Indian Polity Quiz: భారతదేశంలో మొదటి భాషాప్రయుక్త రాష్ట్రం ఏది?
1. భారతదేశంలో మొదటి భాషాప్రయుక్త రాష్ర్టం ఏది?
ఎ) ఆంధ్రరాష్ర్టం
బి) తమిళనాడు
సి) పంజాబ్
డి) గుజరాత్
- View Answer
- సమాధానం: ఎ
2. శ్రీబాగ్ ఒప్పందం ఎవరి మధ్య కుదిరింది?
ఎ) ఆంధ్ర-తెలంగాణ నాయకులు
బి) రాయలసీమ-ఆంధ్ర నాయకులు
సి) ఆంధ్ర-మద్రాస్ రాష్ర్ట నాయకులు
డి) పైవారందరి మధ్య
- View Answer
- సమాధానం: బి
3. భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు కమిటీ అనేది రాజ్యాంగ పరిషత్ ఉప సంఘం. దీని అధ్యక్షుడిగా ఎవరు పనిచేశారు?
ఎ) ధార్
బి) హెచ్.సి.ముఖర్జీ
సి) నెహ్రూ, పటేల్, రాజేంద్రప్రసాద్
డి) ఫజల్ అలీ
- View Answer
- సమాధానం: ఎ
4. రాష్ట్ట్రాల సరిహద్దులను మార్పు చేసే అధికారం పార్లమెంట్‌కు ఏ విధంగా ఉంది?
ఎ) రాష్ట్రాల విన్నపం మేరకు
బి) విదేశీ దురాక్రమణ కారణంగా
సి) రాష్ట్రాల సమ్మతి లేకుండానే
డి) రాష్ట్రాల సమ్మతితో
- View Answer
- సమాధానం: సి
5. కింద ఇచ్చిన వారిలో పెద్దమనుషుల ఒప్పందంలో పాల్గొనని తెలంగాణ నాయకుడు?
ఎ) మర్రి చెన్నారెడ్డి
బి) పి.వి.నరసింహారావు
సి) జె.వి.నరసింగరావు
డి) కె. వెంకట రంగారెడ్డి
- View Answer
- సమాధానం: బి
6. ఆంధ్ర, తెలంగాణ నాయకుల మధ్య పెద్దమనుషుల ఒప్పందం ఎప్పుడు కుదిరింది?
ఎ) ఫిబ్రవరి-1955
బి) ఫిబ్రవరి-1956
సి) మార్చి-1955
డి) నవంబర్-1956
- View Answer
- సమాధానం: బి
7. నీలం సంజీవరెడ్డి మంత్రివర్గంలో స్థానిక పాలన (పంచాయతీరాజ్) మంత్రిగా పని చేసి తర్వాత ముఖ్యమంత్రి అయినవారు?
ఎ) పి.వి.నరసింహారావు
బి) బూర్గుల రామకృష్ణరావు
సి) కాసు బ్రహ్మనందరెడ్డి
డి) జలగం వెంగళరావు
- View Answer
- సమాధానం: సి
8. కింది వాటిలో సరైంది?
ఎ) అక్టోబర్ 1, 1953న ఆంధ్ర రాష్ర్ట్టం ఏర్పడింది
బి) ఆంధ్ర రాష్ర్ట శాసన సభ మొదటి స్పీకర్ - వెంకట్రామయ్య
సి) ఆంధ్ర రాష్ర్ట రాజధాని-కర్నూలు
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి
9. ఆంధ్ర రాష్ర్ట మొదటి ముఖ్యమంత్రి?
ఎ) బెజవాడ గోపాల్ రెడ్డి
బి) కె.వి.రంగారెడ్డి
సి) నీలం సంజీవరెడ్డి
డి) టంగుటూరి ప్రకాశం పంతులు
- View Answer
- సమాధానం: డి
10. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ ప్రాంతానికి చెందిన తొలి ముఖ్యమంత్రి ఎవరు?
ఎ) మర్రి చెన్నారెడ్డి
బి) పి.వి.నరసింహారావు
సి) జలగం వెంగళరావు
డి) టంగుటూరి అంజయ్య
- View Answer
- సమాధానం: బి
11. పూర్తికాలం ముఖ్యమంత్రిగా పని చేసిన ఏకైక తెలంగాణ వ్యక్తి ఎవరు?
