హోర్మోన్లు - 2
Sakshi Education
- హార్మోన్ అనే పదాన్ని మొదట వాడినవారు?
- స్టార్లింగ్ - బహిఃస్రావక గ్రంథుల స్రావాలను ఏమని పిలుస్తారు?
- ఎంజైమ్‌లు - అంతఃస్రావక గ్రంథుల స్రావాలను ఏమని పిలుస్తారు?
- హార్మోన్లు - బహిఃస్రావక గ్రంథులకు ఉదాహరణ?
- లాలాజల గ్రంథులు, జఠర గ్రంథులు - మాస్టర్ గ్రంథి అని దేన్నంటారు?
- పిట్యూటరీ (లేదా) పీయూష గ్రంథి - పీయూష గ్రంథి స్రవించే హార్మోన్లు ఏవి?
- పెరుగుదల హార్మోన్, ప్రొలాక్టిన్, వాసోప్రెసిన్, ఆక్సిటోసిన్, టీఎస్‌హెచ్ (థైరాయిడ్ ప్రేరక హార్మోన్), ఏసీటీహెచ్ (ఎడ్రినో కార్టికో ట్రోపిక్ హార్మోన్, ఎఫ్‌ఎస్‌హెచ్ (పుటికా ఉద్దీపన హార్మోన్), ఎల్‌హెచ్ (ల్యూటినైజింగ్ హార్మోన్), ఎంఎస్‌హెచ్ (మెలనోసైట్ స్టిమ్యులేటింగ్ హార్మోన్) - పెరుగుదల హార్మోన్‌కు గల మరొక పేరు?
- సొమటోట్రోపిన్ - పిల్లల్లో పెరుగుదల హార్మోన్ అధికంగా ఉత్పత్తి అయితే వచ్చే వ్యాధి?
- జైగాంటిజమ్ (అతిదీర్ఘకాయత్వం) - పెద్దల్లో పెరుగుదల హార్మోన్ ఎక్కువగా విడుదలవడం వల్ల వచ్చే వ్యాధి?
- ఆక్రోమెగాలే (లేదా) గొరిల్లా ముఖం - పిల్లల్లో పెరుగుదల హార్మోన్ తక్కువగా విడుదలవడం వల్ల వచ్చే వ్యాధి?
- మరుగుజ్జుతనం (లేదా) కుబ్జత్వం (Dwarfism) - పెద్దల్లో పెరుగుదల హార్మోన్ తక్కువగా విడుదలవ డం వల్ల వచ్చే వ్యాధి?
- సైమండ్స్ వ్యాధి - ప్రొలాక్టిన్ హార్మోన్‌కు గల మరో పేరు?
- లాక్టోజెనిక్ హార్మోన్ (లేదా) ల్యూటియోట్రోపిక్ హార్మోన్ - స్త్రీలలో పాలగ్రంథుల అభివృద్ధికి తోడ్పడే హార్మోన్?
- ప్రొలాక్టిన్ - తల్లి నుంచి పాల ఉత్పత్తికి తోడ్పడే హార్మోన్?
- ప్రొలాక్టిన్ - ప్రొలాక్టిన్ అధికంగా ఉత్పత్తి అయితే ఏర్పడే స్థితి?
- గాలక్టోరోహియా (పాలు అధికంగా ఏర్పడే స్థితి) - పావురంలో పాల ఉత్పత్తిని ప్రేరేపించే హార్మోన్?
- ప్రొలాక్టిన్ (సాధారణంగా క్షీరదాలు పాలిచ్చి పెంచుతాయి. కానీ పావురంలో Crop milk ఉత్పత్తి అవుతుంది) - వాసోప్రెసిన్, ఆక్సిటోసిన్ అనే హార్మోన్లు ఎక్కడ తయారవుతాయి?
- హైపోథలామస్‌లో తయారవుతాయి. పీయూష గ్రంథిలోని పరలంబిక ద్వారా రక్తంలోకి విడుదలవుతాయి. - వాసోప్రెసిన్ హార్మోన్‌కు గల మరో పేరు?
- పిట్రెసిస్ (లేదా) అతిమూత్ర నిరోధక హార్మోన్ లేదా ADH (Anti Diuretic Hormone) - ADHహార్మోన్ విధి?
- మూత్రపిండంలో నీటి పునఃశోషణ - వాసోప్రెసిన్ (ADH) లోపం వల్ల ఏం జరుగుతుంది?
- అధిక మూత్రం ఏర్పడుతుంది - వాసోప్రెసిన్ (ADH) హార్మోన్ లోపం వల్ల కలిగే స్థితి?
