కణ జీవశాస్త్రం
1. కింది వాటిలో ‘కణ ఆత్మహత్య సంచులు (కోశాలు)’ అని వేటిని పిలుస్తారు?
1) రైబోజోమ్స్
2) గాల్జీ సంక్లిష్టం
3) లైసోజోమ్స్
4) న్యూక్లియోజోమ్స్
- View Answer
- సమాధానం: 3
2. ప్రకృతిలో ఏ కర్బన సంబంధ సమ్మేళనం సమృద్ధిగా లభిస్తుంది?
1) గ్లూకోజ్
2) సెల్యులోజ్
3) ఫ్రక్టోజ్
4) సుక్రోజ్
- View Answer
- సమాధానం: 2
3. ‘కణాల శక్తి కేంద్రాలు’గా వేటిని పిలుస్తారు?
1) క్లోరోప్లాస్ట్
2) రైబోజోమ్స్
3) మైటోకాండ్రియా
4) లైసోజోమ్స్
- View Answer
- సమాధానం: 3
4. కిరణజన్య సంయోగ క్రియ జరిగే స్థానం (ప్రాంతం)?
1) ఆకు మొత్తం
2) మొక్క మొత్తం
3) ఆకు టిష్యూ
4) క్లోరోప్లాస్ట్
- View Answer
- సమాధానం:4
5. కణంలో న్యూక్లియస్ కాకుండా ఏ ఇతర జీవకణం DNAను కలిగి ఉంటుంది?
1) మైటోకాండ్రియా
2) హరితరేణువు
3) గాల్జీ సంక్లిష్టం
4) 1, 2
- View Answer
- సమాధానం: 4
6. ‘కణం లోపల కణం’గా దేన్ని భావిస్తారు?
1) రైబోజోమ్స్
2) క్లోరోప్లాస్ట్
3) లైసోజోమ్స్
4) గాల్జీ సంక్లిష్టం
- View Answer
- సమాధానం: 2
7. కింది వాటిలో వృక్ష కణాల్లో ఉండి, జంతుకణాల్లో లోపించేది ఏది?
1) పిండి పదార్థం
2) కొవ్వు పదార్థం
3) ప్రోటీన్
4) సెల్యులోజ్
- View Answer
- సమాధానం: 4
8.‘కణ మేధస్సు’ అని దేన్ని పేర్కొంటారు?
1) కేంద్రకం
2) కేంద్రకాంశం
3) రైబోజోమ్స్
4) మైటోకాండ్రియా
- View Answer
- సమాధానం: 1
9. ప్రోటీన్ల సంశ్లేషణలో ప్రముఖ పాత్ర వహించే కణంలోని భాగాలేవి?
1) లైసోజోమ్స్, సెంట్రోజోమ్స్
2) గాల్జీ సంక్లిష్టం, మైటో కాండ్రియా
3) ఎండోప్లాస్మిక్ రెటిక్యులమ్, రైబోజోమ్స్
4) లైసోజోమ్స్, మైటోకాండ్రియా
- View Answer
- సమాధానం: 3
10.కణాన్ని సూక్ష్మదర్శిని కింద పరిశీలించిన మొదటి శాస్త్రవేత్త ఎవరు?
1) రాబర్డ్ బ్రౌన్
2) ఎ.వి.లీవెన్ హుక్
3) రాబర్ట్ హుక్
4) ఎం.జె.ష్లైడన్
- View Answer
- సమాధానం: 3
11.సరళ సూక్ష్మదర్శినిని కనుగొన్న శాస్త్రవేత్త?
1) డార్విన్
2) మెండల్
3) ఆంటోనీవాన్ లీవెన్ హుక్
4) హన్సన్
- View Answer
- సమాధానం: 3
12. వాణిజ్యపరంగా కార్క అనేది ఏ వృక్షం నుంచి తీసే బెండు ...
1) ఎల్మ్
2) ఓక్
3) వూపుల్
4) విల్లో
- View Answer
- సమాధానం: 2
13. ‘ప్రతి ఒక జీవరాశి.. కణం అనే ప్రాథమిక అంశంతో నిర్మితమై ఉంటుంది. ప్రతి కణం ప్రాథమికంగా నిర్మాణాత్మక, క్రియాత్మక ప్రమాణం’ అని కణ సిద్ధాంతంలో ఒక ముఖ్య అంశంగా పేర్కొన్న వారెవరు?
