Koya tribe language: కోయ భాషలో విద్యాబోధన అభినందనీయం
Sakshi Education
గిరిపుత్రులకు కోయ భాషలో ప్రాథమిక విద్య అందించాలన్న ఏపీ విద్యా శాఖ యత్నాన్ని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభినందించారు.
లిపి కూడా లేని కోయ భాషలకు తెలుగులోనే అక్షరరూపం ఇచ్చి.. గిరిపుత్రుల మాతృభాషలోనే ప్రాథమిక విద్యనందించేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దీనిపై ‘సాక్షి’లో సెప్టెంబర్ 19న ప్రత్యేక కథనం ప్రచురితమైంది. దీనిపై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు స్పందిస్తూ ఏపీ ప్రభుత్వాన్ని ప్రశంసించారు. ‘‘ఆంధ్రప్రదేశ్‌లో 8 జిల్లాల్లోని 920 పాఠశాలల్లో గిరిజన విద్యార్థులకు కోయ భాషల్లోనే ప్రాథమిక విద్యను బోధించనున్నట్లు తెలిసి ఎంతో ఆనందిం చా’’ అని ట్వీట్ చేశారు. కోయ భాషలో ‘తొలకరి చినుకూకు.. ఒరొటో తరగతి’ అని ఉన్న పాఠ్యపుస్తకం ముఖచిత్రాన్ని ట్వీట్‌కు జత చేశారు.
చదవండి:
VP Naidu, PM Modi, Amit Shah greet all engineers on Engineers Day
Vice President Venkaiah Naidu: ఉపరాష్ట్రపతి వెంకయ్య ప్రస్థానంపై కేంద్రం రూపొందించిన పుస్తకం పేరు?
Published date : 20 Sep 2021 12:55PM