ఎద్దు వీర్యాన్ని కృత్రిమంగా దేనిలో నిల్వ చేస్తారు?
1. కింది వాటిలో సరైన వరస క్రమం?
1) గడ్డి-తోడేలు-జింక-గేదె
2) గడ్డి-కీటకం-పక్షి-పాము
3) బ్యాక్టీరియా-కీటకం-పాము-జింక
4) బ్యాక్టీరియా-గడ్డి-కుందేలు-తోడేలు
- View Answer
- సమాధానం: 2
2. అండోత్పత్తి స్థానం నుంచి అండాలు గర్భాశయంలోకి ప్రవేశించడానికి ఏ భాగం సహాయపడుతుంది?
1) సెర్విక్
2) యోని
3) జెరాయువు
4) పెల్లోపియన్ నాళాలు
- View Answer
- సమాధానం: 4
3.ఎద్దు వీర్యాన్ని కృత్రిమంగా దేనిలో నిల్వ చేస్తారు? (వీర్యం-రేతస్సు)
1) మంచు
2) ద్రవ ఆక్సిజన్
3) ద్రవ నైట్రోజన్
4) ద్రవ కార్బన్ డై ఆక్సైడ్
- View Answer
- సమాధానం:3
4. బాహ్య ఫలదీకరణ జరిపే జంతువులు?
1) కాకి-చేప
2) కప్ప-చేప
3) కప్ప-ఎలుక
4) పాము-చేప
- View Answer
- సమాధానం: 2
5. శిశువు లింగ నిర్ధారణ ఎవరిపై ఆధారపడి ఉంటుంది?
1) తల్లి-తండ్రి
2) తల్లిపై
3) తండ్రిపై
4) తాత-ముత్తాతలపై
- View Answer
- సమాధానం: 3
6. సియామీ కవలల వేలి ముద్రలు?
1) ఒకేలా ఉంటాయి
2) ఒకేలా ఉండవు
3) తరచూ ఒకేలా ఉంటాయి
4) తక్కువ తరచుగా ఒకేలా ఉంటాయి
- View Answer
- సమాధానం: 2
7. ఆమ్నియోసెంటాసిస్ అనే వైద్య పరీక్ష దేన్ని నిర్ణయించేందుకు చేస్తారు?
1) బ్లడ్ షుగర్
2) క్యాన్సర్
3) లింగ నిర్ధారణ
4) గుండె స్థితి
- View Answer
- సమాధానం: 3
8. పురుషుల్లో సెక్స్ సామర్థ్యాన్ని పెంచే వయాగ్రా డ్రగ్‌ను ఏ వైద్యులు సిఫార్సు చేయరాదు?
1) ఎండోక్రైనాలజిస్టులు
2) కార్డియాలజిస్టులు
3) సైక్రియాట్రిస్టులు
4) యూరాలజిస్ట్లు
- View Answer
- సమాధానం: 2
9. జీవ పరిణామ వాదానికి సంబంధించిన మొదటి సిద్ధాంతాన్ని రూపొందించింది?
1) హెర్బర్ట్ స్పెన్సర్
2) చార్లెస్ డార్విన్
3) క్యురియస్
4) జె.బి.లామార్క్
- View Answer
- సమాధానం: 4
10. ఆరిజన్ ఆఫ్ స్పీసీస్ గ్రంథకర్త?
1) లామార్క్
2) చార్లెస్ డార్విన్
3) డీవ్రీస్
4) మెండల్
- View Answer
- సమాధానం: 2
11. భూమిపై/ సముద్రంలో మొదట ఏర్పడిన కిరణజన్య సంయోగక్రియ జరిపే జీవులు?
1) శైవలాలు
2) మొక్కలు
3) సయనో బ్యాక్టీరియా
4) శిలీంద్రాలు
- View Answer
- సమాధానం: 3
12. ఉత్పరివర్తన పరిణామ సిద్ధాంతాన్ని ప్రతిపా దించింది?
1) డార్విన్
2) లామార్క్
3) మెండల్
4) డీవ్రీస్
- View Answer
- సమాధానం: 4
13.హరగోవింద్ ఖురానా చేసిన పరిశోధన ఏమిటి?
1) నూతన కణాల గుర్తింపు
2) ప్రయోగశాలలో కృత్రిమ జన్యువు సృష్టి
3) మొక్కలో పరివర్తన
4) జన్యుమార్పిడి
- View Answer
- సమాధానం: 2
14. జన్యువు అంటే?
