ఐదో నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం

రాష్ట్రాలు పటిష్టమైతే దేశం పటిష్టమవుతుందనే సూత్రం ఆధారంగా ‘కోఆపరేటివ్ ఫెడరలిజం’ను వేగవంతం చేయడానికి ప్రణాళికా సంఘం స్థానంలో నీతిఆయోగ్‌ను ప్రభుత్వం 2015 జనవరి 1న ఏర్పాటు చేసింది.
నీతిఆయోగ్ నిర్వహించే విధులను రిసోర్‌‌స సెంటర్ మరియు నాలెడ్‌‌జ హబ్, విధానాల రూపకల్పన, కార్యక్రమాల Frame work, కో ఆపరేటివ్ ఫెడరలిజంను వేగవంతం చేయడం, Monitoring and evaluation అనే నాలుగు కేటగిరీలుగా విభజింపవచ్చు. నీతిఆయోగ్‌కు ప్రధానమంత్రి చైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తూ ఆయన వైస్ చైర్మన్‌ను నియమిస్తారు. నీతిఆయోగ్‌లో గవర్నింగ్ కౌన్సిల్ అత్యున్నతమైంది. గత సమావేశాల ఎజెండాలోని అంశాలకు సంబంధించి తీసుకున్న చర్యలను సమీక్షించడంతో పాటు భవిష్యత్తు అభివృద్ధి ప్రాధాన్యతలను గవర్నింగ్ కౌన్సిల్ చర్చిస్తుంది. గవర్నింగ్ కౌన్సిల్‌లో ప్రధానమంత్రి, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు, ఎక్స్‌అఫీషియో సభ్యులుగా నలుగురు కేంద్ర మంత్రులతో పాటు, ప్రత్యేక ఆహ్వానితులుగా ముగ్గురు కేంద్ర మంత్రులు సభ్యులుగా ఉంటారు.

గవర్నింగ్ కౌన్సిల్ సమావేశాలు
నీతిఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ మొదటి సమావేశం 2015 ఫిబ్రవరి 8న జరిగింది. ఈ సమావేశంలో కోఆపరేటివ్ ఫెడరలిజంను వేగవంతం చేయడంతోపాటు జాతీయ స్థాయి సమస్యల పరిష్కారానికి రాష్ట్రాల క్రియాశీల భాగస్వామ్య ఆవశ్యకతను ప్రధాని ప్రస్తావించారు. రెండో సమావేశం 2015 జూలై 15న, మూడో సమావేశం 2017 ఏప్రిల్ 23న జరిగింది. ఈ సమావేశాల్లో సరైన వ్యూహం, విజన్ డాక్యుమెంట్ల ద్వారా ‘భారత్ అభివృద్ధి ఎజెండా’ రూపొందించాలని నిర్ణయించారు. నాలుగో సమావేశం 2018 జూన్ 17న జరిగింది. ఈ దీనిలో రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడం, ఆయుష్మాన్ భారత్, ్కైఏఊ అభియాన్, మిషన్ ఇంధ్ర ధనుష్ లాంటి పథకాల ప్రగతికి సంబంధించి తీసుకున్న చర్యలను సమీక్షించారు. ఐదో గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం 2019 జూన్ 15న జరిగింది.

గవర్నింగ్ కౌన్సిల్-5వ సమావేశం-ఎజెండా
గవర్నింగ్ కౌన్సిల్ అయిదో సమావేశంలో వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు వెలిబుచ్చిన అభిప్రాయాలు, సూచనలను విధాన నిర్ణయాల రూపకల్పనలో పరిగణనలోకి తీసుకుంటామని ప్రధానమంత్రి హామీ ఇచ్చారు. ఐదో గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం ముందున్న ఎజెండా ఈ విధంగా ఉంది.
  1. వర్షపు నీటి సంగ్రహం (Rain water Harvesting)
  2. కరువు స్థితి, నివారణ చర్యలు.
  3. ఆకాంక్షిత జిల్లాల కార్యక్రమం - విజయాలు, సవాళ్లు
  4. వ్యవసాయ రంగంలో నిర్మాణాత్మక సంస్కరణల్లో భాగంగా కింది చట్టాలకు ప్రాధాన్యత
    ఎ) వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ కమిటీ చట్టం
    బి) నిత్యావసర వస్తువుల చట్టం
  5. భద్రత సంబంధిత అంశాల్లో భాగంగా మావోయిస్టు ప్రభావిత జిల్లాలపై ప్రత్యేక దృష్టి

