ఉప్పు సత్యాగ్రహం ఉద్యమం సందర్భంగా బాల్యంలో ఇందిరాగాంధీ ఏర్పాటు చేసిన బాలికల బృందం పేరు?
1. 1928లో మద్రాస్ నగరంలో సైమన్ కమిషన్‌కు నిరసనగా జరిగిన నల్లజెండా ప్రదర్శనకు నాయకత్వం వహించింది ఎవరు?
1) బండారు అచ్చమాంబ
2) సరోజినీ నాయుడు
3) కొమర్రాజు అచ్చమాంబ
4) సరళాదేవి
- View Answer
- సమాధానం: 3
2. ఉప్పు సత్యాగ్రహం ఉద్యమం సందర్భంగా బాల్యంలో ఇందిరాగాంధీ ఏర్పాటు చేసిన బాలికల బృందం పేరు?
1) వానర సేన
2) మంజీర సేన
3) శాంతి సేన
4) వీర సేన
- View Answer
- సమాధానం: 2
3. ‘భారతదేశ విప్లవోద్యమ మాత’ అని ఎవరిని పేర్కొంటారు?
1) అరుణా అసఫ్ అలీ
2) నళినీ సేన్ గుప్తా
3) మేడం కామా
4) కాదింబినీ గంగూలీ
- View Answer
- సమాధానం: 3
4. 1910లో అలహాబాద్‌లో ‘భారత్ స్త్రీ మహా మండలి’ని స్థాపించిందెవరు?
1) సరళాదేవి చౌధురాణి
2) ప్రీతిలతా వడ్డేకర్
3) స్వర్ణ కుమారీ దేవి
4) అరుణా అసఫ్ అలీ
- View Answer
- సమాధానం: 1
5. కింది వారిలో రాణి రుద్రమదేవి సంతానం కాని వారు?
1) ముప్పమాంబ
2) ముమ్ముడమ్మ
3) రుయ్యమ
4) రుద్రమ
- View Answer
- సమాధానం: 1
6.డోనా గంగూలీ ఏ నాట్యంలో దిట్ట?
1) కూచిపూడి
2) భరత నాట్యం
3) ఒడిస్సీ
4) కథాకళి
- View Answer
- సమాధానం: 3
7. ‘నర్మదా బచావో’ ఆందోళనోద్యమకారిణి ఎవరు?
1) తంగజం మనోరమ
2) మేథా పాట్కర్
3) తారాబాయి షిండే
4) ఆరతి సాహ
- View Answer
- సమాధానం: 2
8. జతపరచండి.
జాబితా-I
i) బేగం అక్తర్
ii) దేవికా రాణి
iii) భాను అతయ
iv) సురభి కమలబాయి
జాబితా-II
a) ఆస్కార్ అవార్డ పొందిన తొలి భారతీయ వనిత
b) తొలి తెలుగు కథా నాయకి
c) దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పొందిన తొలి నటి
d) గజల్, ఠుమ్రీలు గానం చేసే కళాకారిణి
1) i-b, ii-a, iii-d, iv-c
2) i-c, ii-b, iii-d, iv-a
3) i-d, ii-c, iii-a, iv-b
4) i-a, ii-b, iii-c, iv-d
- View Answer
- సమాధానం: 3
9. అరుంధతీ రాయ్ రాసిన ‘ద గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స’ రచనకు ఏ సంవత్సరంలో బుకర్ ప్రైజ్ లభించింది?
1) 1997
2) 1999
3) 2001
4) 2002
- View Answer
- సమాధానం: 1
10. కింది వాటిలో సరికాని జత ఏది?
1) కరణం మల్లీశ్వరి - క్రీడారంగం
2) మహాశ్వేతాదేవి - సాహిత్య రంగం
3) సునీతా విలియమ్స్ - శాస్త్ర సాంకేతిక రంగం
4) శాంతా సిన్హా - నాటకరంగం
- View Answer
- సమాధానం: 4
11. భారతదేశంలో హైకోర్టు తొలి మహిళా న్యాయమూర్తి లీలాసేథ్ ఏ హైకోర్టులో విధులు నిర్వహించారు?
