జెనెటిక్స్
1. డీఎన్ఏ అణువు నమూనాను ఎవరు కనుగొన్నారు?
1) హరగోవింద్ ఖురానా
2) క్రిక్ - వాట్సన్
3) ఎం.ఎస్. స్వామినాథన్
4) జె.సి. బోస్
- View Answer
- సమాధానం: 2
2. జీవుల్లో వంశపారంపర్య లక్షణాలను కలిగించేది ఏది?
1) Hb
2) ATP
3) డీఎన్ఏ
4) ఆర్ఎన్ఏ
- View Answer
- సమాధానం: 3
3. డీఎన్ఏలో జన్యు సంబంధ అంశాలు ఎక్కడ నిల్వ ఉంటాయి?
1) రెండు పోచల్లో
2) డబుల్ హెలిక్స్లో
3) S-P బ్యాక్ బోన్
4) పైవేవీకాదు
- View Answer
- సమాధానం: 2
4. అనువంశిక విజ్ఞానశాస్త్రాన్ని జన్యుశాస్త్రంగా పిలిచినవారెవరు?
1) మెండల్
2) కారెన్స్
3) హెచ్.జె.ముల్లర్
4) విలియం బేట్సన్
- View Answer
- సమాధానం: 4
5.అనువంశిక లక్షణాలను క్రమబద్ధీకరణం చేసే కారకానికి ‘జీన్’ అనే మాటను ప్రవేశపెట్టినవారెవరు?
1) మెండల్
2) డీవ్రీస్
3) జోహెన్సన్
4) విలియం బేట్సన్
- View Answer
- సమాధానం: 3
6. ‘ఒక జన్యువు - ఒక ఎంజైమ్’ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు?
1) బీడిల్ - టాటమ్
2) జాకబ్ - మోనాడ్
3) ఆర్థర్ కారెన్ బర్గ్
4) హరగోవింద్ ఖురానా
- View Answer
- సమాధానం: 1
7. ‘ఒక జన్యువు - పాలీ పెప్టైడ్ గొలుసు’ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినవారెవరు?
1) మెండల్
2) టి.హెచ్. మోర్గాన్
3) బీడిల్-టాటమ్
4) వెర్నర్ ఇన్‌గ్రామ్
- View Answer
- సమాధానం: 4
8. ‘జంపింగ్ జీన్స్’ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు?
1) మెండల్
2) టి.హెచ్. మోర్గాన్
3) బార్బరా మెక్ క్లింటాక్
4) వాట్సన్ - క్రిక్
- View Answer
- సమాధానం: 3
9. ‘జన్యువు’ అనేది అనువంశిక ప్రమాణం. దీన్ని తొలిసారిగా కృత్రిమంగా తయారు చేసి, నోబెల్ పురస్కారం పొందిన శాస్త్రవేత్త ఎవరు?
1) ఆర్థర్ కారెన్ బర్గ్
2) హెచ్.జి. ఖురానా
3) గ్రిగర్ మెండల్
4) టి.హెచ్. మోర్గాన్
- View Answer
- సమాధానం: 2
10. మెండల్‌ను జన్యుశాస్త్ర పితామహుడిగా పేర్కొంటారు. ఇతడు జన్యుశాస్త్ర ప్రయోగాలను మొదట ఏ మొక్కపై చేశాడు?
1) ఫ్రూట్ ప్లై
2) బ్రెడ్‌మోల్డ్
3) తీపి బఠాణీ (మదర్ ఆఫ్ ద జెనెటిక్స్)
4) రిసినస్
- View Answer
- సమాధానం: 3
11. మానవ శరీరంలో క్రోమోజోమ్‌ల సంఖ్య?
1) 43
2) 44
3) 46 జతలు
4) 46
- View Answer
- సమాధానం: 4
12. అంతర్లీనంగా దాగి ఉండే లక్షణాన్ని ఏమంటారు?
1) డామినెంట్
2) F1 జనరేషన్
3) రెసిసివ్
4) పైవేవీ కావు
- View Answer
- సమాధానం: 3
13.జీనోమ్ మ్యాపింగ్ దేనికి సంబంధించింది?
