ప్రాచీన కాలంలో మొదటిసారిగా నాణేలను ఎవరు ప్రవేశపెట్టారు?
ప్రాచీన కాలంలో ఆర్థిక పరిస్థితులు
1. ప్రాచీన కాలంలో నాణేలను ప్రవేశపెట్టినవారు?
1) మౌర్యులు
2) శాతవాహనులు
3) గుప్తులు
4) కుషాణులు
- View Answer
- సమాధానం: 1
వివరణ: ప్రాచీన కాలంలో మొదటి మహాసామ్రాజ్యం మగధ, ఇది మౌర్యుల పాలనా కాలం వరకు అర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందింది. వ్యవసాయ భూములకు నీటిపారుదల సౌకర్యాలు కల్పించారు. శ్రేణులు వ్యవస్థీకృతం అయ్యాయి. రోమ్ మొదలైన దేశాలతో విదేశీ వ్యాపారం అందుబాటులోకి రావడంతో నాణేలను ప్రవేశపెట్టారు.
- సమాధానం: 1
2. మౌర్యుల కాలంలో వ్యవసాయ భూములను ఏ పేరుతో వ్యవహరించేవారు?
1) కేదార
2) పుష్పవాట
3) ఫలవాట
4) స్కండ
- View Answer
- సమాధానం: 1
వివరణ: మౌర్యుల కాలంలో వ్యవసాయ భూములను కేదార అనే పేరుతో, ఉద్యానవనాలను పుష్పవాట అనే పేరుతో, పండ్లతోటలను ఫలవాట అనే పేరుతో, అరటి తోటలను స్కండ అనే పేరుతో వ్యవహరించేవారు.
- సమాధానం: 1
3. మౌర్యుల కాలంలో వడ్రంగి పనివారిని ఏ పేరుతో వ్యవహరించేవారు.
1) రజ్జు వర్తక
2) సాపిత
3) కుట్టక
4) కర్యార, అయస్కార
- View Answer
- సమాధానం: 3
వివరణ: మౌర్యుల కాలంలో వడ్రంగి పనివారిని కుట్టక అని, కమ్మరులను కర్యార, అయస్కార అని, కుమ్మరులు, మంగలివారిని సాపిత అని, తాళ్లు అల్లేవారిని రజ్జు వర్తక అని, వీరందరిని కలిపి గ్రామ భృతకలు అని పిలిచేవారు. వీరు తగు జీతంపై గ్రామానికి సేవ చేయడానికి నియమింపబడేవారు.
- సమాధానం: 3
4. మౌర్యుల కాలంలో భూయజమానులు ఎన్ని రకాలుగా ఉండేవారు?
1) రెండు రకాలు
2) మూడు రకాలు
3) నాలుగు రకాలు
4) ఐదు రకాలు
- View Answer
- సమాధానం: 4
వివరణ: మౌర్యుల కాలంలో ఐదు రకాల భూయజమానులు ఉండేవారు. వారు 1. రాజు 2. ప్రభుత్వం 3. భూస్వాములు 4. సమిష్టి యాజమాన్యం 5. రైతులు.
- సమాధానం: 4
5. మౌర్యుల కాలంలో పన్నులను ముడి పదార్థాల రూపంలో చెల్లించే గ్రామాలను ఏ పేరుతో వ్యవహరించేవారు ?
1) పరిహారిక
2) కుప్య
3) హిరణ్య
4) ఆయుధీయ
- View Answer
- సమాధానం: 2
వివరణ: మౌర్యుల కాలంలో పన్నును గ్రామాల వారిగా మధింపు చేయడానికి భూములను వాటి నాణ్యతను బట్టి ఉత్తమ, మధ్యమ, అధమ అని వర్గీకరించేవారు. తరువాత ఆ గ్రామాన్ని పన్ను చెల్లించే విధానాన్ని బట్టి ఈ కింది రకాల్లో దేనికి చెందుతుందో ఆ జాబితాలో చేర్చేవారు
1. పన్నుల నుంచి మినహాయింపు పొందిన గ్రామాలు (పరిహారిక).
2. సైనికులను సరఫరా చేసేగ్రామాలు (ఆయుధీయ)
3. దాన్యం, పశువులు, బంగారం (హిరణ్య), ముడి పదార్థాలు (కుప్య) రూపంలో పన్నులు చెల్లించే గ్రామాలు
4. పన్నులకు బదులుగా వెటì్ట పనిచేసేవారిని (విష్టి), పాల ఉత్పత్తులను సరఫరా చేసే గ్రామాలు.