1) ఢిల్లీ హైకోర్టు
2) కలకత్తా హైకోర్టు
3) మద్రాస్ హైకోర్టు
4) అలహాబాద్ హైకోర్టు
- View Answer
- సమాధానం: 1
12. జతపరచండి.
రాజు:
i) శ్రీకృష్ణ దేవరాయలు
ii) రాజరాజ నరేంద్రుడు
iii) గౌతమీపుత్ర శాతకర్ణి
iv) వీర పురుషదత్తుడు
తల్లి:
a) గౌతమీ బాలాశ్రీ
b) నాగులాంబ
c) మాఢరీదేవి
d) కుందవ్వ
1) i-c, ii-a, iii-d, iv-b
2) i-b, ii-d, iii-a, iv-c
3) i-a, ii-b, iii-c, iv-d
4) i-d, ii-a, iii-b, iv-c
- View Answer
- సమాధానం: 2
13. అరుంధతి ఎవరి భార్య?
1) అత్రి
2) అంగీరసుడు
3) వశిష్ఠుడు
4) భరద్వాజుడు
- View Answer
- సమాధానం: 3
14. యజ్ఞవల్క్య మహామునిని తన వాదనతో మెప్పించిన వేదజ్ఞాని ఎవరు?
1) అపాల
2) మైత్రేయి
3) విశ్వవర
4) గార్గి
- View Answer
- సమాధానం: 4
15. సావిత్రిబాయి పూలే జన్మదినాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు?
1) ఫిబ్రవరి 13
2) ఏప్రిల్ 21
3) జనవరి 3
4) డిసెంబర్ 29
- View Answer
- సమాధానం: 3
16. ఆర్యవైశ్య కుల దేవతగా పూజలందుకునే దేవత ఎవరు?
1) వాసవీ కన్యకా పరమేశ్వరీ దేవి
2) విశాలాక్షి దేవి
3) మీనాక్షి దేవి
4) మాణిక్యాంబ
- View Answer
- సమాధానం: 1
17. భారతదేశ తొలి మహిళా ప్రధాన ఎన్నికల కమిషనర్?
1) డాక్టర్ వి.ఎస్. రమాదేవి
2) కుముద్‌బెన్ జోషి
3) విజయ లక్ష్మి పండిట్
4) పద్మజా నాయుడు
- View Answer
- సమాధానం: 1
18. కింది వాటిలో సరైన జత ఏది?
1) భగీరథీ దేవి - ఇబ్రహీం కులీ కుతుబ్‌షా
2) భాగమతి - మహమ్మద్ కులీ కుతుబ్‌షా
3) హయత్ బక్షీ బేగం - మహమ్మద్ కుతుబ్‌షా
4) పైవన్నీ సరైనవే
- View Answer
- సమాధానం: 4
19. జతపరచండి.
మహిళ:
i) రీటా ఫారియా
ii) విజయ నిర్మల
iii) కల్పనా చావ్లా
iv) పి.టి. ఉష
ప్రాధాన్యత:
a) ప్రపంచంలో ఎక్కువ చిత్రాలకు దర్శకత్వం వహించినవారు
b) అంతరిక్ష యానం చేసిన తొలి భారతీయురాలు
c) అథ్లెటిక్్షలో ఫైనల్స్ చేరిన తొలి భారతీయ వనిత
d) ప్రపంచ సుందరి అయిన తొలి భారతీయ మహిళ
1) i-a, ii-b, iii-c, iv-d
2) i-d, ii-c, iii-b, iv-a
3) i-d, ii-a, iii-b, iv-c
4) i-b, ii-d, iii-a, iv-c
- View Answer
- సమాధానం: 3
20. ఢిల్లీని పాలించిన ఏకైక మహిళా నాయకురాలు ఎవరు?
