భూమిపై ఉన్న వృక్షాలన్నీ నశిస్తే జీవులన్నీ మరణిస్తాయి. కారణం?
1. భూమిపై ఉన్న వృక్షాలన్నీ నశిస్తే జీవులన్నీ మరణిస్తాయి. కారణం?
1) కార్బన్ డై ఆక్సైడ్ లేకపోవడం
2) ఆక్సిజన్ లేకపోవడం
3) 1, 2
4) ఏదీకాదు
- View Answer
- సమాధానం: 2
2. మడ వృక్షాలు (మంగ్రూవ్ అడవులు) అంటే?
1) నీటి మొక్కలు
2) ఉప్పునీటి వృక్షాలు
3) పండ్లనిచ్చే వృక్షాలు
4) ఆల్గే
- View Answer
- సమాధానం: 2
3. హైడ్రోఫోనిక్స్ అంటే ఏమిటి?
1) ధ్వని తరంగాలతో నీటిని శుద్ధిచేయడం
2) వాతావరణం, నీరు అవసరం లేకుండా మొక్కలు పెంచే పద్ధతి
3) మృత్తిక అవసరం లేకుండా మొక్కలు పెంచే పద్ధతి
4) తడి గాలిని పంపి మొక్కలను పెంచే పద్ధతి
- View Answer
- సమాధానం: 3
4. హెర్బేరియం అనేది ఒక.. ?
1) ఎండు ఔషధ మొక్కల సంకలనం
2) వివిధ ఔషధ మొక్కల తోట
3) విత్తనాలను నిల్వచేసే సంస్థ
4) ఎండు మొక్కల నమూనాలను భద్రపరిచే సంస్థ
- View Answer
- సమాధానం: 4
5. కాఫీలో కలిపే చికోరి పౌడర్‌ను మొక్క ఏ భాగం నుంచి గ్రహిస్తారు?
1) కాండం
2) వేరు
3) ఆకులు
4) విత్తనాలు
- View Answer
- సమాధానం: 2
6. ‘రాడిష్’ అనేది ఒక ..?
1) బల్బ్
2) మొక్కజొన్న
3) మార్పుచేసిన వేరు
4) ట్యూబర్
- View Answer
- సమాధానం: 3
7. వేరు బుడిపెలు ఉన్న పంటలను ఎక్కువగా సాగు చేస్తే నేలలో స్థాపితమయ్యే మూలకం ఏది?
1) కాల్షియం
2) పొటాషియం
3) భాస్వరం
4) నత్రజని
- View Answer
- సమాధానం: 4
8. అల్లం అనేది ఒక ....
1) కండ కలిగిన వేరు
2) కండ కలిగిన కాండం
3) నిల్వచేసే వేరు
4) ఉపవాయుగత కాండం
- View Answer
- సమాధానం: 2
9. ‘జెనెటిక్స్’ అనే పదాన్ని ప్రతిపాదించింది ఎవరు?
1) హ్యూగో డీవ్రీస్
2) మెండల్
3) బేట్సన్
4) సట్టన్-జొహెన్సన్
- View Answer
- సమాధానం: 3
10. ఆకుల ద్వారా జరిగే ట్రాన్సిఫిరేషన్ ప్రక్రియలో పాల్గొనే నిర్మాణాలేవి?
1) క్యూటికిల్
2) లెంటిసెల్స్
3) స్టొమాట
4) హైడథోడ్స్
- View Answer
- సమాధానం: 3
11. కుంకుమపువ్వును మొక్క ఏ భాగం నుంచి సేకరిస్తారు?
1) ఎండిన రక్షక పత్రాలు
2) ఎండిన పూమొగ్గలు
3) కీలాగ్రం
4) ఆకర్షణ పత్రాలు
- View Answer
- సమాధానం: 3
12. కింద పేర్కొన్న పత్రరంధ్రాల ద్వారా నీరు బిందువుల రూపంలో స్రవితమవుతుంది. ఆ నిర్మాణాలను ఏమంటారు?
1) లెంటిసెల్స్
2) ఫయలోపోర్
3) హైడథోడ్స్
4) స్టొమాట
- View Answer
- సమాధానం: 3
13. పీచర్ ప్లాంట్‌లోని ఏ భాగం పీచర్గా మార్పు చెందుతుంది?
1) కాండం
2) ఆకు
3) స్టిప్యూల్స్
4) పిటియోల్
- View Answer
- సమాధానం: 2
14.కింది వాటిలో మాంసాహార మొక్క ఏది?
1) నెపంథిస్
2) డ్రాసిరా
3) డయోనియా
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
15. జీవితకాలంలో కొన్ని మొక్కలు ఒకేసారి పుష్పిస్తాయి. వాటిని ఏమని పిలుస్తారు?