- సమాధానం: 2
6. మంధకులు అనగా ఏవరు?
1) మజ్జిగ చిలికేవారు
2) ఆవుల కాపరులు
3) గేదెల కాపరులు
4) పాలు పితికేవారు
- View Answer
- సమాధానం: 1
వివరణ: మౌర్యుల కాలంలో, ప్రభుత్వ పశుక్షేత్రాల్లో అనేక మంది కార్మికులు పనిచేసేవారు. వారిలో ఆవులు ఎద్దులు కాసేవారిని గోపాలకులని, గేదెలు దున్నపోతులు కాసేవారిని పిండారకులని, పాలు తీసేవారిని దోహకులని, మజ్జిగ చిలికేవారిని మంధకులని పిలిచేవారు.
- సమాధానం: 1
7. సుదర్శన సరస్సును ఎవరి ఆజ్ఞ ప్రకారం నిర్మించారు?
1) అశోకుడు
2) బింబిసారుడు
3) చంద్ర గుప్తుడు
4) బిందుసారుడు
- View Answer
- సమాధానం: 3
వివరణ: మొగస్తనీసు ప్రకారం చంద్ర గుప్తుడు సౌరాష్ట్రలోని సుదర్శన సరస్సు నిర్మాణానికి ఆ ప్రాంత గవర్నర్ పుష్యగుప్తుడిని ఆజ్ఞాపించాడు. ఈ సరస్సు నిర్మాణం చంద్ర గుప్తుడి కాలంలోజరిగినా అశోకుని కాలంలోదానికి తూములు నిర్మించారు.
- సమాధానం: 3
8. ‘వినీత ’ అనే పన్ను దేనిపై విధించేవారు?
1) వ్యవసాయ ఉత్పత్తిపై
2) ఆస్థిపై
3) బందోబస్తుపై
4) పచ్చిక బయళ్లపై
- View Answer
- సమాధానం: 4
వివరణ: కౌటిల్యుని అర్థశాస్త్రం ప్రకారం పలురకాల వ్యవసాయ పన్నులను పేర్కొన్నాడు. వాటిలో ‘భాగ ’ అనే పన్ను వ్యవసాయ ఉత్పత్తిపై , ’కర’ అనే పన్ను ఆస్తిపై, ‘రజ్జు’ అనే పన్ను బందోబస్తుపై , వినీత అనే పన్ను పచ్చిక బయళ్లపై విధించేవారు.
- సమాధానం: 4
9. అశోకుని ఏ శాసనం బుద్దుని జన్మస్థలమైన లుంబినీ గ్రామానికి పన్నులనుంచి మినహాయింపు ఇచ్చినట్లు తెల్పుతుంది ?
1) రుమ్మిందై శాసనం
2) బబ్రూ శాసనం
3) మహాస్థానా
4) సోపారా
- View Answer
- సమాధానం: 1
వివరణ: రుమ్మిందై శాసనం అశోకుడు అధికారం ద్వారా లుంబినీ గ్రామానికి పన్నుల నుంచి మినహాయింపు ఇచ్చినట్లు తెల్పుతుంది. బబ్రూ శాసనం : బౌద్ధం పట్ల విశ్వాసాన్ని తెలియజేస్తుంది. మహాస్థానా: కరువు సమయంలో తీసుకొనే చర్యలను ప్రస్తావించారు. సోపారా : అశోకుడి లౌకిక విధానాన్ని తెలియజేస్తుంది.
- సమాధానం: 1
10. జౌళి వస్త్రాలపై ఎన్నో వంతు పన్ను విధించేవారు?
1) 1/10
2) 1/6
3) 1/25
4) 1/8
- View Answer
- సమాధానం: 3
వివరణ: కౌటిల్యుని అర్థశాస్త్రం ప్రకారం మౌర్యుల కాలంలో వివిధ రకాల వస్తువులపై వేరువేరుగా పన్ను విధింపు ఉండేదని తెలుస్తుంది. అమ్మకం పన్ను సాధారణంగా 1/10 వంతు, జౌళి వస్త్రాలపై 1/25 వంతు, పూలు, కూరగాయలపై 1/6 వంతు, వ్యవసాయోత్పత్తులపై 1/6 వంతు పన్ను విధించే వారని తెలుస్తుంది.