ఎ) పి.వి.నరసింహారావు
బి) మర్రి చెన్నారెడ్డి
సి) టి.అంజయ్య
డి) జలగం వెంగళరావు
- View Answer
- సమాధానం: డి
12. కింది వారిలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా పని చేయని వారు?
ఎ) కె.వి.రంగారెడ్డి
బి) జె.వి.నరసింహారావు
సి) కొనేరు రంగారావు
డి) మర్రి చెన్నారెడ్డి
- View Answer
- సమాధానం: బి
13. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొదటి హోంశాఖ మంత్రి ఎవరు?
ఎ) బెజవాడ గోపాల్‌రెడ్డి
బి) కె.వి.రంగారెడ్డి
సి) కళా వెంకట్రావ్
డి) కల్లూరి సుబ్బారావు
- View Answer
- సమాధానం: ఎ
14. హైదరాబాద్ రాష్ర్ట ఏకైక స్పీకర్?
ఎ) కాశీనాథరావు వైద్య
బి) సాలార్ జంగ్
సి) మాడపాటి హనుమంతరావు
డి) పై ఎవరు కాదు
- View Answer
- సమాధానం: ఎ
15. ప్రత్యేక తెలంగాణ రాష్ర్ట సాధన కోసం కొండా లక్ష్మణ్ బాపూజీ ఎవరి మంత్రివర్గం నుంచి తప్పుకున్నారు?
ఎ) నీలం సంజీవరెడ్డి
బి) కాసు బ్రహ్మానందరెడ్డి
సి) దామోదరం సంజీవయ్య
డి) పి.వి.నరసింహారావు
- View Answer
- సమాధానం: బి
16. కింది వాటిలో సరికాని జత?
ఎ) ప్రాథమిక హక్కులు - అమెరికా
బి) సమాఖ్య ప్రభుత్వం - బ్రిటన్
సి) కాగ్ వ్యవస్థ - బ్రిటన్
డి) ఆదేశిక సూత్రాలు - ఐర్లాండ్
- View Answer
- సమాధానం: బి
17. తెలంగాణలో నిర్మితమైన మొదటి రైలు మార్గం?
ఎ) సికింద్రాబాద్ - వాడి
బి) సికింద్రాబాద్ - గుల్బర్గా
సి) కాచిగూడ - మహబూబ్‌నగర్
డి) కాచిగూడ - వరంగల్
- View Answer
- సమాధానం: ఎ
18. సింగరేణి కాలరీస్‌ను ఎప్పుడు స్థాపించారు?
ఎ) 1921
బి) 1890
సి) 1937
డి) 1943
- View Answer
- సమాధానం: ఎ
19. ‘ఆంధ్రుల సాంఘిక చరిత్ర’ గ్రంథ రచయిత?
ఎ) మాడపాటి హన్మంతరావు
బి) బూర్గుల రామకృష్ణ్ణారావు
సి) సురవరం ప్రతాపరెడ్డి
డి) రావి నారాయణరెడ్డి
- View Answer
- సమాధానం: సి
20. తెలుగు భాషా సాహిత్యాల అభివృద్ధి కోసం ఆంధ్ర సారస్వత పరిషత్‌ను ఎప్పడు స్థాపించారు?
ఎ) 1923
బి) 1943
సి) 1947
డి) ఏదీకాదు
- View Answer
- సమాధానం: బి
21. మహ్మదీయులను ఏకం చేసి వారి అభివృద్ధికి కృషి చేసేందుకు ‘ఇత్తెహాదుల్ ముస్లిమీన్’ను ఎప్పుడు స్థాపించారు?
ఎ) 1927
బి) 1944
సి) 1952
డి) 1957
- View Answer
- సమాధానం: ఎ
22. తెలంగాణ ప్రాంతంలో దళిత ఉద్యమాలకు ఆద్యుడు?
ఎ) భాగ్యరెడ్డి వర్మ
బి) అరిగె రామస్వామి
సి) బి.యస్.వెంకట్రావ్
డి) సంగం లక్ష్మీభాయి
- View Answer
- సమాధానం: ఎ
23. నిజాం ప్రభుత్వంపై సర్దార్ పటేల్ చొరవతో భారత సైన్యం జరిపిన సైనిక చర్య?