1) హయత్ బక్షీ బేగం
2) బిల్కిస్ జమాన్
3) సుల్తానా రజియా
4) గుల్రుఖ్ బేగం
- View Answer
- సమాధానం: 3
21. జతపరచండి.
ప్రముఖ స్త్రీ:
i) సరోజినీ నాయుడు
ii) ఫాతిమా బీవీ
iii) డయానా ఎడుల్జీ
iv) విజయలక్ష్మీ పండిట్
ప్రాధాన్యం:
a) భారత మహిళల వన్డే క్రికెట్ జట్టుకు తొలి కెప్టెన్
b) మంత్రి పదవి చేపట్టిన తొలి భారతీయ మహిళ
c) భారత సుప్రీంకోర్టులో తొలి మహిళా న్యాయమూర్తి
d) భారతీయ తొలి మహిళా గవర్నర్
1) i-c, ii-a, iii-d, iv-b
2) i-b, ii-d, iii-a, iv-c
3) i-d, ii-c, iii-a, iv-b
4) i-d, ii-a, iii-b, iv-c
- View Answer
- సమాధానం: 3
22. భారత్‌లో తొలి మహిళా లోకో పెలైట్ (ట్రైన్ డ్రైవర్) ఎవరు?
1) తంగజం మనోరమ
2) అరుంధతీ భట్టాచార్య
3) సురేఖా యాదవ్
4) ఇంద్రా నూయి
- View Answer
- సమాధానం: 3
23. ప్రపంచంలో ఎక్కువ సంవత్సరాలు నిరాహార దీక్ష చేసి ‘ఐరన్ లేడీ’ అని కీర్తి పొందిన భారతీయురాలు?
1) ఇరోం చాను షర్మిలా
2) రాణీ గైడిన్లూ
3) పొణకా కనకమ్మ
4) పంచాలి భట్టాచార్య
- View Answer
- సమాధానం: 1
24. ‘మానవ గణన యంత్రం’ అని ఎవరిని పిలుస్తారు?
1) అనసూయ సారాబాయి
2) అపర్ణాసేన్
3) పూనమ్ రావత్
4) శకుంతలాదేవి
- View Answer
- సమాధానం: 4
25. భారత్‌లో తొలి టెస్ట్ ట్యూబ్ బేబీ ఎవరు?
1) కనుప్రియ అగర్వాల్ (దుర్గ)
2) దీప్తి శర్మ
3) దివ్యాదత్త
4) అంజలీ మీనన్
- View Answer
- సమాధానం: 1
26. జతపరచండి.
రాజు:
i) వాశిష్టి పుత్ర శ్రీశాంత మూలుడు
ii) అశోకుడు
iii) శ్రీకృష్ణ దేవరాయలు
iv) ప్రతాప రుద్ర గజపతి
కుమార్తె:
a) సంఘమిత్ర
b) మోహనాంగి
c) అన్నపూర్ణాదేవి
d) అటవీ శాంతిశ్రీ
1) i-b, ii-c, iii-d, iv-a
2) i-d, ii-a, iii-b, iv-c
3) i-a, ii-b, iii-c, iv-d
4) i-c, ii-d, iii-b, iv-a
- View Answer
- సమాధానం: 2
27. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకొంటారు?
1) మార్చి 8
2) ఏప్రిల్ 18
3) మే 8
4) జూన్ 18
- View Answer
- సమాధానం: 1
28. గౌతమ బుద్ధుడి బోధనలతో తన వేశ్యావృత్తిని త్యజించిన మహిళ?
1) సుజాత
2) కిస్స గోతమి
3) ఆమ్రపాలి
4) యశోమతి
- View Answer
- సమాధానం: 3
29. చంద్రగుప్త మౌర్యుడు వివాహమాడిన గ్రీక్ యువరాణి?
1) డయనీషియస్
2) ఎథీనా
3) జూనో
4) హెలీనా
- View Answer
- సమాధానం: 4
30.వాకాటకరాజు రుద్రసేనుడు వివాహమాడిన గుప్తుల యువరాణి?
