Skip to main content

ఆంధ్రప్రదేశ్‌ చరిత్ర – శాతవాహనులు

  • శాతవాహన వంశ స్థాపకుడు?
    – శ్రీముఖ శాతకర్ణి
  • మౌర్య సామ్రాజ్య పతనానంతరం, శ్రీముఖుని నాయకత్వంలో శాతవాహనులు స్వతంత్రించారు అని తెలిపినవారు?
    –వి.ఎ.స్మిత్‌
  • శ్రీముఖ శాతకర్ణి ఆంధ్ర జాతీయుడు అని పేర్కొన్న పురాణం?
    – మత్స్య పురాణం
  • శాతవాహనులు – ఆంధ్రులు ఒక్కరే అన్నవారు?
    – ఆర్‌.జి.భండార్కర్, వి.ఎ. స్మిత్, రాప్సన్‌
  • శాతవాహనుల జన్మస్థలం మహారాష్ట్ర అని పేర్కొన్నవారు?
    – పి.టి. శ్రీనివాస అయ్యంగార్‌
  • శాతవాహనుల జన్మస్థలం విదర్భ అని వాదించినవారు?
    – వి.వి. మిరాశి
  • శాతవాహనుల జన్మస్థలం కర్ణాటక అని పేర్కొన్నవారు?
    –సూక్తాంకర్‌
  • శాతవాహనుల తొలి రాజధాని?
    – కోటిలింగాల
  • ఏ శాతవాహన రాజుకు చెందిన నాణేలు పూనా సమీపంలో లభించాయి?
    –మొదటి శాతకర్ణి
  • నానాఘాట్‌ శాసన కర్త?
    – నాగానిక
  • సాంచీ స్థూపానికి దక్షిణ తోరణం నిర్మించిన రాజు?
    – రెండో శాతకర్ణి
  • రెండో శాతకర్ణి శుంగుల రెండో రాజధాని విదిశను జయించాడని పేర్కొనే గ్రంథం?
    – గార్గి సంహిత
  • తన పేరు మీద తొలిసారిగా శాసనాలు వేయించిన శాతవాహన రాజు?
    – మొదటి పులోమావి
  • ఏ రాజు కాలంలో గౌతమీ బాలశ్రీ నాసిక్‌ శాసనం వేయించింది?
    – వాశీష్టపుత్ర పులోమావి
  • నహపాణుడి పునర్ముద్రిత నాణేలు ఎక్కడ లభించాయి?
    – జోగల్‌తంబి
  • ఆంధ్ర రాజులు సుశర్మను చంపి మగధను ఆక్రమించినట్లు పేర్కొనే పురాణం?
    – మత్స్య పురాణం
  • కామర్థకవంశ చష్టానుడు.. వాశీష్ఠపుత్ర పులోమావి సమకాలీనుడు అని తెలిపిన విదేశీ రచయిత?
    – టాలమీ
  • రాజు పేరు ముందు తల్లి నామం పెట్టుకునే ఆచారం ఏ రాజుతో ప్రారంభమైంది?
    – గౌతమీపుత్ర శాతకర్ణి
  • శ్రీముఖుడు మొదట ఆదరించిన మతం?
    – జైన మతం
  • ‘కవి వత్సల’ అనే బిరుదున్న రాజు?
    – హాలుడు
  • శాతవాహన వంశంలో అతి గొప్ప రాజు?
    – గౌతమీపుత్ర శాతకర్ణి
  • శాతవాహనుల కాలంలో రాష్ట్రాలను ఏ పేరుతో పిలిచేవారు?
    – ఆహారము
  • భారత్‌లో తొలిసారిగా బ్రాహ్మణులకు భూ దానాలు ప్రారంభించిన రాజవంశం?
    – శాతవాహనులు
  • నిగమ సభల గురించి వివరిస్తున్న శాసనం?
    – భట్టిప్రోలు
  • శాతవాహనుల కాలంలో గ్రామాలు స్వయం సమృద్ధిగా ఉన్నాయని తెలిపే గ్రంథం?
    – గాథాసప్తశతి
  • అమరావతి స్థూపాన్ని విస్తృతపరిచి, మహాచైత్య వలయాన్ని నిర్మించిన శాతవాహన చక్రవర్తి?
    – యజ్ఞశ్రీ శాతకర్ణి
  • శాతవాహన రాజ్యానికి ప్రధాన ఆదాయ వనరు?
    – భూమి శిస్తు
  • శాతవాహనుల కాలంలో శ్రేణులు అంటే?
