934 Jobs: మంజూరు చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ పరిధిలో గ్రామ రెవెన్యూ సహాయకుల (వీఆర్‌ఎ) సర్దుబాటు కోసం 934 పోస్టులు మంజూరయ్యాయి.
హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా, మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాల్లోని ప్రభుత్వ విభాగాల్లోని వివిధ శాఖల్లో వీఆర్‌ఎల సర్దుబాటు కోసం ఈ పోస్టులను ప్రభ్వుత్వం కేటాయించింది. రెవెన్యూ శాఖకు 217 జూనియర్ అసిస్టెంట్, 234 రికార్డ్ అసిస్టెంట్. 44 ఆఫీస్ సబార్డినేట్/ చైన్‌మెన్ పోస్టులు మంజూరు చేసింది.
చదవండి: Telangana Jobs 2023: తెలంగాణలో 1520 పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..
పురపాలక శాఖలో 205 వార్డు ఆఫీసర్ (జూనియర్ అసిస్టెంట్) పోస్టులు, మిషన్ భగీరథ శాఖలో 156 హెల్పర్ పోస్టులు, నీటిపారుదల శాఖలో 78 లష్కర్, హెల్పర్ పోస్టులను కేటాయించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీఆర్‌ఎల విద్యార్హతలు, సామర్థ్యాల మేరకు వారిని వివిధ శాఖల్లో సర్దుబాటు చేయనున్నారు.
చదవండి: Telangana Jobs 2023: 156 పోస్టులు.. దరఖాస్తులకు చివరి తేదీ ఇదే..
#Tags