1) బ్లడ్ గ్రూపింగ్
2) జన్యువుల మ్యాపింగ్
3) నాడీ కేంద్రాల మ్యాపింగ్
4) మెదడు మ్యాపింగ్
- View Answer
- సమాధానం: 2
14. జీన్ థెరపీ నిర్వహించే పద్ధతి ఏది?
1) రేడియం చికిత్స
2) వ్యాధి నిర్ధారణ
3) కీమోథెరఫీ
4) దోషపూరిత జన్యువులను తొలగించి కొత్తవాటిని చేర్చడం
- View Answer
- సమాధానం: 4
15. అనువంశికత, ఆకస్మిక వైవిధ్యాన్ని ఏ పేరుతో పిలుస్తారు?
1) ఉత్పరివర్తనాలు
2) సంకరణం
3) శాశ్వత వైవిధ్యాలు
4) జాతి సంకరణం
- View Answer
- సమాధానం: 1
16. జీన్ (జన్యువు) అంటే ఏమిటి?
1) డీఎన్ఏ ముక్క
2) సహలగ్న సముదాయం
3) ఆర్ఎన్ఏలో కొంత భాగం
4) ఏదీకాదు
- View Answer
- సమాధానం: 1
17. కింది వాటిలో ఆర్ఎన్ఏలో ఉండి, డీఎన్ఏలో లేని పదార్థం ఏది?
1) థైమిన్
2) సైటోసిన్
3) యురాసిల్
4) అడినైన్
- View Answer
- సమాధానం: 3
18. డీఎన్ఏ ద్విసర్పిల నమూనాను నిర్మించినందుకు(1953) వాట్సన్ -క్రిక్‌తో పాటు 1962 లో నోబెల్ బహుమతి పొందింది ఎవరు?
1) ఎర్విన్ చార్గాప్
2) విల్కిన్స్
3) హెచ్.జి. ఖురానా
4) టి.హెచ్. మోర్గాన్
- View Answer
- సమాధానం: 2
19. జన్యువు (డీఎన్ఏ ముక్క) క్రియాత్మక ప్రమాణాన్ని ఏమంటారు?
1) సిస్ట్రాన్
2) రేఖాన్
3) మ్యూటాన్
4) ఏదీకాదు
- View Answer
- సమాధానం: 1
20. డీఎన్ఏ అణువు వ్యాసం ఎంత?
1) 19 A°
2) 20 A°
3) 25 A°
4) 30 A°
- View Answer
- సమాధానం: 2
21. జన్యువు ఉత్పరివర్తన ప్రమాణాన్ని ఏమంటారు?
1) రేకాన్
2) సిస్ట్రాన్
3) మ్యూటాన్
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 3
22.కింది వాటిలో డీఎన్ఏను గుర్తించే అభిరంజక విధానం ఏది?
1) జానస్ గ్రీన్ - బి పరీక్ష
2) పాయిల్గాన్ పరీక్ష
3) గ్రామ్ అభిరంజన పరీక్ష
4) హెటిరో పిక్నోసిస్ పరీక్ష
- View Answer
- సమాధానం: 2
23. డీఎన్ఏ నుంచి వార్తాహర ఆర్ఎన్ఏకు జన్యు సమాచారం సంక్రమించే విధానాన్ని ఏమంటారు?
1) అనులేఖనం
2) అనువాదం
3) ఆటోకెటాలసిస్
4) అర్ధ సంరక్షణ
- View Answer
- సమాధానం: 1
24. కేంద్రకామ్లాలను కనుగొన్నవారెవరు?
1) ప్లెమింగ్
2) ఫ్రెడరిక్ మిషర్
3) స్ట్రాస్ బర్గర్
4) వాల్డేయర్
- View Answer
- సమాధానం: 2
25. కేంద్రకామ్లాల (డీఎన్ఏ+ఆర్ఎన్ఏ)లోని చక్కెర పేరు?
1) హెక్సోజ్
2) హెప్టోజ్
3) పెంటోజ్
4) ట్రయోజ్
- View Answer
- సమాధానం: 3
26. న్యూక్లియోటైడ్‌లో ఉండేవి ఏవి?
1) నత్రజని క్షారం + చక్కెర
2) నత్రజని క్షారం + ఫాస్ఫేట్
3) చక్కెర + ఫాస్ఫేట్
4) చక్కెర + నత్రజని క్షారం + ఫాస్ఫేట్
- View Answer
- సమాధానం: 4
27. క్లోవర్ లీఫ్ నమూనా దేనికి సంబంధించింది?
