ఆంధ్రప్రదేశ్‌లోని పేదరిక నిష్పత్తులు భారతదేశ పేదరిక నిష్పత్తులకు దగ్గరగా ఉన్నాయని అభిప్రాయపడ్డవారు?
1. ఆంధ్రప్రదేశ్‌లోని పేదరిక నిష్పత్తులు భారతదేశ పేదరిక నిష్పత్తులకు దగ్గరగా ఉన్నాయని అభిప్రాయపడ్డవారు?
1) దండేకర్, రత్
2) డాల్టన్, డ్రెజ్
3) మైసర్, పురి
4) క్లెలాండ్, విల్సన్
- View Answer
- సమాధానం: 1
2. ఆంధ్రప్రదేశ్‌లో ‘నిరుద్యోగిత’ ప్రధానంగా ఎక్కడ ఉంది?
1) అసంఘటిత రంగం, గ్రామీణ ప్రాంతాల్లో
2) సంఘటిత రంగం, పట్టణ ప్రాంతాల్లో
3) క్రమపద్ధతి గల, పారిశ్రామిక రంగం
4) క్రమపద్ధతి గల, పారిశ్రామికేతర రంగం
- View Answer
- సమాధానం: 1
3. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు వలసలను నివారించడానికి అవసరమైంది?
1) గ్రామీణ ఆరోగ్య కేంద్రాలు
2) గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ సౌకర్యాలు కల్పించడం
3) ప్రచ్ఛన్న నిరుద్యోగిత తగ్గించడం
4) ద్రవ్యోల్బణ నియంత్రణ
- View Answer
- సమాధానం: 2
4. నాబార్డ్ (NABARD) ఒక?
1) సహకార బ్యాంకు
2) రిజర్వ బ్యాంక్ అనుబంధ సంస్థ
3) ప్రైవేటు బ్యాంక్
4) స్వయం ప్రతిపత్తి గల ప్రభుత్వ రంగ సంస్థ
- View Answer
- సమాధానం: 2
5. కిందివాటిలో సరైన వాక్యం ఏది?
i) రాష్ర్టంలో పారిశ్రామిక గణాంకాలకు ‘పరిశ్రమల వార్షిక సర్వే’ (Annual survey of industries) ముఖ్యమైన ఆధారం
ii) రాష్ర్ట ఆదాయానికి మొత్తం మాన్యుఫ్యాక్చరింగ్ పరిశ్రమలతో పాటు ఒక్కో పరిశ్రమ అందించిన వాటాను అంచనా వేయడం
iii) ఇటీవలి పరిశ్రమల వార్షిక సర్వే ప్రకారం ఫ్యాక్టరీల సంఖ్య 12.09% వృద్ధిచెందింది.
iv) రాష్ర్టంలో పరిశ్రమలు కల్పించే ఉపాధిలో వృద్ధి ఉంది
1) i, ii
2) i, iii
3) i, ii, iii
4) i, ii, iii, iv
- View Answer
- సమాధానం: 4
6. ఆంధ్రప్రదేశ్‌లో గ్రామీణ పేదరిక నిర్మూలన కార్యక్రమాలను అమలు చేసే సంస్థ ఏది?
1) SERP (సెర్ప్)
2) MEPMA (మెప్మా)
3) ATMA (ఆత్మ)
4) పైవేవీ కావు
- View Answer
- సమాధానం: 1
7. కిందివాటిలో సరైన జత ఏది?
1) లాజిస్టిక్ యూనివర్సిటీ - కాకినాడ
2) పెట్రోలియం యూనివర్సిటీ - విజయవాడ
3) నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ - నెల్లూరు
4) గిరిజన విశ్వవిద్యాలయం - విజయనగరం
- View Answer
- సమాధానం: 2
8. ‘ఆంధ్రప్రదేశ్ భూ గరిష్ట పరిమితి చట్టం’ను ఎప్పుడు చేశారు?
1) మొదటిసారి 1961, రెండోసారి 1973
2) మొదటిసారి 1963, రెండోసారి 1975
3) మొదటిసారి 1967, రెండోసారి 1987
4) మొదటిసారి 1962, రెండోసారి 1971
- View Answer
- సమాధానం: 1
9. ‘డ్వాక్రా’ పథకానికి సంబంధించి కిందివాటిలో సరైంది ఏది?
i) డ్వాక్రాను 1982 సెప్టెంబర్‌లో ప్రారంభించారు
ii) ఇది గ్రామీణ మహిళల పేదరిక నిర్మూలనకు కృషి చేస్తోంది
iii) మహిళల్లో వ్యవస్థాపక నైపుణ్యాలు పెంచడానికి డ్వాక్రా శిక్షణ ఇస్తోంది
1) i మాత్రమే
2) i, iii
3) ii, iii
4) i, ii, iii
- View Answer
- సమాధానం: 4
10.దేశంలోనే తొలిసారిగా ‘ఈ - కేబినెట్’ను నిర్వహించిన రాష్ట్రం ఏది?
