వృక్ష శరీర ధర్మ శాస్త్రం
1. బాష్పోత్సేకం అత్యధికంగా ఎప్పుడు జరుగుతుంది?
1) ఎక్కువ ఆర్థ్రతలో
2) తక్కువ ఉష్ణోగ్రతలో
3) తక్కువ గాలి వేగంలో
4) ఎక్కువ ఉష్ణోగ్రత, తక్కువ ఆర్థ్రతలో
- View Answer
- సమాధానం: 4
2. నీటిలో కరిగే వర్ణద్రవ్యం ఏది?
1) క్లోరోఫిల్
2) కెరోటిన్
3) పైకోబిలిన్లు
4) జాంథోఫిల్స్
- View Answer
- సమాధానం: 3
3. ల్యూటైన్ అనేది ఒక..
1) నీలిరంగు వర్ణద్రవ్యం
2) పసుపు రంగు వర్ణద్రవ్యం
3) గోధుమ రంగు వర్ణద్రవ్యం
4) నారింజ రంగు వర్ణద్రవ్యం
- View Answer
- సమాధానం: 2
4. కింది వాటిలో దేని మూలంగా ఆకుల్లో రంగు ఉంటుంది?
1) పొటాషియం
2) సోడియం
3) క్లోరిన్
4) మెగ్నీషియం
- View Answer
- సమాధానం: 4
5. టమాటా పండ్లకు కింది వాటిలో వేటి వల్ల రంగు వస్తుంది?
1) ఆంథోసయనిన్స్
2) ప్లావనాల్స్
3) కెరోటినాయిడ్స్
4) క్లోరోఫిల్స్
- View Answer
- సమాధానం: 3
6. ఆకుల ద్వారా జరిగే ట్రాన్స్ పిరేషన్ను ఏమని పిలుస్తారు?
1) గట్టేషన్
2) స్టోమాటల్ ట్రాన్సిఫిరేషన్
3) లెంటిక్యులార్ ట్రాన్సిఫిరేషన్
4) క్యూటిక్యులార్ ట్రాన్సిఫిరేషన్
- View Answer
- సమాధానం: 2
7. కిరణజన్య సంయోగక్రియలో వెలువడే వాయువేది?
1) ఆక్సిజన్
2) కార్బన్ డై ఆక్సైడ్
3) నైట్రోజన్
4) హైడ్రోజన్
- View Answer
- సమాధానం: 1
8. ఎండాకాలంలో చెట్టునీడకు వెళితే చల్లగా ఉంటుంది. దీనికి కారణమైన ప్రక్రియ ఏది?
1) ద్రవాభిసరణం
2) నిపానం
3) బాష్పోత్సేకం
4) బిందుస్రావం
- View Answer
- సమాధానం: 3
9. క్లోరోఫిల్లో ఉండే మూలకం ఏది?
1) బెరీలియం
2) కాల్షియం
3) మెగ్నీషియం
4) స్ట్రాన్షియం
- View Answer
- సమాధానం: 3
10.కింది వాటిలో కిరణజన్య సంయోగక్రియకు అవసరం లేనిది ఏది?
1) కాంతి
2) కార్బన్ డై ఆక్సైడ్
3) నీరు
4) హైడ్రోజన్
- View Answer
- సమాధానం: 4
11. మొక్కలు ఆకుపచ్చ రంగులో ఉంటాయి. ఎందుకంటే అవి..
1) ఆకుపచ్చ కాంతిని శోషిస్తాయి
2) ఆకుపచ్చ కాంతిని పరావర్తనం చేస్తాయి
3) ఆకుపచ్చ కాంతిని వక్రీభవిస్తాయి
4) అతినీలలోహిత కాంతిని శోషించవు
- View Answer
- సమాధానం: 2
12. మనల్ని సజీవంగా ఉంచే O2 అనేది కిరణజన్య సంయోగ క్రియ ఫలితం. ఇది దేని నుంచి లభిస్తుంది?
1) కార్బన్ డై ఆక్సైడ్
2) నీరు
3) ఖనిజ మూలక ఆక్సైడ్లు
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 2
13. మొక్కలు ఎక్కువగా ఏ రకమైన కాంతిని గ్రహిస్తాయి?
