Skip to main content

APPSC Forest Range Officers Notification: మరో ఉద్యోగ నోటిఫికేషన్‌ విడుదల చేసిన ఏపీపీఎస్సీ, ఇలా అప్లై చేసుకోండి

Job Alert  APPSC Forest Range Officers Notification   Vacancy Announcement  Apply Now for Forest Range Officers Position
APPSC Forest Range Officers Notification

ఏపీపీఎస్సీ(APPSC) మరో ఉద్యోగ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. అటవీశాఖలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ భర్తీ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 

మొత్తం పోస్టులు:  37
అర్హత: సంబంధిత విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ లేదా తత్సమాన విద్యార్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అగ్రికల్చర్‌, బోట‌నీ, కెమిస్ట్రీ, కంప్యూటర్ అప్లికేషన్స్ / కంప్యూటర్ సైన్స్, ఇంజినీరింగ్ (అగ్రికల్చర్‌/ కెమికల్ / సివిల్ / కంప్యూటర్ / ఎలక్ట్రికల్ / ఎలక్ట్రానిక్స్ /మెకానికల్)ఫారెస్ట్రీ, జాగ్రఫీ, హార్టీకల్చర్‌, మ్యాథమెటిక్స్‌, ఫిజిక్స్‌, స్టాటిస్టిక్స్‌, వెటర్నరీ సైన్స్, జువాలజీ విభాగాల్లో తత్సమాన విద్యార్హత ఉండాలి. 

వయస్సు: 01/07/24 నాటికి 30 ఏళ్లకు మించకూడదు
అప్లికేషన్‌ ఫీజు: రూ. 250 అప్లికేష‌న్ ప్రాసెసింగ్ ఫీజుతో పాటు పరీక్ష ఫీజు రూ. 120 చెల్లించాల్సి ఉంటుంది.(ఎస్సీ/ ఎస్టీ, బీసీ/ఎక్స్ సర్విస్‌మెన్ తదితరులకు ప‌రీక్ష ఫీజు రూ.120 నుంచి మినహాయింపు ఉంటుంది).

వేతనం: రూ. 48,000 నుంచి రూ. 1,37,220గా నిర్ణయించారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ప్రారంభ తేది: ఏప్రిల్‌ 15, 2024
అప్లికేషన్‌కు చివరి తేది: మే 05, 2024

Published date : 12 Mar 2024 03:31PM
PDF

Photo Stories