ఎ) ఆపరేషన్ పోలో
బి) ఆపరేషన్ బ్లూస్టార్
సి) ఆపరేషన్ పీస్
డి) ఆపరేషన్ డిజాస్టర్
- View Answer
- సమాధానం: ఎ
24. హైదరాబాద్ రాష్ర్ట ఆవిర్భావం?
ఎ) 1-10-1953
బి) 17-9-1948
సి) 17-9-1952
డి) 17-9-1949
- View Answer
- సమాధానం: బి
25. నిజాం ప్రభుత్వంపై జరిపిన ‘ఆపరేషన్ పోలో’కు ఎవరు నాయకత్వం వహించారు?
ఎ) జనరల్ కరియప్ప
బి) జనరల్ మెనేక్ష
సి) మేజర్ జనరల్ జె.యస్.చౌదరి
డి) ఎవరూ కాదు
- View Answer
- సమాధానం: సి
26. ప్రభుత్వ ఉద్యోగాలలో హైదరాబాదీలకు ప్రాధాన్యం కల్పిస్త్తూ ‘ముల్కీ’ నిబంధనలను ఎప్పుడు ప్రవేశ పెట్టారు?
ఎ) 1910
బి) 1919
సి) 1927
డి) 1952
- View Answer
- సమాధానం: బి
27. 1953 డిసెంబర్ 22న ఏర్పాటైన రాష్ట్రాల పునర్విభజన కమిటీ అధ్యక్షుడెవరు?
ఎ) జస్టిస్ సర్కారియా
బి) జస్టిస్ ఫజల్ అలీ
సి) జస్టిస్ శ్రీకృష్ణ
డి) జస్టిస్ వర్మ
- View Answer
- సమాధానం: బి
28. 1958లో ఏర్పాటైన తెలంగాణ ప్రాంతీయ కమిటీ మొదటి అధ్యక్షుడు ఎవరు?
ఎ) మొయినుద్దీన్
బి) అచ్యుతరెడ్డి
సి) జగన్నాథరావు
డి) హయగ్రీవాచారి
- View Answer
- సమాధానం: బి
29. తెలంగాణ రాష్ర్ట సమితి(టీఆర్ఎస్) పార్టీని ఎప్పుడు స్థాపించారు?
ఎ) 1999
బి) 2001
సి) 2003
డి) 2006
- View Answer
- సమాధానం: బి
30. రాజ్యాంగ ప్రవేశికను ఏ దేశ రాజ్యాంగం నుంచి గ్రహించారు?
ఎ) బ్రిటన్
బి) అమెరికా
సి) కెనడా
డి) దక్షిణాఫ్రికా
- View Answer
- సమాధానం: బి
31. 1971 లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలోని లోక్‌సభ స్థానాల్లో తెలంగాణ ప్రజా సమితి ఎన్ని స్థానాలను నెగ్గింది?
ఎ) 8
బి) 9
సి) 11
డి) 13
- View Answer
- సమాధానం: డి
32. ఉమ్మడి రాష్ర్టంలో మొదటిసారిగా రాష్ర్టపతి పాలనను ఎప్పుడు విధించారు?
ఎ) 1969
బి) 1971
సి) 1973
డి) 1975
- View Answer
- సమాధానం: సి
33. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి 1973లో ఎన్నో రాజ్యాంగ సవరణ ద్వారా ఆరు సూత్రాల పథకాన్ని ప్రవేశపెట్టారు?
ఎ) 29వ సవరణ
బి) 30వ సవరణ
సి) 32వ సవరణ
డి) 36వ సవరణ
- View Answer
- సమాధానం: సి
34. తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్‌గా ఎవరు వ్యవహరించారు?
ఎ) స్వామిగౌడ్
బి) శ్రీనివాస్‌గౌడ్
సి) ఆచార్య కోదండరామ్
డి) రసమయి బాలకిషన్
- View Answer
- సమాధానం: సి
35. శ్రీకృష్ణ కమిటీలో సభ్యుడు కానివారు?
ఎ) ప్రొఫెసర్ రవిందర్ కౌర్
బి) ప్రొఫెసర్ వి.కె.దుగ్గల్
సి) ప్రొఫెసర్ రణబీర్ సింగ్
డి) జస్టిస్ వర్మ
- View Answer
- సమాధానం: డి
36. తెలంగాణ లోక్‌సభ, రాజ్యసభ స్థానాల సంఖ్య?