1) ఆంధ్రప్రదేశ్
2) తెలంగాణ
3) మహారాష్ర్ట
4) కర్ణాటక
- View Answer
- సమాధానం: 1
11. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థలోని ‘అల్ప ఉద్యోగిత’ను ఏ విధంగా పిలుస్తారు?
1) వ్యవస్థాపక నిరుద్యోగిత
2) సంఘృష్ట నిరుద్యోగిత
3) ప్రచ్ఛన్న నిరుద్యోగిత
4) తక్కువ వేతన నిరుద్యోగిత
- View Answer
- సమాధానం: 3
12. ప్రభుత్వం ఏ నిల్వలు పెంచడానికి రైతుల నుంచి ‘సేకరణ ధర’ ద్వారా ధాన్యాన్ని కొనుగోలు చేస్తోంది?
1) అవసరమైన నిల్వలు
2) కనిష్ట నిల్వలు
3) భవిష్యత్తు నిల్వలు
4) మిగులు నిల్వలు
- View Answer
- సమాధానం: 2
13. కింద పేర్కొన్న ఏ విభాగంలోని ప్రతి వెయ్యి మందిలోని నిరుద్యోగుల సంఖ్యను ‘నిరుద్యోగిత’ అంటారు?
1) మొత్తం జనాభా
2) ప్రభుత్వ రంగం
3) శ్రామిక శక్తి
4) ప్రైవేటు రంగం
- View Answer
- సమాధానం: 3
14.‘సేకరణ ధర’లతో రైతుల నుంచి వివిధ పంట ఉత్పత్తులను కొనుగోలు చేసి, అధిక నిల్వలు చేయడం ద్వారా ప్రభుత్వం దేన్ని నియంత్రిస్తుంది?
1) ధరల పెరుగుదల
2) అధిక డిమాండ్
3) ధరల తగ్గుదల
4) చీకటి బజారు
- View Answer
- సమాధానం: 4
15. ‘కిసాన్ క్రెడిట్ కార్డ్' ఉన్నవారికి పరపతి సమకూర్చేవి?
1) వాణిజ్య బ్యాంకులు
2) ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు
3) సహకార పరపతి సంఘాలు
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
16. హరిత విప్లవ ప్రయోజనాలు కొన్ని ప్రాంతాలకే పరిమితం కావడానికి కారణం ఏమిటి?
1) అధిక దిగుబడి రకాల వంగడాల లభ్యత
2) నీటి పారుదల సౌకర్యాలు
3) రసాయన ఎరువుల లభ్యత
4) పంటల మార్పిడి
- View Answer
- సమాధానం: 2
17. జతపరచండి.
రైతులు
A) ఉపాంత రైతు
B) చిన్నకారు రైతు
C) సన్నకారు రైతు
D) మధ్యస్థ రైతు
భూ పరిమాణం
i) 2.5 ఎకరాలు
ii) 2.5 - 5 ఎకరాలు
iii) 5 -10 ఎకరాలు
iv) 10 - 25 ఎకరాలు
1) A- i, B - ii, C - iii, D - iv
2) A- ii, B - iii, C - iv, D - i
3) A- iii, B - iv, C - ii, D - i
4) A- iv, B - iii, C - i, D - ii
- View Answer
- సమాధానం: 1
18. జతపరచండి.
A) మామిడి పరిశోధనా కేంద్రం
B) ఉల్లిపాయల పరిశోధనా కేంద్రం
C) చెరకు పరిశోధనా కేంద్రం
D) మిర్చి పరిశోధనా కేంద్రం
i) నూజివీడు (కృష్ణా)
ii) ఎర్రగుంట్ల (కడప)
iii) అనకాపల్లి (విశాఖపట్నం)
iv) లాం (గుంటూరు)
1) A - iv, B - iii, C - ii, D - i
2) A - iv, B - iii, C - i, D - ii
3) A - i, B - iv, C - iii, D - ii
4) A - i , B - ii, C - iii, D - iv
- View Answer
- సమాధానం: 4
19. అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలో ‘విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి’ విధానం విదేశీ పెట్టుబడులకు ఒక ప్రధాన మార్గం. దీని ద్వారా దేశంలోకి మూలధనం, సాంకేతిక పరిజ్ఞానాన్ని రప్పించడంతోపాటు దేన్ని పెంచుతుంది?