1) ఆరెంజ్, వయొలెట్
2) నీలం, ఎరుపు
3) పసుపు, ఇండిగో
4) పసుపు, వయొలెట్
- View Answer
- సమాధానం: 2
14. మొక్కలు నీటిని పోగొట్టుకునే ప్రక్రియను ఏమంటారు?
1) ఆస్మాసిస్
2) అంకురణం
3) బాష్పీభవనం
4) బాష్పోత్సేకం
- View Answer
- సమాధానం: 4
15. ఒక చెట్టు బెరడులో కొంత భాగాన్ని కాండంపై తొలగిస్తే.. ఆ మొక్క చనిపోతుంది. దీనికి కారణం?
1) పత్రాలు కిరణ జన్య సంయోగ క్రియను జరపలేవు
2) వేర్లు శోషించిన నీరు, లవణాలు మొక్క పై భాగాలకు చేరకపోవడం
3) పత్రాల్లో సంశ్లేషించిన ఆహార పదార్థాలు వేర్లకు చేరకపోవడం
4) ఘాతం (Shock) ఏర్పడటం
- View Answer
- సమాధానం: 3
16. మృత్తిక గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు?
1) ఎకాలజీ
2) పెడాలజీ
3) వెదరింగ్
4) పేలినాలజీ
- View Answer
- సమాధానం: 2
17.మొక్కల ఆరోగ్యమైన పెరుగుదలకు అవసరమైన నేల ఏది?
1) లోమ్ నేల
2) ఇసుక నేల
3) రేగడి నేల
4) బురద నేల
- View Answer
- సమాధానం: 1
18. నేలలోని నత్రజని స్థాపక జీవులు వేటికి చెందినవి?
1) మాస్ మొక్కలు
2) హరిత శైవలాలు
3) మృత్తికా శిలీంధ్రాలు
4) బ్యాక్టీరియా
- View Answer
- సమాధానం: 4
19. నీరు, గాలి వల్ల మృత్తిక తొలగిపోవడాన్ని ఏమంటారు?
1) గ్లేసియేషన్
2) డిఫారెస్ట్రేషన్
3) క్రమక్షయం
4) కాలుష్యం
- View Answer
- సమాధానం: 3
20. కింది వాటిలో మృత్తికా క్రమక్షయాన్ని నివారించే పద్ధతి ఏది?
1) నేలను ఏటవాలుగా చేయడం
2) మొక్కలను నేలపై కప్పేట్లు పెంచడం
3) పశువులను మేపడం
4) భూసారాన్ని పెంచడం
- View Answer
- సమాధానం: 2
21. కింది వాటిలో నైట్రోజన్ అత్యవసర అనుఘటకంగా వేటిలో ఉంటుంది?
1) కార్బోహైడ్రేట్లు
2) కొవ్వులు
3) గ్లూకోజ్
4) ఎంజైమ్లు
- View Answer
- సమాధానం: 4
22. నత్రజని స్థాపనకు అవసరమయ్యే ఖనిజ మూలకం ఏది?
1) జింక్
2) మాలిబ్డినమ్
3) కాపర్
4) బోరాన్
- View Answer
- సమాధానం: 2
23. మొక్కలకు అతి ఎక్కువగా అవసరమయ్యే మూలకం ఏది?
1) సల్ఫర్
2) కాల్షియం
3) ఫాస్ఫరస్
4) నైట్రోజన్
- View Answer
- సమాధానం: 4
24. పత్రహరితం సంశ్లేషణకు అవసరమయ్యే మూలకాలేవి?
1) Fe, Ca
2) Fe, Mg
3) Cu, Ca
4) K, Ca
- View Answer
- సమాధానం: 2
25.పంట మార్పిడి ఆవశ్యకత ఏమిటి?
1) వేర్వేరు పంటల కోసం
2) ఖనిజాల స్థాయి పెంచడం
3) ప్రోటీన్ ప్రమాణం పెంచడం
4) భూసారాన్ని పెంచడం
- View Answer
- సమాధానం: 4
26. కింది వాటిలో నిరీంద్రియ పోషకం ఏది?
