కార్డేటాలలో ఏ నిర్మాణం ఉండటాన్ని ముఖ్య లక్షణంగా పేర్కొంటారు?
1. కార్డేటాలలో ఏ నిర్మాణం ఉండటాన్ని ముఖ్య లక్షణంగా పేర్కొంటారు?
1) హృదయం
2) చర్మం
3) మెదడు
4) పృష్టవంశం
- View Answer
- సమాధానం: 4
2. జీవశాస్త్రంలో విచిత్ర జీవులుగా వేటిని పేర్కొంటారు?
1) హెమీ కార్డేట్లు
2) సెఫలో కార్డేట్లు
3) యూరో కార్డేట్లు
4) కార్డేట్లు
- View Answer
- సమాధానం: 3
3. సకశేరుకాల ఉద్భవానికి సంబంధించిన డింభకం ఏది?
1) బైపిన్నేరియా లార్వా
2) బఫియోప్లూటియస్
3) ఆరిక్యులేరియా
4) ఎఖైనోఫ్లూయస్
- View Answer
- సమాధానం: 3
4. ‘శీతల రక్త జీవులు (బాహ్యోష్ణ సకశేరుకాలు)’గా వేటిని పేర్కొంటారు?
1) చేపలు
2) ఉభయచరాలు
3) సరీసృపాలు
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
5. కింది వాటిలో ‘ఉష్ణరక్త జీవులు (అంతరోష్ణ సకశేరుకాలు)’ ఏవి?
1) సరీసృపాలు
2) పక్షులు
3) క్షీరదాలు
4) 2, 3
- View Answer
- సమాధానం: 4
6. అధిక సంఖ్యలో ఉన్న సకశేరుకాలేవి?
1) చేపలు
2) ఉభయచరాలు
3) సరీసృపాలు
4) పక్షులు
- View Answer
- సమాధానం: 1
7. చేపల్లో ఏవిధమైన హృదయం ఉంటుంది?
1) సిరా హృదయం
2) ధమని హృదయం
3) మిశ్రమ హృదయం
4) ఏదీకాదు
- View Answer
- సమాధానం: 1
8. చేపల హృదయం విశిష్ట లక్షణం ఏది?
1) మంచి రక్తం ప్రవహించడం
2) చెడు రక్తం ప్రవహించడం
3) మిశ్రమ రక్తం ప్రవహించడం
4) ఎలాంటి రక్తం ప్రవహించకపోవడం
- View Answer
- సమాధానం:3
9. విచ్ఛిన్న విస్తరణను ప్రదర్శించే చేపలు ఏవి?
1) నియోసెరటోడస్
2) ప్రోటాస్టిరస్
3) లెపిడో సైరస్
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
10. కాలేయ నూనెకు ప్రసిద్ధమైన చేప?
1) స్టోన్ ఫిష్
2) బ్లూవేల్
3) కాడ్ ఫిష్
4) సిల్వర్ ఫిష్
- View Answer
- సమాధానం: 3
11. దోమ ఢింబకాలను ఆహారంగా తీసుకుంటూ మలేరియా వ్యాధి నివారణకు దోహదపడే చేపలు ఏవి?
1) ఎక్సోసీటస్
2) హిప్పోకాంపస్
3) గాంబూసియా యుసినిస్
4) పైవేవీ కావు
- View Answer
- సమాధానం: 3
12. కింది వాటిలో నిజమైన చేపలు ఏవి?
1) జెల్లీ ఫిష్
2) సిల్వర్ ఫిష్
3) కటిల్ ఫిష్
4) షార్క ఫిష్
- View Answer
- సమాధానం: 4
13. ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన చేప?
1) స్టోన్ ఫిష్
2) గోల్డెన్ ఫిష్
3) సిల్వర్ ఫిష్
4) స్టార్ ఫిష్
- View Answer
- సమాధానం: 1
14. బెంగాలీలకు ప్రీతిపాత్రమైన హిల్సా చేప 1 కిలోల బరువు పెరుగడానికి ఎన్నేళ్లు పడుతుంది?
1) 4
2) 3
3) 2
4) 5
- View Answer
- సమాధానం: 2
15. ఇక్తియాలజీ అనేది వేటి గురించి అధ్యయనం చేసే శాస్త్రం?
1) చేపలు
2) సరీసృపాలు
3) పక్షులు
4) క్షీరదాలు
- View Answer
- సమాధానం: 1
16. బొటనవేలు లేకపోవడం అనేది కింది వాటిలో ఏ జీవి లక్షణం?