1) వడ్డీ చెల్లింపులు
2) ఆర్థిక వృద్ధి
3) పోటీతత్వం
4) రుణభారం
- View Answer
- సమాధానం: 2
20.ప్రసూతి మరణాల రేటును దేని ఆధారంగా లెక్కిస్తారు?
1) లక్ష జీవిత జననాలు
2) వెయ్యి జీవిత జననాలు
3) వెయ్యి మరణాలు
4) లక్ష మరణాలు
- View Answer
- సమాధానం: 1
21. మహిళలకు ‘దీపం’ పథకం (గ్యాస్ పొయ్యి కనెక్షన్)ను తొలిసారిగా ఎప్పుడు అమలు చేశారు?
1) 1999
2) 2000
3) 2001
4) 2015
- View Answer
- సమాధానం: 1
22. ‘అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్’ను ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు?
1) అమరావతి
2) తాడేపల్లిగూడెం
3) కర్నూలు
4) విశాఖపట్నం
- View Answer
- సమాధానం:1
23. ‘అల్లూరి సీతారామరాజు మెమోరియల్ ట్రైబల్ మ్యూజియం’ను ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు?
1) విజయవాడ
2) విశాఖపట్నం
3) శ్రీకాకుళం
4) రాజమండ్రి
- View Answer
- సమాధానం: 2
24. ‘డాక్టర్ అబ్దుల్ హక్ ఉర్దూ యూనివర్సిటీ’ని ఎక్కడ ఏర్పాటు చేశారు?
1) కర్నూలు
2) కడప
3) చిత్తూరు
4) అనంతపురం
- View Answer
- సమాధానం: 1
25. ‘శ్రీని ఫుడ్ పార్క్’ ఏ జిల్లాలో ఉంది?
1) గుంటూరు
2) చిత్తూరు
3) కడప
4) కృష్ణా
- View Answer
- సమాధానం: 2
26. ఏపీ విజన్ - 2029 ప్రకారం కిందివాటిలో సరైన వాక్యాన్ని గుర్తించండి.
i) 2029 నాటికి ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ఉత్తమ రాష్ర్టంగా ఉండాలి
ii) 2022 నాటికి అద్భుతమైన ప్రతిభను కనబరిచే మొదటి మూడు రాష్ట్రాల్లో ఒకటిగా నిలవడం
iii) 2050 నాటికి ఆంధ్రప్రదేశ్‌ను ప్రపంచ గమ్యస్థానంగా నిలపడం
1) i, ii
2) ii, iii
3) i, iii
4) i, ii, iii
- View Answer
- సమాధానం: 4
27.ప్రణాళిక సంఘం తాజా నివేదిక ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పేదరికం వరసగా?
1) 10.96%, 5.81%
2) 12.97%, 6.84%
3) 14.97%, 7.68%
4) 8.94%, 10.96%
- View Answer
- సమాధానం: 1
28. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డ్వాక్రా సభ్యుల కోసం ‘డిజిటల్ అక్షరాస్యత’ కార్యక్రమాన్ని ఎప్పుడు ప్రారంభించింది?
1) 2015 అక్టోబర్ 19
2) 2015 డిసెంబర్ 19
3) 2015 నవంబర్ 19
4) 2015 సెప్టెంబర్ 19
- View Answer
- సమాధానం: 3
29. 2011 జనాభా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో నివసిస్తున్న గ్రామీణ ప్రాంత ప్రజలు మొత్తం జనాభాలో ఎంత శాతం ఉన్నారు?
1) 68.76%
2) 69.67%
3) 71.53%
4) 70.53%
- View Answer
- సమాధానం: 4
30. రుణాల కంటే డిపాజిట్లు ఎక్కువగా ఉండటాన్ని సూచించేది?
1) మూలధన పెరుగుదల
2) పెట్టుబడి పెరుగుదల
3) పరపతి సృష్టి
4) వినియోగ పెంపుదల
- View Answer
- సమాధానం: 3
31. 1960-61లో సాంద్ర వ్యవసాయ అభివృద్ధి కార్యక్రమాన్ని ఏ జిల్లాలో ప్రవేశపెట్టారు?
1) కృష్ణా
2) తూర్పుగోదావరి
3) గుంటూరు
4) పశ్చిమ గోదావరి
- View Answer
- సమాధానం: 4
32. రోడ్లు, గిడ్డంగుల నిర్మాణం, మత్స్య పరిశ్రమ, అడవులు, నీటి పారుదల సౌకర్యాల అభివృద్ధి పనులకు రుణాలు సమకూర్చేవి?
