మానవ వ్యాధులు
1. బొటులిజం (ఫుడ్ పాయిజనింగ్) దేనివల్ల కలుగుతుంది?
1) ప్రోటోజోవా పరాన్నజీవి
2) వైరస్
3) బ్యాక్టీరియా
4) దోమలు
- View Answer
- సమాధానం: 3
2. ఏడాది లోపు శిశువుల్లో కలిగే డయేరియా వ్యాధి కారక వైరస్ ఏది?
1) ప్లావీ వైరస్
2) ఆల్ఫా వైరస్
3) రోటా వైరస్
4) కరోనా వైరస్
- View Answer
- సమాధానం: 3
3. హెచ్ఐవీ వ్యాధిగ్రస్థులు అధికంగా ఉన్న దేశం ఏది?
1) ఇండియా
2) చైనా
3) నైజీరియా
4) దక్షిణాఫ్రికా
- View Answer
- సమాధానం: 4
4. క్షయ వ్యాధికారక బ్యాక్టీరియాను మొదట వర్ధనం చేసిన శాస్త్రవేత్త?
1) లూయిపాశ్చర్
2) రాబర్ట్ కోచ్
3) ఎడ్వర్డ్ జెన్నర్
4) అలెగ్జాండర్ ఫ్లెమింగ్
- View Answer
- సమాధానం: 2
5. కలరా మహమ్మారి మొదట ఏ దేశంలో ప్రబలింది?
1) పాకిస్తాన్
2) భారత్
3) చైనా
4) అమెరికా
- View Answer
- సమాధానం: 2
6. స్త్రీలలో తరచుగా వచ్చే గర్భాశయ ముఖ ద్వార కేన్సర్‌కు కారణమైన వైరస్?
1) కరోనా వైరస్
2) ఎడినో వైరస్
3) హ్యూమన్ పాపిలోమా వైరస్
4) హెర్పిస్ సింపెక్స్ వైరస్
- View Answer
- సమాధానం: 3
7. కింది వాటిలో ఏ వ్యాధి దోమకాటు వల్ల సంక్రమించదు?
1) డెంగ్యూ
2) అతినిద్ర వ్యాధి
3) పైలేరియాసిస్
4) మలేరియా
- View Answer
- సమాధానం: 2
8. మలేరియా నిర్మూలన, వ్యాప్తిని అరికట్టడానికి కింది వాటిలో ఏ ఔషధాన్ని ఉపయోగిస్తున్నారు?
1) క్లోరోమైసిటిస్
2) రిపాంపుసిన్
3) క్లోరోక్విన్
4) హైపర్జిన్
- View Answer
- సమాధానం:3
9. స్వైన్ ఫ్లూ వ్యాధికి కారణమైన వైరస్?
1) H5N1
2) H1N1
3) ఫంగస్
4) H1N5
- View Answer
- సమాధానం: 2
10. బ్రాంకైటిస్ ఏ అవయవానికి వస్తుంది?
1) కాలేయం
2) చిన్నపేగులు
3) ఊపిరితిత్తులు
4) మెదడు
- View Answer
- సమాధానం: 3
11. తుప్పుపట్టిన ఇనుము వస్తువులు గుచ్చుకోవడం వల్ల వచ్చే వ్యాధి?
1) మెదడువాపు
2) చర్మవ్యాధి
3) ధనుర్వాతం
4) ఫైలేరియా
- View Answer
- సమాధానం: 3
12. తొలిసారిగా గుర్తించిన క్రిమి సంహారకం (ఇన్సెక్టిసైడ్) ఏది?
1) నికోటిన్
2) పైరతీన్
3) నింబిన్
4) డి.డి.టి.
- View Answer
- సమాధానం: 4
13. కింది వాటిలో భిన్నమైంది ఏది?
1) అథ్లెట్ ఫూట్
2) జలుబు
3) ఫ్లూ
4) ఎబోలా
- View Answer
- సమాధానం: 1
14.శిశువులకు వచ్చే డిప్తీరియా వ్యాధి వల్ల ఏ అవయవం ప్రభావితమవుతుంది?
