Skip to main content

APEAPCET-2024 : మే 13 నుంచి ఏపీఈఏపీ సెట్‌..

మే 13 నుంచి ఏపీఈఏపీ సెట్‌..
APEAPCET-2024 : మే 13 నుంచి ఏపీఈఏపీ సెట్‌..
APEAPCET-2024 : మే 13 నుంచి ఏపీఈఏపీ సెట్‌..

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సంప్రదాయ, సాంకేతిక విద్యాకోర్సుల్లో ప్రవే­శాలకు సంబంధించి కామన్‌ ఎంట్రన్స్‌ టెస్టు (సెట్‌)ల తేదీలను ఉన్నత విద్యామండలి బుధవారం విడుదల చేసింది. మే 6వ తేదీ నుంచి జూన్‌ 13వ తేదీ వరకు 9 రకాల సెట్స్‌ను నిర్వహించనుంది. ఆయా వర్సిటీలకు ఒక్కో సెట్‌ నిర్వహణ బాధ్యతలను అప్ప­గిస్తూ కన్వీ­న­ర్లను నియమించింది. త్వరలోనే సెట్స్‌ కమిటీ­లతో సమా­వేశం నిర్వహించి దశలవారీగా ప్రవే­శాల షెడ్యూల్‌ను విడుదల చేయనుంది.

సీఎం వైఎస్‌ జగన్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపరీక్షల విధానంలో విప్లవాత్మక మార్పులు తీసుకొ­చ్చారు. విద్యార్థులకు మేలుచేస్తూ ఎంసెట్‌ స్థానంలో ఇంజనీరింగ్, అగ్రి­కల్చ­ర్, ఫార్మా కోర్సుల్లో ప్రవేశాలకు ఒకే ఎం­ట్రన్స్‌ టెస్టు (ఈఏపీసెట్‌) నిర్వ­హిస్తున్నారు. ఈ విధానం సత్ఫలి­తా­లి­వ్వడంతో తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ ఏడాది నుంచి అక్కడి ఎంసెట్‌ను ఈఏపీసెట్‌గా మార్చింది.

Also Read : EAMCET Quick Review

గతంలో పీజీ ప్రవేశాలకు వర్సిటీల వారీగా నోటి­ఫికే­షన్లు వచ్చేవి. విద్యార్థి వర్సిటీ­లకు విడి­వి­డిగా దరఖాస్తు చేసుకో­వాల్సి వచ్చేది. ఫలితంగా పేద విద్యా­ర్థులపై ఆర్థికభా­రం ఎక్కువయ్యేది. దీన్ని గమనించిన ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని వర్సిటీ­లకు ఒకే ఎంట్రన్స్‌ టెస్టును తీసుకొ­చ్చింది. ఇందులో అర్హత సాధించిన విద్యా­ర్థుల ర్యాంకుల ఆధా­­రంగా వర్సి­టీల్లో సీట్లు భర్తీచే­స్తోంది. దీంతో ప్రతి­భగల విద్యా­ర్థికి ఏ వర్సి­టీలోనైనా చదువుకునే అవకాశం దక్కుతోంది.

 

Published date : 15 Feb 2024 02:57PM

Photo Stories