వృక్ష బాహ్య స్వరూప శాస్త్రం
1. భూమిపై వృక్షాలు లేకపోతే జీవులన్నీ మరణిస్తాయి. కారణం..
1) ఆక్సిజన్ లేకపోవడం
2) కార్బన్ డై ఆక్సైడ్ లోపించడం
3) 1, 2
4) ఏదీకాదు
- View Answer
- సమాధానం: 1
2. మడ అడవులు అంటే ఏమిటి?
1) నీటి మొక్కలు
2) ఉప్పు నీటి వృక్షాలు
3) పండ్లనిచ్చే వృక్షాలు
4) శైవలాలు
- View Answer
- సమాధానం:2
3. ‘హైడ్రోపోనిక్స్’ అంటే ఏమిటి?
1) వాతావరణం, నీరు అవసరం లేకుండా మొక్కలు పెంచే పద్ధతి
2) తడిగాలిని పంపించి మొక్కలు పెంచే పద్ధతి
3) మృత్తిక అవసరం లేకుండా మొక్కలను పెంచే పద్ధతి
4) ఏదీకాదు
- View Answer
- సమాధానం: 3
4. హెర్బేరియం అనేది ఒక..
1) ఎండు ఔషధ మొక్కల సంకలనం
2) వివిధ ఔషధ మొక్కల తోట
3) ఎండు మొక్కల నమూనాలను భద్రపరిచే సంస్థ
4) ఎండు విత్తనాలను నిల్వ చేసే సంస్థ
- View Answer
- సమాధానం: 3
5. కాఫీలో రుచి కోసం కలిపే చికోరి పౌడర్‌ను మొక్క ఏ భాగం నుంచి సంగ్రహిస్తారు?
1) కాండం
2) వేరు
3) పత్రాలు
4) గింజలు
- View Answer
- సమాధానం: 2
6.రాడిష్ అనేది ఒక..
1) బల్బ్
2) ట్యూబర్
3) మార్పు చేసిన వేరు
4) అభివృద్ధి చెందిన కాండం
- View Answer
- సమాధానం:3
7. వేర్లలో బుడిపెలు ఉన్న పంట వేస్తే.. భూమిలో ఎక్కువగా లభ్యమయ్యే మూలకం ఏది?
1) కాల్షియం
2) పొటాషియం
3) భాస్వరం
4) నత్రజని
- View Answer
- సమాధానం: 4
8. నత్రజనిని అమ్మోనియాగా మార్చే మొక్క ఏది?
1) వరి
2) గోధుమ
3) మొక్కజొన్న
4) వేరుశనగ
- View Answer
- సమాధానం:4
9. కింది వాటిలో వరి పంటకు బయోఫెర్టిలైజర్లుగా ఉపయోగపడే జీవులేవి?
1) నీలి ఆకుపచ్చ శైవలాలు
2) రైజోబియం
3) మైకోరైజా
4) అజిటోబ్యాక్టర్
- View Answer
- సమాధానం: 1
10.కాయగూరగా అల్లం అనేది ఒక...
1) కండ కలిగిన వేరు
2) కండ కలిగిన కాండం
3) నిల్వ చేసే వేరు
4) ఉప వాయుగత కాండం
- View Answer
- సమాధానం: 2
11. కింది వాటిలో ఏ పంట విత్తనాల ద్వారా పునరుజ్జీవనం పొందదు?
1) బఠాణీ
2) కాలీఫ్లవర్
3) టమాటా
4) బంగాళాదుంప
- View Answer
- సమాధానం:4
12. కింది వాటిలో ఏ పంటను పండించినప్పుడు సాగుభూమి క్షయానికి గురవుతుంది?
1) గోధుమ
2) బంగాళాదుంప
3) జొన్న
4) లవంగాలు
- View Answer
- సమాధానం: 2
13. కింది వాటిలో శిలీంధ్రానికి, ఎత్తై వృక్షాల వేర్లకు సంబంధం ఏది?
1) బయోఫెర్టిలైజర్
2) మాంగ్రూవ్లు
3) కొరల్లాయిడ్ వేరు
4) మైకోరైజా
- View Answer
- సమాధానం: 4
14.వృక్షాల వయసును ఏ పద్ధతి ద్వారా నిర్ధారించవచ్చు?
1) చెట్టు పొడవును కొలవడం
2) చెట్టు వ్యాసాన్ని కొలవడం
3) వృక్షాల రసవిశ్లేషణ ద్వారా
4) ఏటా ఏర్పడే వార్షిక వలయాలను లెక్కించడం
- View Answer
- సమాధానం: 4
15. అతిచిన్న పుష్పం కలిగిన మొక్క ఏది?