ప్రధానమంత్రి ప్రసంగం - ముఖ్యాంశాలు
  • రాష్ట్రాలు తమ పోటీతత్వాన్ని వినియోగించుకోవడం ద్వారా జిల్లా స్థాయి నుంచి స్థూల దేశీయోత్పత్తి పెంపొందించడానికి తగిన కార్యాచరణ ప్రారంభించాలి. ఈ సమావేశాన్ని ‘టీమ్ ఇండియా సమావేశంగా’ ప్రధాని ప్రస్తావించారు.
  • కోఆపరేటివ్ ఫెడరలిజంను వేగవంతం చేయడానికి నీతిఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ ఒక వేదికగా ఉపకరించగలదని ప్రధాని పేర్కొన్నారు. భారత ప్రగతిని నిరోధించే కారకాలైన పేదరికం, నిరుద్యోగం, కరువు, కాలుష్యం, వరదలు, హింస, అవినీతిపై సమష్టిగా పోరాడాలని ప్రధాని పిలుపునిచ్చారు.
  • నీటి సంరక్షణ విషయంలో రాష్ట్రాల కృషిని ప్రధాని అభినందించారు. నవకల్పనలతో కూడిన నీటి యాజమాన్య పద్ధతులను అమలు చేయాలని రాష్ట్రాలను కోరారు. నీటిని అభివృద్ధి వనరుగా గుర్తించి ‘జల్‌శక్తి మంత్రిత్వ శాఖ’ను ఏర్పాటు చేశారు.
  • 2024 నాటికి భారత్‌ను 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా రూపొందించాలనే లక్ష్యాన్ని ప్రధాని ప్రకటించారు. 2019 మార్చి నాటికి భారత ఆర్థిక వ్యవస్థ పరిమాణం 2.75 ట్రిలియన్ డాలర్లగా అంచనా. భారత్‌ను 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా రూపొందించడం సవాలే అయినప్పటికీ సమష్టి కృషితో లక్ష్యాన్ని సాధించవచ్చని ప్రధాని పేర్కొన్నారు. రాష్ట్రాలు తమ పరిమాణాన్ని 2 నుంచి 2.5 రెట్లు వరకు పెంచుకోగలిగితే ఈ లక్ష్యాన్ని సాధించవచ్చని ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు.
  • రాష్ట్రాలు ఎగుమతి సామర్థ్యాన్ని పెంపొందించుకోవడం ద్వారా ఎగుమతులు, ఉపాధి పెంపునకు చర్యలు తీసుకోవాలి. ఆదాయ పెంపు, ఉపాధి కల్పనలో ఎగుమతి రంగం పాత్ర ప్రధానం కాబట్టి ఎగుమతి రంగం అభివృద్ధిపై రాష్ట్రాలు దృష్టి సారించాలి.
  • ఆరోగ్య రంగానికి సంబంధించి 2022 నాటికి ఆనేక లక్ష్యాలను సాధించడానికి చర్యలు అవసరం. టి.బి.ను 2025 నాటికి పూర్తిగా నిర్మూలించాలని ప్రధాని పేర్కొన్నారు. ఆయుష్మాన్ భారత్ కార్యక్రమం కింద ఇప్పటి వరకు PMJAYను అమలు చేయని రాష్ట్రాలు వెంటనే అమలుకు చర్యలు తీసుకోవాలి.
  • సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్ అనే నినాదాన్ని ఆచరణలో పెట్టడంలో నీతి ఆయోగ్ కీలకపాత్ర పోషిస్త్తుందని ప్రధాని పేర్కొన్నారు. దేశంలో అమలులో ఉన్న పథకాల వల్ల కలిగే ప్రయోజనం కొంత మంది ప్రజలకు లేదా కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితం కాకూడదని ప్రధాని అభిలషించారు.
  • వ్యవసాయ రంగంలో నిర్మాణాత్మక సంస్కరణల కోసం అత్యున్నత స్థాయి కమిటీ ఏర్పాటును ప్రధాని ప్రకటించారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో భారత్ ప్రగతిని ప్రస్తావించారు. మైనింగ్ రంగం అభివృద్ధి ద్వారా ఉపాధి అవకాశాలను విస్తరించాలన్నారు. అనేక రాష్ట్రాల్లో మైనింగ్ రంగం అభివృద్ధిలో ఎదురవుతున్న అడ్డంకులను ప్రధాని ప్రస్తావించారు. ఈ అంశంపై నీతి ఆయోగ్ దృష్టి సారిస్తుందని ప్రధాని పేర్కొన్నారు.
  • మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో హింసను అరికట్టడానికి ప్రభుత్వం కృషి చేస్తుంది. హోంమంత్రిత్వ శాఖ మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాలతో సమన్వయం ద్వారా హింసను అరికట్టడంతో పాటు ఆయా ప్రాంతాల అభివృద్ధి ఎజెండాను ముందుకు తీసుకువెళ్లడంలో తగిన సహకారం అందిస్తుంది.
  • రైతుల ఆదాయాలను 2022 నాటికి రెట్టింపు చేయాలనే లక్ష్యాన్ని సమావేశంలో ప్రధాని ప్రస్తావించారు. లక్ష్యసాధనకు ఫిషరీస్, పశుసంపద, తోటల పెంపకం, పండ్లు, కూరగాయల ఉత్పత్తుల పెంపుపై దృష్టి సారించాలి. నీటి సంరక్షణకు ప్రాధాన్యతనిస్తూ వాటర్ టేబుల్ పెంపుపై దృష్టి సారించాలి. నీటి సంరక్షణ, యాజమాన్యానికి సంబంధించి తగిన నియమావళి, నియంత్రణలను రూపొందించాలి.

