Skip to main content

ఇక డిజి–లాకర్‌ ద్వారా ఈ సర్టిఫికెట్లు

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని విద్యార్థులు, ఇతర అభ్యర్థులకు శుభవార్త. కీలకమైన ఎస్‌ఎస్‌సీ (టెన్త్‌) సర్టిఫికెట్లు ఇకపై డిజి–లాకర్‌ (డిజిటల్‌ లాకర్‌) ద్వారా అందుబాటులోకి రానున్నాయి.
Tenth Certificates through Digi Locker
ఇక డిజి–లాకర్‌ ద్వారా ఈ సర్టిఫికెట్లు

తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఎస్‌ఎస్‌సీ బోర్డు (ప్రభుత్వ పరీక్షల డైరక్టరేట్‌) డిజి–లాకర్‌ ద్వారా సర్టిఫికెట్లను అభ్యర్థులకు అందుబాటులోకి తెచ్చింది. కేంద్ర విద్యామంత్రిత్వ శాఖ ఏర్పాటుచేసిన డిజి–లాకర్‌లోకి ఎస్‌ఎస్‌సీ బోర్డు అనుసంధానమైందని డైరక్టర్‌ డి.దేవానందరెడ్డి తెలిపారు.

చదవండి: ఏపీ ఇంటర్ - సీనియర్ ఇంటర్ | స్టడీ మెటీరియల్ | మోడల్ పేపర్స్ | ప్రివియస్‌ పేపర్స్ | న్యూస్ | టిఎస్ ఇంటర్

2017 నుంచి 2022 వరకు ఎస్‌ఎస్‌సీ సర్టిఫికెట్లు డిజి–లాకర్‌ ద్వారా అభ్యర్థులకు అందుబాటులో ఉంచుతామని పేర్కొన్నారు. అభ్యర్థులు డిజిలాకర్‌కు సైన్‌ అప్‌ అయి ముఖ్య మైన పత్రాలు, సర్టిఫికెట్లను పొందవచ్చన్నారు.

Published date : 10 Dec 2022 04:34PM

Photo Stories