    – వృత్తి సంఘాలు
  • శాతవాహనుల కాలంలో నౌకా వాణిజ్యాన్ని ప్రోత్సహించారని పేర్కొన్న శాసనం?
    – గుంటుపల్లి
  • శాతవాహనుల రాజ భాష?
    – ప్రాకృతం
  • సంస్కృతాన్ని రాజభాషగా చేసుకున్న రాజు?
    – కుంతల శాతకర్ణి
  • నాణేలపై ఉజ్జయిని చిహ్నాన్ని ముద్రించిన రాజు?
    – మొదటి శాతకర్ణి
  • సోమదేవసూరి రచించిన కథాసరిత్సాగరం ప్రకారం శాతవాహనుల మూలపురుషుడు?
    – శాతవాహనుడు
  • శాతవాహనుల కాలంలో జనపదాలు అంటే?
    – సామంత రాజ్యాలు
  • శాతవాహనుల శాసనాలు అన్నీ ఏ భాషలో, ఏ లిపిలో ఉన్నాయి?
  • – ప్రాకృత భాషలో, బ్రాహ్మి లిపిలో
  • శాతవాహనుల కాలంలో ప్రసిద్ధి చెందిన కుంద కుందనాచార్యుడు ఏ మతానికి చెందినవాడు?
    – జైనం
  • నాసిక్, కన్హేరి గుహలను బౌద్ధ మతస్తులకు దానం చేసిన శాతవాహన lరాజు?
    – కృష్ణుడు
  • కార్లే గుహలను మహాసాంఘిక బౌద్ధశాఖకు దానం చేసిన రాజు?
    – రెండో పులోమావి
  • అజంతా గుహల్లోని 9, 10 గుహలు ఏ యుగానికి చెందినవి?
    – శాతవాహనులు
  • గాథాసప్తశతిని పోలిన గ్రంథం ‘వజ్జలగ్గ’ను రచించింది?
    – జయవల్లభ
  • శాతవాహనుల కాలంలో రాతిలో తొలిచిన చైత్యం ఎక్కడ ఉంది?
    – గుంటుపల్లి
  • శ్రీ పర్వతం వద్ద శైల మండపాలు నిర్మించిన రాజు?
    – యజ్ఞశ్రీ శాతకర్ణి
  • శాతవాహనుల కాలంలో బౌద్ధ స్థూపాలను వేటితో నిర్మించారు?
    – ఇటుకలు
  • ప్రముఖ బౌద్ధ క్షేత్రంగా విలసిల్లిన శాతవాహనుల రేవు పట్టణం?
    – ఘంటసాల
  • శాతవాహనుల కాలంలో విదేశీ వాణిజ్యాన్ని నిర్వహించిన వర్తకులు?
    – స్థారవాహులు
  • శాతవాహనుల కాలానికి సంబంధించిన రోమ్‌ దేశ నాణేలు ఏ ప్రాంతంలో లభించాయి?
    – కొండాపూర్‌
  • బృహత్కథను గుణాఢ్యుడు ఏ భాషలో రచించాడు?
    – పైశాచీ భాష
  • శాతవాహనుల కాలంలో ఒక సువర్ణ (బంగారు) నాణేనికి ఎన్ని కార్షపణాలు (వెండి)?
    – 1:35 (ఒక బంగారు నాణేనికి 35 కార్షపణాలు)
  • శాతవాహనుల కాలంలో వడ్డీ రేటు?
    – 12 శాతం
  • శాతవాహనుల కాలంలో వృత్తి పన్నులు?
    – కారుకర
  • ఏ శాతవాహన రాజు కాలంలో భాగవత మతం దక్షిణ భారతదేశానికి విస్తరించింది?
    – మొదటి కృష్ణుడు
  • ఆచార్య నాగార్జునుడు రచించిన గ్రంథాలు?
    – సుహృల్లేఖ, ఆరోగ్య మంజరి, ప్రజ్ఞా పారమిత, మాధ్యమిక కారిక
  • బౌద్ధ మతస్తుల కోసం నాగానిక తొలిపించిన గుహలు?
  • – నానాఘాట్‌
  • ‘బెణకటకస్వామి’ అని బిరుదు గల శాతవాహన రాజు?
    – గౌతమీపుత్ర శాతకర్ణి
  • గౌతమీపుత్ర శాతకర్ణి బిరుదులు?
    – శకారి, ఆగమనిలయ, క్షహరాట వంశ నిషేశకర, త్రిసముద్రతోయ పీతవాహన
  • క్రీ.శ.78లో శాలివాహన శకాన్ని ప్రారంభించింది?
