AP 10th Class Public Exams : ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. ఇకపై 6 పేపర్లతోనే..
Sakshi Education
సాక్షి ఎడ్యుకేషన్ : పదో తరగతి పరీక్షా విధానంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక మార్పులు తీసుకొచ్చింది.
ఇకపై 6 పేపర్లతోనే పదో తరగతి పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ మేరకు విద్యా శాఖ కార్యదర్శి రాజశేఖర్ ఉత్తర్వులు జారీ చేశారు. సీబీఎస్‌ఈ సిలబస్ నేపథ్యంలో 6 పేపర్ల విధానం అమలు చేయనున్నారు. 2022-23 విద్యా సంవత్సరం నుంచి అమలు చేయాలని విద్యా శాఖ నిర్ణయించింది.
10th Model Papers: టెన్త్ పేపర్ ఎలా ఉంటుంది?.. మోడల్ పేపర్లు ఉచితంగా డౌన్ లోడ్ చేసుకోండిలా..
2021–22కి సంబంధించిన..
2021–22కి సంబంధించి పదో తరగతి విద్యార్థులకు ఏప్రిల్ 27 నుంచి మే 9 వరకు పబ్లిక్ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఫలితాలను జూన్ 6న విడుదల చేశారు. కోవిడ్ కారణంగా గత రెండేళ్లుగా స్కూళ్లు సరిగా నడవకపోవడం, ముఖ్యంగా 8, 9 తరగతుల విద్యార్థులకు పాఠాల నిర్వహణ పూర్తిస్థాయిలో లేకపోవడంతో వారు చాలా వెనుకపడ్డారు. దీంతో పదో తరగతి పరీక్షల్లో దాదాపు 2 లక్షల మంది ఉత్తీర్ణులు కాలేకపోయారు.
Published date : 22 Aug 2022 06:49PM