- డయాబెటిస్ ఇన్‌సిపిడస్ (చక్కెర వ్యాధి గ్రస్తుల్లో అధికంగా మూత్రం ఉత్పత్తి అవుతుంది. దీనికి కారణం ADH హార్మోన్ లోపం) - బీరు, మద్యం సేవించినప్పుడు దేహంలో ఏ హార్మోన్ అణచివేతకు గురవుతుంది?
- ADH (మద్యం ADH ను అణచివేస్తుంది. అందువల్ల అధిక మూత్రం వస్తుంది) - దేహంలో నీటి శాతాన్ని నియంత్రించే హార్మోన్?
- ADH (వాసోప్రెసిన్) - పురుటినొప్పులు కలిగించడానికి వాడే హార్మోన్?
-ఆక్సిటోసిన్ (శిశు జననానికి తోడ్పడే హార్మోన్) - క్షీర గ్రంథుల క్రియలను నియంత్రించే హార్మోన్లు ఏవి?
- ప్రొలాక్టిన్, ఆక్సిటోసిన్ - క్షీరోత్పత్తి హార్మోన్ ఏది?
- ప్రొలాక్టిన్ - Milk ejection hormone (క్షీరం చిందించే హార్మోన్) ఏది?
- ఆక్సిటోసిన్ - స్త్రీలలో మాతృ ప్రవర్తన (Maternal behaviour) ను కలిగించే హార్మోన్?
- ఆక్సిటోసిన్ - ప్రసవ సమయంలో గర్భాశయ సంకోచం కలిగించి (పురుటినొప్పులు) తద్వారా స్వేచ్ఛా ప్రసవం కలగజేసే హార్మోన్?
- ఆక్సిటోసిన్ - Pitocin (పిటోసిన్) పేరుతో మార్కెట్లో లభ్యమయ్యే హార్మోన్ ఏది?
- ఆక్సిటోసిన్ - థైరాయిడ్ గ్రంథిని ప్రేరేపించే హార్మోన్?
- TSH (థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్) - ఎడ్రినల్ గ్రంథి (అధివృక్క గ్రంథిని ప్రేరేపించే హార్మోన్?
- ACTH (ఎడ్రినో కార్టికో ట్రోపిక్ హార్మోన్) - సకశేరుకాల్లో చర్మం రంగును నియంత్రించే హార్మోన్?
- MSH (మెలనోసైట్ స్టిమ్యులేటింగ్ హార్మోన్) - కప్పల్లో చర్మ వర్ణ మార్పులకు కారణమయ్యే హార్మోన్?
-కఏ (ఇది చర్మ వర్ణాన్ని గాఢంగా మారుస్తుంది) - మెలటోనిన్ హార్మోన్‌ను స్రవించే గ్రంథి?
- పీనియల్ గ్రంథి - పీనియల్ గ్రంథికి గల మరో పేరు?
- ఎఫిఫైసిస్ (లేదా) పీనియల్ దేహం - చర్మాన్ని లేతగా, వర్ణ రహితంగా మార్చే హార్మోన్?
- మెలటోనిన్ - సకశేరుకాల్లో జీవగడియారాన్ని (Biological Clock), సర్కేడియన్ రిథమ్స్ (జీవ వలయాల) ను క్రమపరిచే హార్మోన్?
- మెలటోనిన్ - ఉభయ చరాలు, సరీసృపాల్లో- మూడో కన్ను (Third Eye)గా పేర్కొనే గ్రంథి?
- పీనియల్ దేహం - వయసు పెరుగుతున్నకొద్దీ క్షీణించే గ్రంథి?
- పీనియల్ దేహం - పిల్లల్లో అధిక స్థాయిలో ఉండి, పెద్దల్లో తగ్గిపోయే హార్మోన్?
- మెలటోనిన్ (పీనియల్ గ్రంథి స్రవిస్తుంది) - పీనియల్ గ్రంథిని ఎందుకు మూడో కన్నుగా పేర్కొంటారు?
- పీనియల్ దేహం కాంతిని గుర్తించే స్వభావం వల్ల (రుతువుల్లో కాంతి మార్పులకు తగ్గట్లుగా జంతు ప్రవర్తనను మార్చుకోవడానికి సహకరిస్తుంది) - గుండెకు దగ్గరగా ఉండే గ్రంథి?
- థైమస్ గ్రంథి - థైమస్ గ్రంథి స్రవించే హార్మోన్?
- థైమోసిన్ (లేదా) థైమిన్ - పిల్లలు, పిండంలో ప్రతిదేహాల ఉత్పత్తికి సహాయపడే హార్మోన్?
- థైమోసిన్ - మానవుడిలో కాలక్రమేణా పరిమాణంలో మార్పులు ప్రదర్శించే గ్రంథి?