1) ఉల్ఫియా
2) టేబుల్ రోజ్
3) రోజ్
4) డెలొనిక్స్
- View Answer
- సమాధానం: 2
16. ‘సల్ఫర్ షవర్‌స’ అంటే ఏమిటి?
1) పసుపు రంగు పుప్పొడి రేణువులు గాలిలోకి విడుదలవడం
2) పెనస్ అడవుల నుంచి పసుపు రంగు పుప్పొడి రేణువులు విస్తారంగా గాలిలోకి విడుదలవడం
3) సల్ఫర్ తయారు చేసే ఫ్యాక్టరీల నుంచి గాలిలోకి సల్ఫర్ పొడి వెలువడటం
4) సమీప సల్ఫర్ మైన్ల నుంచి అధిక మొత్తంలో సల్ఫర్ రేణువులు విడుదల వడం
- View Answer
- సమాధానం: 2
17. స్త్రీ, పురుష పుష్పాలున్న మొక్కను ఏమని పిలుస్తారు?
1) బెసైక్సువల్
2) ద్విలింగాశ్రయి
3) ఏకలింగాశ్రయి
4) మోనోగామస్
- View Answer
- సమాధానం:2
18. కుంకుమ పువ్వు (శాఫ్రాన్) చెట్టు ఏ భాగం నుంచి కుంకుమపువ్వును సేకరిస్తారు?
1) ఎండిన రక్షక పత్రాలు
2) ఎండిన పూ మొగ్గలు
3) కీలాగ్రం
4) ఎండిన ఆకర్షణ పత్రాలు
- View Answer
- సమాధానం: 3
19. కుంకుమ పువ్వును భారత్‌లో ఎక్కడ పండిస్తారు?
1) డార్జిలింగ్
2) నీలగిరి పర్వతాలు
3) మధ్యప్రదేశ్
4) జమ్ము-కశ్మీర్
- View Answer
- సమాధానం: 4
20. ద్విలింగ పుష్పాల్లో అండాశయం (గైనీషియం), కేసరావళి (ఆండ్రూషియం) వివిధ కాలాల్లో పక్వానికి వస్తే.. ఆ ప్రక్రియను ఏమంటారు?
1) హెర్కోగమీ
2) డైకోగమీ
3) హెటిరోగమీ
4) మోనోగమీ
- View Answer
- సమాధానం: 2
21. కీటకాల ద్వారా జరిగే పరాగ సంపర్కాన్ని ఏమని పిలుస్తారు?
1) ఎనిమోఫిలి
2) హైడ్రోఫిలి
3) ఎంటమోఫిలి
4) ఆర్నిథోఫిలిs
- View Answer
- సమాధానం: 3
22. వేటి ద్వారా జరిగే పరాగ సంపర్కాన్ని ‘కాంథరోఫిలి’ అంటారు?
1) పక్షులు
2) తేనెటీగలు
3) సీతాకోకచిలుకలు
4) పాములు
- View Answer
- సమాధానం: 3
23. ద్విఫలదీకరణం కింది వాటిలో ఏ మొక్కల ప్రత్యేక లక్షణం?
1) ఆవృత బీజాలు
2) వివృత బీజాలు
3) ఫంగై
4) బ్రయోఫైటా
- View Answer
- సమాధానం: 1
24. ఫలదీకరణ తర్వాత పుష్పంలోని ఏ భాగం బీజంగా మారుతుంది?
1) స్టిగ్మా
2) ఓవరీ
3) ఓవ్యూల్
4) పిస్టిల్
- View Answer
- సమాధానం: 3
25. కింది వాటిలో మెత్తని పండు (బెర్రీ) ఏది?
1) అరటి
2) మామిడి
3) అనాస
4) కొబ్బరి
- View Answer
- సమాధానం: 1
26. పండ్లలో చక్కెర ఏ రూపంలో ఉంటుంది?
1) సుక్రోజ్
2) గ్లూకోజ్
3) ఫ్రక్టోజ్
4) హెక్సోజ్
- View Answer
- సమాధానం: 3
27. ఆపిల్‌లో తినడానికి ఉపయోగపడే భాగం?
1) థాలమస్
2) కార్పెల్
3) ఎండోకార్ప్
4) మోనోకార్ప్
- View Answer
- సమాధానం: 1
28. టమాటా, వంకాయ, మిర్చి అనేవి ఏ కుటుంబానికి చెందినవి?
