ఏపీ- సామాజిక, సాంస్కృతిక చరిత్ర
1. ఆంధ్ర ప్రాంతంలో అతి ప్రాచీన బౌద్ధ స్తూపం ఎక్కడ ఉంది?
1) అమరావతి
2) నాగార్జున కొండ
3) చందవరం
4) భట్టిప్రోలు
- View Answer
- సమాధానం: 4
2. శాతవాహనుల కాలం నాటి ‘చిత్రకళ’ అవశేషాలు ఎక్కడ కనిపిస్తాయి?
1) శాలిహుండం
2) పిల్లలమర్రి
3) అజంతా 9,10వ గుహలు
4) అమరావతి
- View Answer
- సమాధానం: 3
3. క్రీ.పూ. 200 ఏళ్ల నాటి ‘గుంటుపల్లి గుహాలయాలు’ ఏ జిల్లాలో ఉన్నాయి?
1) శ్రీకాకుళం
2) పశ్చిమ గోదావరి
3) గుంటూరు
4) విశాఖపట్నం
- View Answer
- సమాధానం: 2
4. ప్రసిద్ధి చెందిన బౌద్ధ క్షేత్రం ‘శాలిహుండం’ ఏ నది ఒడ్డున ఉంది?
1) కృష్ణా
2) నాగావళి
3) వంశధార
4) శారద
- View Answer
- సమాధానం: 3
5. ఆంధ్ర ప్రాంతంలో ‘రోమన్ దేశ బంగారు నాణేలు’ ఎక్కడ లభించాయి?
1) అమరావతి, వినుకొండ, చేబ్రోలు, నాగార్జున కొండ
2) చందవరం, శ్రీశైలం, త్రిపురాంతకం
3) రామతీర్థం, శంకరం, బావికొండ
4) శాలిహుండం, జగ్గయ్యపేట, ఘంటసాల
- View Answer
- సమాధానం: 1
6. గౌతమ బుద్ధుడు స్వయంగా ‘కాలచక్రతంత్రం’ను ఎక్కడ ప్రవర్తింపజేశాడు?
1) శాలిహుండం
2) అమరావతి (ధాన్యకటకం)
3) నాగార్జున కొండ
4) జగ్గయ్యపేట
- View Answer
- సమాధానం: 2
7. అశ్వఘోషుడు ‘బుద్ధ చరితం’, ‘సౌందర నందనం’ లాంటి కావ్యాలను ఏ భాషలో రచించాడు?
1) తెలుగు
2) పాళీ
3) సంస్కృతం
4) కన్నడ
- View Answer
- సమాధానం: 3
8. ఎన్నో బౌద్ధ సంగీతి (సమావేశం)లో బౌద్ధమతం హీనయానం, మహాయాన శాఖలుగా విడిపోయింది?
1) ప్రథమ బౌద్ధ సంగీతి
2) రెండో బౌద్ధ సంగీతి
3) నాలుగో బౌద్ధ సంగీతి
4) మూడో బౌద్ధ సంగీతి
- View Answer
- సమాధానం: 3
9. ‘వజ్రయానం’ అంటే..?
1) బుద్ధుడిని చిహ్నాల రూపంలో పూజించడం
2) బుద్ధుడిని ప్రతిమ రూపంలో పూజించడం
3) తాంత్రిక పూజా విధానం (మంత్ర-తంత్రాలు)
4) ఆధ్యాత్మిక విధానం
- View Answer
- సమాధానం: 3
10. ‘సల్లేఖనం’ ఏ మతానికి సంబంధించింది?(Group-I, 1994)
1) వైదిక మతం
2) జైన మతం
3) వీర శైవం
4) బౌద్ధ మతం
- View Answer
- సమాధానం: 2
11. ఇటీవల కనుగొన్న ‘బావి కొండ’ బౌద్ధ క్షేత్రం ఏ జిల్లాలో ఉంది? (Group-I, 1994)
1) శ్రీకాకుళం
2) విశాఖపట్నం
3) విజయనగరం
4) అనంతపురం
- View Answer
- సమాధానం: 2
12. ఆంధ్రప్రదేశ్లోని ‘బేతంచర్ల’ దేనికి ప్రసిద్ధి?(Group-I, 1994)
1) ప్రాక్ చరిత్ర నాటి గుహలు
2) దేవాలయాలు
3) పుణ్యతీర్థం
4) శైవ క్షేత్రం
- View Answer
- సమాధానం: 1