1) డార్విన్
2) లూయీ పాశ్చర్
3) మెండల్
4) ష్లైడన్ - ష్వాన్
- View Answer
- సమాధానం: 4
14.వృక్ష కణం కణకవచం సెల్యులోజ్తో నిర్మితమై ఉంటుంది. సెల్యులోజ్ అనేది ఒక..
1) ప్రోటీన్
2) ఆమైనోఆమ్లం
3) పాలీ శాకరైడ్
4) లిపిడ్
- View Answer
- సమాధానం: 3
15.జంతు రాజ్యంలో అతి పొడవైన కణం
1) ఆస్ట్రిచ్ అండం
2) నాడీ కణం
3) శుక్రకణం
4) మైకోప్లాస్మా
- View Answer
- సమాధానం: 2
16. వృక్ష రాజ్యంలో అతి పెద్ద కణం
1) సైకస్ అండం
2) ఆస్ట్రిచ్ అండం
3) నాడీ కణం
4) ఆసిటాబ్యులేరియా శైవల కణం
- View Answer
- సమాధానం: 1
17. వృక్ష కణంలోని నిర్జీవ భాగం ఏది?
1) కేంద్రకం
2) కణద్రవ్యం
3) కణ త్వచం
4) కణకవచం
- View Answer
- సమాధానం: 4
18.మధ్యపటలికలో ఉండే రసాయన పదార్థం ఏది?
1) సెల్యులోజ్
2) సూబరిన్
3) కాల్షియం పెక్టేట్
4) లిగ్నిన్
- View Answer
- సమాధానం: 3
19. కింది వాటిలో పండిన ఫలాల్లో ఉండే కణ కవచ పదార్థం ఏది?
1) సెల్యులోజ్
2) సూబరిన్
3) కైటిన్
4) పెక్టిన్
- View Answer
- సమాధానం: 4
20. బెండు కణాల కవచంలో ఉండే రసాయన పదార్థం ఏది?
1) లిగ్నిన్
2) కైటిన్
3) సూబరిన్
4) క్యూటిన్
- View Answer
- సమాధానం: 3
21.కింది వాటిలో ఏ కణాంగం జంతు, వృక్ష కణాల్లో ఒకే పనిని నిర్వహిస్తుంది?
1) ప్లాస్మా పొర
2) కణకవచం
3) హరిత రేణువు
4) ఆహార రిక్తిక
- View Answer
- సమాధానం: 1
22. జీవానికి భౌతిక ఆధారం ఏది?
1) కణరసం
2) జీవ పదార్థం
3) సైటోప్లాజమ్
4) కేంద్రక రసం
- View Answer
- సమాధానం: 2
23. కేంద్రక రహిత సజీవ పరిపక్వ కణం ఏది?
1) దారు నాళం
2) చాలనీనాళ మూలకాలు
3) దృఢ కణజాలం
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 2
24. కేంద్రకం నిర్వహించే క్రియ ఏది?
1) శ్వాసక్రియ
2) స్రావ క్రియ
3) ప్రోటీన్ల సంశ్లేషణ
4) కణ జీవన నియంత్రణ క్రియ
- View Answer
- సమాధానం:4
25. అనువంశికతకు వాహకం ఏది?
1) కేంద్రకం
2) జీవ పదార్థం
3) కణ ద్రవ్యం
4) ప్లాస్టిడ్
- View Answer
- సమాధానం: 1
26. కణంలో పదార్థాల సరఫరాకు ఉపయోగపడే త్వచ నిర్మిత కాలువల వ్యవస్థ ఏది?
1) మైటో కాండ్రియా
2) లైసోజోమ్లు
3) అంతర్జీవ ద్రవ్యజాలం
4) క్రొమాటిడ్ వలయం
- View Answer
- సమాధానం: 3
27. కింది వాటిలో ప్రోటీన్ల సంశ్లేషణతో సంబంధం కలిగింది ఏది?
1) మైటోకాండ్రియా
2) రైబోజోమ్లు
3) గాల్జీ దేహాలు
4) సెంట్రోజోమ్
- View Answer
- సమాధానం: 2
28. కింది వాటిలో ‘అతి పురాతన కణాంగాలు’గా వేటిని పేర్కొంటారు?
1) మైటోకాండ్రియా
2) గాల్జీ సంక్లిష్టం
3) రైబోజోమ్లు
4) లైసోజోమ్స్
- View Answer
- సమాధానం: 3
29. లైసోజోమ్లు ఎక్కువగా ఉండే కణాలేవి?
1) ఎర్రరక్త కణాలు
2) విసర్జక కణాలు
3) గ్రంథి కణాలు
4) జీర్ణక్రియ జరిగే కణాలు
30. మైటో కాండ్రియాలు ఏ క్రియలో దోహదపడతాయి?