1) మోనోకార్పిక్
2) మోనోగామస్
3) మోనోజెనిక్
4) మోనోమార్పిక్
- View Answer
- సమాధానం: 1
16. అతిపెద్ద పుష్పం ఏది?
1) క్రైసాంథిమమ్
2) రఫ్లీషియా
3) సన్‌ఫ్లవర్
4) జిన్నియా
- View Answer
- సమాధానం: 2
17. ఆపిల్‌లో తినే భాగం ఏది?
1) కార్పెల్
2) థాలమస్
3) పెడిసిల్
4) ఎండోకార్ప్
- View Answer
- సమాధానం: 2
18. పప్పుధాన్యాల్లో ప్రధానంగా ఉండే పోషక విలువలేవి?
1) పిండి పదార్థాలు
2) విటమిన్లు
3) కొవ్వులు
4) మాంసకృత్తులు
- View Answer
- సమాధానం: 4
19.సుగంధద్రవ్యంగా ఉపయోగపడే లవంగం అనేది ఒక .......
1) వేరు
2) ఫలం
3) ఎండిన విప్పారని పూమొగ్గ
4) కాండం
- View Answer
- సమాధానం: 3
20. ‘చందన వృక్షం’ శాస్త్రీయ నామం?
1) సాంటాలమ్ ఆల్బం
2) షోరియా రొబెస్టా
3) సిడ్రస్ డియోడరా
4) పైనస్ రాక్స్బర్గై
- View Answer
- సమాధానం: 1
21. ‘మార్పిన్’ను మొక్క ఏ భాగం నుంచి సేకరిస్తారు?
1) పుష్పం
2) ఆకు
3) పండు/కాయ లేటెక్స్
4) కాండం
- View Answer
- సమాధానం: 3
22. వృక్ష కణం, జంతు కణానికి మధ్య తేడా?
1) కేంద్రకం
2) ప్లాస్మాత్వచం
3) క్లోరోప్లాస్ట్
4) మైటోకాండ్రియా
- View Answer
- సమాధానం: 3
23. సూక్ష్మదర్శిని ద్వారా కణాన్ని పరిశీలించిన తొలి శాస్త్రవేత్త ఎవరు?
1) రాబర్ట్ హుక్
2) ఎ.వి. లీవెన్‌హుక్
3) టి. ష్వాన్
4) ఎం.జె. ష్లైడన్
- View Answer
- సమాధానం: 1
24. కింది వాటిలో ప్రోకారియోటిక్ (కేంద్రక పూర్వ) కణం కానిది?
1) క్లోరెల్లా
2) ఈస్ట్
3) క్షయ బ్యాక్టీరియా
4) 1, 2
- View Answer
- సమాధానం: 4
25. వాణిజ్యపరంగా ‘కార్క్’ అనేది ఏ వృక్షం నుంచి తీసిన బెండు?
1) ఎల్మ్
2) విల్లో
3) ఆర్కిడ్
4) ఓక్
- View Answer
- సమాధానం: 4
26. ‘ప్రతి జీవి దేహం కణాలతో నిర్మితమవుతుంది. జీవుల నిర్మాణాత్మక, క్రియాత్మక ప్రమాణం కణం’ అని కణ సిద్ధాంతాన్ని వివరించినవారు?
1) లూయీపాశ్చర్
2) రాబర్ట్ హుక్
3) ష్లైడన్-ష్వాన్
4) లీవెన్‌హుక్
- View Answer
- సమాధానం: 3
27. జన్యువు (Gene) అంటే?
1) ప్రోటీన్‌లోని అమైనో ఆమ్లం
2) ఆర్ఎన్ఏలో కొంత భాగం
3) డీఎన్ఏ ముక్క
4) సహలగ్న సముదాయం
- View Answer
- సమాధానం: 3
28. అంతర్లీనంగా దాగి ఉండే లక్షణాన్ని ఏమంటారు?
1) డామినెంట్
2) F1 జనరేషన్
3) రెసిసివ్
4) పైవేవీకాదు
- View Answer
- సమాధానం: 3
29. హరగోవింద్ ఖురానా చేసిన పరిశోధన ఏమిటి?
1) నూతన కణాల గుర్తింపు
2) ప్రయోగశాలలో కృత్రిమ జన్యువు సృష్టి
3) మొక్కల్లో పరివర్తన
4) జన్యు మార్పిడి
- View Answer
- సమాధానం: 2
30. ‘జన్యువు’ అని పేరు పెట్టినవారెవరు?
1) బేట్సన్
2) మెండల్
3) జొహెన్సన్
4) క్రిక్-వాట్సన్
- View Answer
- సమాధానం: 3
31.జీవ పరిణామ సిద్ధాంతాన్ని తొలిసారిగా శాస్త్రీయంగా ప్రతిపాదించినవారు?