13. జైన తీర్థంకరుల జీవిత చరిత్రను తెలిపే గ్రంథం? (Civils prelims, 1999)
1) కాతంత్ర వ్యాకరణం
2) గాథాసప్తశతి
3) కల్పసూత్రం
4) త్రిపీఠకాలు
- View Answer
- సమాధానం: 3
14. పండిత బ్రాహ్మణులకు ఇచ్చిన పన్నులేని గ్రామాలను ఏవిధంగా వ్యవహరించేవారు? (Group-I, 1999)
1) ఘటికలు
2) భోగమాన్యాలు
3) అగ్రహారాలు
4) రాజమాన్యాలు
- View Answer
- సమాధానం: 3
15. కళింగదేశంపై అశోకుడి విజయాన్ని ఏ శాసనంలో పేర్కొన్నారు? (Group-I, 1999)
1) నాసిక్ శిలాశాసనం
2) రాజుల మందగిరి శాసనం
3) హాతిగుంఫా శాసనం
4) ప్రభుత్వ రాజ శాసనం (13వ శిలా శాసనం)
- View Answer
- సమాధానం: 4
16. మహావీరుడు 24వ తీర్థంకరుడైతే ప్రథమ తీర్థంకరుడు ఎవరు? (Group-I, 2004)
1) నేమినాథుడు
2) రుషభనాథుడు
3) పార్శ్వనాథుడు
4) అరిష్టనేమి
- View Answer
- సమాధానం: 2
17. గౌతమబుద్ధుడు పరమపదించిన ప్రదేశం?(Group-I, 2004)
1) కుశీ నగరం
2) పావపురి
3) సార్నాద్
4) రాజగృహ
- View Answer
- సమాధానం: 1
18. భాగవత మత స్థాపకుడు ఎవరు?
1) శంకరాచార్యులు
2) కృష్ణ వాసుదేవుడు
3) రామానుజాచార్యులు
4) మధ్వాచార్యులు
- View Answer
- సమాధానం: 2
19. క్రీ.శ. 885 నాటి ‘బెజవాడ శాసనం’ ఎవరి కాలానికి సంబంధించింది?(Group-I, 2003)
1) గుణగణాధిత్యుడు
2) మొదటి చాళుక్య భీముడు
3) యుద్ధమల్లుడు
4) విమలాదిత్యుడు
- View Answer
- సమాధానం: 3
20. హాలుడి వివాహ వృత్తాంతాన్ని తెలిపే ‘లీలావతి’ గ్రంథ రచయిత ఎవరు? (Group-II, 2003)
1) కుతూహలుడు
2) కొండకుందాచారి
3) పంపడు
4) కొరవి గోపరాజు
- View Answer
- సమాధానం: 1
21. తొలి తెలుగు శాసనాన్ని ఎవరి కాలంలో వేశారు? (Group-I, 1995)
1) కాకతీయులు
2) ఇక్ష్వాకులు
3) శాతవాహనులు
4) రేనాటి చోడులు
- View Answer
- సమాధానం: 4
22. ‘ప్రతీత్ప సముత్పాదన సిద్ధాంతం’ను ఎవరు ప్రతిపాదించారు? (Group-I, 1994)
1) రామానుజాచార్యుడు
2) జైన మహావీరుడు
3) గౌతమబుద్ధుడు
4) నాగార్జునుడు
- View Answer
- సమాధానం: 3
23. ‘మాచల్దేవి’ ఏ తెలుగు సాహిత్య గ్రంథంలోని పాత్ర? (Group-I, 1995)
1) క్రీడాభిరామం
2) భాగవతం
3) పల్నాటి వీరచరిత్ర
4) ఆముక్తమాల్యద
- View Answer
- సమాధానం: 1
24. ‘జక్కులపురంద్రి’ ఏ జానపద కళకు సంబంధించింది? (Group-I, 1995)
1) యక్షగానం
2) తోలుబొమ్మలాట
3) కోలాటం
4) చెక్కభజన
- View Answer
- సమాధానం: 1
25. క్రీ.శ. 927లో గోదావరి నది ఒడ్డున రాజమహేంద్రీపురం (రాజమండ్రి) నగరాన్ని నిర్మించిన తూర్పు చాళుక్యరాజు ఎవరు?
