Skip to main content

Sakshi Media: ఈఏపీసెట్, నీట్‌ విద్యార్థులకు మాక్‌ టెస్ట్‌లు

సాక్షి, అమరావతి/సాక్షి ఎడ్యుకేషన్‌ : మే 2, 3, 4 తేదీల్లో ‘సాక్షి’ మీడియా ఆధ్వర్యంలో నీట్, ఈఏపీసెట్‌ మాక్‌ టెస్ట్‌లను నిర్వహించనున్నారు.
Sakshi Media
ఈఏపీసెట్, నీట్‌ విద్యార్థులకు మాక్‌ టెస్ట్‌లు

ఈ పరీక్షలకు టెక్నాలజీ పాట్నర్‌గా మై ర్యాంక్‌ వ్యవహరించనుంది. దేశ వ్యాప్తంగా మెడికల్‌ కళాశాలల్లో ప్రవేశానికి నీట్, తెలుగు రాష్ట్రాల్లో ఇంజినీరింగ్‌/అగ్రికల్చర్‌ తదితర కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈఏపీసెట్‌ పరీక్షలను నిర్వహిస్తారు. అయితే ఈ పరీక్షలకు కొద్ది రోజుల ముందు వాస్తవ పరీక్షలాంటి వాతావరణంలో జరిగే సాక్షి మాక్‌ టెస్టులు రాయడం ద్వారా విద్యార్థులు తమ సన్నద్ధత స్థాయిని అంచనా వేసుకుని మరింత మెరుగవ్వడానికి అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో ఆసక్తి కలిగిన అభ్యర్థులు https://www.arenaone.in/mock ఝౌఛిజు ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్‌ ఫీజు రూ.350 చెల్లించాల్సి ఉంటుంది.

చదవండి: APSCHE: ఈఏపీసెట్‌లో ‘ఇంటర్‌’కు వెయిటేజీ.. ఏంతో తెలుసా..

రిజిస్ట్రేషన్‌లకు ఈ నెల 25వ తేదీ చివరి గడువు. రిజిస్టర్‌ చేసుకున్న ఈ మెయిల్‌కు పరీక్షకు సంబంధించిన హాల్‌ టికెట్‌ నంబర్‌ వస్తుంది. ఒక్కో స్ట్రీమ్‌కు(ఇంజినీరింగ్, అగ్రికల్చర్, నీట్‌) మూడు టెస్ట్‌లుంటాయి. ఈ పరీక్షలను మే 2, 3, 4 తేదీల్లో నిర్వహించనున్నారు. ఈ పరీక్షలను అభ్యర్థులు తమ హాల్‌ టికెట్‌ నంబర్‌(యూజర్‌ నేమ్‌), ఫోన్‌ నంబర్‌(పాస్‌వర్డ్‌)తో మూడు రోజుల్లో ఎప్పుడైనా లాగిన్‌ అయ్యి రాసుకోవచ్చు. అలాగే పరీక్ష ముగిసిన వెంటనే స్కోర్‌ను తెలుసుకోవచ్చు. http://sakshimocktest.myrank.co.in వెబ్‌సైట్‌లో పరీక్షలు నిర్వహిస్తారు. టెస్ట్‌కు సంబంధించిన కీని మే 5వ తేదీన ఇదే వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చు. పూర్తి వివరాలకు 9666697219, 9912671555, 7075709205 నంబర్లను సంప్రదించాల్సి ఉంటుంది. 

చదవండి: Best Courses After 12th BiPC: బైపీసీతో... క్రేజీ కోర్సులివే!

Published date : 12 Apr 2023 03:03PM

Photo Stories