వ్యవసాయ రంగంలో సంస్కరణలు
నీటి సంరక్షణ, వర్షపు నీటి సంగ్రహం (రైన్ వాటర్ హార్వెస్టింగ్) విషయంలో మహారాష్ట్ర, రాజస్థాన్, తెలంగాణ, గుజరాత్, కర్ణాటకలు అభిలషణీయ పద్ధతులను అవలంభించాయి. మహారాష్ట్ర ప్రభుత్వం Jalyukt shivar కింద తీసుకున్న చర్యల కారణంగా 11,000 గ్రామాలు కరువు నుంచి విముక్తి పొందాయి. ముఖ్యమంత్రి జల్ స్వావలంభన్ అభియాన్ కార్యక్రమం ఫలితంగా మహారాష్ట్రలోని 21 జిల్లాల్లో భూగర్భ జలమట్టం 5 అడుగులు పెరిగింది. తెలంగాణ ప్రభుత్వం అమలు పరిచిన మిషన్ కాకతీయ పథకం 19 లక్షల ఎకరాలకు సాగునీరు అందించింది. గుజరాత్ ప్రభుత్వం ప్రారంభించిన ‘సుజలం-సుఫలం’, కర్ణాటకలో కృత్రిమ రీచార్‌‌జ పథకాలు ఆశించిన ఫలితాలనిచ్చాయి. తద్వారా ఆయా రాష్ట్రాలు కరువు నివారణ విషయంలో కొంత మేర విజయవంతమయ్యాయి. కరువు యాజమాన్యం, సంబంధిత నివారణ చర్యలను గవర్నింగ్ కౌన్సిల్ చర్చించింది. అన్ని రాష్ట్రాలకు సంబంధించి సమగ్ర కరువు యాజమాన్య ప్రణాళికను కేంద్ర ప్రభుత్వం రూపొందించాలని సమావేశంలో ప్రతిపాదించారు. వ్యవసాయ రంగంలో నిర్మాణాత్మక సంస్కరణల్లో భాగంగా వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ కమిటీ చట్టం అమలు సమీక్ష, నిత్యావసర వస్తువుల చట్టంలో మార్పులు ఎజెండా అంశాలుగా ఉంటాయి. వ్యవసాయ రంగంలో నిర్మాణాత్మక సంస్కరణల ఆవశ్యకతను ప్రధాని ప్రస్తావిస్తూ కార్పొరేటు పెట్టుబడిని ప్రోత్సహించడం, లాజిస్టిక్స్‌ను పటిష్టపరచడం, ఆహార ప్రాసెసింగ్‌పై దృష్టి సారించడం లాంటి చర్యలను పేర్కొన్నారు.