1) డీఎన్ఏ నిర్మాణం
2) డీఎన్ఏ ప్రతికృతి
3) t-RNA నిర్మాణం
4) m-RNA నిర్మాణం
- View Answer
- సమాధానం: 3
28. జన్యు సమాచారం సంకేతాల (కోడాన్) రూపంలో ఉంటుంది. మొత్తం సంకేతాల సంఖ్య 64 అయితే, అర్ధ రహిత (నాన్ సెన్స్) సంకేతాల సంఖ్య ఎంత?
1) 61
2) 3
3) 2
4) 1
- View Answer
- సమాధానం: 2
29. ‘క్రోమోజోమ్’ అని పేరు పెట్టినవారెవరు?
1) వాల్డేయర్
2) మిల్లర్
3) రాబర్‌టసన్
4) డీవ్రీస్
- View Answer
- సమాధానం: 1
30. క్రోమోజోమ్‌లను హప్మిస్టర్ (1849) ఏ మొక్కలో కనుగొన్నాడు?
1) బఠాణీ
2) ఈనోథీరా
3) ట్రాడెస్కాన్షియా
4) ప్రిమ్యులా
- View Answer
- సమాధానం: 3
31. ఆడ-మగ లైంగిక లక్షణాలను ఆధీనంలో ఉంచుకునే క్రోమోజోమ్‌లను ఏమంటారు?
1) అటోజోమ్స్
2) టాటోనీమ్స్
3) అల్లోజోమ్స్
4) ఎర్గోజోమ్స్
- View Answer
- సమాధానం: 3
32. క్రోమోజోమ్ సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారు?
1) సట్టన్ - బవేరి
2) క్రిక్ - వాట్సన్
3) బెంథమ్ - హూకర్
4) ష్లైడన్ - ష్వాన్
- View Answer
- సమాధానం: 1
33. అతి తక్కువ సంఖ్యలో క్రోమోజోమ్స్ కలిగిన మొక్క ఏది?
1) హప్లోపాపస్
2) బ్రాకీకోమ్
3) ఒపియోగ్లాసమ్
4) 1, 2
- View Answer
- సమాధానం: 4
34. ట్రైసోమిక్ క్రోమోజోమ్‌లకు ఉదాహరణ?
1) 2n–1
2) 2n+2
3) 2n–2
4) 2n+1
- View Answer
- సమాధానం: 4
35. నల్లిసోమిక్ క్రోమోజోమ్‌లకు ఉదాహరణ?
1) 2n–1
2) 2n–2
3) 2n+2
4) 2n+1
- View Answer
- సమాధానం: 2
36. అత్యధిక సంఖ్య (2n = 1260)లో క్రోమోజోమ్‌లను కలిగిన మొక్క ఏది?
1) హప్లోపాపస్
2) పైజమ్ సెటైవమ్
3) ఒపియోగ్లాసమ్
4) బ్రాకీకోమ్
- View Answer
- సమాధానం: 3
37. కింది వాటిలో క్రోమోజోమ్‌లకు సంబంధించిన క్రియ ఏది?
1) శరీర పెరుగుదల
2) అనువంశికం
3) శ్వాసక్రియ
4) శోషణం
- View Answer
- సమాధానం: 2
38. డిప్టీరా తరగతికి చెందిన కీటకాల (డ్రాసోఫిలా, ఫ్రూట్ప్లై) లాలాజల గ్రంథుల్లో ఉండే బృహత్(అతిపెద్ద) క్రోమోజోమ్‌లను ఏమని పిలుస్తారు?
1) పాలీటీన్ క్రోమోజోమ్‌లు
2) లాంప్ బ్రష్ క్రోమోజోమ్‌లు
3) b - క్రోమోజోమ్‌లు
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 1
39. ప్రత్యేక రకానికి చెందిన లాంప్ బ్రష్ క్రోమో జోమ్‌లు వేటి అండంలో ఉంటాయి?
1) చేపలు, ఆంఫీబియన్లు
2) సరీసృపాలు
3) పక్షులు
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
40. డీఎన్ఏ, ఆర్ఎన్ఏలు దేనిలో ఉంటాయి?
