TSGENCO 2024 Exams Date Postponed: జెన్‌కో ఏఈ, కెమిస్ట్ పరీక్షలు వాయిదా.. కారణం ఇదే..
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ విద్యుదుత్పత్తి సంస్థ (జెన్‌కో)లో అసిస్టెంట్ ఇంజనీర్లు, కెమిస్ట్ ఉద్యోగాల భర్తీ కోసం మార్చి 31న జరగాల్సిన కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీటీ)ను రద్దు చేసినట్టు సంస్థ సీఎండీ ఎస్‌ఏఎం రిజ్వీ ప్రకటించారు.
రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్నందున పరీక్ష నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం నుంచి అనుమతి కోరారు.
ఎన్నికల సంఘం నుంచి ఇంకా స్పందన రాకపోవడంతో పరీక్షను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఎత్తి వేసిన తర్వాత పరీక్షల నిర్వహణకు కొత్త షెడ్యూల్‌ను ప్రకటిస్తామని రిజ్వీ తెలిపారు. పరీక్ష తేదిని త్వరలో ప్రకటిస్తామని తెలిపారు.
చదవండి:
NDMA Recruitment 2024: వైస్-ఛాన్సలర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, వేతనం నెలకు లక్షన్నర
Published date : 29 Mar 2024 01:11PM