- థైమస్ గ్రంథి (పిల్లల్లో పెద్దగా, యుక్తవయసు వారిలో రెట్టింపు పరిమాణంలో, వృద్ధుల్లో గుర్తించలేనంత స్థాయికి కుంచించుకుపోయే గ్రంథి థైమస్ గ్రంథి. పీనియల్ గ్రంథి పిల్లల్లో పెద్దగా ఉండి కాలక్రమేణా క్షీణిస్తుంది) - మానవ దేహంలో సంయుక్త/మిశ్రమ గ్రంథి?
- క్లోమం - మిశ్రమ గ్రంథి అంటే?
- పాక్షికంగా అంతఃస్రావక గ్రంథిగా (వినాళ గ్రంథిగా), పాక్షికంగా బహిస్రావక (నాళ) గ్రంథిగా పనిచేస్తుంది - క్లోమంలో అంతఃస్రావక గ్రంథిలా పనిచేసేవి?
- లాంగర్‌హాన్ పుటికలు - క్లోమంలోని లాంగర్‌హాన్ పుటికల్లో ఎన్ని రకాల కణాలుంటాయి?
- నాలుగు రకాలు 1) ఆల్ఫా కణాలు 2) బీటా కణాలు 3) డెల్టా కణాలు 4) F- కణాలు - ఆల్ఫాకణాలు ఏ హార్మోన్‌ను స్రవిస్తాయి?
- గ్లూకగాన్ - బీటా కణాలు ఏ హార్మోన్‌ను స్రవిస్తాయి?
- ఇన్సులిన్ - డెల్టా కణాలు ఏ హార్మోన్‌ను స్రవిస్తాయి?
- సొమాటో స్టాటిన్ (సొమాటో స్టాటిన్ వేరు, సొమాటో ట్రోపిన్ వేరు. సొమాటో ట్రోపిన్ ఒక పెరుగుదల హార్మోన్) - F కణాలు దేన్ని ఉత్పత్తి చేస్తాయి?
- క్లోమపాలిపెప్టైడ్ - ఇన్సులిన్ విధి ఏమిటి?
- రక్తంలో గ్లూకోజ్ స్థాయిని తగ్గించడం - గ్లూకగాన్ విధి ఏమిటి?
- రక్తంలో గ్లూకోజ్ స్థాయిని పెంచడం - ఇన్సులిన్ గ్లూకోజ్‌ను గ్లైకోజెన్‌గా మారుస్తుంది. దీన్ని ఏమంటారు?
- గ్లైకోజెనిసిస్ - గ్లూకగాన్ గ్లైకోజెన్‌ను గ్లూకోజ్‌గా మారుస్తుంది. దీన్ని ఏమంటారు?
- గ్లైకోజెనోలైసిస్ - గ్లూకగాన్‌ను ఏ కారకం అంటారు?
- హైపర్ గ్లైసీమిక్ కారకం - ఇన్సులిన్‌ను ఏ కారకం అంటారు?
- హైపో గ్లైసీమిక్ కారకం - ఇన్సులిన్ లోపంతో వచ్చే వ్యాధి?
- డయాబెటిస్ మిలిటస్ - డెల్టా కణాలుసొమాటోస్టాటిన్ అనే నిరోధక హార్మోన్‌ను స్రవిస్తాయి. ఇది పెరుగుదల హార్మోన్. ఈ హార్మోన్ దేనికి విరోధంగా పనిచేస్తుంది?
- ఇన్సులిన్, గ్లూకగాన్ హార్మోన్‌లకు విరోధంగా పనిచేస్తుంది - మెడ కింది భాగంలో వాయు నాళానికి ఇరువైపులా ఉన్న ద్విలంబికా గ్రంథి ఏది?
- థైరాయిడ్ గ్రంథి - థైరాయిడ్ గ్రంథి స్రవించే హార్మోన్లు ఏవి?
- థైరాక్సిన్; ట్రై అయిడో థైరోనిన్; కాల్సిటోనిన్ - థైరాక్సిన్, ట్రై అయిడో థైరోనిన్ ఏ అమైనో అమ్లం నుంచి ఏర్పడతాయి?
- టైరోసిన్ - రోజువారీ వంటల్లో వాడే Iodised salt లో ఉండే అయోడిన్ ఏ హార్మోన్ ఉత్పత్తికి ఉపయోగపడుతుంది?
- థైరాక్సిన్, ట్రై అయిడో థైరోనిన్ - థైరాక్సిన్ హార్మోన్‌లో ఉండే రసాయన మూలకం?
- అయోడిన్ (I2), థైరాక్సిన్-4 అయోడిన్ అణువులు; ట్రై అయిడో థైరోనిన్-3 అయోడిన్ అణువులు - ఆహారంలో అయోడిన్ లోపం వల్ల వచ్చే వ్యాధి?