1) కోతి
2) మానవుడు
3) కుందేలు
4) కప్ప
- View Answer
- సమాధానం: 4
17. భూమి మీద మొదట నివసించిన జీవులు ఏవి?
1) తొండలు
2) డిప్నావ్ చేపలు
3) కప్పలు
4) సర్పాలు
- View Answer
- సమాధానం: 3
18. రెడ్ ఇండియన్లు బాణాల చివరన విషంగా ఏ కప్ప చర్మగ్రంథుల స్రావాలను పూస్తారు?
1) హైలా
2) రాకోపోరస్
3) పిల్లోబేటస్
4) ఎలైటస్
- View Answer
- సమాధానం: 3
19. కింది వాటిలో ప్రపంచంలో అత్యంత విషపూరిత ఉభయచరాల్లో ఒకటి ఏది?
1) బ్లూ డార్ట్ మండూకం
2) రాటిల్ స్నేక్
3) స్పెర్మ వేల్
4) గ్రీన్ టర్టిల్
- View Answer
- సమాధానం: 1
20. బాహ్య ఫలదీకరణం జరిపే జీవులు ఏవి?
1) చేపలు
2) కప్పలు
3) బల్లులు-పాములు
4) 1, 2
- View Answer
- సమాధానం: 4
21. టాడ్పోల్ లార్వా రూప విక్రియను నియంత్రించే హార్మోన్ ఏది?
1) అడ్రినలిన్
2) థైరాక్సిన్
3) ఈస్ట్రోజన్
4) ఆక్సిటోసిన్
- View Answer
- సమాధానం: 2
22. ‘వేసవి కాల నిద్ర’ అంటే ఏమిటి?
1) శీతాకాల సుప్తావస్థ
2) ప్రతికూల పరిస్థితులు
3) గ్రీష్మకాల సుప్తావస్థ
4) కోమా
- View Answer
- సమాధానం: 3
23. స్పాన్ అంటే..?
1) కప్ప అండాల సమూహం
2) పుట్టగొడుగుల విత్తనాలు
3) కప్ప శుక్రకణాల సమూహం
4) 1, 2
- View Answer
- సమాధానం: 4
24. రెండు కర్ణికలు, ఒక జఠరికతో కూడిన హృదయం ఏ జీవుల్లో ఉంటుంది?
1) చేపలు
2) కప్పలు
3) పాములు
4) పక్షులు-క్షీరదాలు
- View Answer
- సమాధానం: 2
25. కప్పల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు?
1) ఇక్తియాలజీ
2) బాట్రకాలజీ
3) టార్పిడాలజీ
4) ఓఫియాలజీ
- View Answer
- సమాధానం: 2
26. రూప విక్రియ ప్రదర్శించే జీవి ఏది?
1) పాము
2) కప్ప
3) హైడ్రా
4) చేప
- View Answer
- సమాధానం: 2
27. మెడ, తోక, పొలుసులు లోపించిన జీవులు ఏవి?
1) చేపలు
2) కప్పలు
3) సరీసృపాలు
4) పక్షులు
- View Answer
- సమాధానం: 2
28. సర్పాలకు సంబంధించి కింది వాటిలో సరైంది ఏది?
1) కదిలే కనురెప్పలు ఉంటాయి
2) కదలని కనురెప్పలు ఉంటాయి
3) కనురెప్పలు ఉండవు
4) నిమేశక పటలం ఉంటుంది
- View Answer
- సమాధానం: 3
29. విషసర్పాల్లో విషగ్రంథులు వేటి రూపాంతరం?
1) ఆస్య గ్రంథులు
2) లాలాజల గ్రంథులు
3) తైల గ్రంథులు
4) అశ్రు గ్రంథులు
- View Answer
- సమాధానం: 2
30.కింది వాటిలో పాము కరిచినప్పుడు విరుగుడుగా పనిచేసే మంచి ఇంజెక్షన్ ఏది?
1) పెన్సిలిన్
2) యాంటీవీనమ్
3) యాంటీబయాటికిన్
4) స్ట్రెప్టోమైసిన్
- View Answer
- సమాధానం: 2
31. నాగుపామును దేని ఆధారంగా గుర్తిస్తారు?