1) రాజరాజ నరేంద్రుడు
2) మొదటి అమ్మరాజు
3) విమాలాదిత్యుడు
4) గుణగ విజయాదిత్యుడు
- View Answer
- సమాధానం: 2
26. సమస్త గాంధర్వ విద్యల్లో ప్రవీణురాలైన ‘చెల్లవ-చెల్లాంబిక’ను పోషించిన చాళుక్యరాజు ఎవరు? (Civils prelims, 1997)
1) రాజరాజ నరేంద్రుడు
2) మొదటి చాళుక్య భీముడు
3) గుణగ విజయాదిత్యుడు
4) విమలాదిత్యుడు
- View Answer
- సమాధానం: 2
27. తూర్పు చాళుక్యుల కాలంలో తెలుగులో సగం, సంస్కృతంలో సగం వేసిన శాసనం ఏది? (Group-I, 2004)
1) అహదనకర శాసనం
2) బెజవాడ యుద్ధమల్లుడి శాసనం
3) పండరంగడి అద్దంకి శాసనం
4) మైదవోలు శాసనం
- View Answer
- సమాధానం: 1
28. రాజరాజ నరేంద్రుడి నుంచి ‘నవఖండవాడ’ అగ్రహారాన్ని పొందినవారు ఎవరు? (Group-II, 2008)
1) నన్నయ భట్టు
2) నారాయణ భట్టు
3) పావులూరి మల్లన
4) విద్యానాథుడు
- View Answer
- సమాధానం: 3
29. ‘నరేంద్ర మృగేశ్వరాలయాలు’ అనే పేరుతో 108 శివాలయాలను నిర్మించిన తూర్పు చాళుక్య రాజు ఎవరు? (Group-II, 2008)
1) మొదటి అమ్మరాజు
2) విమలాదిత్యుడు
3) మొదటి చాళుక్య భీముడు
4) రెండో విజయాదిత్యుడు
- View Answer
- సమాధానం: 4
30. భారతీయ న్యాయశాస్త్రానికి ఆధారమైన యాజ్ఞవల్క స్మృతిపై ‘మితాక్షరీ’ పేరుతో వ్యాఖ్యానం రాసింది ఎవరు? (Civils prelims, 1999)
1) విజ్ఞానేశ్వరుడు
2) జైమినీ
3) కణాదుడు
4) కపిలుడు
- View Answer
- సమాధానం: 1
31. పావులూరి మల్లన తన ‘గణితసార సంగ్రహం’ గ్రంథాన్ని ఏ భాషలో రచించాడు?
1) తెలుగు
2) సంస్కృతం
3) ప్రాకృతం
4) కన్నడం
- View Answer
- సమాధానం: 1
32. రాజరాజ నరేంద్రుడు ‘నందంపూడి’ గ్రామాన్ని అగ్రహారంగా ఎవరికి దానం చేశాడు? (Group-II, 2008)
1) నన్నయ భట్టు
2) నారాయణ భట్టు
3) పావులూరి మల్లన
4) సోమదేవ సూరి
- View Answer
- సమాధానం: 2
33. తూర్పుగోదావరి జిల్లా ‘బిక్కవోలు’లో రాజరాజేశ్వర, గోలింగేశ్వర, చంద్రశేఖర దేవాలయాలను నిర్మించిన చాళుక్య రాజు ఎవరు?
1) రాజరాజ నరేంద్రుడు
2) అమ్మంగ దేవుడు
3) గుణగ విజయాదిత్యుడు
4) మొదటి చాళుక్య భీముడు
- View Answer
- సమాధానం: 3
34. తెలుగు భాషలో తొలి వ్యాకరణ గ్రంథమైన ‘ఆంధ్రశబ్ద చింతామణి’ రచయిత ఎవరు?
1) శ్రీనాథుడు
2) నన్నయ భట్టు
3) పోతన
4) నారాయణ భట్టు
- View Answer
- సమాధానం: 2
35. వేంగి (లేదా) తూర్పు చాళుక్య రాజుల ‘రాజ లాంఛనం’ ఏది?
1) వరాహం
2) సింహం
3) పులి
4) చేప
- View Answer
- సమాధానం: 1
36. ‘స్థల మహత్యాలు’ అంటే..?
1) స్థానిక దేవతల గురించి వివరించే కథలు
2) బ్రాహ్మణ గ్రామాలు
3) గ్రామ సభలు
4) న్యాయస్థానాలు
- View Answer
- సమాధానం: 1
37. ‘బృహత్ సంహిత’ గ్రంథ రచయిత ఎవరు?(Gazetted, 2005)
1) కాళిదాసు
2) వరాహమిహిరుడు
3) సుశ్రుతుడు
4) పతంజలి
- View Answer
- సమాధానం: 2
38. వర్తక శ్రేణులను ‘నకరం’గా పేర్కొనేవారు. తూర్పు చాళుక్యుల కాలంలో వీటికి ప్రధాన కేంద్రం ఏది?
