Skip to main content

హార్మోన్లు - 3

మొక్కల్లో, జంతువుల్లో వివిధ రకాల హార్మోన్లు ఉంటాయి.
మొక్కల్లో ఉండే హార్మోన్లు:
1. ఆక్సిన్లు
2. జిబ్బరెల్లిన్లు
3. సైటోకైనిన్లు
4. ఇథిలిన్
5. అబ్‌సిసిక్ ఆమ్లం

జంతువుల్లో ఉండే హార్మోన్లు: జంతువుల్లో వివిధ గ్రంథులు వివిధ హార్మోన్లను స్రవిస్తాయి.
హార్మోన్లను స్రవించే గ్రంథులు: పిట్యూటరీ గ్రంథి, థైరాయిడ్, పారా థైరాయిడ్, అడ్రినల్,పాంక్రియాస్ (క్లోమం), గోనాడ్స్‌ (బీజకోశాలు).
ఈ అంశాల గురించి విశ్లేషణాత్మకంగా చదివితే కచ్చితమైన సమాధానాలు గుర్తించొచ్చు.

గతంలో అడిగిన ప్రశ్న
శరీరంలో ఎముక నిర్మాణానికి అవ సరమైన Ca, P మూలకాలను సమతాస్థితిలో ఉంచే గ్రంథి?
ఎ) థైరాయిడ్
బి) అడ్రినల్
సి) పారాథైరాయిడ్
డి) పిట్యూటరీ
జ: (సి) అడ్రినలిన్ Na అయాన్లను నియంత్రిస్తుంది. థైరాయిడ్‌కు అయోడిన్‌తో సంబంధం ఉంటుంది. ఇలాంటి అంశాలను గుర్తుంచుకుంటే తేలిగ్గా సమాధానం గుర్తించొచ్చు.

కింది ప్రశ్నలను గమనించండి..
మానవ శరీరంలో అతి పెద్ద అంతఃస్రావ గ్రంథి ఏది?
ఎ) కాలేయం
బి) క్లోమం
సి) పిట్యూటరీ
డి) థైరాయిడ్
జ. (డి) అతిపెద్ద గ్రంథి, అతి ప్రధాన గ్రంథి, అతి పెద్ద అంతఃస్రావ గ్రంథి వంటి వాటిని జాగ్రత్తగా నేర్చుకోవాలి. ఈపదాలతో తికమక పెట్టొచ్చు. కాబట్టి ప్రతి పదానికీ సంబంధించిన విషయాలను క్షుణ్నంగా అధ్యయనం చేస్తే సులభంగా సమాధానం గుర్తించొచ్చు. మానవ శరీరంలో అతిపెద్ద గ్రంథి కాలేయం. అతి ప్రధాన గ్రంథి పిట్యూటరీ, మిశ్రమ గ్రంథి- క్లోమం.

కింది వాటిలో మధుమేహాన్ని నియంత్రించే గ్రంథి ఏది?
ఎ) థైరాయిడ్
బి) కాలేయం
సి) అడ్రినల్
డి) క్లోమం
జ: (డి) క్లోమం అనేది మిశ్రమ గ్రంథి. ఇది ఎంజైములను, హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది. ఇది విడుదల చేసే హార్మోన్లు...
ఎ) ఇన్సులిన్
బి) గ్లూకగాన్.
ఇన్సులిన్ శరీరంలోని గ్లూకోజ్‌ను నియంత్రిస్తుంది. ఎక్కువైన గ్లూకోజ్‌ను గ్లైకోజన్‌గా మారుస్తుంది. ఇది గ్లూకోజ్ (చక్కెర) స్థాయిని నియంత్రిస్తుంది. కాబట్టి సరైన సమాధానం క్లోమం.

విత్తనాలు లేని ఫలాలు ఏర్పడటానికి ఉపయోగపడే హార్మోన్ ఏది?
ఎ) ఆక్సిన్
బి) జిబ్బరెల్లిన్
సి) సైటోకైనిన్
డి) ఇథిలిన్
జ: (బి) జిబ్బరెల్లిన్, ఇథిలిన్ ఫలాలకు సంబంధించిన హార్మోన్లు. విత్తనాలు లేని (అనిషేక) ఫలాలు ఏర్పడటానికి జిబ్బరెల్లిన్; ఫలాలు త్వరగా పక్వం చెందడానికి ఇథిలిన్ తోడ్పడతాయి.

కింది వాటిలో గుల్మనాశకాన్ని గుర్తించండి?
ఎ) IAA
బి) IBA
సి) NAA
డి) 2, 4D
జ: (డి) ఆక్సిన్ల గురించి లోతుగా అధ్యయనం చేస్తే ఈ ప్రశ్నకు సమాధానం గుర్తించొచ్చు. మొక్కల్లో సహజంగా ఉండే ఆక్సిన్ IAA. మిగిలి నవి కృత్రిమంగా రూపొందించినవి. వీటిలో ఐఆఅ వేర్ల ఉత్పత్తికి, NAA పుష్పాల ఉత్పత్తికి తోడ్పడతాయి. 2,4D, 2,4,5T అనేవి గుల్మనాశకాలు (కలుపు మొక్కలనాశని) అని గుర్తుంచుకోవాలి.


మాదిరి ప్రశ్నలు

1. భారత్‌లో అంధత్వానికి ముఖ్యమైన కారణం?
 1) ట్రకోమా 
 2) కాటరాక్ట్
 3) గ్లుకోమా 
 4) రోడ్డు ప్రమాదాలు

Published date : 20 Sep 2016 05:34PM

Photo Stories