1) సెల్యులోజ్
2) విటమిన్లు
3) కాల్షియం
4) ప్రోటీన్లు
- View Answer
- సమాధానం:3
27. ఏ మూలకం లోపించడం వల్ల లఘు(చిన్న) పత్ర వ్యాధి వస్తుంది?
1) ఐరన్
2) జింక్
3) బోరాన్
4) నైట్రోజన్
- View Answer
- సమాధానం: 2
28. వేర్లు గ్రహించిన నీరు, ఖనిజ మూలకాలు వేటి ద్వారా పత్రాలకు రవాణా అవుతాయి?
1) దారువు
2) పోషక కణజాలం
3) చాలనీ నాళాలు
4) ఏదీకాదు
- View Answer
- సమాధానం: 1
29.ఒక కణాన్ని అధిక గాఢత ఉన్న ద్రావణంలో ఉంచినప్పుడు జరిగే క్రియ..
1) కోశిక ద్రవ్య సంకోచం
2) ద్రవాభిసరణం
3) బాష్పోత్సేకం
4) నిపానం
- View Answer
- సమాధానం: 1
30. ఏ ప్రక్రియ జరగకపోవడం వల్ల రబ్బరు నీటిలో వ్యాకోచం చెందదు?
1) విసరణ
2) నిపానం
3) కోశిక ద్రవ్య సంకోచం
4) ద్రవాభిసరణం
- View Answer
- సమాధానం: 2
31. పొడి విత్తనాలను నీటిలో ఉంచినప్పుడు ఉబ్బడానికి కారణమైన ప్రక్రియ ఏది?
1) శోషణ
2) విసరణ
3) నిపానం
4) అధిశోషణ
- View Answer
- సమాధానం: 3
32. మొక్కల వేర్లు భూమి నుంచి నీటిని పీల్చుకోవడంలో ఇమిడి ఉన్న ప్రక్రియ ఏది?
1) విసరణం
2) నిపానం
3) ద్రవాభిసరణం
4) బాష్పోత్సేకం
- View Answer
- సమాధానం: 3
33.పచ్చళ్లు దీర్ఘకాలం నిల్వ ఉండటానికి (బ్యాక్టీరియా నశించడానికి) కారణమైన ప్రక్రియ?
1) కోశిక ద్రవ్య సంకోచం (బాహ్య ద్రవాభిసరణం)
2) విసరణ
3) నిపానం
4) బిందుస్రావం
- View Answer
- సమాధానం: 1
34. మొక్కల్లో వేరు పీడనాన్ని కొలిచే సాధనం..
1) పోటోమీటర్
2) మానోమీటర్
3) బారోమీటర్
4) థర్మామీటర్
- View Answer
- సమాధానం: 2
35. కోసిన మొక్క కొన భాగం నుంచి దారురసం కారడానికి కారణం..
1) శ్వాసక్రియ
2) వేరుపీడనం
3) బాష్పోత్సేకం
4) బిందుస్రావం
- View Answer
- సమాధానం: 2
36. పత్రంలో పత్రరంధ్రాలు తెరచుకోవడాన్ని నియంత్రించే కణాలేవి?
1) స్తంభ కణాలు
2) స్పంజి కణాలు
3) రక్షక కణాలు
4) మృదు కణాలు
- View Answer
- సమాధానం: 3
37. బాష్పోత్సేక రేటును కొలిచే పరికరం ఏది?
1) ఆక్సనోమీటర్
2) మానోమీటర్
3) బారోమీటర్
4) పోటోమీటర్
- View Answer
- సమాధానం: 4
38. బిందుస్రావం వేటి ద్వారా జరుగుతుంది?
1) పత్రరంధ్రం
2) జలరంధ్రం
3) గాయాలు
4) వాయు రంధ్రాలు
- View Answer
- సమాధానం: 2
39. ముదిరిన ద్విదళ బీజ కాండాల్లో బాష్పోత్సేకం ఎక్కడ జరుగుతుంది?
