Skip to main content

APBIE: ఇంటర్‌ పరీక్ష ఫీజు చెల్లింపునకు గడువు పెంపు

సాక్షి, అమరావతి: ఇంటర్‌ పబ్లిక్‌ పరీక్ష ఫీజు(రూ.500 ఆలస్య రుసుముతో), కాలేజీలు అఫిలియేషన్‌ ఫీజుల చెల్లింపునకు గడువు పొడిగించినట్లు ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్మీడియెట్‌ బోర్డు కార్యదర్శి ఎంవీ శేషగిరిబాబు డిసెంబర్‌ 29న ఒక ప్రకటనలో తెలిపారు.
APBIE
ఇంటర్‌ పరీక్ష ఫీజు చెల్లింపునకు గడువు పెంపు

ఏపీ సీఎఫ్‌ఎస్‌ఎస్‌ ప్రాజెక్ట్‌ మేనేజర్‌ సమాచారం ప్రకారం అప్లికేషన్, డేటాబేస్‌ సర్వీస్‌ మైగ్రేషన్‌ చేస్తున్నందున పరీక్ష, కాలేజీల గుర్తింపు ఫీజులు చెల్లించేందుకు డీపీసీ, ఇతర ఆన్‌లైన్‌ సేవలు డిసెంబర్‌ 30 సాయంత్రం నుంచి జనవరి 2వ తేదీ ఉదయం వరకు పనిచేయబోవని పేర్కొన్నారు.

చదవండి: ఏపీ ఇంటర్ - సీనియర్ ఇంటర్ | టైం టేబుల్ 2023 | స్టడీ మెటీరియల్ | మోడల్ పేపర్స్ | ప్రివియస్‌ పేపర్స్ | న్యూస్ | టిఎస్ ఇంటర్

అందువల్ల రూ.500 ఆలస్య రుసుముతో ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం పరీక్ష ఫీజు చెల్లించడానికి చివరి తేదీని జనవరి 2 నుంచి 4 వరకు పొడిగించినట్లు తెలిపారు. అలాగే 2022–23 విద్యా సంవత్సరానికి అఫిలియేషన్‌ ఫీజు చెల్లింపు గడువు తేదీని డిసెంబర్‌ 31 నుంచి జనవరి 4 వరకు పొడిగించినట్లు వివరించారు.

Published date : 30 Dec 2022 04:52PM

Photo Stories