సూక్ష్మజీవశాస్త్రం - వ్యాధులు
1. కింది వాటిలో వైరస్ ద్వారా సంక్రమించే వ్యాధి ఏది?
1) టెటానస్
2) కలరా
3) మశూచి
4) ప్లేగు
- View Answer
- సమాధానం:3
2. ‘ఎబోలా వైరస్’ పేరు దేనికి సంబంధించింది?
1) ఎడారి
2) సముద్రం
3) నది
4) ఆటవిక తెగ
- View Answer
- సమాధానం: 3
3. ఎబోలా వ్యాధి దేని ద్వారా వ్యాపిస్తుంది?
1) రక్తం, వీర్యం
2) లాలాజలం, చెమట
3) బుష్మీట్, అడవి జంతువుల మాంసం
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
4. ఎబోలా వ్యాధి దేని ద్వారా వ్యాప్తి చెందదు?
1) రక్తం, వీర్యం
2) అడవి జంతువుల మాంసం
3) గాలి
4) చెమట, వాంతులు
- View Answer
- సమాధానం: 3
5. ఎబోలా వైరస్‌కు రిజర్వాయర్ అతిథేయి (ఆశ్రయ జంతువు) ఏది?
1) చింపాంజీ
2) ఫ్రూట్‌బ్యాట్స్ (పండ్ల గబ్బిలాలు)
3) గొరిల్లాలు
4) కోతులు
- View Answer
- సమాధానం: 2
6. ‘సజీవులు - నిర్జీవులకు వారధి’గా ఏ సూక్ష్మజీవులను పేర్కొంటారు?
1) బ్యాక్టీరియా
2) వైరస్లు
3) శిలీంధ్రాలు
4) ప్రోటోజొవా పరాన్నజీవులు
- View Answer
- సమాధానం: 2
7. రేబిస్ (హైడ్రోఫోబియా) వ్యాధికారకం?
1) వైరస్
2) శిలీంధ్రాలు
3) బ్యాక్టీరియా
4) ప్లాస్మోడియం
- View Answer
- సమాధానం: 1
8. శీతల జ్వరం అని ఏ వ్యాధికి పేరు?
1) మలేరియా
2) టైఫాయిడ్
3) ఎబోలా
4) స్వైన్ ఫ్లూ
- View Answer
- సమాధానం: 4
9. పోలియో వ్యాధి దేని వల్ల వ్యాపిస్తుంది?
1) కలుషిత ఆహారం
2) కలుషిత నీరు
3) ఈగలు
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
10. పోలియో వ్యాధి సంక్రమించిన చిన్నారిలో ఏ అవయవం ప్రభావితమవుతుంది?
1) కాళ్లు
2) చేతులు
3) నడుము
4) చాలకనాడులు
- View Answer
- సమాధానం: 4
11. ఎయిడ్స్ వ్యాధిని మొదటగా 1981లో ఏ దేశంలో గుర్తించారు?
1) ఇండియా
2) పాకిస్తాన్
3) దక్షిణాఫ్రికా
4) అమెరికా
- View Answer
- సమాధానం: 4
12. ఎయిడ్స్ వ్యాధి వ్యాప్తి చెందే విధానం?
1) అసురక్షిత లైంగిక సంపర్కం
2) కలుషిత సిరంజీలు, సూదులు
3) హెచ్ఐవీ ఉన్న రక్తాన్ని ఎక్కించడం
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
13. కింది వాటిలో ఏవి జన్యు సంబంధ (లింగ సహలగ్న) వ్యాధులు?
1) హిమోఫిలియా
2) వర్ణాంధత్వం
3) తలసేమియా
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
14. లెగ్యూమ్ మొక్కల వేరు బొడిపెల్లో సహజీవనం చేసే బ్యాక్టీరియా?
1) క్లాస్ట్రీడియం
2) ఎశ్చరీషియా కోలై
3) రైజోబియం
4) సూడోమోనాస్
- View Answer
- సమాధానం: 3
15. క్షీరదాల (మానవుడి) ఆహార నాళంలో ఉంటూ B12, K విటమిన్లను ఉత్పత్తి చేసే బ్యాక్టీరియా ఏది?
1) క్లాస్ట్రీడియం
2) రైజోబియం
3) ఎశ్చరీషియాకోలై (ఇ.కోలై)
4) అవచీనా
- View Answer
- సమాధానం: 3
16. సముద్రం పై భాగంలో ఏర్పడిన చమురు తెట్టును విచ్ఛిన్నం చేసే బ్యాక్టీరియా?
1) పాశ్చురెల్లా
2) సూడోమోనాస్ పుటిడా
3) బాసిల్లస్ దురెంజియెన్సిస్
4) మైకోబ్యాక్టీరియం లెఫ్రే
- View Answer
- సమాధానం: 2
17. కింది వాటిలో ఏ బ్యాక్టీరియాను బయో -పెస్టిసైడ్/ బయో-ఇన్సెక్టిసైడ్ అంటారు?