ఎ) 10,5
బి) 17,7
సి) 15,8
డి) 20,10
- View Answer
- సమాధానం: బి
37. తెలంగాణ విధాన సభ, విధాన పరిషత్ సభ్యుల సంఖ్య?
ఎ) 130, 50
బి) 120, 45
సి) 119, 40
డి) 119, 50
- View Answer
- సమాధానం: సి
38. తెలంగాణ లోక్‌సభ స్థానాల్లో ఎస్సీ, ఎస్టీలకు ఎన్ని సీట్లు కేటాయించారు?
ఎ) 6, 3
బి) 7, 3
సి) 3, 2
డి) 3, 3
- View Answer
- సమాధానం: సి
39. తెలంగాణ విధాన సభలో ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేకంగా కేటాయించిన సీట్లెన్ని?
ఎ) 20, 10
బి) 19, 12
సి) 15, 10
డి) 30, 15
- View Answer
- సమాధానం: బి
40. తెలంగాణ సాధన కోసం హైదరాబాద్‌లో మిలియన్ మార్చ్ ఎప్పుడు నిర్వహించారు?
ఎ) 10-3-2011
బి) 10-3-2012
సి) 13-4-2011
డి) 2-5-2011
- View Answer
- సమాధానం: ఎ
41. రాజ్యాంగం అంటే?
ఎ) ప్రజలకు, ప్రభుత్వానికి మధ్యనున్న సంబంధాన్ని తెలియజేసే శాసనం
బి) దేశ పరిపాలన విధానానికి మూల శాసనం
సి) రాజ్యాధికారాన్ని నియంత్రించి వ్యక్తి స్వేచ్ఛను కాపాడే శాసనం
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి
42.ఏ చట్టం ద్వారా విద్య అభివృద్ధి కోసం బడ్జెట్లో లక్ష రూపాయలు కేటాయించారు?
ఎ) 1773 రెగ్యులేటింగ్ చట్టం
బి) 1813 చార్టర్ చట్టం
సి) 1833 చార్టర్ చట్టం
డి) 1853 చార్టర్ చట్టం
- View Answer
- సమాధానం: బి
43. ఏ చట్టం ద్వారా బ్రిటన్‌లో భారత వ్యవహరాల కార్యదర్శి పదవిని ఏర్పాటు చేశారు?
ఎ) 1858 విక్టోరియా మహారాణి ప్రకటన
బి) 1861 కౌన్సిల్స్ చట్టం
సి) 1892 కౌన్సిల్స్ చట్టం
డి) 1909 మింటో-మార్లె సంస్కరణల చట్టం
- View Answer
- సమాధానం: ఎ
44. 1919 మాంటెంగ్-చేమ్స్‌ఫర్‌డ సంస్కరణల చట్టానికి సంబంధించి సరికానిది?
ఎ) ద్వంద పాలన ప్రవేశపెట్టడం
బి) కేంద్రంలో ద్విసభ విధానం ప్రవేశ పెట్టడం
సి) సీఏజీ(కాగ్) వ్యవస్థను ప్రవేశపెట్టడం
డి) అడ్వకేట్ జనరల్ పదవి ఏర్పాటు
- View Answer
- సమాధానం: డి
45. షెడ్యూల్డ్ కులాలు అనే పదాన్ని తొలిసారిగా ఎక్కడ ఉపయోగించారు?
ఎ) సైమన్ కమిషన్
బి) రౌండ్ టేబుల్ సమావేశాలు
సి) కమ్యూనల్ అవార్డు
డి) పుణే ఒప్పందం
- View Answer
- సమాధానం: ఎ
46. కింది వాటిలో ఏ చట్టాన్ని భారత రాజ్యాంగ ‘మాగ్నాకార్టా’గా పేర్కొంటారు?
ఎ) 1909 మింటో-మార్లే చట్టం
బి) 1919 మాంటెంగ్-చేమ్స్‌ఫర్డ్ చట్టం
సి) 1935 భారత ప్రభుత్వ చట్టం
డి) పై ఏవీ కాదు
- View Answer
- సమాధానం: సి
47. రాజ్యాంగ పరిషత్ ఉపాధ్యక్షుడెవరు?
ఎ) వి.టి.కృష్ణమాచారి
బి) టి.టి.కృష్ణమాచారి
సి) కె.ఎం.మున్షీ
డి) సర్దార్ పటేల్
- View Answer
- సమాధానం: ఎ