IIIT Intergrated B Tech Admissions: బాసరలో ట్రిపుల్‌ఐటీ ఇంటిగ్రేటెడ్‌ బీటెక్‌ కోర్సుల్లో ప్రవేశాలు..

తెలంగాణ రాష్ట్రం నిర్మల్‌ జిల్లా బాసరలోని రాజీవ్‌ గాంధీ విజ్ఞాన, సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్‌జీయూకేటీ).. 2024–25 విద్యాసంవత్సరంలో ట్రిపుల్‌ ఐటీలో ఇంటిగ్రేటెడ్‌ బీటెక్‌ ప్రోగ్రామ్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదలైంది..

సాక్షి ఎడ్యుకేష‌న్‌:

»    కోర్సు: ఇంటిగ్రేటెడ్‌ బీటెక్‌(ఇంటర్‌ + బీటెక్‌) 
»    మొత్తం సీట్లు: 1500
»    అర్హత: ఈ సంవత్సరం పదో తరగతి ఉత్తీర్ణులు మాత్రమే దరఖాస్తుకు అర్హులు. 
»    వయసు: 31.12.2024 నాటికి 18 ఏళ్లలోపు ఉండాలి. ఎస్సీ/ఎస్టీ విద్యార్థులకు 21ఏళ్లలోపు ఉండాలి. 
»    ఎంపిక విధానం: పదో తరగతిలో వచ్చిన మా­ర్కుల ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు వారి పదో తరగతి గ్రేడ్‌కు 0.40 స్కోర్‌ కలుపుతారు. మొత్తం సీట్లలో 85 శాతం రాష్ట్ర విద్యార్థులకు కేటాయిస్తారు. మిగతా 15 శాతం సీట్లకు తెలంగాణ రాష్ట్ర విద్యార్థులతోపాటు అంధ్రప్రదేశ్‌ విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

ముఖ్య సమాచారం
»    దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
»    ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం: 01.06.2024
»    ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 22.06.2024
»    వెబ్‌సైట్‌: http://rgukt.ac.in

Comviva CEO: టెక్ మహీంద్రా కంపెనీ ‘కామ్‌వివా’కి కొత్త సీఈవో

#Tags