1) నలుపురంగు
2) పడగ
3) రాళ్లలో నివసించడం వల్ల
4) పడగ, మూడో అదివోష్ట పొలుసు
- View Answer
- సమాధానం: 4
32. సర్పాల్లో మధ్య చెవి ఉండదు. అవి శబ్దాలను వేటి ద్వారా గ్రహిస్తాయిు?
1) నాలుక
2) చర్మం
3) ముట్టె
4) గాలి
- View Answer
- సమాధానం: 2
33. పాము విషానికి విరుగుడు ఇంజెక్షన్లను ఎక్కడ తయారు చేస్తున్నారు?
1) అ.ఇ.ఈ., ఢిల్లీ
2) ఐఐఇఖీ, హైదరాబాద్
3) హాప్కిన్ ఇన్స్టిట్యూట్, ముంబై
4) పింపు, పుణే
- View Answer
- సమాధానం: 3
34. సరీసృపాలన్నింటిలో మొసళ్లలో ఉన్న ప్రత్యేక లక్షణం ఏది?
1) దృడమైన దవడ కండరాలు
2) నేలమీదకు రాగలిగే శక్తి
3) నాలుగు గదుల గుండే
4) అండం చుట్టూ గట్టి పెంకు ఉండటం
- View Answer
- సమాధానం: 3
35.పక్షుల్లో ఉండే ప్రధాన లక్షణం?
1) ముక్కు
2) రెక్కలు
3) పొలుసులు
4) ఈకలు
- View Answer
- సమాధానం: 4
36.పాముల గురించి అధ్యయనం చేసే శాస్త్రం?
1) ఇక్తియాలజీ
2) ఓఫియాలజీ
3) లెపిడాప్టరాలజీ
4) ఎంటమాలజీ
- View Answer
- సమాధానం: 2
37. కింది వాటిలో శిశుత్పాదక సర్పం ఏది?
1) కోబ్రా
2) కట్లపాము
3) రక్తపింజర
4) రాట్ సర్పం
- View Answer
- సమాధానం: 3
38. రక్తపింజర విషం ఏ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది?
1) జీర్ణ వ్యవస్థ
2) రక్తప్రసరణ వ్యవస్థ
3) శ్వాస వ్యవస్థ
4) విసర్జన వ్యవస్థ
- View Answer
- సమాధానం: 2
39. నాగుపాము విషం ఏ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది?
1) శ్వాస వ్యవస్థ
2) రక్తప్రసరణ వ్యవస్థ
3) నాడీ వ్యవస్థ
4) జీర్ణ వ్యవస్థ
- View Answer
- సమాధానం: 3
40. చలనంలో సర్పాలకు సహాయపడేవి ఏవి?
1) తల
2) పొలుసులు
3) పర్సుకలు
4) తోక
- View Answer
- సమాధానం:3
41. అతి తక్కువ కాలం చూలు మోసే జీవి?
1) మేక
2) గుర్రం
3) అపోజం
4) చుంచెలుక
- View Answer
- సమాధానం: 3
42. కింది వాటిలో విష సర్పం కానిది?
1) సముద్ర సర్పం
2) కట్లపాము
3) రక్తపింజర
4) పైథాన్
- View Answer
- సమాధానం: 4
43. కింది వాటిలో విష సర్పం ఏది?
1) పైథాన్
2) కట్లపాము
3) ట్రి స్నేక్
4) రాట్ స్నేక్
- View Answer
- సమాధానం: 2
44. ఒక వ్యక్తి కాలికి ఏదో జీవి కరవడం వల్ల రెండు గాట్లు పడ్డాయి. ఆ గాట్ల ఆధారంగా కింది వాటిలో అది ఏ జీవి అయి ఉండవచ్చు?
1) తేలు
2) ఎలుక
3) విషరహిత సర్పం
4) విషపూరిత సర్పం
- View Answer
- సమాధానం: 4
45.పరిసరాలను బట్టి రంగులు మార్చేది?
1) పిల్లి
2) ఎలుక
3) ఊసరవెల్లి (కెమీలియాన్)
4) తొండ
- View Answer
- సమాధానం: 3
46. కింది వాటిలో దీర్ఘకాలం జీవించే జంతువు?
1) ఏనుగు
2) ఒంటె
3) నక్క
4) తాబేలు
- View Answer
- సమాధానం: 4
47. డైనోసార్ ఒక...
1) సరీసృపం
2) ఉభయచరం
3) క్షీరదం
4) పక్షి
- View Answer
- సమాధానం: 1
48. ‘డైనోసార్’ అనే పదానికి అర్థం?