1) గ్రామినే
2) సొలనేసి
3) మాల్వేసి
4) ఆస్టరేసి
- View Answer
- సమాధానం: 2
29. ఉమ్మెత్తలో ఏ రకమైన ఫలం ఉంటుంది?
1) సెప్టిసైడల్
2) లోక్యులిసైడల్
3) సెప్టిప్రాగల్
4) బెర్రి
- View Answer
- సమాధానం: 3
30. కొన్ని వృక్ష జాతుల్లో పండ్ల వృద్ధి ఫలదీకరణ లేకుండా జరుగుతుంది. ఈ దృగ్విషయాన్ని ఏమంటారు?
1) అపోకార్పి
2) అపోగమి
3) పార్థినోకార్పి
4) సింగమి
- View Answer
- సమాధానం: 3
31. కాఫీ విత్తనాల్లో తినే భాగాన్ని ఏమంటారు?
1) టపెటమ్
2) కారంకుల్
3) ఎరిల్
4) పరిచ్ఛదం
- View Answer
- సమాధానం:4
32. కింది వాటిలో ఏ వృక్షం.. ఫలాలను కాకుండా గింజలను ఉత్పత్తి చేస్తుంది?
1) ఆల్మండ్ (బాదం)
2) ఆవాలు
3) సైకస్
4) వేరుశనగ
- View Answer
- సమాధానం: 3
33. కాల్చుకొని తినే ‘చిల్గోజా’ అనే విత్తనం ఏ మొక్క నుంచి లభిస్తుంది?
1) సైకస్
2) పైనస్
3) నీటమ్
4) యూకలిప్టస్
- View Answer
- సమాధానం: 2
34. ‘ది రైపైడ్ ఫ్రూట్ ఆఫ్ ఇండియా’ అని ఏ ఫలాన్ని పిలుస్తారు?
1) అనాస
2) పనస
3) జీడిమామిడి
4) మామిడి
- View Answer
- సమాధానం: 4
35. కింది వాటిలో వాస్తవంగా పండు (ఫలం) కానిది ఏది?
1) ఆపిల్
2) జీడిపిక్క/జీడిమామిడి
3) కొబ్బరి
4) 1, 2
- View Answer
- సమాధానం: 4
36. అంతరించిపోయే దశలో ఉన్న ఫలం ఏది?
1) అనాస
2) అరటి
3) నిమ్మ
4) మామిడి
- View Answer
- సమాధానం: 2
37. పిల్లోక్లాడ్ (పత్రాభ కాండం) కింది వాటిలో ఏ ఎడారి మొక్కలో ఉంటుంది?
1) ఒపెన్షియా
2) కోకోలోబా
3) కాజురైనా
4) పైవన్నీ
- View Answer
- సమాధానం:4
38. నెపంథిస్ (కీటకాహార) మొక్కలో కూజా లాంటి నిర్మాణం దేని రూపాంతరం?
1) పత్రపీఠం
2) పత్రదళం
3) పత్రాగ్రం
4) పత్రపుచ్ఛం
- View Answer
- సమాధానం: 2
39. కింది వాటిలో మాంసాహార (కీటకాహార) మొక్క ఏది?
1) నెపంథిస్
2) డ్రోసెరా - డయోనియా
3) యుట్రిక్యులేరియా
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
40. కింది వాటిలో పత్రాల ద్వారా కొత్త మొక్కలను ఉత్పత్తి చేసే మొక్క ఏది?
1) బ్రయోపిల్లమ్ (రణపాల)
2) బెగోనియా
3) సిల్లా
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
41. ‘తంగేడు’ శాస్త్రీయ నామం ఏమిటి?
1) కేసియా ఆరిక్యులేట
2) కేసియా ఆక్సిడెంటాలిస్
3) కేసియా టొర
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 1
42. తంగేడు పుష్పవిన్యాసం ఏ రకానికి చెందింది?
1) సమశిఖి
2) స్పాడిక్స్
3) శీర్షావత్ పుష్పవిన్యాసం
4) గుచ్ఛం
- View Answer
- సమాధానం: 1
43.అతిపెద్ద పుష్పాలను ఉత్పత్తి చేసే వేరు పరాన్న జీవి మొక్క ఏది?
1) రఫ్లీషియా
2) పొగాకు మల్లె
3) సాంటాలమ్
4) పొద్దు తిరుగుడు
- View Answer
- సమాధానం: 1
44. ఊడవేర్లు ఏ మొక్కలో ఉంటాయి?