1) ప్రోటీన్‌లోని అమైనో ఆమ్లం
2) సహలగ్న సముదాయం
3) డీఎన్ఏ ముక్క
4) ఆర్‌ఎన్‌ఏలోని కొంత భాగం
- View Answer
- సమాధానం: 3
15. జీవుల్లో వంశపారంపర్య లక్షణాలను కలిగిం చేది?
1) Hb
2) DNA
3) RNA
4) ATP
- View Answer
- సమాధానం: 2
16. అనువంశిక లక్షణాలను క్రమబద్ధీకరించే కారకాన్ని ‘జీన్’ అని పిలిచినవారు?
1) గ్రెగర్ మెండల్
2) హ్యూగోడీవ్రీస్
3) టి.హెచ్.మోర్గాన్
4) జొహెన్సన్
- View Answer
- సమాధానం: 4
17. మానవ శరీరంలో క్రోమోజోమ్‌ల సంఖ్య?
1) 44
2) 46
3) 45
4) 43
- View Answer
- సమాధానం: 2
18. మెండల్ తన పరిశోధనలను ఏ మొక్కపై పరిశోధన చేసి ప్రతిపాదించాడు?
1) ఫ్రూట్ ఫ్లై
2) బ్రెడ్ మోల్డ్
3) బఠాణీ మొక్క
4) రిసినస్
- View Answer
- సమాధానం: 3
19. కింది వాటిలో ఏది పారసైటిక్ (వాహక-విక్టర్స్) వ్యాధి కాదు?
1) మెదడు వాపు
2) డెంగ్యూవ్యాధి
3) చికెన్ గున్యా
4) లెప్రసీ (కుష్ఠువ్యాధి)
- View Answer
- సమాధానం: 4
20.మానవ రక్తంలో టైఫాయిడ్ కారకాలను నిర్ధారించే పరీక్ష?
1) షీక్ టెస్ట్
2) పీసీఆర్ టెస్ట్
3) వైడాల్ టెస్ట్
4) ఎలీసా టెస్ట్
- View Answer
- సమాధానం: 3
21.తాగేనీటిలో ఎక్కువ శాతం ఫ్లోరిన్ ఉండడం వల్ల వచ్చే వ్యాధి?
1) అనీమియా
2) ఫ్లోరోసిస్
3) మినిమోటా
4) గౌట్ వ్యాధి
- View Answer
- సమాధానం: 2
22. ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి ఎబోలాకి కారణం?
1) బ్యాక్టీరియా
2) ప్రోటోజోవా
3) ఫంగస్
4) వైరస్
- View Answer
- సమాధానం: 4
23. ఊపిరితిత్తుల్లోకి నిచ్ఛ్వాస ప్రక్రియలో రక్తం నుంచి సరఫరా అయ్యేది?
1) నత్రజని
2) కార్బన్‌డైఆక్సైడ్
3) ఆమ్లజని
4) కార్బన్ మోనాక్సైడ్
- View Answer
- సమాధానం: 2
24. మానవుడి గుండె ఎడమ భాగం దేన్ని కలిగి ఉంటుంది?
1) O2 రహిత రక్తం
2)O2 సహిత రక్తం
3) ఉదజని రహిత రక్తం
4) ఉదజని సహిత రక్తం
- View Answer
- సమాధానం: 2
25.తృతీయ వినియోగదారులు?
1) సర్వభక్షులు
2) డీకాంపోజర్స్
3) శాకాహారులు
4) మాంసాహారులు/ కార్నివోర్స్
- View Answer
- సమాధానం: 4
26.డబ్ల్యూహెచ్‌వో ప్రకారం ప్రపంచంలోని చాలా మంది చిన్న పిల్లల్లో కలిగే అంధత్వానికి కారణమైన విటమిన్?
1) బి-విటమిన్
2) సి-విటమిన్
3) ఎ-విటమిన్
4) డి-విటమిన్
- View Answer
- సమాధానం: 3
27. ఆరోగ్యవంతమైన మానవుడి రక్తం PH ఎంత?
1) 13.0
2) 7.4
3) 4.8
4) 6.4
- View Answer
- సమాధానం: 2
28. స్వైన్‌ఫ్లూ (శీతల జ్వరం) కారక వైరస్?
1) హెచ్1ఎన్1 వైరస్
2) హెచ్5ఎన్1
3) హెచ్1ఎన్5
4) హెచ్ఎన్
- View Answer
- సమాధానం: 1