
3) 2018-19
4) 2019-20
- View Answer
- సమాధానం: 3
11. గత ఐదు సంవత్సరాల కాలంలో కింది ఏ రంగంలో సగటు సాంవత్సరిక వృద్ధి 7.9 శాతంగా ఆర్థిక సర్వే పేర్కొంది?
1) పశుసంపద
2) గనులు, ఖనిజాలు
3) తయారీ రంగం
4) విద్చుచ్ఛక్తి, గ్యాస్, నీటి సరఫరా
- View Answer
- సమాధానం: 1
12. 2019-20లో భారత్‌లో వాస్తవిక జి.డి.పి. వృద్ధి ఎంత శాతం ఉంటుందని అంచనావేశారు?
1) 8 శాతం
2) 5.0 శాతం
3) 6.5 శాతం
4) 6.8 శాతం
- View Answer
- సమాధానం: 2
13. 2019-20లో మొదటి ముందస్తు అంచనాల ప్రకారం పారిశ్రామిక రంగానికి సంబంధించి కింది ఏ ఉపరంగంలో జి.వి.ఏ. వృద్ధి అధికం?
1) మైనింగ్, క్వారియింగ్
2) తయారీ
3) విద్యుచ్ఛక్తి, గ్యాస్, నీటి సరఫరా
4) నిర్మాణ రంగం
- View Answer
- సమాధానం: 3
14. 2019-20లో మొదటి ముందస్తు అంచనాల ప్రకారం సేవా రంగానికి సంబంధించి కింది ఏ ఉపరంగంలో జి.వి.ఏ. వృద్ధి అధికం?
1) వాణిజ్యం, హోటళ్ళు, రవాణా
2) ప్రభుత్వ పాలన, రక్షణ, ఇతర సేవలు
3) సమాచారం, బ్రాడ్‌కాస్టింగ్ సర్వీస్‌లు
4) రియల్ ఎస్టేట్, ఫైనాన్షియల్, వృత్తిపరమైన సేవలు
- View Answer
- సమాధానం: 2
ఎ) వ్యవసాయం, అనుబంధాలు
బి) తయారీ రంగం
సి) నిర్మాణ రంగం
డి) ఫైనాన్షియల్, రియల్ ఎస్టేట్, వృత్తి పరమైన సేవలు
1) ఎ, బి
2) సి మాత్రమే
3) డి మాత్రమే
4) ఎ, బి, సి, డి
- View Answer
- సమాధానం: 4
16. 2019-20లో వాస్తవిక జి.వి.ఏ. వృద్ధి బేసిక్ ధరల వద్ద భారత్‌లో ఎంత శాతం నమోదైంది?
1) 4.9 శాతం
2) 5.2 శాతం
3) 6.2 శాతం
4) 6.8 శాతం
- View Answer
- సమాధానం: 1
17. ప్రస్తుత ధరల వద్ద జి.డి.పి. 2019-20లో కింది ఏ దేశంతో పోల్చినప్పుడు భారత్‌లో అధికంగా నమోదైంది?
ఎ) ఫ్రాన్స్
బి) యు.కె
సి) ఇటలీ
డి) బ్రెజిల్
1) ఎ మాత్రమే
2) బి, డి
3) ఎ, బి, సి, డి
4) డి మాత్రమే
- View Answer
- సమాధానం: 3