1) పత్ర రంధ్రాలు
2) అవభాసిని
3) వాయు రంధ్రాలు
4) బాహ్య చర్మం
- View Answer
- సమాధానం: 3
40. పత్రం తాజా బరువు అత్యధికంగా ఏ సమయంలో ఉంటుంది?
1) ఉదయం
2) సాయంత్రం
3) మధ్యాహ్నం
4) రాత్రి
- View Answer
- సమాధానం: 1
41. ఎంజైమ్లన్నీ వేటితో తయారవుతాయి?
1) కార్బోహైడ్రేట్లు
2) లిపిడ్లు
3) అమైనో ఆమ్లాలు
4) ఖనిజాలు
- View Answer
- సమాధానం:3
42. ఎంజైమ్లు అనేవి మౌలికంగా..
1) ప్రోటీన్లు
2) విటమిన్లు
3) కొవ్వులు
4) చక్కెరలు
- View Answer
- సమాధానం:1
43. కింది వాటిలో ఎంజైమ్లు లేని జీవులేవి?
1) శిలీంధ్రాలు
2) బ్యాక్టీరియాలు
3) వైరస్లు
4) శైవలాలు
- View Answer
- సమాధానం: 3
44. ఈస్ట్ అనే శిలీంధ్రంలో గుర్తించిన మొట్ట మొదటి ఎంజైమ్ ఏది?
1) ఐసోమరేజ్
2) ఆల్డలోజ్
3) జైమేజ్
4) ఆక్సిడేజ్
- View Answer
- సమాధానం: 3
45. ‘ఎంజైమ్’ అనే పదాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు?
1) బుక్నర్
2) కూనె
3) ఫంక్
4) సమ్నర్
- View Answer
- సమాధానం: 2
46. ఆకుపచ్చని మొక్కలు వేటిని తయారు చేస్తాయి?
1) చక్కెరలు, కొవ్వులు, ప్రోటీన్లు
2) చక్కెరలను మాత్రమే
3) చక్కెరలు, పిండి పదార్థాలు
4) చక్కెరలు, కొవ్వులను మాత్రమే
- View Answer
- సమాధానం: 1
47. కాంతి శక్తి నుంచి రసాయన శక్తి ఏర్పడే క్రియ..
1) స్వాంగీకరణం
2) కాంతి విశ్లేషణ
3) కిణ్వనం
4) కిరణజన్య సంయోగక్రియ
- View Answer
- సమాధానం: 4
48. కర్బన స్వాంగీకరణ ఏ కాంతిలో తీవ్రంగా జరుగుతుంది?
1) అధిక కాంతి
2) ఆకుపచ్చ కాంతి
3) నీలి రంగు కాంతి
4) అరుణ కాంతి
- View Answer
- సమాధానం: 4
49. అయోడిన్ ద్రావణ పరీక్షను వేటిని గుర్తించడానికి ఉపయోగిస్తారు?
1) ప్రోటీన్లు
2) లిపిడ్లు
3) పిండి పదార్థాలు
4) నూనెలు
- View Answer
- సమాధానం:3
50. కిరణజన్య సంయోగక్రియ ప్రత్యేక లక్షణం?
1) కార్బోహైడ్రేట్ల ఉత్పత్తి
2) ఆక్సిజన్ విడుదల
3) కాంతిశక్తి రసాయన శక్తిగా మారడం
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 3
51. కిరణజన్య సంయోగక్రియలో మొదటగా ఏర్పడే స్థిర పదార్థం ఏది?
1) అమైనో ఆమ్లం
2) పిండి పదార్థం
3) ఫాస్పోగ్లిజరిక్ ఆమ్లం (పీజీఏ)
4) ఇన్సులిన్
- View Answer
- సమాధానం: 3
52. నిష్కాంతి చర్యలో CO2ను స్వీకరించే తొలి పదార్థం ఏది?
1) NADP
2) పైరిడాక్సిన్
3) RuBP
4) సైటోక్రోమ్
- View Answer
- సమాధానం:3
53. జీవ శక్తికి మూలాధారం ఏది?
1) గ్లూకోజ్
2) సూర్యకాంతి
3) ATP
4) మైటోకాండ్రియా
- View Answer
- సమాధానం: 2