Admissions: ప్రైవేటు స్కూళ్లలో ఇంత మందికి ఉచిత ప్రవేశాలు
Sakshi Education
సాక్షి, అమరావతి: ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం ప్రకారం 2023–24 విద్యా సంవత్సరానికి రాష్ట్రంలోని ప్రైవేటు అన్ ఎయిడెడ్ స్కూళ్లలోని 1వ తరగతిలో ప్రవేశాలకు ఎంపికైన అర్హుల జాబితాను ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యా శాఖ ఏప్రిల్ 18న విడుదల చేసింది.
దరఖాస్తులను పరిశీలించిన అనంతరం అర్హత పొందిన వారిలో నుంచి.. మొదటి లాటరీ విధానం, కిలోమీటర్ సచివాలయ పరిధి వారీగా 9,064 మంది విద్యార్థులను ఎంపిక చేశారు. విద్యార్థులు, వారికి కేటాయించిన స్కూళ్ల వివరాలను జిల్లా విద్యా శాఖ అధికారులకు, అడిషనల్ ప్రాజెక్ట్ కో–ఆర్డినేటర్‌లకు, సమగ్ర శిక్ష కార్యాలయానికి పంపించారు. ఎంపికైన విద్యార్థుల తల్లిదండ్రులకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. జిల్లా విద్యా శాఖ అధికారులు, అడిషనల్ ప్రాజెక్ట్ కో–ఆరి్డనేటర్లు ఏప్రిల్ 19 నుంచి 25వ తేదీ లోగా విద్యార్థులు జాయిన్ అయ్యేలా చర్యలు తీసుకోవాలని పాఠశాల విద్యా శాఖ కమిషనర్ ఎస్.సురేష్‌కుమార్ ఆదేశాలు జారీ చేశారు.
చదవండి:
Published date : 19 Apr 2023 04:36PM