UPSC Civil Services Results: UPSC Civils AIR 198 ర్యాంక‌ర్‌.. భానుశ్రీ లక్ష్మీ అన్నపూర్ణ ప్రత్యూష..

సివిల్స్‌ ఫలితాల్లో మెరిసిన తెలుగు తేజం
UPSC Civils AIR 198

సాక్షి, ఢిల్లీ: యూపీఎస్సీ సివిల్స్‌ ఫలితాలు విడుదలయ్యాయి. ఇందులో 1,016 మంది ఎంపికయ్యారు. ఆదిత్య శ్రీవాత్సవకు మొదటి ర్యాంకు, అనిమేష్‌ ప్రధాన్‌కు రెండో ర్యాంకు, దోనూరి అనన్యరెడ్డికి మూడో ర్యాంకు దక్కింది.  తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు ర్యాంకుల పంట పండింది. 


ఆంధ్ర‌ప్ర‌దేశ్ పశ్చిమ గోదావరి జిల్లాలో కాళ్ల (Kalla) మండ‌లంకి (వీళ్లు ఊరు భీమ‌వరం ద‌గ్గ‌ర్లో ఉంటుంది) చెందిన భానుశ్రీ లక్ష్మీ అన్నపూర్ణ ప్రత్యూషకి 198వ ర్యాంకు వచ్చింది.

 

గత ఏడాది 
ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 ఫ‌స్ట్ ర్యాంక‌ర్‌..
ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ Group 1 తుది ఫ‌లితాల‌ను ఏపీపీఎస్సీ చైర్మన్‌ గౌతం సవాంగ్‌ ఆగ‌స్టు 17వ తేదీన (గురువారం) ప్ర‌క‌టించిన విష‌యం తెల్సిందే. ఈ ఫ‌లితాల్లో భానుశ్రీ లక్ష్మీ అన్నపూర్ణ ప్రత్యూష స్టేట్ ఫ‌స్ట్ ర్యాంక్ సాధించారు.


ఈమె బిఎ ఎకనామిక్స్ ఢిల్లీ యూనివర్సిటీలో చ‌దివారు.  

కుటుంబ నేప‌థ్యం :
భానుశ్రీ లక్ష్మీ అన్నపూర్ణ ప్రత్యూష.. పశ్చిమ గోదావరి జిల్లాలో కాళ్ల (Kalla) మండ‌లంకి (వీళ్లు ఊరు భీమ‌వరం ద‌గ్గ‌ర్లో ఉంటుంది) చెందిన వారు.  ఈమె తండ్రి ఉండి ద‌గ్గ‌ర‌ల్లోని ప్ర‌భుత్వ పాఠ‌శాల్లో ఉపాధ్యాయుడుగా ప‌నిచేస్తున్నారు. వీరి కుటుంబంలో ఈమె ఏకైక కూతురు.

 

ఎడ్యుకేష‌న్ : 
ఈమె స్కూల్ ఎడ్యుకేష‌న్ పశ్చిమ గోదావరి జిల్లాలోనే జ‌రిగింది. అలాగే ఇంట‌ర్ మాత్రం తెలంగాణలోని హైద‌రాబాద్‌లో శ్రీచైత‌న్య కాలేజీలు చ‌దివారు. ఈమె టెన్త్‌లో 10 కి 10 పాయింట్లు సాధించారు. అలాగే ఇంట‌ర్‌లో స్టేట్ టాప‌ర్‌గా నిలిచారు. ఇంట‌ర్ ప్ర‌థ‌మ సంవ‌త్స‌రంలో 492 మార్కులు సాధించారు. ఇంట‌ర్‌లో ఎంఈసీ గ్రూప్‌లో చేరారు.
 

#Tags