Skip to main content

AP EAPCET 2023: ఈఏపీసెట్‌లో 25 శాతం ఇంటర్ వెయిటేజీ

ఇంజినీరింగ్‌, వ్యవసాయ, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఈఏపీసెట్‌లో ఇంటర్మీడియట్‌ మార్కులకు 25 శాతం వెయిటేజీ ఇవ్వనున్నారు.
AP EAPCET 2023

2020-21, 2021-22 విద్యా సంవ‌త్స‌రాల్లో విద్యార్థులకు పరీక్షలు నిర్వహించలేదు. దీంతో రెండేళ్లు ఇంటర్మీడియట్‌ మార్కుల వెయిటేజీని తొలగించారు. ఈ ఏడాది ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు పరీక్షలు రాయ‌డంతో 2023-24కు వెయిటేజీని పునరుద్ధరించారు. గతేడాది ఫ‌స్ట్ ఇయ‌ర్‌లో 70శాతం సిలబస్‌నే విద్యార్థులు చదవ‌డంతో ఈఏపీసెట్‌లోనూ ఆ మేరకే ప్రశ్నలు ఇవ్వాలని నిర్ణయించారు.

క‌చ్చితంగా పాస్ కావాల్సిందే....
ఇంటర్మీడియట్‌లోని నైతికత, మానవ విలువలు, పర్యావరణ విద్య పరీక్షల్లో విద్యార్థులు తప్పనిసరిగా ఉత్తీర్ణులు కావాలని ఇంటర్‌ విద్యామండలి కార్యదర్శి శేషగిరిబాబు తెలిపారు. గతంలో ఫెయిల్ అయిన‌ వారు, పరీక్ష రాయని విద్యార్థులు కళాశాలల నుంచి పాత హాల్‌ టికెట్లను తీసుకోవాలని సూచించారు. ఈ పరీక్షల్లో పాస్‌ కానివారికి ఉత్తీర్ణత సర్టిఫికెట్లు ఇవ్వబోమని స్ప‌ష్టం చేశారు.

College Predictor 2022 AP EAPCET TS EAMCET

ఇంజినీరింగ్‌, వ్యవసాయ, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష EAPCETలో ఇంటర్మీడియట్‌ మార్కులకు 25 శాతం వెయిటేజీ ఇవ్వనున్నారు.

Published date : 16 Feb 2023 11:37AM

Photo Stories