1) మామిడి
2) మర్రి
3) నరమామిడి
4) జొన్న
- View Answer
- సమాధానం: 2
45.ఊడవేర్లు ఏ మొక్కలో ఉంటాయి?
1) మామిడి
2) మర్రి
3) నరమామిడి
4) జొన్న
- View Answer
- సమాధానం: 4
46. అరటిలో ఉండే వాయుగత కాండం ఒక..
1) నిజమైన కాండం
2) మిథ్యా కాండం
3) కందం
4) పిలక మొక్క
- View Answer
- సమాధానం: 2
47.ఆలుగడ్డ (బంగాళాదుంప)లోని కన్నుల ప్రయోజనం ఏమిటి?
1) ఆహారం నిల్వ చేయడం
2) శాఖీయ ప్రత్యుత్పత్తి
3) లైంగిక ప్రత్యుత్పత్తి
4) ఏదీకాదు
- View Answer
- సమాధానం: 2
48.కింది వాటిలో అతిపెద్ద బహువార్షిక గుల్మం ఏది?
1) యూకలిప్టస్
2) సిక్వొయా జైగాన్షియా
3) ఉల్ఫియా
4) అరటి (మ్యూసా పారడైసియాక)
- View Answer
- సమాధానం: 4
49. అతి పొడవైన ఆవృతబీజ మొక్క ఏది?
1) యూకలిప్టస్
2) సిక్వొయా జైగాన్షియా
3) పామ్ మొక్క
4) అరటి
- View Answer
- సమాధానం:1
50. జీవించి ఉన్న వృక్షాల్లో (వివృత బీజం) అత్యంత పొడవైంది ఏది?
1) యూకలిప్టస్
2) సిక్వొయా డెండ్రాన్ జైగాన్షియా
3) దేవదారు
4) ట్రీ ఫెర్‌న
- View Answer
- సమాధానం:2
51.ఆహారంగా ఉపయోగపడే కాలీఫ్లవర్ అనేది ఒక..?
1) పత్రాల సముదాయం
2) రసయుత పుష్పవిన్యాసం
3) ఫలవంతమైన పుష్పాలు ఉండే శాఖ
4) భూగర్భ కాండ రూపాంతరం
- View Answer
- సమాధానం: 2
52. కింది వాటిలో అతిపెద్ద ఆకు కలిగిన మొక్క ఏది?
1) రఫ్లీషియా ఆర్నాల్డీ
2) విక్టోరియా అమెజోనికా
3) ఉల్ఫియా
4) లెమ్నా
- View Answer
- సమాధానం: 2
53. చందన చెట్టు శాస్త్రీయ నామమేమిటి?
1) సాంటాలమ్ ఆల్బం
2) షోరియా రొబెస్టా
3) సిడ్రిస్ డియోడరా
4) పైనస్ రాక్స్ బర్గీ
- View Answer
- సమాధానం: 1
54. జతపరచండి.
1) i-A, ii-B, iii-C, iv-D మొక్క భాగం ఆహారంగా ఉపయోగపడేది i) క్యారెట్ A) భూగర్భ కాండం ii) అల్లం B) పత్రపీఠాలు iii) నీరుల్లి C) శాఖీయ మొగ్గ iv) క్యాబేజీ D) దుంపవేర్లు
2) i-D, ii-A, iii-B, iv-C
3) i-B, ii-A, iii-C, iv-D
4) i-D, ii-A, iii-C, iv-B
- View Answer
- సమాధానం: 2
55.జతపరచండి.
మొక్క భాగం | ఉపయోగపడే భాగం |
i) శాఫ్రాన్ | A) పరిచ్ఛదం |
ii) లవంగాలు | B) ఎండిన విప్పారని మొగ్గ |
iii) క్వీన్ ఆఫ్ స్పైసెస్ | C) కీలాగ్రం |
iv) కాఫీ | D) ఫలం |
2) i-A, ii-B, iii-C, iv-D
3) i-C, ii-B, iii-D, iv-A
4) i-B, ii-C, iii-D, iv-A
- View Answer
- సమాధానం: 3
56. కొత్తిమీర (ధనియాలు) శాస్త్రీయ నామం?
1) కొరియాండర్ సెటైవమ్
2) డాకస్ కరొటా
3) ట్రైడాక్స్ ప్రొకంబెన్స
4) క్యుమినమ్ సిమినమ్
- View Answer
- సమాధానం: 1