1) భీమవరం
2) ఏలూరు
3) ద్రాక్షారామం
4) పెనుగొండ
- View Answer
- సమాధానం: 4
39. తూర్పు చాళుక్యుల కాలంలో ‘కొదెన’ అనే సుంకాన్ని వేటిపై విధించేవారు?
1) మగ్గాల తయారీ
2) గొడుగుల తయారీ
3) రాచభూములు
4) నూనె తీయడం
- View Answer
- సమాధానం: 2
40. ‘అభిదాన చింతామణి’ గ్రంథ రచయిత ఎవరు?
1) పెదకోమటి వేమారెడ్డి
2) ఎలకూచి బాలసరస్వతి
3) విశ్వేశ్వర కవి
4) హేమాద్రి
- View Answer
- సమాధానం: 4
41. ద్రాక్షారామ ‘భీమేశ్వరాలయం’, సామర్లకోట ‘చాళుక్య భీమేశ్వరాలయం’ నిర్మించిన తూర్పు చాళుక్య రాజు ఎవరు?
1) రాజరాజ నరేంద్రుడు
2) విమలాదిత్యుడు
3) మొదటి చాళుక్య భీముడు
4) గుణగ విజయాదిత్యుడు
- View Answer
- సమాధానం: 3
42. ‘పూర్వ మీమాంస’ (కర్మ మార్గం) వాదానికి మూల పురుషుడు జైమినీ అయితే, జ్ఞానమార్గాన్ని ప్రతిపాదించిన ‘ఉత్తర మీమాంస’ వాదానికి మూలపురుషుడు ఎవరు?
1) పతంజలి
2) కణాదుడు
3) కపిలుడు
4) బాదరాయణుడు
- View Answer
- సమాధానం: 4
43. వైష్ణవ మతంలో ‘పంచారాత్ర’ క్రతువును ప్రతిపాదించినవారు?
1) కశ్యపుడు
2) మాతంగుడు
3) శాండిల్యుడు
4) కౌండిన్యుడు
- View Answer
- సమాధానం: 3
44. తెలుగులో తొలి శాసనమైన ‘కళ్లమల్ల’ శాసనాన్ని వేయించిన రాజు ఎవరు?
1) రేనాటి చోడ రాజు ధనుంజయుడు
2) జయసింహ వల్లభుడు
3) పాండురంగడు
4) యుద్ధమల్లుడు
- View Answer
- సమాధానం: 1
45. కింది వాటిలో సరికాని జత ఏది? (Group-I, 2004)
1) నన్నెచోడుడు - కుమార సంభవం
2) పాల్కురికి సోమనాథుడు - పండితారాధ్య చరిత్ర
3) వేములవాడ భీమకవి - బసవ పురాణం
4) మల్లికార్జున పండితారాధ్యుడు - శివతత్త్వసారం
- View Answer
- సమాధానం: 3
46. ముసునూరి ప్రోలయ నాయకుడి రాజధాని ఏది?
1) అద్దంకి
2) చందవోలు
3) రేకపల్లి దుర్గం
4) ఆమనగల్లు
- View Answer
- సమాధానం: 3
47. కాకతీయ రాజ్య పతనాంతరం, ఆంధ్రదేశంలో మహమ్మదీయ దాడులను వర్ణించిన శాసనం ఏది?
1) గణపేశ్వర శాసనం
2) విలస తామ్ర శాసనం
3) ఆర్యావట శాసనం
4) హనుమకొండ శాసనం
- View Answer
- సమాధానం: 2
48. ఆంధ్రదేశాదీశ్వర, ప్రఖ్యాతాంధ్ర సురత్రాణుడు అనేవి ఎవరి బిరుదులు?
1) పోతన నాయకుడు
2) కామన నాయకుడు
3) ప్రోలయ నాయకుడు
4) ముసునూరి కాపయ నాయకుడు
- View Answer
- సమాధానం: 4
49. ‘దయాభాగ’ రచయిత ఎవరు?(Group-I, 1999)
1) విఘ్నేశ్వర
2) కుల్లక భట్ట
3) విశ్వరుద్ర
4) జీమూత వాహనుడు
- View Answer
- సమాధానం: 4
50. రెడ్డి - వెలమ రాజుల మధ్య అనుసంధాన కర్తగా వ్యవహరించినవారెవరు?
1) పోతన
2) శ్రీనాథుడు
3) వేమన
4) విశ్వేశ్వరకవి
- View Answer
- సమాధానం: 2