1) ప్రభావతి గుప్త
2) కుమారదేవి
3) కుభేరనాగ
4) దత్తాదేవి
- View Answer
- సమాధానం: 1
31. కింది వాటిలో సరైన జత ఏది?
1) రాజశ్రీ - హర్షవర్థనుడి సోదరి
2) శీల మహాదేవి - నాలుగో విష్ణువర్థనుడి కుమార్తె
3) సంయుక్త - పృథ్వీరాజ్ చౌహాన్ భార్య
4) పైవన్నీ సరైనవే
- View Answer
- సమాధానం: 4
32. గణపతి దేవుడు వివాహమాడిన యాదవరాజు జైతుగి కుమార్తె?
1) సోమలదేవి
2) నారాంబ
3) పేరాంబ
4) ముప్పుమాంబ
- View Answer
- సమాధానం: 1
33. పల్నాటి బాల చంద్రుడు వివాహమాడిన మహిళ?
1) సూరాంబ
2) పాపాంబ
3) మాంచాల
4) మల్లమ్మ
- View Answer
- సమాధానం: 3
34. జతపరచండి.
మహిళ:
i) మైలాంబ
ii) గౌతమీ బాలాశ్రీ
iii) నాగానిక
iv) అనితల్లి
శాసనం:
a) కలువచేరు శాసనం
b) నానాఘాట్ శాసనం
c) బయ్యారం శాసనం
d) నాసిక్ శాసనం
1) i-b, ii-c, iii-a, iv-d
2) i-c, ii-a, iii-d, iv-b
3) i-a, ii-b, iii-c, iv-d
4) i-c, ii-d, iii-b, iv-a
- View Answer
- సమాధానం: 4
35.అల్లావుద్దీన్ ఖిల్జీ వివాహమాడిన కర్ణదేవుడి (గుజరాత్) భార్య?
1) పద్మావతి
2) కమలాదేవి
3) నేహల్
4) దేవల్దేవి
- View Answer
- సమాధానం: 2
36. జతపరచండి.
జాబితా-I
i) ధృవాదేవి
ii) ఆంధ్ర లక్ష్మి
iii) వరూధిని
iv) గోదాదేవి
జాబితా-II
a) ఆముక్త మాల్యద
b) మను చరిత్ర
c) దేవీ చంద్రగుప్తం
d) గాథా సప్తశతి
1) i-d, ii-a, iii-b, iv-c
2) i-c, ii-b, iii-a, iv-d
3) i-a, ii-c, iii-d, iv-b
4) i-c, ii-d, iii-b, iv-a
- View Answer
- సమాధానం: 4
37. అక్క మహాదేవి గుహలు ఎక్కడ ఉన్నాయి?
1) చంద్రగిరి
2) శ్రీశైలం
3) ఏటూరు నాగారం
4) మొగల్రాజపురం
- View Answer
- సమాధానం: 2
38. మహిళల కోసం ‘చెల్లి నిలయం’ను స్థాపించింది ఎవరు?
1) దుర్గాబాయి దేశ్‌ముఖ్
2) హేమలతాలవణం
3) సంగెం లక్ష్మీబాయి
4) ఆరుట్ల కమలా దేవి
- View Answer
- సమాధానం: 2
39. ఝాన్సీ లక్ష్మీబాయికి సంబంధించి కింది వాటిలో సరైంది ఏది?
1) ‘ఇండియన్ జోన్ ఆఫ్ ఆర్క’ అని పేరొందారు
2) ఈమె అసలు పేరు మణికర్ణిక
3) లక్ష్మీబాయిని సర్ హ్యూగ్రోజ్ చంపాడు
4) పైవన్నీ సరైనవే
- View Answer
- సమాధానం: 4
40. పాశ్చాత్య వైద్యశాస్త్రంలో పట్టా పొందిన తొలి భారత మహిళ?