1) ప్రోటీన్ల సంశ్లేషణ
2) శ్వాసక్రియ
3) కిరణజన్య సంయోగక్రియ
4) బాష్పోత్సేకం
- View Answer
- సమాధానం: 2
31. కింది వాటిలో మైటోకాండ్రియాలు వేటిలో మినహా అన్ని కణాల్లో ఉంటాయి?
1) శిలీంధ్రాలు
2) బ్యాక్టీరియాలు, నీలి ఆకుపచ్చ శైవలాలు
3) టెరిడోఫైట్లు
4) ఆవృత బీజాలు
- View Answer
- సమాధానం: 2
32. కింద పేర్కొన్న వాటిలో దేనిలో ఒకే ఒక మైటోకాండ్రియా ఉంటుంది?
1) మైక్రోస్టీరియాస్
2) రైజోపస్
3) నాస్టాక్
4) యూలోథ్రిక్స్
- View Answer
- సమాధానం: 1
33. వృక్ష కణాల్లో మాత్రమే ఉండే కణాంగం ఏది?
1) గాల్జీ సంక్లిష్టం
2) మైటోకాండ్రియా
3) రైబోజోమ్స్
4) ప్లాస్టిడ్లు
- View Answer
- సమాధానం: 4
34.ఆక్సీకరణ పత్రాలు, ఫలాలకు పసుపు - నారింజ రంగును కలుగజేసేవి ఏవి?
1) హరిత రేణువులు
2) శ్వేత రేణువులు
3) వర్ణ రహిత రేణువులు
4) వర్ణ రేణువులు
- View Answer
- సమాధానం: 4
35. కణంలో రిక్తిక దేనితో నిండి ఉంటుంది?
1) నీరు
2) కణరసం
3) జీవ పదార్థం
4) పైవేవీ కాదు
- View Answer
- సమాధానం: 2
36. ‘టోనోప్లాస్టు’ దేన్ని ఆవరించి ఉండే త్వచం?
1) కణద్రవ్యం
2) రిక్తిక
3) కేంద్రకం
4) మైటోకాండ్రియా
- View Answer
- సమాధానం: 2
37.పక్వ స్థితిలో ఉన్న టమాటా ఫలాన్ని సూదితో గుచ్చినప్పుడు నీరు లాంటి ద్రవం వస్తుంది. ఈ ద్రవం నిల్వ ఉండే భాగం ఏది?
1) కణద్రవ్యం
2) ప్లాస్టిడ్
3) రిక్తిక
4) కేంద్రకం
- View Answer
- సమాధానం: 3
38. కింది వాటిలో పెరాక్సీజోమ్లకు సంబంధించిన చర్య ఏది?
1) ప్రోటీన్ల సంశ్లేషణ
2) కాంతి శ్వాసక్రియ
3) కొవ్వుల సంశ్లేషణ
4) ఆహార పదార్థాల రవాణా
- View Answer
- సమాధానం: 2
39. బ్యాక్టీరియాలను జంతువులుగా కంటే మొక్కలుగానే ఎక్కువగా పరిగణిస్తారు. కారణమేమిటి?
1) చిన్న కేంద్రకం ఉండటం
2) ప్లాస్మా పొర ఉండటం
3) కణకవచం ఉండటం
4) సిద్ధబీజ ఉత్పత్తి
- View Answer
- సమాధానం: 3
40. బ్యాక్టీరియాల్లో శ్వాసక్రియ దేనిలో జరుగుతుంది?
1) కేంద్రకం
2) మీసోజోమ్లు
3) కణకవచం
4) మైటోకాండ్రియా
- View Answer
- సమాధానం: 2
41. కణ స్వరూప నియంత్రణలో కేంద్రకం పాత్ర ఉంటుందని హమర్లింగ్ ఏ మొక్కపై జరిపిన ప్రయోగాల ద్వారా నిరూపించాడు?
1) తీపి బఠాణీ
2) న్యూరోస్పోరా
3) అసిటాబ్యులేరియా
4) గోధుమ
- View Answer
- సమాధానం: 3
42. థైలకాయిడ్లు దేనిలో ఉంటాయి?
1) మైటోకాండ్రియా
2) గాల్జీ సంక్లిష్టం
3) కేంద్రకం
4) హరిత రేణువు
- View Answer
- సమాధానం: 4
43. లైసోజోమ్లు ఏ క్రియలో తోడ్పడతాయి?