1) ఎశ్చరీషియా కోలై
2) స్ట్రెప్టోమైసిన్
3) మిథనోకోకస్
4) బాసిల్లస్ దురెంజియెన్సిస్ (బి.టి.)
- View Answer
- సమాధానం: 4
18. టైఫాయిడ్ వ్యాధి వల్ల మానవ శరీరంలోని ఏ అవయవం ప్రభావితమవుతుంది?
1) మూత్రపిండాలు
2) కాలేయం
3) చిన్నపేగులు
4) గుండె
- View Answer
- సమాధానం: 3
19. ప్రభుత్వం క్షయవ్యాధి నివారణ కోసం ప్రవేశ పెట్టిన కార్యక్రమం పేరు?
1) M.D.T.
2) DOTS
3) ఇంద్రధనస్సు
4) రెడ్ రిబ్బన్
- View Answer
- సమాధానం: 2
20. 0-5 ఏళ్ల లోపు పిల్లలకు మాత్రమే వచ్చే వ్యాధి/వ్యాధులు?
1) డిప్తీరియా
2) కోరింత దగ్గు
3) ధనుర్వాతం, మీజిల్స్
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
21. కింది వాటిలో వైరస్ ద్వారా సంక్రమించని వ్యాధి ఏది?
1) ఎబోలా
2) డెంగ్యూ
3) ఆంథ్రాక్స్
4) సార్స
- View Answer
- సమాధానం: 3
22. హోమియో వైద్యశాస్త్ర పితామహుడు?
1) విలియం హార్వే
2) గలెన్
3) హిప్పోక్రెటిస్
4) హనిమన్
- View Answer
- సమాధానం:4
23. వైద్యశాస్త్ర పితామహుడు ఎవరు?
1) హనిమన్
2) లూయిపాశ్చర్
3) ఫ్లెమింగ్
4) హిప్పోక్రెటిస్
- View Answer
- సమాధానం: 4
24. ‘విషం’ గురించి చేసే అధ్యయనాన్ని ఏమంటారు?
1) ట్రెమటాలజీ
2) ఫార్మకాలజీ
3) టాక్సికాలజీ
4) ట్రైకాలజీ
- View Answer
- సమాధానం: 3
25. నీలి రంగు సిరలు ఉబ్బి కాళ్లలో కనిపించడాన్ని ఏమంటారు?
1) మంగోలిజం
2) వర్ణాంధత్వం
3) వెరికోజ్ వీన్స్
4) ఆంజీనా పెక్టోరిస్
- View Answer
- సమాధానం: 3
26. టైఫాయిడ్ వ్యాధి నిర్ధారణ కోసం చేసే పరీక్ష?
1) వి.డి.ఆర్.ఎల్. పరీక్ష
2) వైడాల్ టెస్ట్
3) ఎలీసా
4) పి.సి.ఆర్.
- View Answer
- సమాధానం: 2
27. ట్రకోమా అనే బ్యాక్టీరియల్ వ్యాధి శరీరంలోని ఏ భాగానికి సోకుతుంది?
1) చర్మం
2) గుండె
3) ఊపిరితిత్తులు
4) నేత్రం
- View Answer
- సమాధానం: 4
28. సాధారణ జలుబు కారక వైరస్ పేరు?
1) ఆల్ఫా వైరస్
2) హెచ్ఐవీ వైరస్
3) మిక్సో వైరస్
4) రైనో వైరస్
- View Answer
- సమాధానం: 4
29. పశువుల్లో మ్యాడ్-కౌ వ్యాధికి కారణం?
1) బ్యాక్టీరియా
2) ప్రయాన్
3) వైరాయిడ్
4) వైరస్
- View Answer
- సమాధానం: 4
30.హెచ్ఐవీ వైరస్ మానవ శరీరంలో ఏ రక్త కణాలపై దాడి చేస్తుంది?
1) ఆర్.బి.సి.
2) డబ్ల్యు.బి.సి.
3) కాలేయ కణాలు
4) T4 లింఫోసైట్స్
- View Answer
- సమాధానం: 4
31. గాలి ద్వారా వ్యాపించే వ్యాధి?
1) రేబిస్
2) పోలియో
3) గవదబిళ్లలు
4) హెపటైటిస్-బి
- View Answer
- సమాధానం: 3
32. ‘బ్రేక్ బోన్ ఫివర్’ అని ఏ వ్యాధికి పేరు?
1) చికెన్ గున్యా
2) టైఫాయిడ్
3) మెనింజైటిస్
4) డెంగీజ్వరం
- View Answer
- సమాధానం: 4