1) లామార్క్
2) డార్విన్
3) డేవ్రీస్
4) మెండల్
- View Answer
- సమాధానం: 2
32. ‘ది ఆరిజన్ ఆఫ్ స్పెసీస్’ గ్రంథకర్త?
1) లామార్క్
2) చార్లెస్ డార్విన్
3) డీవ్రీస్
4) మెండల్
- View Answer
- సమాధానం: 2
33. సముద్రంలో ఏర్పడిన, కిరణజన్య సంయోగ క్రియ జరిపే మొదటి జీవులేవి?
1) శైవలాలు
2) సయనో బ్యాక్టీరియా
3) శిలీంధ్రాలు
4) మొక్కలు
- View Answer
- సమాధానం: 2
34. ఉత్పరివర్తన పరిణామ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినవారు?
1) డార్విన్
2) లామార్క్
3) మెండల్
4) హ్యూగో డీవ్రీస్
- View Answer
- సమాధానం: 4
35. ‘ప్రోటీన్ల కర్మాగారాలు’ అని వేటిని పిలుస్తారు?
1) పెరాక్సీజోమ్లు
2) రైబోజోమ్స్
3) హరితరేణువు
4) మైటోకాండ్రియా
- View Answer
- సమాధానం: 2
36. మానవుడి శుక్రకణంలోని క్రోమోజోమ్‌ల సంఖ్య?
1) 46
2) 44+XX
3) 22
4) 23
- View Answer
- సమాధానం: 4
37. కొబ్బరి అంకురచ్చద స్థితి?
1) ఏక స్థితికం
2) ద్వయ స్థితికం
3) త్రయ స్థితికం
4) బహు స్థితికం
- View Answer
- సమాధానం: 3
38.సమ విభజనను పరిశీలించడానికి అనువైన స్థానం ఏది?
1) కాండం
2) ఉల్లి వేరుకొన
3) మొగ్గ
4) పుష్పంలోని పరాగకోశం
- View Answer
- సమాధానం: 2
39. డీఎన్ఏ డబుల్ హెలిక్స్ నమూనాను ప్రతిపాదించినవారు?
1) ష్లైడన్ - ష్వాన్
2) క్రిక్-వాట్సన్
3) బేంధమ్-హుకర్
4) ఎంగ్లర్ ప్రాంటల్
- View Answer
- సమాధానం: 2
40. అంటుకట్టడం, గాయాలు మానడంలో ఇమిడి ఉన్న ప్రక్రియ ఏది?
1) ద్విదావిచ్ఛిత్తి
2) బహుదావిచ్ఛిత్తి
3) సమ విభజన
4) క్షయకరణ విభజన
- View Answer
- సమాధానం: 3
41. పాకిటీన్ ఉపదశ దేనిలో ఉంటుంది?
1) సమ విభజన
2) క్షయకరణ విభజన
3) అసమ విభజన
4) ఏదీకాదు
- View Answer
- సమాధానం:2
42. కిరణజన్య సంయోగక్రియ ఏ కాంతిలో ఎక్కువగా జరుగుతుంది?
1) నీలి కాంతి
2) సూర్య కాంతి
3) అరుణ కాంతి
4) అతినీలలోహిత కాంతి
- View Answer
- సమాధానం: 3
43.క్లోరోఫిల్ అణువులో ఏ మూలకం ఉంటుంది?
1) ఇనుము
2) మెగ్నీషియం
3) కోబాల్ట్
4) కాల్షియం
- View Answer
- సమాధానం: 2
44. మానవ నిర్మిత ధాన్యపు మొక్క (Man made cereal)?
1) ఓట్స్
2) రెపానో బ్రాసికా
3) ట్రిటికేల్
4) షర్బతి సానోరా
- View Answer
- సమాధానం: 3
45. నీటిలో కరిగే వర్ణద్రవ్యాలు?
1) క్లోరోఫిల్స్
2) కెరోటినాయిడ్స్
3) జాంతోఫిల్స్
4) పైకోబిలిన్లు
- View Answer
- సమాధానం: 4
46.శిలీంధ్రం నుంచి రూపొందించిన ఫైటోహార్మోన్ ఏది?
1) ఆక్సిన్
2) జిబ్బరెల్లిన్
3) సైటోకైనిన్
4) ఇథిలీన్
- View Answer
- సమాధానం: 2
47. అగ్రాధిక్యతకు కారణమైన హార్మోన్ ఏది?
1) ఆక్సిన్
2) జిబ్బరెల్లిన్
3) సైటోకైనిన్
4) ఇథిలీన్
- View Answer
- సమాధానం: 1
48. కింది వాటిలో జిబ్బరెల్లిన్‌ల చర్య ఏది?