- హైపోథైరాయిడిజమ్ - అయోడిన్ లోపంతో థైరాయిడ్ గ్రంథి పెద్దదవడాన్ని ఏమంటారు?
- అయోడిన్ లోప గాయిటర్ - థైరాక్సిన్ లోపంతో కలిగే వ్యాధులు?
- గాయిటర్, మిక్సోడిమా (పెద్దల్లో), క్రెటినిజం (పిల్లల్లో) - థైరాక్సిన్ అధిక ఉత్పత్తితో కలిగే వ్యాధులు?
- హైపర్ థైరాయిడిజం, గ్రేవ్స్ వ్యాధి - థైరాయిడ్ ఉత్పత్తి చేసే మూడో హార్మోన్?
-కాల్సిటోనిన్ - కాల్సిటోనిన్ హార్మోన్‌కు గల మరోపేరు?
- థైరో కాల్సిటోనిన్ - కాల్సిటోనిన్ చేసే పని?
- రక్తంలో కాల్షియం స్థాయిని తగ్గిస్తుంది (ఎముకల్లో కాల్షియం స్థాయిని పెంచుతుంది) - కాల్సిటోనిన్ ఏ వ్యాధులను నియంత్రిస్తుంది?
- ఆస్టియోపొరోసిస్ - థైరాయిడ్ గ్రంథిపై ఉండే మరో గ్రంథి?
- పారాథైరాయిడ్ గ్రంథులు (2 జతలు) - పారా థైరాయిడ్ గ్రంథులు స్రవించే హార్మోన్?
- పారాథర్మోన్ (లేదా) పారాథైరాయిడ్ హార్మోన్ (PTH) - పారాథర్మోన్ విధి?
- రక్తంలో కాల్షియం స్థాయిని పెంచుతుంది, ఎముకల్లో కాల్షియం స్థాయిని తగ్గిస్తుంది. - పారాథర్మోన్ ఏ హార్మోన్‌కు వ్యతిరేకంగా పనిచేస్తుంది?
- కాల్సిటోనిన్ - కాల్సిటోనిన్ రక్తంలో Ca+ స్థాయిని తగ్గిస్తుంది, ఎముకల్లో పెంచుతుంది. మరి పారాథర్మోన్?
- రక్తంలో Ca+ స్థాయిని పెంచి, ఎముకల్లో తగ్గిస్తుంది - పారాథర్మోన్ అధిక ఉత్పత్తితో ఏ వ్యాధి వస్తుంది?
- ఆస్టియోపొరోసిస్ - పారాథర్మోన్ అల్ప ఉత్పత్తితో వచ్చే వ్యాధి?
- టెటానస్ (కండరాల వణుకు) - మూత్రపిండాలపై ఉండే గ్రంథి?
- ఎడ్రినల్ గ్రంథి (లేదా) అథివృక్క గ్రంథి - ఎడ్రినల్ గ్రంథి స్రవించే హార్మోన్లను ఏమని పిలుస్తారు?
- స్టిరాయిడ్ హార్మోన్లు (గ్లూకోకార్డికాయిడ్స్, నినరలో కార్డికాయిడ్స్, లైంగిక కార్టికాయిడ్స్) - కార్టిసోల్ అధికోత్పత్తి వల్ల కలిగే వ్యాధి?
- కుషింగ్ సిండ్రోమ్ - పోరాట (లేదా) పలాయన హార్మోన్లు అని వేటినంటారు?
- ఎడ్రినలిన్ లేదా నార్‌ఎడ్రినలిన్ - స్త్రీలలో అండోత్సర్గాన్ని ప్రేరేపించే హార్మోన్?
- LH (లూటినైజింగ్ హార్మోన్) - గర్భిణిల మూత్రంలో అధికంగా ఉండే హార్మోన్?
- HCG (హ్యూమన్ కొరియోనిక్ గొనడోట్రోపిక్ హార్మోన్) - ముష్కంలో ఉండే లీడిగ్ కణాలు స్రవించే హార్మోన్?
- టెస్టోస్టిరాన్ - గ్రాఫియన్ పుటికలు ఏ హార్మోన్‌ను విడుదల చేస్తాయి?
- ఈస్ట్రోజన్ - కార్పస్ ల్యూటియం విడుదల చేసే హార్మోన్?
- ప్రొజెస్టిరాన్ - గర్భ నిర్ధారణ పరీక్షలకు వాడే Pregnancy test kit లు ఏ హార్మోన్ ఆధారంగా పనిచేస్తాయి?
- HCG (Human Chorionic Gonadotropin)
Published date : 13 Aug 2016 12:19PM