Skip to main content

APBIE: విద్యార్థులు, లెక్చరర్లకు నైపుణ్య శిక్షణ

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ఇంటర్మీడియెట్‌ కాలేజీలలోని విద్యార్థులు, లెక్చరర్లకు వ్యక్తిత్వ వికాసం, నైపుణ్యాభివృద్ధి కోసం ఆంధ్రప్రదేశ్‌ ప్రవాసాంధ్రుల సంఘం (ఏపీఎన్నార్టీఎస్‌)తో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఇంటర్మీడియెట్‌ బోర్డు ఫిబ్రవరి 21న ఒక ప్రకటనలో తెలిపింది.
APBIE
ఇంటర్మీడియెట్‌ విద్యార్థులు, లెక్చరర్లకు నైపుణ్య శిక్షణ

ఈ ఒప్పందం ప్రకారం విద్యార్థులు, లెక్చరర్లకు ఎన్‌ఆర్‌ఐ డాక్టర్లు, వర్చువల్‌ విధానంలో శిక్షణ ఇస్తారని పేర్కొంది. నైపుణ్యాల పెంపుతో పాటు పరీక్ష సమయంలో విద్యార్థులు ఒత్తిడిని అధిగమించడానికి నిపుణులు శిక్షణ ఇస్తారని తెలిపింది. ఈ శిక్షణ ఒక్కో కాలేజీ నుంచి ఇద్దరు చొప్పున 6,800 మందికి ఇవ్వనున్నట్లు పేర్కొంది. 

చదవండి:

150 మంది గిరిజన విద్యార్థులకు నైపుణ్య శిక్షణ

అటు నైపుణ్యం... ఇటు ఉద్యోగం

Reskilling and Upskilling: స్కిల్‌.. అప్‌స్కిల్‌.. రీ–స్కిల్‌...

Skill Training: లక్ష మందికి నైపుణ్య శిక్షణ

Published date : 22 Feb 2023 03:07PM

Photo Stories