ఆకాంక్షిత జిల్లాలు, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు
ఆకాంక్షిత జిల్లాల కార్యక్రమం అమలును గవర్నింగ్ కౌన్సిల్ సమీక్షించింది. సమ్మిళిత వృద్ధి సాధనలో ఈ కార్యక్రమం అమలు ప్రాధాన్యత సంతరించుకుంది. మానవ, సామాజికాభివృద్ధికి సంబంధించిన 49 సూచికల విషయంలో ఈ కార్యక్రమంలో భాగమైన అన్ని ఆకాంక్షిత జిల్లాల్లో వృద్ధి వేగవంతమైంది. తమ రాష్ట్రాల్లో ఈ కార్యక్రమం విజయవంతమైందని అనేక మంది ముఖ్యమంత్రులు పేర్కొన్నారు. సమ్మిళిత వృద్ధి సాధనకు ఆకాంక్షిత జిల్లాల కార్యక్రమం కింద అమలుకు వీలయ్యే కొన్ని పథకాలను క్లిష్టమైన ప్రాంతాల్లో కొన్ని బ్లాక్‌లలో అమలుపరచడానికి ఉన్న అవకాశాలను సమావేశంలో చర్చించారు.

కేంద్ర హోంమంత్రి గత ఐదేళ్లుగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో అభివృద్ధి, భద్రతకు సంబంధించి తీసుకొన్న చర్యలను ప్రస్తావించారు. కేంద్ర ఆర్‌‌మడ్ పోలీస్ ఫోర్సెస్‌ను ఆయా ప్రాంతాలకు పంపించడం ద్వారా మావోయిస్టు కార్యకలాలపాలను తగ్గించగలిగామని పేర్కొన్నారు. ఆయా ప్రాంతాల్లో రూ. 18,000 కోట్ల వ్యయంతో 11,000 కి.మీ. రోడ్ల నిర్మాణాన్ని చేపట్టగా ఇప్పటి 5,500 కి.మీ. రోడ్ల నిర్మాణం పూర్తయింది. టెలికాం కనక్టివిటీ పెంపుకు 2335 మొబైల్ టవర్‌‌సను ఏర్పాటు చేశారు. తర్వాత రూ. 11,000 కోట్ల వ్యయంతో 4072 టవర్‌‌సను మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తారు.

వివిధ రాష్ట్రాల డిమాండ్లు
సమావేశంలో ప్రసంగించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి రాష్ట్రానికి ప్రత్యేక హోదా డిమాండ్ బలంగా వినిపించారు. ప్రత్యేక హోదాకు వ్యతిరేకంగా 14 ఆర్థిక సంఘం ఏ విధమైన సిఫార్సులు చేయలేదని ఆయన పేర్కొన్నారు. విద్య, వైద్య రంగాలకు కేంద్ర ప్రభుత్వం సహాయంతో పాటు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, పంటలకు కనీస మద్దతు ధర, పేదలకు గృహ నిర్మాణం లాంటి అంశాలను ముఖ్యమంత్రి ప్రస్తావించారు. 2014 మేలో రాష్ట్ర రుణం రూ. 97000 కోట్లు కాగా ప్రస్తుతం రూ. 2,59,000 కోట్ల్లు చేరిందని, ఆయన పేర్కొన్నారు. ప్రత్యేక హోదా వల్ల రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని కొంత మేర పూడ్చుకోవడంతో పాటు ఉపాధి కల్పన మెరుగవుతుందని ముఖ్యమంత్రి అభిలషించారు.

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీకి పూర్తి రాష్ట్ర హోదా ఇవ్వాలని కోరారు. బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తమ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఆవశ్యకతను ప్రస్తావించారు. పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరిందర్ సింగ్ సమావేశానికి హాజరుకాకపోయినప్పటికీ తన ప్రసంగ పాఠంలో నీటి సంక్షోభ నివారణకు కేంద్ర ప్రభుత్వ సహాయాన్ని అర్థించారు. రుణగ్రస్త రైతులకు ఒకేసారి రుణమాఫీతోపాటు పీఎం కిసాన్ పథకంకిందరైతులకుఅందించే సాంవత్సరిక సహాయాన్ని రెట్టింపు చేయాలని, వ్యవసాయ కార్మికులను ఈ పథకం పరిధిలోకి తీసుకురావాలని తన ప్రసంగ పాఠంలో పేర్కొన్నారు.
- డాక్టర్ తమ్మా కోటిరెడ్డి
ప్రొఫెసర్, ఐబీఎస్, హైదరాబాద్










#Tags