- సమాధానం: 3
11. శ్రేణుల సమాఖ్యకు అధ్యక్షునిగా ఎవరు ఉండేవారు?
1) రాజు
2) భాండగారికుడు
3) జెట్టకుడు
4) శెట్టి
- View Answer
- సమాధానం: 2
వివరణ: రాజు మొత్తం రాజ్యానికి అధ్యక్షునిగా ఉండేవాడు, శెట్టి అంటే శ్రేణికి నాయకుడుగా ఉండేవాడు, జెట్టకుడు అంటే నగర వృద్ధుడు, శ్రేణుల సమాఖ్యకు అధ్యక్షునిగా భాండగారికుడు ఉండేవాడు.
- సమాధానం: 2
12. ఈ కింది వానిలో బంగారు నాణెం కానిది ఏది?
1) నిష్క
2) సువర్ణ
3) శతమాన
4) కార్షాపణ
- View Answer
- సమాధానం: 4
వివరణ: మను, యజ్ఞవల్క ధర్మశాస్త్రాలు, కౌటిల్యుని అర్థశాస్త్రం ప్రకారం నిష్క, సువర్ణ, శతమాన అనేవి బంగారు నాణేలుగా, కార్షాపణ అనేది వెండి నాణెంగా చెలామణిలో ఉండేది.
- సమాధానం: 4
13. చాణక్యుని అర్థశాస్త్రం ఎన్ని రకాల బానిసలను పేర్కొంది?
1) 2
2) 3
3) 4
4) 5
- View Answer
- సమాధానం: 4
వివరణ: అర్థశాస్త్రం 5రకాల బానిసలను పేర్కొంది. వారు 1. యుద్ధంలో బంధించ బడినవారు. 2. తమకు తాముగా అమ్ముడు పోయినవారు. 3. దాసికి బానిస ద్వారా జన్మించినవారు. 4. రుణం లేదా తాకట్టు ఫలితంగా బానిసలైనవారు. 5. జరిమానా లేదా న్యాయస్థానం తీర్పు ఫలితంగా బానిసలైనవారు.
- సమాధానం: 4
14. మొదటిసారిగా భారతదేశ చరిత్రలో బౌద్ధ సన్యాసులకు భూములు దానంగా ఇచ్చినవారు ఎవరు?
1) మౌర్యులు
2) శాతవాహనులు
3) కుషాణులు
4) గుప్తులు
- View Answer
- సమాధానం: 2
వివరణ: మొదటిసారిగా భారతదేశ చరిత్రలో బౌద్ధ సన్యాసులకు భూములు దానంగా ఇచ్చినవారు శాతవాహనులే, గౌతమీపుత్ర శాతకర్ణి బౌద్ధ సన్యాసులకు భూములు దానంగా ఇవ్వడమేకాక ఆ భూములపై పరిపాలన, ఆర్థిక సంబంధమైన హక్కులు కూడా వారికే ఉన్నట్లు నాసిక్ శాసనం వల్ల తెలుస్తుంది.
- సమాధానం: 2
15. ధాన్యం వ్యాపారుల శ్రేణి ఏడు గదులు గల గుహను, జలాశయాన్ని దానంగా ఇచ్చిందని పేర్కొన్న శాసనం ఏది?
1) హాథీగుంఫా
2) నానాఘాట్
3) జున్నార్
4) ఐహోల్ శాసనం
- View Answer
- సమాధానం: 3
వివరణ: జున్నార్ శాసనం ధాన్యం వ్యాపారుల శ్రేణి ఏడు గదులు గల గుహను, జలాశయాన్ని దానంగా ఇచ్చిందని పేర్కొన్నది. హాథీగుంఫా శిలా శాసనం : కలింగ ఖారవేలుని విజయాల గురించి చెబుతున్న ఏకైక శిలా శాసనం ఇది. నానాఘాట్ శాసనం :మొదటి శాతకర్ణి సైనిక విజయాలను తెలియజేస్తుంది. దీన్ని అతని భార్య నాగనిక వేయించింది. ఐహోల్ శాసనం : బాదామి చాళుక్య పాలకుడైన రెండో పులకేశి సైనిక విజయాలను వివరిస్తుంది.
- సమాధానం: 3
16. శాతవాహనులు పరిమిత సంఖ్యలో ముద్రించిన ‘పోటిన్’ నాణేలు ఏయే లోహ మిశ్రమాలతో రూపొందించారు?