1) కేంద్రకం
2) కణకవచం
3) కణ రసం
4) రిక్తిక
- View Answer
- సమాధానం: 1
41. కింది వాటిలో ప్యూరిన్లు ఏవి?
1) అడినిన్ - థైమిన్
2) గ్వానైన్ - సైటోసిన్
3) థైమిన్ - సైటోసిన్
4) అడినిన్ - గ్వానైన్
- View Answer
- సమాధానం: 4
42. కింది వాటిలో డీఎన్ఏలో ఉండి ఆర్ఎన్ఏలో లేని పదార్థం ఏది?
1) అడినైన్
2) గ్వానైన్
3) థైమిన్
4) సైటోసిన్
- View Answer
- సమాధానం: 3
43. ఏ రకమైన విభజన జరిగినప్పుడు క్రోమోజోమ్‌ల సంఖ్య సగానికి తగ్గుతుంది?
1) సమ విభజన
2) క్షయకరణ విభజన
3) అసమ విభజన
4) ఏదీకాదు
- View Answer
- సమాధానం: 2
44. మైటాసిస్ (సమ విభజన) దేనిలో జరుగుతుంది?
1) పరాగరేణువు
2) పిండం
3) శాఖీయ కణాలు
4) అండం
- View Answer
- సమాధానం: 3
45. జంతు కణాల్లో తొలిసారిగా సమ విభజనను పరిశీలించి, దానికి ‘మైటాసిస్’ అని పేరు పెట్టిన శాస్త్రవేత్త ఎవరు?
1) స్ట్రాస్ బర్గర్
2) వాల్టర్ ప్లెమింగ్
3) జె.బి. ఫార్మర్
4) జె.ఇ. మూర్
- View Answer
- సమాధానం: 2
46. గాయాలు మానడానికి తోడ్పడే కణ విభజన ఏది?
1) సమ విభజన
2) క్షయకరణ విభజన
3) అసమ విభజన
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 1
47. కణ విభజన అనేది జీవకణాల్లో సాధారణంగా జరిగే చర్య. ఒక భాగంలో నియంత్రణ లేకుండా జరిగే కణ విభజన దేనికి దారి తీస్తుంది?
1) కొత్త అవయవాలు ఏర్పడటానికి
2) పిండం ఏర్పడేందుకు
3) జైగోట్ ఏర్పడటానికి
4) కేన్సర్
- View Answer
- సమాధానం: 4
48. జతపరచండి.
శాస్త్రవేత్త పేరు ఆవిష్కరణ (పరిశోధన) ఎ) వాల్డేయర్ i) క్రోమోజోమ్ నామకరణం బి) క్రిక్-వాట్సన్ ii) డీఎన్ఏ - ద్వికుండళి నమూనా సి) బిడిల్-టాటమ్ iii)ఒక జన్యువు - ఒక ఎంజైమ్ డి) వెర్నర్-ఎం. ఇన్‌గ్రామ్ iv)ఒక జన్యువు-ఒక పాలీపెప్టైడ్ సిద్ధాంతం
ఎ బి సి డి 1) iv iii ii i 2) i ii iv iii 3) iv i iii ii 4) i ii iii iv
- View Answer
- సమాధానం: 4
49. జతపరచండి.
శాస్త్రవేత్త ప్రత్యేకత ఎ) మెండల్ i) జన్యుశాస్త్ర పితామహుడు బి) హ్యూగో డీవ్రీస్ ii) ఉత్పరివర్తన పితామహుడు సి) రాబర్ట్ హుక్ iii) కణ జీవశాస్త్ర పితామహుడు డి) టి.హెచ్. మోర్గాన్ iv) ఆధునిక జన్యుశాస్త్ర పితామహుడు
ఎ | బి | సి | డి | |
1) | iv | iii | i | ii |
2) | i | ii | iv | iii |
3) | iv | i | iii | ii |
4) | i | ii | iii | iv |
- View Answer
- సమాధానం: 4
50. డీఎన్ఏ కృత్రిమ సంశ్లేషణ జరిపింది ఎవరు?
