Survey Report: విద్యా దీవెన, వసతి దీవెనతో మంచి ఫలితాలు
2018–19తో పోలిస్తే 2019–20లో జాతీయ స్థాయిలో జీఈఆర్ రేషియో పెరుగుదల 3.04 శాతం కాగా మన రాష్ట్రంలో 8.6 శాతంగా నమోదైంది. జాతీయ స్థాయిలో జీఈఆర్‌కు సంబంధించి ఎస్సీల్లో 1.7 శాతం, ఎస్టీల్లో 4.5 శాతం, బాలికల్లో 2.28 శాతం పెరుగుదల ఉండగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరింత మెరుగైన ఫలితాలున్నాయి. ఎస్సీల్లో 7.5 శాతం, ఎస్టీల్లో 9.5 శాతం, విద్యార్థినుల్లో 11.03 శాతం పెరుగుదల నమోదైంది. జాతీయ స్థాయి సగటు కన్నా మెరుగ్గా ఉన్నప్పటికీ మనం అనుకున్న లక్ష్యాలను చేరాలంటే సుదీర్ఘ ప్రయాణం చేయాలి. అందరి ఆశీస్సులు, దేవుడి దయతో గమ్యాన్ని చేరుకుంటామన్న నమ్మకం ఉంది.
రెండున్నరేళ్లలో రూ.8,526 కోట్లు
పెద్ద చదువులకు పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్ ఒక్కటే సరిపోదని వసతి దీవెన పథకాన్ని కూడా అమలు చేస్తున్నాం. పిల్లల బోర్డింగ్, మెస్ ఖర్చులు రూ.20 వేలు చెల్లించలేని పరిస్థితుల్లో తల్లిదండ్రులున్నారు. వారు అవస్థలు పడకూడదు, అప్పుల పాలయ్యే పరిస్థితి రాకూడదనే వసతి దీవెన అమలు చేస్తున్నాం. వసతి దీవెనకు ఇప్పటివరకు రూ.2,267 కోట్లు నేరుగా తల్లుల ఖాతాల్లో జమ చేశాం. పిల్లలకు మేనమామలా.. అక్క చెల్లెమ్మలకు తమ్ముడిగా, అన్నగా మంచి చేస్తున్నాం. విద్యాదీవెన, వసతి దీవెన.. ఈ రెండు పథకాలకు కలిపి ఈ రెండున్నర ఏళ్లలో రూ.8,526 కోట్లకుపైగా ఇచ్చాం.
ట్రైబల్ వర్సిటీకి త్వరలో శంకుస్థాపన
విజయనగరం జిల్లాలో గురజాడ జేఎన్టీయూ, ఒంగోలులో ఆంధ్రకేసరి యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నాం. తద్వారా ప్రతి జిల్లాలో యూనివర్సిటీ ఉంటుంది. కడపలో ఆర్కిటెక్చర్ యూనివర్సిటీ, కర్నూలులో క్లస్టర్ యూనివర్సిటీ, కురుపాంలో ఇంజనీరింగ్ కాలేజీ, పాడేరులో మెడికల్ కాలేజీ, సాలూరులో ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటవుతున్నాయి. త్వరలోనే పనులు మొదలవుతాయి.
చదవండి:
Twitter: సీఈవోగా.. మనోడే!.. 11 ఏళ్లలోనే కీలక స్థానానికి..