    – గౌతమీపుత్ర శాతకర్ణి
ఇక్ష్వాకులు
  • శాసనాల ప్రకారం ఇక్ష్వాకు వంశ మూల పురుషుడు?
    –వాశీష్ఠపుత్ర శ్రీశాంతమూలుడు
  • ఏ రాజును ఓడించి ఇక్ష్వాకులు విజయపురిలో అధికారాన్ని స్థాపించారు?
    –మూడో పులోమావి
  • ఇక్ష్వాకులు స్థానికులు అని వాదించిన చరిత్రకారుడు?
    – కాల్డ్‌వెల్‌
  • ఇక్ష్వాకులు కర్ణాటక ప్రాంతం నుంచి ఆంధ్రకు వలస వచ్చారని పేర్కొన్నవారు?
    – వోగేల్‌
  • శ్రీశాంతమూలుడు ఏ మతాన్ని ఆదరించాడు?
    – వైదిక మతం
  • ఇక్ష్వాకులు ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశానికి వలస వచ్చారని పేర్కొనే పురాణం?
    – విష్ణు పురాణం
  • రెంటాల, దాచేపల్లి, కెసానపల్లి శాసనాలు వేయించిన ఇక్ష్వాక రాజు?
    – శ్రీశాంతమూలుడు
  • శతసహస్రహలక, మహాదానపతి బిరుదులు కలిగిన ఇక్ష్వాక రాజు?
    – శ్రీశాంతమూలుడు
  • ఇక్ష్వాకుల చరిత్రకు మూలాధారాలైన శాసనాలు?
    – నాగార్జునకొండ, జగ్గయ్యపేట, రామిరెడ్డిపల్లి
  • వీరపురుష దత్తుడి కాలంలో మహాచైత్య నిర్మాణానికి ఆయక స్తంభాన్ని ప్రతిష్టించింది ఎవరు? – అడవి శాంతిశ్రీ
  • నాగార్జునకొండ వద్ద చుళ్ల ధర్మగిరిపై చైత్యగృహాన్ని నిర్మించింది?
    – ఉపాసిక బోధిశ్రీ
  • మేనత్త కుమార్తెలను వివాహమాడే సంప్రదాయం ఏ రాజు కాలంలో ప్రారంభమైంది?
    – వీరపురుష దత్తుడు
  • ఏ రాజు కాలాన్ని ఆంధ్రలో బౌద్ధ మతానికి స్వర్ణయుగంగా పేర్కొంటారు?
    – వీరపురుషదత్తుడు
  • రాజు.. శివలింగాన్ని కాలితో తొక్కుతూ, బౌద్ధులకు అభయం ఇస్తున్న శిల్పం ఏ ప్రాంతంలో లభించింది?
    – నాగార్జునకొండ
  • అశ్వమేథయాగం చేసిన ఇక్ష్వాక రాజు?
    – శ్రీశాంతమూలుడు
  • ఇక్ష్వాకుల రాజభాష?
    – ప్రాకృతం
  • ఇక్ష్వాకుల రాజ చిహ్నం?
    – సింహం
  • భారతదేశంలో తొలి వైదిక (హిందూ) దేవాలయాలు నిర్మించిన రాజులు?
    – ఇక్ష్వాకులు
  • ఏ ఇక్ష్వాక రాజు కాలంలో శ్రీ పర్వతం మహాయాన మతానికి పుణ్యక్షేత్రంగా వర్ధిల్లింది?
    – వీరపురుషదత్తుడు
  • దక్షిణ భారతదేశంలో తొలి సంస్కృత శాసనం వేయించిన రాజు?
    – ఎహుబల శాంతమూలుడు
  • ఇక్ష్వాకుల కాలంలో ప్రధాన వృత్తి?
    – వ్యవసాయం
  • హారతి అంటే?
    – చిన్న పిల్లలను రక్షించే దేవత
  • వీరగల్‌ అంటే?
    – యుద్ధంలో మరణించిన వీరుల స్మారక చిహ్నాలు
  • ఇక్ష్వాకుల కాలం నాటి వృత్తి పన్నుల గురించి వివరిస్తున్న శాసనం?
    – విషవట్టి శాసనం
  • ఇక్ష్వాకుల కాలంలో ప్రముఖ వర్తక శ్రేణులు?
    – పర్నిక శ్రేణి, పుసిన శ్రేణి
  • మొదటిసారిగా ఆయా నిర్మాణాలపై శిల్పుల పేర్లు చెక్కే సంప్రదాయం ఎవరి కాలంలో ప్రారంభమైంది?
    – ఇక్ష్వాకులు
Published date : 06 Mar 2017 12:17PM

Photo Stories