1) ఘోర పాకుడు జంతువు
2) భయంకరమైన పాకుడు జంతువు
3) ఘోర బల్లి
4) అథమ పాకుడు జంతువు
- View Answer
- సమాధానం: 2
49. కింది వాటిలో ఎగిరే డైనోసార్గా ప్రసిద్ధి చెందింది ఏది?
1) స్పైనోసారస్
2) టైరోసారస్
3) అర్జంటినో సారస్
4) ఏదీకాదు
- View Answer
- సమాధానం: 2
50. విషం గురించి అధ్యయనం చేసే శాస్త్రం?
1) మార్పాలజీ
2) ఆస్టియాలజీ
3) టాక్సికాలజీ
4) కాంకాలజీ
- View Answer
- సమాధానం: 3
51. భూమిపై అతి పెద్ద పక్షి ఏది?
1) ఈము
2) ఆస్ట్రిచ్
3) ఆల్ బట్రాస్
4) సైబీరియన్ క్రేన్
- View Answer
- సమాధానం: 2
52. కింది వాటిలో దేనిలో వాతులాస్థులు ఉంటాయి?
1) గబ్బిలం
2) తిమింగలం
3) పక్షులు
4) ఎక్సోసీటస్
- View Answer
- సమాధానం: 3
-
1) మోనాక్యులార్-టెలిస్కోపిక్ దృష్టి
2) బైనాక్యులర్-మయోపిక్ దృష్టి
3) బైనాక్యులర్-టెలిస్కోపిక్ దృష్టి
4) మోనాక్యులర్- మయోపిక్ దృష్టి
- View Answer
- సమాధానం: 1
54. పక్షుల గురించి అధ్యయనం చేసే శాస్త్రం?
1) హెర్పిటాలజీ
2) ఆర్నిథాలజీ
3) ఇథాలజీ
4) ఫినాలజీ
- View Answer
- సమాధానం: 2
55. కింది వాటిలో పక్షుల్లో ఏవి ఉండవు?
1) నరాలు
2) చెమట గ్రంథులు
3) కనురెప్పలు
4) వాతులాస్థులు
- View Answer
- సమాధానం: 2
56. నేలపై అతి వేగంగా పరుగెత్తే జంతువు?
1) లేడి
2) చిరుతపులి
3) గుర్రం
4) పెద్దపులి
- View Answer
- సమాధానం: 2
57. స్వేద గ్రంథులు లేని క్షీరదం?
1) కోతి
2) ఆవు
3) తిమింగలం
4) పంది
- View Answer
- సమాధానం: 3
58. గబ్బిలం, తిమింగలం ఏ వర్గానికి చెందినవి?
1) పక్షులు
2) సరీసృపాలు
3) క్షీరదాలు
4) ఉభయచరాలు
- View Answer
- సమాధానం: 3
59.కింది వాటిలో క్షీరదాల అత్యంత ప్రధాన లక్షణం ఏది?
1) హెమియోథర్మిక్
2) విభాజక పటలం
3) శిశు ఉత్పాదకాలు
4) డైకాండైలిక్
- View Answer
- సమాధానం: 2
60. ఏ జీవికి వేళ్లు ఉండవు కానీ, గోళ్లు ఉంటాయి?
1) కంగారు
2) అపోజం
3) బ్లూవేల్
4) ఒంటె
- View Answer
- సమాధానం: 3
61. గుడ్లు పెట్టే క్షీరదం?
1) డక్బిల్ ప్లాటిపస్
2) ఎకిడ్నా
3) గబ్బిలం
4) 1, 2
- View Answer
- సమాధానం: 4
62.ప్రపంచంలో అతి పెద్ద ప్రాణి ఏది?
1) ఇండియా ఏనుగు
2) బ్లూవేల్
3) రైనోడాన్
4) ఆఫ్రికా ఏనుగు
- View Answer
- సమాధానం: 2
63. మానవుడి తర్వాత అతి తెలివైన క్షీరదం?
1) బ్లూవేల్-తిమింగలం
2) డాల్ఫిన్
3) ఆఫ్రికా ఏనుగు
4) కంగారు
- View Answer
- సమాధానం: 2
64. జంతువుల ప్రవర్తనను అధ్యయనం చేసే శాస్త్రం ఏది?
1) ఎంటమాలజీ
2) ఇథాలజీ
3) ఎకాలజీ
4) యూజెనిక్స్
- View Answer
- సమాధానం: 2