5వ తరగతి ‘గురుకుల’ ప్రవేశాలు.. దరఖాస్తుకు చివరి తేదీ ఇదే..
Sakshi Education
ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయాల సంస్థ (ఏపీఆర్‌ఈఐఎస్) నడుపుతున్న 38 సాధారణ, 12 మైనార్టీ గురుకుల పాఠశాలల్లో 2022–23 విద్యాసంవత్సరానికి 5వ తరగతిలో ప్రవేశం కల్పించేందుకు మే 9వ తేదీ నుంచి 31వ తేదీలోపు ఆన్ లైన్ లో దరఖాస్తు చేయాలని గుంటూరులోని సంస్థ కార్యదర్శి ఆర్. నరసింహారావు మే 6న ఓ ప్రకటనలో తెలిపారు.
తాడికొండలోని రీజనల్ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్, అనంతపురం జిల్లా కొడిగెనహళ్లి పాఠశాలతో సహా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గురుకుల పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంతో కూడిన 5వ తరగతిలో ప్రవేశానికి దరఖాస్తు చేసుకున్న విద్యార్థులను లాటరీ ద్వారా ఎంపిక చేసి సీట్లు కేటాయిస్తామని తెలిపారు. ప్రభుత్వ, గుర్తింపు పొందిన పాఠశాలల్లో 4వ తరగతి పూర్తిచేసిన విద్యార్థులు హెచ్‌టీటీపీ.// ఏపీఆర్‌ఎస్. ఏపీసీఎఫ్‌ఎస్‌ఎస్.ఇన్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో రూ.50 చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అర్హులైన విద్యార్థులకు జూన్ 10న లాటరీ ద్వారా సీట్లు కేటాయిస్తామని పేర్కొన్నారు. అర్హతలు, నిబంధనలకు సంబంధించిన పూర్తి వివరాలకు పై వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు.
Published date : 07 May 2022 12:26PM