1) మొక్కల పొడవు పెంచుతుంది
2) అన్ని రకాల మొక్కల పొడవు పెంచుతుంది
3) పొట్టి మొక్కల పొడవు మాత్రమేపెంచుతుంది
4) పొడవు మొక్కల పొడవు పెంచుతుంది
- View Answer
- సమాధానం: 3
49. విత్తన రహిత ఫలాలు ఏర్పడటానికి దోహదపడే హార్మోన్ ఏది?
1) అబ్‌సైసిక్ ఆమ్లం
2) సైటోకైనిన్
3) ఆక్సిన్
4) జిబ్బరెల్లిన్లు
- View Answer
- సమాధానం: 4
50. ఫ్రూట్ రైపనింగ్ హార్మోన్ ఏది?
1) అబ్‌సైసిక్ ఆమ్లం
2) ఇథిలీన్
3) సైటోకైనిన్
4) జిబ్బరెల్లిన్
- View Answer
- సమాధానం: 2
51. వార్ధక్యాన్ని నివారించే హార్మోన్ ఏది?
1) ఆక్సిన్
2) సైటోకైనిన్
3) ఇథిలీన్
4) అబ్‌సైసిక్ ఆమ్లం
- View Answer
- సమాధానం: 2
52.కణ విభజనను ప్రోత్సహించే హార్మోన్?
1) ఇథిలీన్
2) సైటోకైనిన్
3) జిబ్బరెల్లిన్
4) అబ్‌సైసిక్ ఆమ్లం
- View Answer
- సమాధానం: 2
53. సుప్తావస్థను కలుగజేసే హార్మోన్ ఏది?
1) ఇథిలీన్
2) సైటోకైనిన్
3) జిబ్బరెల్లిన్
4) అబ్‌సైసిక్ ఆమ్లం
- View Answer
- సమాధానం: 4
54. మొక్కల ఆకులు ఆకుపచ్చ రంగులో ఉండటానికి కారణం?
1) మెలనిన్
2) టానిన్
3) క్లోరోఫిల్
4) బ్యాక్టీరియా
- View Answer
- సమాధానం: 3
55. మొక్కల పెరుగుదలకు కావాల్సిన ప్రధాన సమ్మేళనం ఏది?
1) సల్ఫర్
2) సోడియం
3) కార్బన్
4) నైట్రోజన్
- View Answer
- సమాధానం: 4
56. క్వినైన్ దేని నుంచి లభిస్తుంది?
1) మల్బరీ
2) కోకో
3) సింకోనా
4) యూకలిప్టస్
- View Answer
- సమాధానం:3
57. ‘ద్వి ఫలదీకరణం’ ఏ మొక్కల ముఖ్య లక్షణం?
1) శైవలాలు
2) బ్రయోఫైటా
3) వివృత బీజాలు
4) ఆవృత బీజాలు
- View Answer
- సమాధానం: 4
58. లిట్మస్ పేపర్ తయారీకి ఉపయోగించే మొక్క ఏది?
1) శైవలాలు
2) శిలీంధ్రం
3) లైకేన్లు
4) పెర్న
- View Answer
- సమాధానం: 3
59. పిండి పదార్థాలను గుర్తించే రసాయనం?
1) కోబాల్ట్ క్లోరైడ్
2) అయోడిన్
3) సోడియం హైడ్రాక్సైడ్
4) కాపర్ సల్ఫేట్
- View Answer
- సమాధానం: 2
1) హరిత రేణువు
2) మైటోకాండ్రియా
3) రైబోజోమ్స్
4) 1, 2
- View Answer
- సమాధానం: 4
61. జీవ పరిణామంలో ప్రకృతి ఎన్నిక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త?
1) లామార్క్
2) డార్విన్
3) డీవ్రీస్
4) మెండల్
- View Answer
- సమాధానం: 2
62. జీవుల్లో వంశపారంపర్య లక్షణాలు కలిగించేది ఏది?
1) ఆర్ఎన్ఏ
2) ఏటీపీ
3) డీఎన్ఏ
4) హిమోగ్లోబిన్
- View Answer
- సమాధానం: 3
63. క్రోమోజోమ్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు?
1) డార్విన్
2) మెండల్
3) సట్టన్-బవేరి
4) లామార్క్
- View Answer
- సమాధానం: 3
64. శిశువు లింగ నిర్ధారణ ఎవరిపై ఆధారపడి ఉంటుంది?
1) తల్లి
2) తండ్రి
3) తల్లి, తండ్రి
4) పూర్వీకులు
- View Answer
- సమాధానం:2
65. డీఎన్ఏలోని క్రియాత్మక ప్రమాణం?
1) సిస్ట్రాన్
2) రేకాన్
3) మ్యూటాన్
4) ఏదీకాదు
- View Answer
- సమాధానం: 1