1) బంగారు, వెండి
2) వెండి, రాగి
3) రాగి, బంగారం
4) రాగి, తగరం
- View Answer
- సమాధానం: 4
వివరణ: శాతవాహనులు సీసం, రాగి నాణేలను అధిక సంఖ్యలోను, రాగి, తగరం లోహాల మిశ్రమంతో రూపొందించిన పోటిన్ నాణేలు పరిమిత సంఖ్యలో ముద్రించారు.
- సమాధానం: 4
17. శాతవాహనుల కాలంలో ముద్రించిన వెండి కార్షాపణ ప్రామాణిక బరువు ఎంత?
1) 32 రత్తిలు
2) 80 రత్తిలు
3) 40 రత్తిలు
4) 20 రత్తిలు
- View Answer
- సమాధానం: 1
వివరణ: వెండి కార్షాపణ ప్రామాణిక బరువు 32 రత్తిలు (3.823 గ్రాములు), రాగి కార్షాపణ ప్రామాణిక బరువు 80 రత్తిలు (9.460 గ్రాములు), రాగి అర్థపణ(బీ) ప్రామాణిక బరువు 40రత్తిలు (4.730 గ్రాములు), రాగి పాద (బి) ప్రామాణిక బరువు 20రత్తిలు (2.365 గ్రాములు).
- సమాధానం: 1
18. ‘ ఎ గైడ్ టు జాగ్రఫీ ’ అనే గ్రంథ రచయిత?
1) ప్లీనీ
2) టాలమీ
3) హుయాన్‌త్సాంగ్
4) మెగస్తనీస్
- View Answer
- సమాధానం: 2
వివరణ: నేచురల్ హిస్టరీ అనే గ్రంథ రచయిత ప్లీనీ , ఎ గైడ్ టు జాగ్రఫీ అనే గ్రంథ రచయిత టాలమీ, సీయూకీ అనే గ్రంథ రచయిత హుయాన్‌త్సాంగ్, ఇండికా అనే గ్రంథ రచయిత మెగస్తనీస్ .
- సమాధానం: 2
19. శ్రేణిలో సభ్యుడిని ఏ పేరుతో పిలిచేవారు?
1) గహపతి
2) శెటి
3) నిగమ
4) సార్థవాహ
- View Answer
- సమాధానం: 3
వివరణ: శ్రేణిలో సభ్యుడిని నిగమ అని, శ్రేణి అధ్యక్షుడిని శ్రేష్టి (శెట్టి) అని పిలిచేవారు. గహపతి అనేది వ్యాపారుల బిరుదు. సార్థవాహ అంటే బిడారు వ్యాపారి.
- సమాధానం: 3
20. ఋతుపవనాలను మొదటగా ఎవరు గమనించారు?
1) హిప్పార్కస్
2) హిప్పాలస్
3) టాలమీ
4) విలియం హార్వే
- View Answer
- సమాధానం: 2
వివరణ: అక్షాంశాలు, రేఖాంశాలు అనే పదాలను మొదటగా వాడినది హిపార్కస్. సాధారణ శకం 46–47 లో గ్రీక్ నావికుడైన హిప్పాలస్ ఋతుపవనాలను కనుగొని అరబ్ మహాసాగరం ద్వారా నౌకాయానానికి ఉపయోగపడేటట్టు చేయడంతో, భారతీయ, పశ్చిమాసియా రేవు పట్టణాల దూరం తగ్గినట్టనిపించింది. క్లాడియస్ టాలమీ అనే అలెగ్జాండ్రియా ఖగోళ శాస్త్రవేత్త గ్రహాల తిరోగమన చలనాన్ని పరిగణనలోకి తీసుకొని, భూ కేంద్రక సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. విలియం హార్వే ప్రఖ్యాతి గాంచిన వైద్యశాస్త్రవేత్త. గుండె పనిచేసే తీరును, శరీరంలో రక్తప్రసరణ జరిగే పద్ధతిని మొదటగా వివరించాడు.
- సమాధానం: 2
21. టాలమీ పేర్కొన్న శాతవాహనుల కాలంలోని తూర్పుతీర ఓడరేవు కానిది?
1) సోపార
2) కంటకోస్సిల
3) కొద్దూర
4) మోటుపల్లి
- View Answer
- సమాధానం: 1
వివరణ: సోపార అనేది పశ్చిమ తీర ఓడరేవు దీన్ని ప్రస్తుతం సూపార అనే పేరుతో పిలుస్తున్నారు. కంటకొస్సిల (కంటకసెల), కొద్దూర (గూడురు), మోటుపల్లిలను టాలమీ తన ఎ గైడ్ టు జాగ్రఫీ గ్రంథంలో పేర్కొన్నాడు.