1) క్రిక్-వాట్సన్
2) ఆర్థర్ కారెన్ బర్గ్
3) బఖోవా
4) హరగోవింద్ ఖురానా
- View Answer
- సమాధానం: 2
51. కేంద్రకామ్లాలు(డీఎన్ఏ+ఆర్ఎన్ఏ) వేటితో ఏర్పడతాయి?
1) C, H, O, Ca, P
2) C, H, O, N, P
3) C, H, O, P, Pb
4) C, Fe, O, P
- View Answer
- సమాధానం: 2
52. మైటాసిస్‌ను పరిశీలించడానికి మొక్కల్లో అనువైన స్థలం ఏది?
1) కాండాగ్రం
2) వేరు కొన
3) అంకురచ్ఛదం
4) పిండకోశం
- View Answer
- సమాధానం: 2
53. మియాసిస్ (క్షయకరణ విభజన) వేటిలో జరుగుతుంది?
1) అండం
2) ముష్కాలు
3) పరాగ రేణువులు (మాతృకణం)
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
-
54. ఏక సంకర సంకరణంలో F2 సంతతి జన్యు రూప నిష్పత్తి?
1) 3 : 1
2) 9 : 3 : 3 : 1
3) 1 : 2 : 1
4) 1 : 3
- View Answer
- సమాధానం: 3
55. జెనెటిక్స్ అనే పదాన్ని ప్రతిపాదించినవారు?
1) హ్యూగో డీవ్రీస్
2) మెండల్
3) బేట్సన్
4) సట్టన్-జొహెన్సన్
- View Answer
- సమాధానం: 3
56. ద్విసంకర సంకరణంలో F2 తరం దృశ్య రూప నిష్పత్తిఎంత?
1) 3 : 1
2) 9 : 3 : 3 : 1
3) 1 : 2 : 1
4) 1 : 3
- View Answer
- సమాధానం: 2
57. ఆధునిక జన్యుశాస్త్ర పితామహుడు ఎవరు?
1) మెండల్
2) టి.హెచ్. మోర్గాన్
3) నిరెన్‌బర్గ్
4) ఖురానా
- View Answer
- సమాధానం: 2
58. ఒక జన్యువు -ఒక ఎంజైమ్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు?
1) మెండల్
2) టి.హెచ్. మోర్గాన్
3) బీడిల్ - టాటమ్
4) ఖురానా
- View Answer
- సమాధానం: 3
59. ఒక జన్యువు- ఒక పాలిపెప్టైడ్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు?
1) టి.హెచ్.మోర్గాన్
2) డీవ్రీస్
3) వెర్నర్ ఎం. ఇన్‌గ్రామ్
4) బీడిల్-టాటమ్
- View Answer
- సమాధానం: 3
60. ఓపెరాన్ భావన (Operon Concept)ను ప్రతిపాదించింది?
1) ఖురానా
2) నిరెన్‌బర్గ్
3) జాకబ్ - మోనాడ్
4) బీడిల్ - టాటమ్
- View Answer
- సమాధానం: 3
61.‘కణం ఆత్మహత్య కోశాలు’ అని వేటిని పిలుస్తారు?
1) పెరాక్సీజోమ్లు
2) రైబోజోమ్స్
3) లైసోజోమ్స్
4) మైటోకాండ్రియా
- View Answer
- సమాధానం: 3
62. టమాట, వంకాయ ఏ కుటుంబానికి చెందిన మొక్క ఫలాలు?
1) మాల్వేసి
2) సోలనేసి
3) ఆస్టరేసి
4) కుకుర్బిటేసి
- View Answer
- సమాధానం: 2
63. టేకు ఒక నాణ్యమైన కలప. ఇది.....
1) ఉష్ణమండల అడవుల్లో పెరుగుతుంది
2) ఉష్ణమండల పొడి అడవుల్లో పెరుగుతుంది
3) ఉష్ణమండల సతతహరిత అరణ్యాల్లో పెరుగుతుంది
4) ఉష్ణమండల పొడి ఆకురాల్చే అడవుల్లో పెరుగుతుంది
- View Answer
- సమాధానం: 4
64. నోరిస్ - 10 అనేది ఒక....
1) లండన్‌లో ఒక వీధి పేరు
2) పొట్టి వరి వంగడం
3) పొట్టి గోధుమ వంగడం
4) సంకర జొన్న
- View Answer
- సమాధానం: 3