1) శ్వాసక్రియ
2) కాంతి శ్వాసక్రియ
3) స్వయం విచ్ఛిత్తి
4) స్రావ క్రియ
- View Answer
- సమాధానం: 3
44. డీఎన్ఏ (క్రొమాటిన్ పదార్థం)ను కలిగిన కణాంగం ఏది?
1) కేంద్రకం
2) కేంద్రకాంశం
3) ప్లాస్టిడ్
4) ఎర్గోజోమ్లు
- View Answer
- సమాధానం: 1
45. ఆక్సీజోమ్లు ఉండే కణాంగం ఏది?
1) హరిత రేణువు
2) మైటోకాండ్రియా
3) 1, 2
4) ఏదీకాదు
- View Answer
- సమాధానం: 2
46. ఆంథోసయనిన్ వర్ణద్రవ్యం దేనిలో ఉంటుంది?
1) హరిత రేణువు
2) వర్ణ రేణువు
3) కణద్రవ్యం
4) రిక్తిక
- View Answer
- సమాధానం: 4
47. క్యారెట్ దుంపవేరుకు రంగు దేని వల్ల కలుగుతుంది?
1) శ్వేత రేణువులు
2) ఆంథోసయనిన్ వర్ణద్రవ్యం
3) క్రోమోప్లాస్టులు (వర్ణ రేణువులు)
4) క్లోరోప్లాస్టులు
- View Answer
- సమాధానం: 3
48. 70S రకానికి చెందిన రైబోజోమ్లు వేటిలో ఉంటాయి?
1) హరిత రేణువు
2) మైటోకాండ్రియా
3) కేంద్రక పూర్వ జీవులు
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
49. 80S రకానికి చెందిన రైబోజోమ్లు నిజకేంద్రక జీవుల కణాల్లో ఉంటాయి. ఈ రకమైన రైబోజోమ్స్లోని చిన్న - పెద్ద ఉప ప్రమాణాలు వరసగా..
1) 40S – 60S
2) 40S – 50S
3) 30S – 60
4) 30S – 50S
- View Answer
- సమాధానం: 1
50. కణంలో పదార్థాల రవాణాకు తోడ్పడే అంతర్జీవ ద్రవ్యజాలాన్ని (E.R.) ఎన్ని రకాలుగా వర్గీకరించారు?
1) 2
2) 3
3) 6
4) 4
- View Answer
- సమాధానం: 1
51. ‘క్రిస్టే’ నిర్మాణాలు ఏ కణాంగంలో ఉంటాయి?
1) రైబోజోమ్స్
2) హరిత రేణువు
3) మైటోకాండ్రియా
4) కేంద్రకం
- View Answer
- సమాధానం: 3
52. కణంలో మైటోకాండ్రియాలను మాత్రమే చూసేందుకు ఉపయోగించే అభిరంజకం
1) అసిటో ఆర్సిన్
2) అసిటోకారమిన్
3) జానస్ గ్రీన్-బి
4) ఎసిటోన్
- View Answer
- సమాధానం: 3
53. జతపరచండి.
కణాంగాలు | విధులు (ఇతర పేర్లు) |
ఎ) మైటోకాండ్రియా | I) ఒక కణం లోపల మరో కణం |
బి) హరిత రేణువు | II) కణం స్వయం విచ్ఛిత్తి కోశాలు |
సి) లైసోజోమ్ | III) కణ రక్షణాశ్రయం (స్టోర్ హౌజ్) |
డి) రిక్తిక | IV) జీవ కొలుములు |
ఎ | బి | సి | డి | |
1) | IV | I | II | III |
2) | I | II | III | IV |
3) | III | IV | II | I |
4) | IV | I | III | II |
- View Answer
- సమాధానం: 1
54. జతపరచండి.
శాస్త్రవేత్తలు | కనుగొన్న సిద్ధాంతాలు |
ఎ) ష్లైడన్ - ష్వాన్ | I) క్రోమోజోమ్ సిద్ధాంతం |
బి) సట్టన్ - బవేరీ | II) కణ డాక్ట్రెన్ సిద్ధాంతం/కణ సిద్ధాంతం |
సి) రాబర్ట్ సన్ | III) కణ అనువంశిక సిద్ధాంతం |
డి) రుడాల్ఫ్ విర్షా | IV) ప్రమాణ త్వచ సిద్ధాంతం |
ఎ | బి | సి | డి | |
1) | I | II | III | IV |
2) | II | I | III | IV |
3) | II | I | IV | III |
4) | IV | III | II | I |
- View Answer
- సమాధానం: 3