1) గ్రామీణ అవస్థాపన అభివృద్ధి నిధి
2) ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు
3) ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు
4) ఏదీకాదు
- View Answer
- సమాధానం: 1
33. బ్రిటిష్ కాలంలో రవాణా సౌకర్యాలను అభివృద్ధి చేయడం వల్ల త్వరితంగా క్షీణించింది?
1) హస్తకళల పరిశ్రమ
2) చేనేత పరిశ్రమ
3) జౌళి పరిశ్రమ
4) జనపనార పరిశ్రమ
- View Answer
- సమాధానం: 1
34.RAGAను విస్తరించండి.
1) రాష్ట్రీయ గ్రామీణ అభివృద్ధి సమాచారం
2) రాష్ట్రీయ గిరిజనుల అభివృద్ధి సమాచారం
3) రాష్ట్రీయ గ్రామీణ అల్పాదాయ వర్గాల సమాచారం
4) రాష్ట్రీయ గిరిజనుల అధికారిక సమాచారం
- View Answer
- సమాధానం: 1
35. ‘ఎన్టీఆర్ జలసిరి’ ద్వారా ఎన్ని లక్షల ఎకరాలకు సాగునీటి వసతి కల్పించనున్నారు?
1) 3.31
2) 2.31
3) 4.31
4) 5.31
- View Answer
- సమాధానం: 2
36.సెర్ప్ (SERP) ఏ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది?
1) ఆర్థిక శాఖ
2) గ్రామీణాభివృద్ధి శాఖ
3) కార్మిక శాఖ
4) వ్యవసాయ శాఖ
- View Answer
- సమాధానం: 2
37. ఆంధ్రప్రదేశ్‌లో ‘లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ టెర్మినల్’ను ఏ రేవు వద్ద ప్రారంభించనున్నారు?
1) గంగవరం
2) కాకినాడ
3) రావ పోర్టు
4) భావనపాడు పోర్టు
- View Answer
- సమాధానం: 1
38.రాగి, వెండి, జింక్‌ల మైనింగ్‌కు ప్రసిద్ధి చెందిన జిల్లా ఏది?
1) విశాఖపట్నం
2) శ్రీకాకుళం
3) కడప
4) గుంటూరు
- View Answer
- సమాధానం: 4
39. ఒక మెగా ప్రాజెక్టులో పెట్టుబడి, ఉద్యోగిత (ఎంప్లాయ్మెంట్)లు వరసగా?
1) రూ. 600 కోట్లు, 3000 వ్యక్తులు
2) రూ. 700 కోట్లు, 4000 వ్యక్తులు
3) రూ. 800 కోట్లు, 5000 వ్యక్తులు
4) రూ. 500 కోట్లు, 2000 వ్యక్తులు
- View Answer
- సమాధానం: 4
40. ప్రచ్ఛన్న నిరుద్యోగం అంటే?
1) మహిళల నిరుద్యోగిత
2) 60 ఏళ్ల పైబడినవారి నిరుద్యోగిత
3) ఉద్యోగం లేని వ్యక్తులు
4) తక్కువ మంది కావలసిన పనిలో ఎక్కువ మంది పని చేయడం
- View Answer
- సమాధానం: 4
41. ఆంధ్రప్రదేశ్‌లో రైతు బజార్ల ముఖ్య లక్ష్యం ఏమిటి?
1) గుణాత్మక వస్తువుల అమ్మకం
2) తక్కువ ధరలకు కూరగాయల అమ్మకం
3) దళారుల తొలగింపు
4) అమ్మకాలపై ఆంక్షల తగ్గింపు
- View Answer
- సమాధానం: 3
42. ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో పంచవర్ష ప్రణాళికల విజయం దేని పనితీరుపై ఎక్కువగా ఆధారపడి ఉంటుంది?
1) సేవల రంగం
2) పారిశ్రామిక రంగం
3) ఎగుమతుల రంగం
4) వ్యవసాయ రంగం
- View Answer
- సమాధానం: 4
43. కేంద్ర ప్రణాళిక సంఘం అనుమతి కోసం రాష్ర్ట ‘పంచవర్ష ప్రణాళిక ముసాయిదా’ను సమర్పించేది?
1) ఆర్థిక మంత్రి
2) ముఖ్యమంత్రి
3) రెవెన్యూ మంత్రి
4) రాష్ర్ట ప్రణాళిక సంఘం కార్యదర్శి
- View Answer
- సమాధానం: 2
44. 2011 జనాభా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో స్త్రీ, పురుష నిష్పత్తి?
1) 980 : 1000
2) 990 : 1000
3) 997 : 1000
4) 987 : 1000
- View Answer
- సమాధానం: 3