గుప్తుల అనంతర యుగం
1. హుయాన్‌త్సాంగ్ ప్రకారం హర్షుడు చాతుర్వర్ణాల్లోని ఏ వర్ణానికి చెందినవాడు?
ఎ) బ్రాహ్మణ
బి) క్షత్రియ
సి) వైశ్య
డి) శూద్ర
- View Answer
- సమాధానం: సి
2. స్థానేశ్వర్ నుంచి కనౌజ్‌కు రాజధానిని మార్చిన ఉత్తర భారతదేశ రాజు?
ఎ) నరవర్థన
బి) ఆదిత్య వర్థన
సి) ప్రభాకర వర్థన
డి) హర్ష వర్థన
- View Answer
- సమాధానం: డి
3. హర్షుడి చేతిలో ఓడిన వల్లభి పాలకుడు?
ఎ) రెండో ధ్రువసేనుడు
బి) రెండో ప్రవరిసేనుడు
సి) మూడో ధ్రువసేనుడు
డి) మూడో ప్రవరిసేనుడు
- View Answer
- సమాధానం: ఎ
4. హర్షుడి దిగ్విజయ యాత్రలకు నాయకత్వం వహించిన సేనాపతి?
ఎ) దండి
బి) భండి
సి) వ్యాఘ్రకేతు
డి) నిఘ్రాత
- View Answer
- సమాధానం: బి
5. సకలోత్తర పథేశ్వర అనే బిరుదు ఎవరిది?
ఎ) గ్రహవర్మ
బి) శశాంక
సి) హర్ష
డి) భాస్కరవర్మ
- View Answer
- సమాధానం: సి
6. భారతదేశ చరిత్రలో తొలిసారిగా అధికా రులకు భూదానాలు చేసిన రాజవంశం?
ఎ) శాతవాహనులు
బి) గుప్తులు
సి) ఇక్ష్వాకులు
డి) పుష్యభూతి
- View Answer
- సమాధానం: డి
7. హుయాన్‌త్సాంగ్ వ్యవసాయదారులుగా ఏ వర్ణాన్ని పేర్కొన్నాడు?
ఎ) బ్రాహ్మణులు
బి) క్షత్రియులు
సి) వైశ్యులు
డి) శూద్రులు
- View Answer
- సమాధానం: డి
8. బాణుడి ప్రకారం హర్షుడి సమాజంలో సర్వ సాధార ణ దురాచారం?
ఎ) సతీ సహగమనం
బి) వరకట్నం
సి) కన్యాశుల్కం
డి) వితంతు వివాహాల నిషేధం
- View Answer
- సమాధానం: బి
9. హర్షుడు ఆదరించిన మతం?
ఎ) హిందూ మతం
బి) బౌద్ధ మతం
సి) జైన మతం
డి) వైష్ణవ మతం
- View Answer
- సమాధానం: బి
10. హర్షుడి కాలంలో ఎక్కువగా వ్యాప్తిలో ఉన్న మతం?
ఎ) వైష్ణవం
బి) బౌద్ధం
సి) శైవం
డి) జైనం
- View Answer
- సమాధానం: సి
11. ఉత్తర భారతదేశాన్ని పాలించిన చివరి గొప్ప హిందూ చక్రవర్తిగా ఎవరిని పేర్కొంటారు?
ఎ) సముద్రగుప్తుడు
బి) హర్షవర్థనుడు
సి) రెండో చంద్రగుప్తుడు
డి) యశోధర్ముడు
- View Answer
- సమాధానం: బి
12. రాజపుత్ర, శీలాదిత్య అనే బిరుదులు ధరిం చిన రాజు?
ఎ) రెండో పులకేశి
బి) మొదటి మహేంద్రవర్మ
సి) హర్షుడు
డి) రెండో నరసింహవర్మ
- View Answer
- సమాధానం: సి
13. హర్షుడి కాలంలోని పాలనా విభాగాల్లో సరైన క్రమం?
ఎ) భుక్తి - విషయ - పాథక - గ్రామ
బి) విషయ - గ్రామ - భుక్తి - పాథక
సి) పాథక - భుక్తి - విషయ - గ్రామ
డి) గ్రామ - భుక్తి - విషయ - పాథక
- View Answer
- సమాధానం: ఎ
14. హర్షుడి కాలంలో చాత - భాత అంటే?
ఎ) పన్నులు
బి) సైనికులు
సి) కులాలు
డి) భూదానాలు
- View Answer
- సమాధానం: బి
15. హర్షుడు సర్వమత సమ్మేళనాన్ని ఏ ప్రాంతంలో నిర్వహించాడు?
ఎ) ప్రయాగ
బి) పాటలీపుత్రం
సి) కనౌజ్
డి) వల్లభి
- View Answer
- సమాధానం: సి
16. సముద్రగుప్తుడిని ‘ఇండియన్ నెపోలియన్’ అని పిలిచింది?
ఎ) సర్ విలియం జోన్స్
బి) వి.ఎ.స్మిత్
సి) హెచ్.సి. రామచౌదరి
డి) కె.పి. జయస్వాల్
- View Answer
- సమాధానం: బి
17. రెండో చంద్రగుప్తుడి చేతిలో హతమైన శకరాజు?
ఎ) రెండో రుద్రసేనుడు
బి) మూడో రుద్రసేనుడు
సి) రెండో రుద్రసింహుడు
డి) మూడో రుద్రసింహుడు
- View Answer
- సమాధానం: డి
18. సాహసాంక, శకారి అనే బిరుదులున్న గుప్త రాజు?