- సమాధానం: 1
22. శాతవాహనుల కాలంనాటి ఒదయాంత్రికులు అనగా ఎవరు?
1) వడ్రంగులు
2) తాపీ పనివారు
3) నేత పనివారు
4) జలయంత్రాలు చేసేవారు
- View Answer
- సమాధానం: 4
వివరణ: వడ్రంగులను వఢకిలు అని, తాపీ పనివారిని సెలవఢకినులు అని, నేతపనివారిని కొలికులు అని, జలయంత్రాలు చేసేవారిని ఒదయాంత్రికులు అని పేర్కొనేవారు.
- సమాధానం: 4
23. కలుపు మొక్కలు తీసి భూమిని శుభ్రం చేసి వ్యవసాయానికి అనుగుణంగా చేసినవానికే భూమి చెందుతుందని వివరించినది?
1) మిళింద పన్హా
2) దివ్యావదాన
3) మహావస్తు
4) మనుధర్మశాస్త్రం
- View Answer
- సమాధానం: 4
వివరణ: అడవిని తొలగించి భూమిని సాగుచేసేందుకు అవసరమైన వ్యక్తిని గురించి మిళింద పన్హా తెల్పుతుంది, వ్యవసాయం చేసే రైతుల గురించి దివ్యావదాన తెలియజేస్తుంది. వ్యక్తి యాజమాన్యం గురించి మహావస్తు తెలియజేస్తుంది, కలుపు మొక్కలు తీసి భూమిని శుభ్రం చేసి వ్యవసాయానికి అనుగుణంగా చేసినవానికే భూమి చెందుతుందని మనుధర్మశాస్త్రం వివరించినది.
- సమాధానం: 4
24. హావిష్కుడు అక్షయనీని పద్ధతి ప్రకారం వంద మంది బ్రాహ్మణులకు పుణ్య శాలలను, ఐదువందల పురాణాలను రెండు దానాలుగా ఇచ్చాడని తెలుపుతున్న శాసనం.
1) గిర్నాల్ శాసనం
2) భట్టిఫ్రోలు శాసనం
3) మధుర శాసనం
4) ఉత్తర మేరూర్ శాసనం
- View Answer
- సమాధానం: 3
వివరణ: గిర్నాల్ శాసనం – పశ్చిమ భారతదేశం మీద చంద్రగుప్తుడి ఆధిపత్యాన్ని తెలుపుతుంది. భట్టిఫ్రోలు శాసనం – కుబేరకుడనే యక్షరాజు వేయించాడు. శాతవాహనుల కాలంలో నిగమసభల గురించి ఈ శాసనం తెలుపుతుంది. మధుర శాసనం – హావిష్కుడు అక్షయనీని పద్ధతి ప్రకారం వంద మంది బ్రాహ్మణులకు పుణ్య శాలలను, ఐదువందల పురాణాలను రెండు దానాలుగా ఇచ్చాడని తెలుపుతుంది. ఉత్తర మేరూర్ శాసనం – మొదటి పరాంతకుని గురించి తెలుపును. ఈ శాసనం దక్షిణ భరతదేశంలో చోళుల కాలంలో గ్రామీణ ప్రభుత్వాలు వర్దిల్లాయని తెలుపుతుంది.
- సమాధానం: 3
25. సుదర్శన సరస్సుకు రుద్రదమనుడు మరమ్మత్తులు చేయించినట్లు తెల్పుతున్న శాసనం
1) జునాఘడ్ శాసనం
2) జెడా శాసనం
3) కార్లే శాసనం
4) అలహద్ శాసనం
- View Answer
- సమాధానం: 1
వివరణ: జునాఘడ్ శాసనం సుదర్శన సరస్సుకు రుద్రదమనుడు మరమ్మత్తులు చేయించినట్లు తెల్పుతుంది, జెడా శాసనం కనిష్కుడు బావులు తవ్వి దానంగా ఇవ్వడం గురించి తెల్పుతుంది. కార్లే శాసనం గౌతమీ పుత్రశాతకర్ణి విజయాలను గురించి తెలుపుతుంది, అలహద్ శాసనం సముద్ర గుప్తుని విజయాలను గురించి తెలుపతుంది.
- సమాధానం: 1