1) ముక్కు
2) గొంతు
3) చెవులు
4) కాలేయం
- View Answer
- సమాధానం: 2
15. బ్యాక్టీరియా పేజ్ అనేవి? (సివిల్స్-1995)
1) బ్యాక్టీరియా పెరుగుదలలోని దశలు
2) ఒకరకమైన మృత్తిక బ్యాక్టీరియాలు
3) పరాన్నజీవ బ్యాక్టీరియాలు
4) బ్యాక్టీరియాలను చంపే వైరస్లు
- View Answer
- సమాధానం: 4
16. మొదటిసారిగా వైరస్‌లను రసాయనికంగా స్ఫటికాల రూపంలో వేరుచేసినందుకు 1938లో నోబెల్ బహుమతి పొందిన శాస్త్రవేత్త? (సివిల్స్)
1) ఇవానోవిస్కీ
2) హెచ్.జి.ఖురానా
3) వాట్సన్-క్రిక్
4) డబ్ల్యు.ఎం. స్టాన్లీ
- View Answer
- సమాధానం: 4
17. హెపటైటిస్ దేనికి సంబంధించిన జబ్బు? (గ్రూప్-1, 2002)
1) గుండె మంట
2) కాలేయ మంట
3) మూత్ర పిండాలు చెడిపోవడం
4) రక్తకణాలు నశించడం
- View Answer
- సమాధానం: 2
18. కామెర్ల వ్యాధికి కారణం కలుషితమైన ..... (గ్రూప్-1, 2003)
1) నీరు, ఆహారం
2) రక్తం
3) గాలి
4) 1, 2
- View Answer
- సమాధానం: 4
19. దద్దు లేదా తట్టు (మీజిల్స్) వ్యాధిని నిరోధించగలిగే శక్తి కింది వారిలో ఎవరికి ఉంటుంది?
1) ఏడాది లోపు వయసున్న పిల్లలు
2) 7 నెలలు - సంవత్సరం మధ్య వయసు ఉన్న పిల్లలు
3) రెండేళ్ల వయసు ఉన్న పిల్లలు
4) ఆరు నెలల లోపు వయసున్న పిల్లలు
- View Answer
- సమాధానం: 4
20. వైరస్ అనేది ఒక .... (గ్రూప్-2, 2003)
1) ప్రోటీన్
2) కార్బోహైడ్రేట్
3) నూక్లియస్
4) న్యూక్లియో ప్రోటీన్
- View Answer
- సమాధానం: 4
21. ఏ ప్రాణిలో కేవలం ఒక కేంద్రకామ్లం (డీఎన్ఏ/ ఆర్ఎన్ఏ) మాత్రమే ఉంటుంది? (సివిల్స్-1999)
1) అమీబా
2) బ్యాక్టీరియా
3) వైరస్
4) మొక్క కణం
- View Answer
- సమాధానం: 3
22. వైరస్ ప్రభావానికి గురైన శరీర కణాలు తయారు చేసే ప్రోటీన్ ఏది? (వాటర్ వర్క్స్ మేనేజర్-2008)
1) ఇంటర్ పెరాన్స్
2) హైబ్రిడోమా
3) గమ్మాగ్లోబ్యులిన్లు
4) టాక్సిన్స్
- View Answer
- సమాధానం:1
23. వైరస్ రేణువును ఏమంటారు?
1) ప్రియాన్
2) వైరాయిడ్
3) విరియాన్
4) న్యూక్లియాయిడ్
- View Answer
- సమాధానం: 3
24. క్షయ వ్యాధి నివారణ కోసం.. పుట్టిన పిల్లలకు ఇచ్చే వ్యాక్సిన్ ఏది?
1) ట్రిపుల్ యాంటీజెన్
2) బి.సి.జి.
3) ఒ.పి.వి.
4) టి.ఎ.బి.
- View Answer
- సమాధానం: 2
25. వ్యాక్సిన్‌ను కనిపెట్టిన శాస్త్రవేత్త .... (ఏపీ మైన్స-2011)
1) విలియం హార్వే
2) అలెగ్జాండర్ ఫ్లెమింగ్
3) ఎడ్వర్డ్ జెన్నర్
4) బెర్నార్డ్
- View Answer
- సమాధానం: 3
26.ప్రపంచంలో మొదటి యాంటీబయాటిక్ ఔషధం ఏది? (ఇన్స్టిట్యూట్ ఆఫ్ సర్వే అండ్ లాండ్స్-2008)
1) నొకార్డిన్
2) స్ట్రెప్టోమైసిన్
3) పెన్సిలిన్
4) క్వినైన్
- View Answer
- సమాధానం:3
27. సూక్ష్మజీవనాశిని ‘పెన్సిలిన్’ను దేని నుంచి సంగ్రహిస్తారు?
1) బ్యాక్టీరియా
2) బూజు (ఫంగస్)
3) వైరస్
4) శైవలం
- View Answer
- సమాధానం: 2
28. భారత్ మొదటిసారిగా జన్యుపరంగా తయారు చేసిన టీకా మందు ఏది? (గ్రూప్-1, 2010)
1) మలేరియా వ్యాక్సిన్
2) TAB వ్యాక్సిన్
3) బి.సి.జి.
4) హెచ్.బి.వి.
- View Answer
- సమాధానం: 4