ఎ) మొదటి చంద్రగుప్తుడు
బి) రెండో చంద్రగుప్తుడు
సి) సముద్ర గుప్తుడు
డి) కుమార గుప్తుడు
- View Answer
- సమాధానం: బి
19. నవ రత్నాలు ఏ రాజు ఆస్థాన కవులు?
ఎ) సముద్రగుప్తుడు
బి) కచ గుప్తుడు
సి) రెండో చంద్రగుప్తుడు
డి) బుధ గుప్తుడు
- View Answer
- సమాధానం: సి
20. రెండో చంద్రగుప్తుడి కాలంలో భారతదేశాన్ని సందర్శించిన చైనా యాత్రికుడు?
ఎ) ఇత్సింగ్
బి) పాన్చావో
సి) హుయాన్‌త్సాంగ్
డి) ఫాహియాన్
- View Answer
- సమాధానం: డి
-
21. బాదామీ చాళుక్య రాజ్యాన్ని హుయాన్‌త్సాంగ్ ఏ సంవత్సరంలో సందర్శించాడు?
ఎ) క్రీ.శ.642
బి) క్రీ.శ.641
సి) క్రీ.శ.640
డి) క్రీ.శ.639
- View Answer
- సమాధానం: బి
22. సత్యాశ్రయ అనే బిరుదున్న బాదామీ చాళుక్య రాజు?
ఎ) మొదటి పులకేశి
బి) రెండో పులకేశి
సి) రెండో విక్రమాదిత్యుడు
డి) రెండో విజయాదిత్యుడు
- View Answer
- సమాధానం: ఎ
23. హరీతిపుత్రులు అని ఏ రాజవంశాన్ని పిలుస్తారు?
ఎ) పల్లవులు
బి) రాష్ర్టకూటులు
సి) చాళుక్యులు
డి) వాకాటకులు
- View Answer
- సమాధానం: సి
24. కాదంబుల రాజధాని?
ఎ) పట్టడకల్
బి) కల్యాణి
సి) ఐహోల్
డి) బనవాసి
- View Answer
- సమాధానం: డి
25.గౌతమీపుత్ర శాతకర్ణి తర్వాత దక్కన్లో అంతటి విశాలమైన రాజ్యాన్ని నిర్మించిన చక్రవర్తి?
ఎ) హర్షవర్థ్ధనుడు
బి) రెండో పులకేశి
సి) సముద్రగుప్తుడు
డి) రెండో నరసింహవర్మ
- View Answer
- సమాధానం: బి
26. కుబ్జ విష్ణువర్థనుడు రెండో పులకేశి ప్రతి నిధిగా ఆంధ్ర ప్రాంతాన్ని ఏ రాజధాని నుంచి పాలించాడు?
ఎ) వేంగి
బి) వినుకొండ
సి) పిష్టపుర
డి) విజయపురి
- View Answer
- సమాధానం: సి
27. రెండో పులకేశి మొదటి మహేంద్రవర్మను ఏ యుద్ధంలో అంతం చేశాడు?
ఎ) పుల్లలూరు యుద్ధం
బి) కొప్పం యుద్ధం
సి) సంగమేశ్వర యుద్ధం
డి) మణిమంగళ యుద్ధం
- View Answer
- సమాధానం: ఎ
28. ఏ చాళుక్యరాజు గుజరాత్‌పై జరిగిన అర బ్బుల దాడిని తిప్పికొట్టాడు?
ఎ) రెండో పులకేశి
బి) మొదటి విక్రమాదిత్యుడు
సి) రెండో విక్రమాదిత్యుడు
డి) రెండో కీర్తివర్మ
- View Answer
- సమాధానం: సి
29. రెండో పులకేశి క్రీ.శ.642లో జరిగిన ఏ యుద్ధంలో మొదటి నరసింహవర్మ చేతిలో అంతమయ్యాడు?
ఎ) మణిమంగళ యుద్ధం
బి) కంచి యుద్ధం
సి) అనిల్‌వారా యుద్ధం
డి) బనవాసి యుద్ధం
- View Answer
- సమాధానం: ఎ
30. బాదామీ చాళుక్యుల రాజ చిహ్నం?
ఎ) వరాహం
బి) వృషభం
సి) సింహం
డి) పులి
- View Answer
- సమాధానం: ఎ
31. ఐహోల్ శాసనాన్ని రచించిన వారు?
ఎ) హరిసేనుడు
బి) రవికీర్తి
సి) మొదటి పులకేశి
డి) బాణుడు
- View Answer
- సమాధానం: బి
32. కంచిలోని కైలాసనాథ ఆలయ నమూనా లో నిర్మించిన పట్టడకల్‌లోని ఆలయం?
ఎ) విరూపాక్షాలయం
బి) లింగరాజ ఆలయం
సి) దశావతారాలయం
డి) సర్వ దేవాలయం
- View Answer
- సమాధానం: ఎ
33. ఐహోల్ ప్రశస్తిని కలిగిన దేవాలయం?
ఎ) దుర్గాలయం
బి) మేగుటి జైనాలయం
సి) లాడ్‌ఖాన్ ఆలయం
డి) లోకేశ్వరాలయం
- View Answer
- సమాధానం: బి
34. చాళుక్యుల కాలంలో దేవాలయాల నగరంగా ప్రసిద్ధిగాంచింది?
ఎ) ఐహోల్
బి) పట్టడకల్
సి) అలంపూర్
డి) మహానంది
- View Answer
- సమాధానం: ఎ
35. హిందూ పాలకుల్లో అక్బర్ లాంటివాడు అని కీర్తిగాంచిన రాజు?
ఎ) రెండో పులకేశి
బి) సముద్రగుప్తుడు
సి) హర్షుడు
డి) అశోకుడు
- View Answer
- సమాధానం: సి