బాలికల గురుకుల పాఠశాల నిర్మాణానికి రూ.35 కోట్లు
Sakshi Education
చోడవరం: స్థానిక జ్యోతీరావ్‌పూలే బాలికల గురుకుల పాఠశాల భవన నిర్మాణానికి ప్రభుత్వం రూ.35 కోట్లు మంజూరు చేసిందని ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీ చెప్పారు.
వైఎస్సార్‌సీపీ కార్యాల యంలో జూలై 19న ఏర్పాటు చేసిన విలేకరుల స మావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి విద్యా రంగానికి అత్యధిక ప్రాధన్యం ఇస్తున్నారన్నారు. చోడవరం ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో పీజీ కాలేజీని మంజూరు చేసి రెండేళ్లుగా తరగతులు నిర్వహిస్తున్నామన్నారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీకి వెంకన్నపాలెం సమీపంలో 6 ఎకరాల స్థలాన్ని సమకూర్చి, రూ.15 కోట్లు మంజూరు చేశామని, ఈనెలలో పనులు ప్రారంభిస్తామన్నారు.
జ్యోతీరావ్‌పూలే బాలికల గురుకుల పాఠశాల కోసం జన్నవరంలో 10 ఎకరాల స్థలం సేకరించామన్నారు. సొంత భవనం నిర్మాణానికి నిధులు మంజూరు చేయమని ముఖ్యమంత్రిని కోరిన వెంటనే రూ.35 కోట్లు మంజూరు చేస్తూ జూలై 19న ఉత్తర్వులు జారీ చేశారని ధర్మశ్రీ చెప్పారు. త్వరలోనే టెండర్లు పిలిచి పనులు ప్రారంభిస్తామన్నారు.
Published date : 20 Jul 2023 05:10PM