1) ఆనందీబాయి జోషి
2) లీలా శాంసన్
3) సుధా రఘునాథన్
4) అలర్మెల్ వల్లి
- View Answer
- సమాధానం: 1
41. సారా వ్యతిరేకోద్యమంలో కీలక పాత్ర పోషించిన దూబగుంట రోశమ్మకు స్ఫూర్తినిచ్చిన కథ?
1) చుక్కమ్మ కథ
2) రామవ్వ కథ
3) ఎల్లమ్మ కథ
4) సీతమ్మ కథ
- View Answer
- సమాధానం: 4
42. జతపరచండి.
జాబితా-I
i) కిరణ్ బేడీ
ii) సుచేతా కృపలానీ
iii) సరళా తక్రాల్
iv) కంచన్ చౌదరి భట్టాచార్య
జాబితా-II
a) తొలి మహిళా డీజీపీ
b) తొలి మహిళా పెలైట్
c) తొలి మహిళా ముఖ్యమంత్రి
d) తొలి మహిళా ఐపీఎస్
1) i-b, ii-a, iii-d, iv-c
2) i-c, ii-b, iii-d, iv-a
3) i-d, ii-c, iii-b, iv-a
4) i-a, ii-b, iii-c, iv-d
- View Answer
- సమాధానం: 3
43. భారతదేశంలో తొలి మహిళా న్యాయవాది ఎవరు?
1) రుక్మాబాయి రావత్
2) మానసీ ప్రధాన్
3) కార్నెలియా సొరాబ్జీ
4) సుస్మితా బెనర్జీ
- View Answer
- సమాధానం: 3
44. కింది వారిలో సంగీత రంగానికి చెందని వారు ఎవరు?
1) ఎం.ఎల్. వసంతకుమారి
2) డి.కె. పట్టమ్మాళ్
3) ఆషా భోంస్లే
4) అరుంధతీరాయ్
- View Answer
- సమాధానం: 4
45. శాతవాహన రాజు హాలుడు వివాహమాడిన శ్రీలంక యువరాణి?
1) మలయవతి
2) లీలావతి
3) నాగానిక
4) శీలమహాదేవి
- View Answer
- సమాధానం: 2
46. చిందు భాగవతం ప్రదర్శనలో కీర్తిగాంచిన ప్రముఖురాలు ఎవరు?
1) ఎల్లమ్మ
2) బుచ్చమ్మ
3) సుబ్బమ్మ
4) కమలాబాయి
- View Answer
- సమాధానం: 1
47.జతపరచండి.
జాబితా-I
i) మరీచీ పరిణయం
ii) సుభద్రా కళ్యాణం
iii) రాధికా సాంత్వనం
iv) మధురా విజయం
జాబితా-II
a) ముద్దు పళని
b) గంగాంబ
c) తిరుమలాంబ
d) తాళ్లపాక తిమ్మక్క
1) i-a, ii-b, iii-d, iv-c
2) i-d, ii-c, iii-b, iv-a
3) i-b, ii-a, iii-c, iv-d
4) i-c, ii-d, iii-a, iv-b
- View Answer
- సమాధానం: 4
48. సంగీత, కళారంగంలో కీర్తిగాంచిన కర్ణాటక సంగీత విద్వాంసురాలు ఎం.ఎస్. సుబ్బులక్ష్మీ భారతరత్న అవార్డు ఎప్పుడు పొందారు?
1) 1996
2) 1997
3) 1998
4) 1999
- View Answer
- సమాధానం: 3
49. ‘భారతరత్న’ పురస్కారం పొందిన తొలి మహిళ ఎవరు?
1) మదర్ థెరిసా
2) లతా మంగేష్కర్
3) ఇందిరా గాంధీ
4) ఎం.ఎస్. సుబ్బులక్ష్మి
- View Answer
- సమాధానం: 3
50. మహిళా ఆర్య సమాజాన్ని పండిత రమాబాయి ఎక్కడ స్థాపించారు?
1) కలకత్తా
2) మద్రాస్
3) బొంబాయి
4) ఢిల్లీ
- View Answer
- సమాధానం: 3